Home » Adivishnu » Udyogam

ఎగుమతీ దిగుమతులకు సంబంధించిన ఆ వ్యాపారము దినదినాభివృద్ధి చెందుతున్న విషయం ఆ సంస్థలో ఉద్యోగం చేస్తూన్న మా వూరివాళ్ళు చాలామంది చెప్పేరు. పశుపతి గారి వ్యాపారాభివృద్ధి గురించి అక్కడి ఉద్యోగస్థులందరి మాటా ఒక్కటేగానీండి, వాళ్ళ ఉద్యోగ నిర్వహణ వగైరా విషయాల్లో మాత్రం భేదాభిప్రాయాలున్నాయి. దీని మూలంగా పశుపతిగార్ని చాలారకాలుగా వూహించుకోవలసిన అవసరమెంతైనా వుంటుంది.క్లాస్ వన్ ధర్మరాజని కొద్ది మంది చెప్పేరు. వొఠ్ఠి దుర్మార్గపు మనిషని చాలామంది అన్నారు. స్వార్థముందిగానీ, అది ఎదటివాడిని ముంచేది కాదని  కొందరి విశ్వాసం. ఏమైతేనేం పశుపతిగారు దైవ స్వరూపులు ఒకేదేవుడు అనేకమంది కనేకరకాలుగా ఎలా కన్పిస్తాడో సాక్షాత్తువీరూ. అంతే.
పశుపతిగారితో నాకు పరియమున్నమాట వాస్తవమే. స్థానికంగా ఏర్పాటు చేయబడే సంఘ కార్యకలాపాల్లో ఆయన్నాకు తారసపడ్డారు. మొదటిది ( గుర్తున్నది) పట్టణ యువజన సంఘ వార్షికోత్సవంలో నేను వక్తను. ఆనాడు పశుపతిగారు మొదటివరుసలో ఓ అందమైన కుర్చీలో కూర్చున్నారు. కార్యక్రమం పూర్తయినంత తర్వాత శ్రీహరితో నాకు పరిచయభాగ్యం కలిగింది.సంఘ నిర్వాహకులు పశుపతి గారికి నా గురించి అతిగానే చెప్పారు. అప్పుడాయన మందహాసంచేసి వీలు చిక్కినప్పుడు తమని తప్పక కలుసుకోవలసిందింగా కోరేరు. రెండోతడవకాబోలు వారికి నేను కావలసిన మనిషినయ్యాను. నేను రాసిన నాటకాన్ని పురనటులు కొందరు మావూళ్ళోనే ప్రదర్శించేరు. ఆ ప్రదర్శనకి సినిమా చిన్ననటులొకరు హాజరయ్యేరు. వారిదీ మావూరే .వారి పక్కకుర్చీలో నే పశుపతిగారు కూర్చున్నారు.  ఆనాటి ప్రదర్శన నిజానికి రక్తికట్టిందనే చెప్పాలి. రచయితగా ప్రేక్షకమహాశయులకు నన్నానాడు వేదికమిద పరిచయం చేశారు. తదనంతరం మా పూర్వం మాస్టారొకాయన నా గురించీ నా నాటకంలోని నటుల గురించీ ఉద్ఘాటించారు. ఆ పైన పశుపతిగారు సినీమా చిన్ననటునితో నన్ను కలుసుకున్నారు. వారికి నన్ను పరిచయం చేసి ఆనక నన్నో మంచి నాటకం కొత్తది రాయమని అడిగేరు.
కాని, పశుపతిగారంత పట్టుదలగలమనిషిని నాకానాడనిపించలేదు సరిగ్గా వారంరోజులు గడవగానే ఓ సాయంత్రం నన్ను వారింటికి పిలిపించేరు. వెళ్ళాను.
వారిల్లు అందంగా వుంటుంది. పాలరాతిమేడలా నున్నగా వుంటుంది చూట్టూతా ముచ్చటైన ప్రహరీ ఒకటుంది. ప్రహరీ  అంచును మనోహరమైన కోటన్సూ వున్నాయి. నేను వెళ్ళినవేళకి పశుపతిగారొక్కరూ మల్లెపందిరికింద ఓ కూర్చీలో( వాలుది ఖరీదైనది) నడుంవాల్చి పుస్తకమేదో తీరుబడిగా చుదువుతున్నారు. వారినాస్థితిలో చూచినప్పుడు నేసూయచెందాను.  ఈ మనిషికింత దర్జాని ఇంత ఆనందాన్ని నిష్కారణంగా ఆ భగవంతుడేల అనుగ్రహించేడాని బాధపడిపోయేను.
తిన్నగా వెళ్ళినే నాయనక్కొంచెం దూరంలో నించున్నాను. నేనొచ్చినట్టు పశుపతిగారు గమనించలేదు కాబోలు కాని వారికుక్క గమనించి మేడమించి అరిచి గోలపెట్టే సింది. పశుపతిగారు పుస్తకాన్ని తొలిగించి నన్ను చూచిన మిదట చిన్న హాసరేఖ పెదాలమిద వెలిగించి, వారి కుక్కని మందలించేరు. కుక్క నోరుమూసుకున్నది.
ఆయన నన్ను కూర్చోమన్నట్టు నటించేరు. అక్కడే ఖాళీగావున్న మరో కుర్చీలో వినయంగా  కూర్చోవాలను కున్నానుగానీ, కుదరక చాలా మామూలుగానే కూర్చున్నాను.
వంటమనిషో , పనిమనిషో తెలియదుగాని ఒకతను కాఫీలు పట్టుకొచ్చి మాకందించేడు ఇక మరి తాగవలసిందిగా తలతో తెలియచేసి వారమ్మాయిని పిలిపించేరు.ఎందుకలా అనవసరంగా ఆపిల్లని పిలుస్తున్నారో అర్దమయిందికాదు. వారమ్మాయి దాదాపు నాట్యంచేస్తున్నట్టు వొస్తూ, దార్లోనే   ఓ మనస్కరం పారేసి, వొచ్చి మరోకూర్చలో కూర్చుంది.
ఈ అమ్మాయి నింతకంటె చిన్నతనంలో నేనన్నో సార్లు చూసేను. ఆడపిల్లలు సైకిలు తొక్కడమనే విద్యని హర్షించలేనివూరు మాదికాదుగాని, విడ్డూరంగాచూచే మానవులు  నాతోపాటు చాలామంది మావూళ్ళోవున్నారు.పశుపతిగారమ్మాయి సైకిల్మీద సాయంసమయాల్లో ఆలా ఆ తార్రోడ్డు వెంట షికారుకొచ్చేది.  వెనగ్గా ఓ బంట్రోతు నరుగలు కక్కుతూ, రొప్పుతూ వొచ్చేవాడు. అప్పుడు  నాకా అవస్థంతా చిత్రంగా కనుపిస్తూండేది అందుచేత పశుపతిగా రమ్మాయిని నేనీ జన్మలో మరిచిపోలేనుగదా!
"శకుంతల  మా అమ్మాయి. బియస్సీ చదువుతోంది. వీళ్ళమ్మ చదువుతోంది. వీళ్ళమ్మ  చదువింక కట్టేయమంటుంది . నేనేమొ మెడిసన్ చదివిద్దామంటాను. శకుంతలేమొ  సినీమాల్లో చేరతానంటుంది. ఇదండీ మాకథ!" అన్నారు పశుపతి.
నేను చాలాకథలు రాశాను. కొన్ని నిజమైన కథలూ రాసేను. కానీ పశుపతిగారు చెప్పినకధ నాకు నచ్చలేదు. నన్నడుగుతే దానికి కథనే పేరూ తగదని చెప్తాను.
పశుపతిగారి మాటలకు శకుంతల సిగ్గపడిట్లే కనిపించింది. మరి.తనకున్న రెండు జడలల్లో ఓజడని ముందుకు లాక్కుని రెండు చేతుల్తో ఆజడని అల్లుతూంది.
కాసేపలా జరిగింతర్వాత పశుపతిగారు వారి అసలు, ఉద్దేశాన్ని బహిరంగం చేశారు.
"మిరు మంచి నాటకాలు రాస్తారని నాకు తెలుసు. మరేంలేదు. మా శకుంతల సినీమాల్లో చేరాలనే ఉబలాటాన్ని తండ్రిగా నేనుకొట్టిపారేయలేకపోతున్నాను. మిరు ఓ బ్రహ్మాండమైన నాటకం రాయండి. దాన్లో శకుంతలకి మంచి పోర్షను ఎంచండి. అయ్యిందా  ఈ నాటకాన్ని నా  సొంత ఖర్చులమిద  అటు మదరాసూ, ఇటు హైద్రాబాదు రెండూళ్ళలోనూ ప్రదర్శించే ఏర్పాటు  చేస్తాను. నాటకం మాత్రం చాలా బాగుండాలి. పెద్ద పెద్ద సినిమా డైరెక్టుర్లు, నటులు  వగైరాలను ప్రదర్శనకి పిలిపించే  బాధ్యత నాదే.  అదృష్టంబాగుంటే అమ్మాయికి సినీమాల్లో ఛాన్సు దొరకొచ్చు. అంతేకాకుండా నాటక రచయితగా నిక్కూడా  ఏదైనా ప్రయోజనమూ వుండొచ్చు. ఆలోచించండి"
నేనాయన పథకాన్ని  విని తెల్లబోయాను.ఇంతకు మునుపు నాతో యెవరూ ఈప్సానుని చెప్పలేదు. పశుపతి గారి తెలివి అమోఘ . మధ్యలో నాగ్గూడా ఇంత ' ఆశ'  మేతపెట్టారు. కానీ చాలా బాగా నచ్చే కొత్తనాటకాన్ని నేనెంతకాలంలో రాయగల ననేది మొదటిసమస్య. ఆరాసిననాటకం ఈయనగారి కెంత నచ్చుతుందనేది ముఖ్యమైన రెండో సమస్య. అందుచేత నేనప్పుడాయనకి యేవిధమైన హామియివ్వలేకపోయేను.
నేను వారింటినుంచి తిరిగొచ్చి నాటినుంచీ నేటివరకూ నేను నాటకం రాయనూలేదు, ఇప్పటికొచ్చి నేనాయక్కని పించమాలేదు. ఆలాంటప్పుడీ సమయంలో నేనాయక్కని పించమాలేదు. ఆలాంటప్పుడీ సమయంలో సంగమేశ్వరరావు ఉద్యోగం నిమిత్తం మళ్ళీ నేనాయన్ని చూడవలసివస్తేనా గొంతుక్కి ఉరి పడేమాట ఖాయం. పోనీ, నేనేదైనా నాటకం రాసివుంటే ఆసందర్భం ఆయన్ను కులుసుకోవచ్చు. నేనీమధ్య అస్సలేమి రాయటంలేదు. గనుక ఇక వార్ని కలుసుకోడమనేమాట తీసిపారేశాను.    
కానీ,ఇటు సంగమేశ్వరరావు నన్ను బ్రతకనిచ్చేలా లేడు. బొత్తిగా నన్ను తినేస్తున్నాడు. తరచూ మాయింటికొచ్చి అత నుద్యోగవిషయ మెంతవరకు  వచ్చిందో కనుక్కువెడుతున్నాడు. మధ్య మధ్య పశుపతిగారి ప్రయాణాలూ, వారి తీరుబడి వైనాలూ, యివన్నీ  హెచ్చరించడం గూడా చేస్తున్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra