Home » Mainanpati bhaskar » Buddijeevi

"ఎవరు నువ్వు?" అన్నాడు అజిత్ నిదానంగా. అతని మాటలకి తక్షణం తర్జుమా చేసి బుద్ధిజీవికి వినిపించింది మెషిను.
బుద్ధిజీవి నవ్వింది. "బుద్ధిజీవి - అని పేరొకటి చెప్పావుగా ఈ అమ్మాయితో. ఆ పేరుతోనే పిలు నన్ను. ఫర్వాలేదు."
"ఎక్కడ నుంచి వచ్చావు నువ్వు?"
"మాది వై ఎక్స్ గ్రహం. మీ మిల్కీవే గెలాక్సీని దాటాక. పక్క గెలాక్సీలోని ఒక సౌరకుటుంబంలో ఉంది మా గ్రహం."
అదును చూసి కదిలి, దాని మీదకు ఉరకబోయాడు అజిత్. కానీ బుద్ధిజీవి మానవుని వూహకి అందని ఏదో ప్రక్రియతో అక్కడి వాతావరణంలో, అయస్కాంత క్షేత్రంలో ఏవో మార్పులు కలగజేసినట్లు, అతని కాళ్లూ, చేతులూ బిగుసుకు పోయాయి. శిలావిగ్రహంలా అలాగే ఉండిపోయాడు.
"భయపడకు నేస్తం! నేను మీకు అపకారం చెయ్యడానికి రాలేదు. అనేకనేక కాంతి సంవత్సరాల క్రితం బయలుదేరి విశ్వమంతటా పర్యటిస్తున్నాను - నా సహృద్భావ సందేశం అందరికీ అందించడానికి! నేను ఇంటర్ గెలాక్సియాల్ టూరిస్టుని" అని నవ్వింది బుద్ధిజీవి.
"గత కొద్దిరోజులుగా మీ భూగోళం మీదే మకాం వేసి ఇక్కడి పరిస్థితులు గమనిస్తున్నాను నేను. 'ప్రపంచానికి ఏదో ప్రళయం రాబోతోంది'అన్న భయం కలగడంలో అనుకోకుండా నా స్పేస్ షిప్ కూడా తోడ్పడినందుకు చింతిస్తున్నాను. నన్ను క్షమించండి."
నివ్వెరపోయి చూస్తున్నారు అపురూప,అజిత్.
బుద్ధిజీవి ఇంకా చెబుతోంది. "మీ భూమికంటే మా గ్రహం రెండొందల కోట్ల సంవత్సరాలు ముందు పుట్టింది. ఇప్పుడు మీరు ఉన్న నాగరికత దశలు మేము కోట్ల సంవత్సరాల క్రితమే దాటేసి ముందుకు వెళ్ళిపోయాం. అందుచేత మా అనుభవాన్ని మీతో పంచుకుని నాలుగు మంచి ముక్కలు చెప్పాలని ఉంది.
"నేస్తం! ఇందాకటినుంచీ నువ్వు సృష్టించిన దృశ్యాలు చూస్తూనే ఉన్నాను. నువ్వు చెప్పింది చాలా కరెక్టు! సైన్సు మనిషికి మంచి చెయ్యాలేగానీ ముంచెయ్యకూడదు.
"కానీ చిత్రంగా, సైన్సులో ఏదన్నా కొత్త విషయం గ్రహించగానే, దాన్ని మంచికి ఉపయోగించకుండా మిలిటరీ అవసరాలకు వాడుకోవడమో లేదా దాన్ని 'అతి' చేసి, భస్మాసుర హస్తంలా మార్చుకోవడమో జరుగుతోంది.
"మీ నాగరికతకు సంబంధించినంత వరకూ గత ఒకటి రెండు శతాబ్దాల్లో సాధించిన అద్భుతమైన విజయాలు - అణువును బద్దలు చేసి అణుశక్తి ఉత్పన్నం చెయ్యటం, జెనెటిక్ ఇంజనీరింగ్ తో సృష్టికి ప్రతిసృష్టి చెయ్యటం, రోదసీలోకి పయనించడం, కంప్యూటర్లనీ, రాబొట్లని తయారు చెయ్యడం -
"న్యాయానికి ఇవన్నీ మనిషి మనుగడని మరింత సుఖవంతంగా, మరింత శాంతియుతంగా మరింత అర్ధవంతంగా మార్చడానికి మాత్రమే ఉపయోగించాలి. కానీ జరుగుతున్న దేమిటి? ఆటంని బద్దలుకొట్టడం నేర్చుకోగానే ఆటం బాంబులతో చెలగాటం మొదలయింది. జెనెటిక్ ఇంజనీరింగ్ సాయంతో వంశపారంపర్యంగా వచ్చే జబ్బులని నివారించవచ్చు. మనిషి ఆయుర్దాయాన్నీ యవ్వనాన్నీ పొడిగించవచ్చు. గొడ్రాళ్ళకు సంతానం కలిగించవచ్చు. కానీ జరుగుతున్నదేమిటి? జెనెటిక్ ఇంజనీరింగ్ తో మనుషుల్ని యంత్రాల్లా మార్చేశాడు ఒక డిక్టేటరు - తన రాజకీయ ప్రయోజనాల కోసం!
"క్లోనింగ్ పద్ధతిని "క్లౌనింగ్"గా, బఫూనరీగా చేసేసి విశృంఖల శృంగారానికి ఉపయోగించుకుంటున్నారు మెకానికాలోని మనుషులు.
"రాబొట్స్ వచ్చాక అసలు చిన్నచిన్న పనులు కూడా చెయ్యడానికి ఇష్టపడటం లేదు ఎవ్వరూ!
"అంతరిక్షంలోకి రాకెట్లూ, శాటిలైట్లూ, స్పేస్ షిప్పులూ పంపడం నేర్చుకున్న తర్వాత కమ్యూనికేషన్లూ, విద్యాబోధన మార్గాలూ మెరుగయ్యాయి. నిజమే! ఒకానొక కాలంలో వార్తలని పంపడం మీకు దుర్లభంగా ఉండేది. అబ్రహాం లింకన్ చనిపోయినట్లు ఇంగ్లండుకి వార్త అందడానికి వారం రోజులు పట్టిందట! అలాంటిది, ఇప్పుడు చంద్రుడిమీద నుంచి టెలివిజన్ సిగ్నల్ ని భూమి మీదకు పంపడానికి ఒకటీ పాయింట్ మూడు సెకెండ్లు మాత్రమే పడుతోంది. సంతోషమే!
"కానీ ఆ వెంటనే జరిగింది ఏమిటి?
"శాటిలైట్లను మిలిటరీ అవసరాలకు వాడటం పెరిగిపోయింది. దగ్గరగా ఉన్న గ్రహాలలో సైనిక స్థావరాల స్థాపనకై పోటీ పెరిగింది.
"ఏదో వరంలాగా దొరికిన ప్రతి వైజ్ఞానిక అంశాన్నీ ఇలా దుర్వినియోగం చెయ్యాలా మనిషి? సూర్యరశ్మికూడా మిలిటరీ అవసరాలకు పనికి వస్తుందనీ, సాటి మానవుడిని చంపడానికి ఉపయోగపడుతుందనీ అనిపిస్తే, మనిషి దాన్ని వెయ్యి సంవత్సరాల క్రితమే డెవెలప్ చేసి ఉండేవాడు! సందేహం లేదు!
"గత కొద్ది రోజులుగా తలెత్తిన భయాందోళనలను గమనిస్తూనే ఉన్నాను నేను. ఏదో విషక్రిమి వల్ల తమ జాతి అంతమై పోతుందని భయపడుతున్నారు మనుషులు. కానీ ఈ స్వల్ప వ్యవధిలోనే నేను గ్రహించింది ఏమిటంటే, ఆ విష క్రిమి కంటే కూడా భయంకరమైన క్రిమి మనిషే! తన క్రిమినల్ బుద్ధితో, తన విశృంఖలత్వంతో, తన స్వార్థంతో, తనకి తానే శత్రువులా ప్రవర్తిస్తున్నాడు. వాతావరణాన్ని పాడు చేసుకుంటున్నాడు. సైన్సుతో చెలగాటమాడుతున్నాడు. మానవజాతిని మట్టుపెట్టే మారణాస్త్రాలనీ, మరణాన్ని తెచ్చే క్రిములనీ చేతులారా తయారు చేసుకుంటున్నాడు.
"మనిషికి మనిషిని మించిన శత్రువు లేడు!" అని విచారంగా తల వూపింది బుద్ధిజీవి. ఆ తర్వాత హఠాత్తుగా అజిత్ వైపు తిరిగి, "అజిత్! ఆ విషక్రిమి కాప్స్యూల్ ఏదీ? ఎక్కడ దాచావ్? బయటికి తియ్యి!" అంది.
 ఆ మాట వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు అజిత్. కొద్దిక్షణాలు నిశ్చలంగా బుద్ధిజీవి కళ్ళలోకి చూశాడు. తర్వాత తన ఆటలు ఆ గ్రహాంతర జీవి ముందు సాగవని గ్రహించినవాడిలా ఒక నిశ్చయానికొచ్చేసి, కుడి చేతితో ఎడమచేతి మణికట్టుని పట్టుకుని తిప్పసాగాడు. వాచీకి కిందగా, కంటికి కనపడనంత సున్నితమైన జాయింటు ఉంది.
"మొదట్లో కొంతకాలం నేనూ భ్రమపడ్డాను, నువ్వు మనిషివేనేమోనని! కానీ తర్వాత నీవు రాబొట్ వని కనిపెట్టేశాను" అంది బుద్ధిజీవి చిరునవ్వుతో.
అజిత్ మాట్లాడకుండా మణికట్టుని తిప్పుతూనే ఉన్నాడు. అది స్క్రూలా తిరిగి, వూడి చేతిలోకి వచ్చేసింది. దాన్లో చిన్న పాకెట్ ఉంది. ఆ పాకెట్లో ఉంది ఎర్రటి చిన్న కాప్స్యూలు!
నిశ్చేష్టురాలైపోయింది అపురూప.
బ్రహ్మాండం తిరిగి బద్దలైపోయినట్లూ, నక్షత్రాలు పేలిపోతున్నట్లూ, చంద్రుడు కరిగిపోతున్నట్లూ, సముద్రాలు మరిగి పోతున్నట్లూ, విశ్వమంతా కొలాప్స్ అయిపోయి తనమీద విరుచుకుపోతున్నట్లూ అనిపించింది ఆ అమ్మాయికి.
అజిత్, తన అజిత్, తను ప్రాణప్రదంగా ప్రేమించిన అజిత్, చివరికి తను పెళ్ళికూడా చేసుకుందామనుకుంటున్న అజిత్, మనిషి కాడా? మరమనిషా?
భరించలేని నిస్పృహతో, నిరాశతో, కళ్ళు తిరిగినట్లయింది. ఒళ్ళు స్వాధీనం తప్పుతోంది.
స్పృహ కోల్పోయింది అపురూప.
"అపూ!" అని ఒక్క అంగలో ఆమెని చేరుకుని, ఆమె పడిపోకుండా ఆపాడు అజిత్. అతని మొహం పాలిపోయి వుంది.
ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు రాక తప్పదని తనకు తెలుసు.
అయినా ఆ క్షణం రాకుండా ఉండాలని ఎంతో ఆశపడ్డాడు తను - తాపత్రయ పడ్డాడు.
మరమనిషి అయిన తను, మనిషి అయిన అపురూపతో ప్రేమలో పడటం తగదని తెలుసు తనకి. తెలిసీ ఈ అమ్మాయితో ప్రేమలో పడిపోయాడు.
తన శరీరంలోని ఏ జాయింటుకి ఆ జాయింటు పీకేసుకుని, తననితాను నాశనం చేసుకోవాలని తీవ్రమైన కోరిక కలిగింది అతనికి.
తను ఒక రాబొట్ అని తెలియగానే అపురూప మొహంలో కనబడిన భయం, ఏహ్యభావం చూసి కూడా తన బాడీలోని సిస్టమ్స్ అన్నీ ఫ్యూజ్ అయ్యి, చలనరహితంగా అయిపోకుండా ఇంకా మామూలుగానే ఎలా ఉన్నాడు తను? తనలో గుండె కాదు. బండ!
విషాదంగా నవ్వుకున్నాడు అజిత్. నిజమే! తనలో మానవత్వం ఎలా ఉంటుంది? తను అసలు మనిషి కానప్పుడు? మనుషులతో కలిసిపోయి ఉండడంవల్ల తనకి మానవత్వం ఆపాదించుకున్నాడు. తను ఒక మరమనిషినన్న సంగతి మర్చిపోయి.
ఏమిటీ? ఏమిటీ? ఆపాదించుకుంటున్నాడా? మళ్ళీ అదే తప్పు! తనని "డు" అని పుంలింగంతో వ్యవహరించుకోవచ్చా అసలు? "ఆపాదించు కుంటోంది" అనుకోవాలా? తను మనిషి కాదు. మెషిను. "అతను" కాదు. "అది!"
మైగాడ్!
ఉహూ! అలా కాదు! నాది మొగ మనసు! నాది మొగ బుద్ధి! నన్ను మొగ రాబొట్ గానే డిజైన్ చేశారు డాక్టర్ సంజీవ్! నో! నేను అజిత్ నే! నాకు అపురూప కావాలి?
తన చేతుల్లో ఉన్న అపురూప హఠాత్తుగా అదృశ్యమైపోతుందేమోనని భయపడుతున్నట్లు గట్టిగా పట్టుకున్నాడు అజిత్. తనకి ఉక్కు కౌగిలి అని ఆ క్షణంలో మర్చిపోయాడు.
"అబ్బా!" అని బాధగా అంటూ కళ్ళు తెరిచింది అపురూప.
అజిత్ కౌగిట్లో తను!
డాక్టర్ సంజీవ్ సృష్టించిన భయంకరమైన 'బేబీ ఫేస్' రాబొట్ ఉక్కు కౌగిట్లో తను!
తన పక్కటెముకలు విరిగిపోతాయేమో అనిపించింది. తన ప్రాణానికి ప్రాణమనుకున్న అజిత్, తన ప్రాణం తీస్తున్నాడా?
ప్రియుడి చేతిలోనే చనిపోతోందా తను?
ప్రియుడా? ఈ మెషిన్ తన ప్రియుడా?  
అవమానంతో ఆమె మొహం ఎర్రబడింది. ఉవ్వెత్తున దుఃఖం పొంగు కొచ్చింది.
"అజిత్! ప్లీజ్ త్వరగా చంపెయ్ నన్ను! ఈ మనసు కోత నేను భరించలేను! క్విక్! చంపెయ్ నన్ను త్వరగా!" అంది హిస్టిరికల్ గా.
"అపూ! నా అపూ! నిన్ను నేను చంపుకుంటానా? నిన్ను చంపేముందు నేను వెయ్యి చావులు చస్తాను అపురూపా! నా అపూ!" అతని గొంతు వణికింది.
తలెత్తి ఆశ్చర్యంగా అతని కళ్ళలోకి చూసింది అపురూప.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra