Home » Suryadevara rammohan rao » సాహసి


    రెండ్రోజులు గడిచాయి.

    ఎక్కడా ఒక్క గుక్క నీరు దొరకలేదు. ప్రాణాలు కడగట్టుకు పోతున్న పరిస్థితి- ఇదే ఇక ఆఖరి సమయం అని అనుకున్నారట ఆయన.

    అంతలోనే-

    ఒక చిన్న గుడిసె కనిపిస్తే, ఆవురావురుమంటూ అక్కడికెళ్ళారు. అక్కడ ఆ చిన్న గుడిసెలో కునికిపాట్లు పడుతూ, ఒక ముసిలవ్వ కనిపించిందట.

    అలిసిపోయి, ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్న సుబ్రహ్మణ్య భూపతికి ముందు మంచినీళ్ళిచ్చి, ఆ తర్వాత అక్కడే వున్న 'పచ్చిపసరిక గడ్డి'ని తీసుకుని దాంతోనే 'పచ్చడిచేసి' అన్నం వండి పెట్టిందట.

    గడ్డి పచ్చడినే పరమాన్నం అనుకుని తినేసారట సుబ్రహ్మణ్య భూపతి. ఆ తర్వాతే ఆయన వెనక్కి తిరిగి వచ్చేశారు.

    ఆ రోజు తన ఆకలి తీర్చి, తనను కాపాడిన ఆ ముసిలవ్వను చూడడానికి, మరో వారం రోజుల్లో అక్కడి కెళ్ళారట ఆయన. ఆ ముసిలవ్వ కనిపించ లేదు గుడిసె బోసిగా కనిపించింది. సమీప గ్రామాల్లో విచారించారు- అలాంటి ముసిలవ్వ ఎవరూ ఆ ప్రాంతంలో లేరని చెప్పారు అక్కడి గిరిజనులు.

    చాలా ఆశ్చర్యకరమైన సంఘటన.

    'ఇంతకీ ఆ ముసిలవ్వ ఎవరు అనేది- సమాధానం లేని ప్రశ్న.

    తమ వంశపు ఆరాధ్య దేవశక్తి అయిన కాళికాదేవి, ఆ రూపంలో వచ్చి, తన ఆకలిని తీర్చి తనని కాపాడిందని సుబ్రహ్మణ్య భూపతి విశ్వసించారు. మహామంత్రి ఆస్థాన పండితులు అందరూ అదే చెప్పారు కూడా.

    అప్పుడు-

    సుబ్రహ్మణ్య భూపతివారు ఆ ప్రదేశానికి 'పసరికలోవ' అని పేరు పెట్టి, ఒక దేవి దేవాలయాన్ని కట్టించారట. తనకు జరిగిన సంఘటనను తేదీల్తో సహా సంస్కృతంలో శిలాఫలకం మీద చెక్కించి తాపడం చేయించారట కూడా.

    ఆ దేవాలయాన్ని దర్శించడం మరచిపోకూడదు.

    అసలు ఆ శిలాఫలకంలో ఏవుందో, తెలిస్తే మన పరిశోధనకు బాగా ఉపయోగపడుతుంది గుర్తుంచుకో."

    అలాంటి సంఘటనలంటే వాటి గురించి వినటమంటే చాలా ఇష్టం ఇందుమతికి. "సైంటిఫిగ్గా ఆలోచిస్తే ఇవన్నీ మిత్స్ కాదంటారా?" అడిగింది ఇందుమతి. అయినా ఏదో అనుమానం... "ఏది.. మిత్. ఏది మిధ్య... ఏది సత్యం... ఎవరు చెప్పగలరు- మనం నేనమ్మేది... నమ్మింది... సత్యం... అవునా- అలాగే... రాముడు రామాయణం ప్రకారం మానవోత్తముడు. భాగవతం ప్రకారం దేవుడు.

    పోతనకు ఏం రాయాలో తోచని సమయంలో, రాముడు, రాసేసి వెళ్ళిపోయాడని అంటారు. ఎలా ఇది సాధ్యం... అందుచేత... ఏ విషయాన్నయినా, చర్చించేటప్పుడు మన అనుభవాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోకూడదు.

    విపులాచ పృధ్వీ.

    భగవంతుడు వున్నాడు- శక్తి రూపంలో వున్నాడు- నిత్యం ఈ మానవాళిని రక్షించేది ఆ శక్తే. కోటలకు, నిధులకు 'శక్తి కాపలా'గా ఉంటుందని ఎందుకంటారు? దుష్టగ్రహాలు- శిష్టగ్రహాలు ఎందుకున్నాయి? పీడలు... చేతబడులు... దెయ్యాలు... ఇవ్వి ఉన్నాయా? లేవా? వున్నాయని నువ్వు గట్టిగా సహేతుకమయిన ఆధారాలతో చెప్తే నమ్ముతుందీ ప్రపంచం. లేవని, అంతే ఆధారాలతో నిరూపిస్తే అదీ నమ్ముతుంది లోకం- ఏవంటావ్..." అడిగాడు విశ్వరూపశర్మ.

    "కానీ... మనకు దయను కురిపించే దైవశక్తి వుంది బాబూ... మీరెన్నయినా అనండి... నేను చనిపోయే లోపల శక్తి దర్శనాన్ని చేసుకుని చచ్చిపోతాను. చూస్తుండండి..." మధ్యలో అన్నాడు ముత్యాలనాయుడు.

    "ముత్యాలూ... నీ టాపిక్ వేరయ్యా..." నవ్వుతూ అన్నాడు విశ్వరూపశర్మ.

    అప్పుడు విశ్వరూపశర్మకు తటాలున ఓ విషయం జ్ఞాపకాని కొచ్చింది.

    "అమ్మా- ఇందూ- నువ్వు కనిపించినపుడల్లా- అడుగుదామనుకుంటున్నాను. మరిచేపోతున్నాను. మీ వంశంలో ఒకప్పుడు ఆడ సంతానము ఉండేది కాదు. పుట్టీ పుట్టగానే ఆడశిశువులు చనిపోతుండేవారు- ఆ సమయంలో కాశీ నుంచొచ్చిన ఒక పండితుడు, దేవీ పూజను జరిపి గర్భవతిగా వున్న ఒక రాజమహిళకు ఒక లాకెట్ ను ధరించమని ఇచ్చాడు. పూజా ఫలమో ఆ లాకెట్ రక్షో తెలీదు కానీ అప్పటి నుంచి మీ వంశములో ఆడపిల్లలకు కనీసం జ్వరం కూడా రాలేదు. బహుశా ఆ రాజమహిళ- మీ ముత్తాత గారి సతీమణి కావచ్చు- ప్రస్తుతం ఆ లాకెట్ ఎవరి దగ్గరుంది-? ఉంటే నీ దగ్గర వుండాలి. ఆ వంశంలో మిగిలిన ఆడపిల్లవు నువ్వే గనుక-" 

    "లాకెట్-" చప్పున గుర్తొచ్చింది. కాలేజీకి ఫీజు విషయంలో ఇబ్బంది ఏర్పడినపుడు కృతజ్ఞతా సూచకంగా లాకెట్ ను వైశాలికిచ్చిన సంగతి గుర్తు కొచ్చింది.

    అదే లాకెట్టా! ఏమో!

    "మొన్నటి వరకూ. ఆ లాకెట్- నా దగ్గరే వుంది. కానీ ఇటీవలే ఓ ఫ్రెండ్ కి ప్రజంట్ చేశాను..." అంది ఇందుమతి అదెందుకో అర్ధం కాక.

    "ప్రజంట్ చేశావా?" షాక్ తిన్నాడు విశ్వరూపశర్మ.

    "ఆ లాకెట్ ఎందుకు?" అడిగింది ఇందుమతి.

    "ఏం లేదమ్మా... ఆ లాకెట్లో ఏదయినా మనకు అవసరమయిన మర్మం దొరుకుతుందని నా నమ్మకం. మన పరిశోధనలో ఇలాంటి చిన్న వస్తువుల అవసరాలే ఎక్కువ. ఇప్పుడు సంపాదించగలవా... ఇప్పుడా అమ్మాయి మైసూర్ లోనే వుంది కదా..."

    "వుంటుంది"

    "ప్రెజెంట్ చేసిన వస్తువుని తీసుకోవడం..." సందేహించింది ఇందుమతి.

    "అందులో ఇన్ ఫర్ మేషన్ ఏదీ లేదనుకో... తిరిగిచ్చేద్దాం... ఏవంటావ్..." సమాధానపడింది ఇందుమతి.

    "అర్జంటుగా దాన్ని సంపాదించు- నువ్వెళతావా..." అడిగాడాయన.

    "ఇక్కడ చాలా పనులున్నాయి కదా..." సందేహించింది ఇందుమతి.

    ముత్యాలనాయుడు అడ్డొచ్చాడు.

    "అది కాదు చిన్నమ్మా... మన యువరాజున్నాడు కదా... అతడ్ని పంపుదాం... అతనికి కూడా చిన్న పరీక్ష పెట్టినట్టుంటుంది గదా..."

    "భేషైన సలహా. అతన్ని పంపించు... మనం బయల్దేరే నాటికి మనకు ఆ లాకెట్ మర్మం కూడా తెలిస్తే ఇంకా బాగుంటుంది..." అన్నాడు శర్మ.

    చేతి వాచీవైపు చూసుకుంది ఇందుమతి.

    పదిగంటలు కావొస్తోంది. తెల్లవారు జామునే దేవులపల్లి కోటకు ప్రయాణం పెట్టుకుంది... అలాంటప్పుడు అప్పుడే.

    వెళ్ళి యువరాజుకి ఆ విషయం చెప్పాలి, తప్పదు. ఈ సమయంలో ఎక్కడుంటాడు యువరాజు? అని ఆలోచించింది ఇందుమతి. ఆమె ఆలోచనల్ని పసిగట్టాడు ముత్యాలనాయుడు.

    "అంత ఆలోచన ఎందుకమ్మా ఎక్కడున్నా... జాలపేటలోనే ఉంటాడు కదా... పద ముందు... చకచక పనులు జరుగుతున్నప్పుడు... మరి ఆలోచనలు పెట్టుకోగూడదు."

    పంచెను ఎగకట్టుకుంటూ అన్నాడు ముత్యాలనాయుడు.

    లేచి నిలబడింది ఇందుమతి.


                  *    *    *    *


    జాలరిపేటలో యువరాజు ఇల్లు వెతికేసరికి ఓ గంట గడిచి పోయింది. తలుపు తెరిచిన యువరాజు ఎదురుగా లక్ష్మీదేవిలా కనిపించిన ఇందుమతిని చూసి- ఆశ్చర్యపోయాడు.

    "మీరా... ఈ సమయంలో?"

    గదిలోకెళ్తూ చుట్టూ చూసింది. ఒక హాలు, ఒక పడక గది అంతే.

    "ఏమిటీ మీరొక్కరే వుంటున్నారా?"

    "లేదండీ... నేనూ మా మారుతీ" ఆయనెవరు?" కుర్చీమీద కూర్చుంటూ అడిగింది. గోడకున్న పటంవైపు చూపించాడు యువరాజు...

    "అంటే మీరు బ్రహ్మచారులా?"

    "అవును. లైఫ్ లాంగ్ అంతే!" అన్నాడు యువరాజు నిట్టూరుస్తూ.

    "లైఫ్ లాంగూనా... ఎందుకా కఠోర నిర్ణయం తీసుకున్నారు" ఆసక్తిగా అడిగింది.

    "అదొక పెద్ద ఫ్లాష్ బ్యాక్ స్టోరీలెండి. సినిమాల్లో చూపిస్తారు చూశారూ... రింగు రింగులు తిరగాలి... భూకంపాలు రావాలి... సముద్రాలు పొంగాలి... ఎక్కడో ఏదో విమానం ఏదో రైలుని ఢీ కొట్టాలి... అప్పుడు చెప్తాను లెండి- ప్రస్తుతానికి..." ఆగాడు.

    తనెందుకొచ్చిందో చెప్పింది ఇందుమతి నవ్వుతూ.

    "అర్జంటుగా బయల్దేరమంటారన్న మాట... బాగానే వుంది... ఆ హాస్టల్లో ఆ పిల్ల వుంటుందంటారా..."

    "వుంటుంది"

    "ఆ లాకెట్ ఇస్తుందంటారా..."

    "ఇస్తుంది"

    "అయితే ఇప్పుడే వెళ్ళిపోమంటారా?"

    "ఇప్పుడే..." 

    "అయితే... మీరొక్కసారి బయటికెళ్ళండి..." అలా యువరాజు ఎందుకంటున్నాడో మొదట అర్ధం కాలేదు ఇందుమతికి.

    "అపార్ధం చేసుకోకండి ఈ ఒక్క గదే. డైనింగ్... డ్రెస్సింగ్, బెడ్ రూమ్... అన్నీనన్న మాట... ఇప్పుడు నేను మేకప్ అవ్వాలిగదా- అందుకని" అతని మాటలకు మనసులోనే నవ్వుకుంటూ, గదిలోంచి హాల్లోకొచ్చి నిలబడింది ఇందుమతి. హాల్లో కర్ర స్తంభానికి చేరబడి నిద్రపోతున్నాడు ముత్యాలనాయుడు.

    హాయిగా కృష్ణా, రామా అనుకునే వయసు... ముత్యాలనాయుడు మీద అపారమైన అభిమానంతో పాటు జాలి కూడా కలిగాయి ఇందుమతికి.

    మరో అయిదు నిమిషాల తర్వాత-

    లోపల్నించి బయటికొచ్చాడు యువరాజు.

    "అయామ్ రెడీ..."

    ఒక పేపరుమీద ఎడ్రసురాసి, వైశాలికి ఒక ఉత్తరం కూడా రాసి యువరాజు చేతిలో పెట్టింది ఇందుమతి.

    "నాకు కన్నడ భాష తెలీదు... ఎలాగో అక్కడ"

    "మొత్తం కన్నడభాషే అక్కడ మాట్లాడరు... మీకు ఇంగ్లీషు వచ్చుగదా"

    "ఇంగ్లీషా... మన్నింగ్లీషంతా... దొరల ఇంగ్లీషు... అవతలి వాడికి తప్ప, మనకేం అర్ధం కాదు..." చార్లీచాప్లిన్ లా చేతులూపుతూ చెప్పాడు.

    ముగ్గురూ రోడ్డుమీద కొచ్చారు.

    "ఆదివారం ఉదయం... కోటకు వచ్చెయ్యాలి-" చెప్పింది ఇందుమతి.

    "లాకెట్ తో-" యాడ్ చేశాడు యువరాజు.

    యువరాజు ఆటో బస్టాండువేపు, ఇందుమతి ఆటో పెద్ద వాల్టేరువేపు బయలుదేరాయి.


                                         *    *    *    *


    మర్నాడు బస్టాండుకు బయల్దేరే ముందు విశ్వరూపశర్మని, పరంజ్యోతిని కూడా ఆదివారం నాటికి దేవులపల్లి కోటకు రమ్మని, ఆహ్వానించింది ఇందుమతి. అందుకు ఆనందంతో ఒప్పుకున్నారు దంపతులు.


                   *    *    *    *


    శుక్రవారం రాత్రి-

    కరెంట్ రావడంవల్ల కోటలోని కౌశికభూపతి నివాస భవనానికి కొండంత వెలుగొచ్చింది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra