Home » Mainanpati bhaskar » Davagni


    అప్పుడు హఠాత్తుగా లోపలికి వచ్చాడు కెప్టెన్ తోకాస్.

 

    ఎప్పుడు పడితే అప్పుడు జనరల్ భోజా సాన్నిధ్యంలోకి రావడానికి అతనొక్కడికే పర్మిషన్ వుంది.

 

    తోకాస్ మొహంలో కనబడుతున్న భావం చూస్తే, అది భయమో, ఎగ్జయిట్ మెంటో అర్థం కాలేదు భోజాకి:

 

    పక్కనే నిలబడి తనకి సారాయం చేస్తున్న బట్లర్ ని "గెటవుట్:" అని కసురుకుని, తామిద్దరే మిగిలాక, తోకాస్ తో అన్నాడు భోజా:

 

    "ఏమయింది?"

 

    అటూ ఇటూ చూసి అన్నాడు తోకాస్.

 

    "మీ పర్సనల్ బార్బరు అమ్మగారి గదిలోకి వెళ్ళాడు. ఇద్దరూ తలుపులు మూసుకున్నారు."

 

    పెదిమల మీద చిరునవ్వు మెరిసింది జనరల్ భోజాకి.

 

    తన మంగలి జెన్నిఫర్ గదిలోకి వెళ్ళాడా? తర్వాత ఇద్దరూ తలుపులు వేసుకున్నారా?

 

    అది అక్రమ సంబంధం అయివుండదు.

 

    జెన్నీ లాంటి జెర్సీగొడ్డుని మోహించే మొగాడు ఉండడు.

 

    కానీ -

 

    మంగలి తన భార్య గదిలోకి యెందుకు వెళ్ళాడు?

 

    "బార్బర్ వెళ్ళిన కొద్ది నిముషాలకు అంతకు ముందే గదిలోవున్న పాపాడాక్టర్ బయటికి వచ్చాడు" అన్నాడు తోకాస్.

 

    ఒక్కసారిగా వెయ్యి పిడుగులు తన మీద పడినట్టు ఫీలయ్యాడు భోజా.

 

    తన భార్య... బార్బరు.... విచ్ డాక్టర్: అంటే... మాంత్రికుడూ- తాంత్రికుడూ అయిన పాపాడాక్టర్:

 

    ఈడూ విద్యలో ఉద్ధండుడు:   

 

    గాడ్...:

 

    వాళ్ళకి మంగలి అవసరం ఏమిటో హఠాత్తుగా అర్థం అయింది భోజాకి.... నిలువు గుడ్లు వేసి సందేహ నివృత్తి కోసం తోకాస్ వైపు చూశాడు.

 

    "దిండు తయారు చేయిస్తోంది" అన్నాడు తోకాస్. "నీకు సమాధి కట్టిస్తోంది" అన్నట్లుగా గొంతుపెట్టి.

 

    కసాయివాడి చేతికి అందిన పందిలా అరిచాడు జనరల్ భోజా...

 

    చిత్రద్వీప్ చాలా వెనకబడ్డ దేశం: అక్కడ వున్న జనానికి అనేకానేకమైన మూఢనమ్మకాలు. ఆ మూఢనమ్మకాలకి జనరల్ భోజా కూడా అతీతుడేం కాదు.

 

    భారతదేశంలో చేతబడులూ, బాణామతి లాంటి రకరకాల క్షుద్ర విద్యలున్నట్లే- ఆఫ్రికా ఖండంలో దాని ప్రభావంపడ్డ దగ్గర దేశాల్లో ఊడూ అనే విద్య మీద ప్రజలకు తిరుగులేని నమ్మకం వుంది.

 

    ఆ విద్యని ప్రాక్టీసు చేసే విచ్ డాక్టర్లు అంటే జనసామాన్యానికి అనూహ్యమైన భయభక్తులు ఉంటాయి.

 

    జనరల్ భోజాకి ఊడూ విద్య బాగా వచ్చనీ, అతను పిలిస్తే దేవతలు పలుకుతారనీ, దెయ్యాలు ఎగిరి గంతేసి వచ్చి అతడి సేవకోసం తయారుగా వుంటాయనీ ప్రజల్లో భావన ఉంది. ఆ విద్యవల్లే అతను సర్వ శక్తిమంతుడయ్యాడని జనవాక్యం.

 

    ఆ భావనని మరింతగా పెంచి పోషిస్తున్నాడు భోజా.... నిజానికి ఊడూ గురించి అతనికి తెలిసింది అవగింజలో వెయ్యోవంతు వుండదు...

 

    నిజానికి ప్రజలకంటే కూడా అతనికే విచ్ డాక్టర్లు అంటే చాలా భయం వుంది.

 

    అందుకే పాపాడాక్టర్ ని తన ఆస్థాన వైద్యుడిగా పెట్టుకున్నాడు తన రక్షణకోసం:

 

    జనరల్ భోజా కొలువులో చేరగానే పాపాడాక్టర్ చేసినపని ఒకటి వుంది.

 

    భోజా శతృవుల, ప్రత్యర్థులతాలూకు జుట్టు సంపాదించాడు అతను ఆ జుట్టునే దూదికి బదులుగా ఉపయోగించి, ఒక దిండు తయారు చేయించాడు.... పూజా పునస్కారాలు జరిపి ఆ దిండుని జనరల్ భోజాకి యిచ్చాడు.

 

    ఆఫ్రికన్ దేశాల్లో ఆ నమ్మకం వుంది. శతృవు జుట్టు దొరికితే, వాడి ఆయువుపట్టు దొరికినట్లేనని.

 

    ఆ దిండు తలగడకింద పెట్టుకొని నిద్రపోయేవాడు జనరల్ భోజా. కాకతాళీయమో, దిండు మహత్యమోగానీ, ఆ రోజు నుండి శతృవులను వరసపెట్టి చంపెయ్యగలిగాడు అతను.

 

    అందరి జుట్టూ తన చేతిలో పెట్టుకున్నాడుగానీ, తన భార్యజుట్టుని మాత్రం దిండులో వెయ్యలేదు భోజా.

 

    ఆ అవసరం వస్తుందనుకోలేదు.

 

    ఇప్పుడు తన జుట్టే జెన్నీ చేతిలో చిక్కుకుంది.

 

    "దిండు తయారయిందా?" అన్నాడు జనరల్ భోజా ఆదుర్దాగా.

 

    "మీకు క్రాపు చేసినప్పుడల్లా ఆ జుట్టంతా తీసుకెళ్ళి వాళ్ళకిస్తున్నట్లున్నాడు. ఇది చాలా రోజులనుండి జరుగుతూ ఉండి వుండాలి. ఇవాళ అదృష్టవశాత్తు మనకంట పడింది" అన్నాడు తోకాస్.

 

    "మన జుట్టు వాళ్ళ చేతిలో పడ్డాక ఇంకా అదృష్టమేమిట్రా అనాకారి పీనుగా..." అని తోకాస్ డొక్కలో ఒక్క గుద్దు గుద్దాడు జనరల్ భోజా. "దిండు తయారయిందా? అది చెప్పిచావు ముందు.   

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra