Home » Yerramsetti sai » Mogudu Inko Pellam Varjalu


    "కొత్తగా మార్కెట్లోకొచ్చిన బట్టల సబ్బులమ్మే సేల్స్ గాళ్ మేడం, కొనమని తెగ బ్రతిమాలింది గానీ సార్ ఏమాత్రం అవసరం లేదని అన్నారు. ఇప్పటికే ఇంట్లో పెద్ద బార్ సోప్ వుంది. మళ్ళీ వేరే సోప్ లెందుకని గెంటేశారు."
    అతను స్టన్ అయిపోయాడు.
    అంత అద్భుతమయిన అయిడియా తనకెందుకు రాలేదు?
    "ఓ.కె! వెళ్తాను" కార్లో కూర్చుని స్టార్ట్ చేస్తూ అన్నాడతను.
    కారు కొంతదూరం వచ్చాకగానీ మళ్ళీ మామూలు మనిషి కాలేకపోయాడు.
    భజన్ రావ్ సమయస్ఫూర్తితో తనను రక్షించబట్టిగానీ లేకపోతే రెడ్ హాండెడ్ గా దొరికిపోయేవాడు.
    వెంటనే చేరుకుని. త్వరత్వరగా ల్యాప్ టాప్ నుంచి మెయిలిచ్చేశాడు.
    "నేనే వచ్చే ఆదివారం మీఇంటికొస్తున్నాను. అక్కడే కలుసుకుందాం_ సీత" అని రాశాడందులో.
    అప్పటికి ధైర్యం వచ్చిందతనికి.
    అయినా ఇంకా లోలోపల అనుమానం పూర్తిగా పోలేదు.
    మొదటి మెయిల్ చూసి కుతూహలం కొద్దీ ఆ రచయితగాడు "హూ ఆర్ యూ?" అంటూ మళ్ళీ మెయిల్ కొట్టాడంటే కథ మళ్ళీ మొదటికొచ్చేస్తుంది.
    అదీగాక ఆ కల్నల్ గాడు ఏ క్షణాన్నయినా నిజం ఋజువు చేసుకోవాలని చంద్రకాంత్ ని కలుసుకోడానికి వాడి ఊరు వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
    ఎటూ తోచక ఆఫీస్ వరండాలోనే నిలబడి ఆలోచనలో పడిపోయాడు అతను. ఆ పరధ్యానంలో వుండగా భుజం మీద దభేల్ మని ఎవరో లాగి కొట్టేసరికి కెవ్వున కేక వేశాడు. ఆ కేకకు వరండాలో నిలబడ్డ చాలామంది ఏం జరిగిందో తెలీక బయటకు పరుగెత్తారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని_
    "ఏంటి మిత్రమా అలా అరచావు? నేనే కొట్టింది" అన్నాడు భవానీశంకర్.
    గోపాల్రావ్ కి అతనిని చూసేసరికి పోయిన ప్రాణం తిరిగివచ్చినట్లయింది.
    "ఓరి నువ్వా? ఎంతకాలానికి కనబడ్డావురా? ఏమైపోయావు ఇన్నాళ్ళూ?" అడిగాడు ఉత్సాహంగా.
    "స్ట్రగుల్ ఫర్ సర్ వైవల్ బ్రదర్! రకరకాల ఉద్యోగాల్లో చేరటం కొద్దిరోజుల తర్వాత ప్రొప్రయిటర్ కీ, మనకీ అభిప్రాయ భేదాలు రావటం, పురజనుల కోరిక మీద మనం రిజైన్ చేయటం, మళ్ళీ ఉద్యోగం వేటలో పడటం, ఇదీ నెట్ వర్క్ కార్యక్రమం మిత్రమా! నా సంగతి సరే! ప్రస్తుతం నీ కార్యక్రమం ఏమిటి? మనిద్దరం ఎక్కడయినా త్రీ బై టూ కాఫీ కొడుతూ మంచి చెడూ మాట్లాడుకునే ఛాన్సుందా"
    "ఓ లాట్సాఫ్ టైమ్"
    "ఒండర్ ఫుల్! అయితే పద మాంచి హోటల్ కి..."
    "ఓకే!"
    ఇద్దరూ ఓ హోటల్ కి చేరుకుని త్రీ బైటూ కాఫీ తాగసాగారు.
    భవానీశంకర్ చెప్పే మాటలకు 'ఊ' కొడుతూనే మధ్య మధ్యలో ట్రాన్స్ లో కెళ్ళిపోతున్నాడు గోపాల్రావ్.
    "నీ బాడీ, నీ మనసు రెండూ వేరు వేరు కాపురాలు పెట్టినట్లు నాకనిపిస్తోంది మిత్రమా! ఏమిటి సంగతి? సెకండ్ సెటప్ లాంటి దేమయినా పెట్టావా?"
    గోపాల్రావ్ స్పృహలోకొచ్చాడు.
    "నో నో! అలాంటిదేమీ లేదురా. ఒక్క సెటప్ తోనే మటాష్ అయిపోతున్నాను."
    "అయితే ఆఫీస్ లో లక్షలు లక్షలు ఫ్రాడ్ చేసి వుండాలి. ఇది మనదేశంలో ఫ్రాడ్ ల సీజన్ కదా."
    "కాదురా! ఇంట్లో గొడవలు."
    "ఇంట్లో గొడవలా? ఇంపాజిబుల్ మిత్రమా! కావాలని లవ్ చేసి పెళ్ళిచేసుకున్న పిల్లతో గొడవా?"
    "అది మామూలు పిల్లకాదురా నాయనా! ఏకే 47! అచ్చం వాళ్ళ నాన్నే అనుకో దానికితోడు నామీద అనుమానం. నేను వేరే అమ్మాయిలతో ఎఫైర్స్ పెట్టుకున్నానని_"
    "అనుమానమేముంది? నిజమేగా! అదివరకు ఎక్కడ అమ్మాయి కనబడినా...."
    "ష్! అరవకు. మనల్ని మా మావగాడు ఫాలో అయినా అయివుండవచ్చు..." చుట్టూ భయంగా చూస్తూ అన్నాడు.
    "పరిస్థితి అంత దారుణంగా వుందా బ్రదర్?"
    "నిన్నటినుంచీ అసలు నిప్పంటుకున్న ఇంట్లో వున్నట్లు వుందనుకో."
    "కారణం ఏమిటి మిత్రమా? కారణంలేందే పొగరాదనే సూత్రం మీద మనక్కొంచెం గురి ఎక్కువలే. అందుకని అడిగాను."
    "అయితే నీకు మొదటినుంచీ జరిగిందంతా చెప్పాలి."
    "కొంచెం క్లుప్తంగా చెప్తే మనిద్దరికీ శ్రేయస్కరమని నా అభిప్రాయం."
    "ఆల్ రైట్! ఎక్కడినుంచి మొదలుపెట్టను?"
    "నిన్న ఓ పిల్ల కనిపించింది" దగ్గర్నించి మొదలుపెట్టు. ప్రపంచంలో ఇబ్బందులన్నీ అక్కడినుంచే మొదలవుతాయ్ కదా?"
    "ఎస్! నిన్న ఓ పిల్ల కనిపించింది..."
    అంటూ గోపాల్రావ్ జరిగిందంతా చెప్పాడు.
    "చెప్పటం అయిపోయిందా?" అడిగాడు భవానీశంకర్.
    "అయిపోయింది."
    "అయితే ఇంక విను... నువ్వీ మెస్ లోనుంచి బయటపడ్డానికి దేరీజ్ ఓన్లీ వన్ వే..."
    "ఏమిటదీ?" ఆతృతగా అడిగాడు.
    "స్కీమ్ నెంబర్ త్రీ..."
    "అంటే?"
    "వెంటనే మనం ఆ రచయిత చంద్రకాంత్ గాడిని ఈడ్చుకొచ్చి నిన్న రాత్రంతా నువ్వు వాడితోనే గడిపినట్లు చెప్పించటం."
    గోపాల్రావ్ కి చిరాకు పుట్టుకొచ్చింది.
    "ఏడ్చినట్లుంది. ఆ రచయితగాడికింకేం పని వుండదా? పెళ్ళాలకు అబద్ధాలు చెప్పిన వాళ్లందరి ఇళ్ళకూ వెళ్ళి మీ ఆయన నాతోనే వున్నాడని సర్టిఫికెట్స్ యిస్తూ టూరింగ్ చేస్తుంటాడా? ఛస్తే రాడు."
    "వాడు కాకపోతే ఇంకోడు వస్తాడు మిత్రమా!"
    "ఇంకోడెవడు?"
    "ఎవడైనా కావచ్చు. ఒకవేళ ఇంకెవడూ కాకపోతే నేను కావచ్చు."
    "అంటే?"
    "అంటే నేనే చంద్రకాంత్ నంటూ మీ ఇంటికొస్తాననుకో. అహహ! అనుకో. నన్నెలాగూ ఇంతవరకూ మీ మిసెస్ వాళ్ళ మిలట్రీ ఫాదర్ చూళ్ళేదు. కనుక నా మాట చచ్చినట్లు నమ్మక తప్పదు. ఎలా వుందిది?"
    గోపాల్రావ్ ముందు నిశ్చేష్టుడయ్యాడు.
    ఆ తర్వాత కొద్ది క్షణాలు స్పృహ తప్పాడు.
    ఆ తర్వాత మళ్ళీ స్పృహలోకొచ్చీ రాగానే అమాంతం భవానీశంకర్ ని కౌగిలించుకున్నాడు.
    "అబ్బ... ఎంత మంచి అయిడియా వచ్చిందిరా! సింప్లీ సూపర్బ్_ మా మిసెస్ కాదు గదా_ ఆ కల్నల్ గాడు కూడా ఈ దెబ్బతో సైలెంటయి పోవలసిందే."
    "చచ్చినట్లు..."
    "అవును.. ఏం?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra