చైనా దేశపు అరుదైన, అందమైన ఉద దార్విమ్గ్ చెయిర్ లో కూర్చుని వున్నాడు మన దేశ రక్షణమంత్రి. ఎదురుగా గోడకి "కొండ బెరుండ" పులితల అలంకారంగా తగలించబడి వుండి. కాశ్మీరం కళాకారులు అల్లిన లేసుల ముఖమల్ బట్ట ద్వారానికి అడ్డంగా వ్రేలాడుతోంది. అతడికి ఎదురుగా ప్రిసిపుల్ సెక్రటరీ పాయ్, మాదాల వేమ్కత్రంయ్యా కూర్చిని వున్నారు.
ముందుగా మాదల వెంకట్రామయ్య తానొచ్చిన పని చెప్పాలేదు. మంత్రిగారు రాకముందు ప్రిస్నిపల్ సెక్రటరీ కూతురు పెళ్ళి విషయం__ అమెరుకాలో చదువుకుంటున్న కొడుకు విషయం మాట్లాడాడు. మంత్రిగారు వచ్చిన తర్వాత వి.పి.సింగ్ ప్రాభావం రాజకీయంగా ఎంత వున్నదీ, రాబోయే ఎలక్షన్స్ కి రక్షణ మంత్రిగారికి అతడి అనుమాయులకి ఎంత ఖర్చుయ్యేది ముచ్చటించాడు. వి.పి.సింగ్ రక్షణ మంత్రిగా ఉన్నపుడు ఫారిన్ డిటెక్టివ్ ఏజెన్సీని అపాయింట్ చేయడంవల్ల మనదేశ సైనిక రహస్యాలు ఏవైనా బయటకు పొక్కిందీ, పిచ్చాపాటిగా మాట్లాడుతూ కూపీ లాగాడు. ఆ తర్వాత అసలు పాయింట్ కొచ్చాడు.
"పూర్వం 'హిందూ' దినపత్రికకు సొంత విమానం వుండేది. వ్యక్తులకి బస రూట్లు ఇచ్చినట్లే విమాన సర్వీసులుకూడా ఎందుకు ఇవ్వాకూడదు..." అసలు మాట్లాడవలసిన విషయానికి నాందిగా కొసరు విషయాన్ని ప్రస్తావించాడు.
తనతో మాట్లాడుతున్న వ్యక్తీ సామాన్యుడు కాదు, పెద్ద ఇండస్ట్రీయలిస్టు. అమతమిమ్చి ఒక ముఖ్యమంత్రిని శాశించగల వ్యక్తీ. అందుకే "మీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందండీ__" అనడిగాడు.
"ఏంలేదు, విమానాలు, రైళ్ళు, ఓడలు సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ లో వున్నాయి. మన నేవీ ఎంతవుందో, ఎటు వైపు ఏ క్షణాన మూవ్ అవుతుందో మీకు మాత్రమె తెలుసు, అలాగే ఏరోనాటిక్స్. షిప్పింగ్ కార్పోరేషన్ పేరిట సముద్రమీద వ్యాపారం చేయడానికి ఏర్ వేస్ ప్వ్రిత విమాన సంస్థల్ని ప్రైవైట వ్యక్తులు నిర్వహించటానికి అనుమతి ఇస్తే దేశ రక్షణకు ఏదైనా విఘాతం కలుగుతుందా? అని మీ అభిప్రాయం తెలుసుకోవాలని వచ్చాను. ఏ అభ్యంతరం లేని పక్షంలో ఆ లైను కూడా స్టడీ చేస్తాను. ఈ మధ్య మనకు హిందూ మహాసముద్రంలో ఆయిల్ పడుతోంది. అలాగే నేవికూడా బాగా దేవలఫ్ చేస్తున్నాం. అన్నింటిని మించి ఎతామిక్ ఎక్స్ ప్లోజన్ డేంజరస్ లోనూ, సముద్రాల్లోనూ చేస్తున్నాం. ఈ స్థితిలో షిప్పింగ్ కార్పోరేషన్ పేరిట మేము ఏ చేపలు పట్టే కార్యక్రమమో సముద్రంలో చేపడితే మాకు నష్టం జరగవచ్చు. ఇన్సూర్ చేసినందుకు మేము నష్ట పరిహారం అడుగుతాం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ పరంగా ఒపినియన్ కావాలి..." అంటూ అసలు విషయాన్ని మర్మగర్బంగా చెప్పాడు.
రక్షణ మంత్రి గాభరా పడటం చూసి తనపని అంత తేలిగ్గా అవుతున్నందుకు చాలా సంతోషించాడు మాదాల వెంకట్రామయ్య.
* * * *
ఆ చిన్నసైజు లాంచీలోకి కావ్య రావడంతో, తంబితోపాటు బోటులోవున్న మిగతా ఇద్దరూ నీళ్ళలోకి దిగారు. సర్వ సాధారణంగా 'పోగ్రామ్' ఒప్పుకునేముందు తమకు ప్రోగ్రామ్ ఇచ్చిన పార్టీ వివరాలను__ ప్రోగ్రామ్ పార్టి క్యులర్స్, స్పష్టంగా తెలుపుకునేవారు. తెలుసుకోవలసిన అవసరం చాలావుంది. గ్యాంగ్ వార్స్ చాలా ప్రమాదకరమైనవి. మాట నిలకడమీద కోట్లలో సాగే ఈ వ్యాపారంలో ఒకరికి మరొకరు అడ్డోచ్చినా, తెలుసో తెలియకో ఒకరి లావాదేవీల్నిమరొకరు సభ్య సమాజం__ అధికార మత్రామ్గం దృష్టికి తీసుకొచ్చినా పరిణామాలు అతిదారుణంగా వుంటాయి. పిల్లాపాప అన్న తారతమ్యంగాని, జాతి కులమత వివక్షతగాని చూపించారు. దొరికినవాడ్ని దొరికినట్లు ఒక వర్గంవారు మరొక వర్గంవార్ని ఊచకోత కోసిన సంఘటనలు: గ్రుహాదహానాలు_ లూటీలు చరిత్రకేక్కనివి ఎన్నో ఎన్నెన్నో! అధికార యంత్రాంగంవద్ద వున్నా అయుధాలకన్నా అత్యంత శక్తి వంతమైన ఆధునిక ఆయుధాలను ఈ స్మగ్లర్స్ ముందుగా దిగుమతి చేసుకుంటారు. ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతారు. ఇటువంటి సంఘవిద్రోహులు తమ మధ్యనున్న అంతర్గత సంఘర్షణవల్ల ఒకనొకరు అంతం చేసుకోవాలి_ ఒఅకరి ఆచూకీ మరొకరు అధికార వర్గాలకు తెలియజేయాలి. అప్పుడే కొంతవరకు ఈ అండర్ వరదలు కార్యకలాపాలకు సంకెళ్ళు పడతాయి. లేకుంటే వీరి విచ్చలవిదితనాన్ని అరికట్టడం అంత తేలికకాదు. భారత రాజ్యంగం ప్రసవించెది ఒక్కటే, నూరుగురు దోషులయినా శిక్షింపబడగూడదు. విద్రోహ చర్యకు పాల్పడిన ఒక వ్యక్తిని 'దోషిగా' నిర్దారించడం: నిరూపించడం__ చట్ట పరిధికి లోబడి _చాలా కష్టం. అందుకు ఒక చక్కని ఉదాహరణగా 1986లో మద్రాస ఎయిర్ పోర్ట్ లో జరిగిన యదార్డ సంఘటనని పేర్కొనవచ్చు.