Home » Yandamuri veerendranath » ఆఖరి పోరాటం


    సూర్యారావు ప్రారంభించాడు మామూలు రాజకీయ ఉపన్యాసమే. ఈ రోజు ఎంతో సుదినం. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి- పసిపిల్లల ప్రాణాల్ని రక్షించడానికి స్వచ్చందంగా పదవీ విరమణ చేయబూనారు. పైగా ఆ పదవిలో కొనసాగాలన్న బాధ్యత నామీద పెట్టారు. ఇబ్బందికరమైన పరిస్థితి. అయినా రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని దీనికి ఒప్పుకున్నాను. కానీ నా మనసు బాధపడుతూనే ఉంది. ఉగ్రవాదుల బెదిరింపులకు సౌజన్యమూర్తి. పరిపాలనాదక్షుడు అయిన ముఖ్యమంత్రి పదవి కోల్పోవడం, ఆ పదవిని నేను చేపట్టవలసి రావడం నన్ను నిరంతరం క్షోభకు గురిచేసింది. ఈ పరిస్థితినుంచి బయట వెయ్యమని దేవుడిని నేను ప్రార్ధించని క్షణం లేదు. భగవంతుడే నా ప్రార్ధన ఆలకించినట్టున్నాడు. ఈ విషయంలో సి.బి.ఐ.ని, ముఖ్యంగా డిప్యూటీ చీఫ్ ప్రవల్లికని అభినందిస్తున్నాను" అన్నాడు సూర్యారావు.

    విహారి జనాన్ని తోసుకుని కాస్త ముందుకు వచ్చాడు. అతడి మొహం ఎర్రగా కందిపోయి వుంది. సూర్యారావు కొనసాగించాడు.

    "ఈ-రోజు మన రాష్ట్రం ఎన్నో సమస్యల్ని ఎదుర్కొంటూంది. ఈ పరిస్థితులలో మనకి సుస్థిరత్వం కావాలంటే మన నాయకుడి పట్ల మనందరం విశ్వాసం ప్రకటించాలి."

    "అబద్ధం-"

    ఒక మూలనుంచి వినిపించిన అరుపుకి అందరి కళ్ళు అటు తిరిగాయి.

    విహారి ఆవేశంతో వణికిపోతున్నాడు.

    మరీ ఇంత మోసమా అన్నట్టుంది అతడి ముఖ భంగిమ. దీన్ని సహించనట్టు అతడి పిడికళ్ళు బిగుసుకుని వున్నాయి. "ఈ సూర్యారావు చెపుతున్నదంతా అబద్ధం."

    దగ్గిరగా వున్న పోలీసులు పరుగెత్తుకువచ్చి అతడిని బలవంతంగా బయటకు లాకెళ్ళడానికి ప్రయత్నించారు. అతడు ఒక విదిలింపుతో వాళ్ళని వదిలించుకుని స్టేజి దగ్గరికి వచ్చాడు. ముఖ్యమంత్రిని కూడా పట్టించుకోకుండా అతడు మైకు దగ్గరకు వెళ్ళబోయాడు. మంత్రుల దగ్గిరుండే బాడీగార్డులు అతడిని తోసెయ్యబోయే లోపులో అతడు మైకు ముందు నిలబడి "ప్రవల్లికగారితో పాటు టెర్రరిస్టులు తీసుకెళ్ళింది నన్నే. నా పేరు విహారి" అన్నాడు.

    చప్పున ఆ సభలో నిశ్శబ్దం ఆవరించింది.

    చాలామంది అతడిని అంతకుముందు చూడలేదు. కానీ పేరు అందరికీ పరిచయమే. అతడు తానెవరో చెప్పేసరికి తాత్కాలికమైన ఉద్వేగం సభంతా అలుముకుంది. ఆ నిశ్శబ్దంలోంచి అతడు చెప్పడం ప్రారంభించాడు. అతడు చెప్పటాన్ని ఆపుచేయటానికి ప్రయత్నిస్తూ లేచిన సూర్యారావుని ముఖ్యమంత్రి సైగతో ఆపు చేశాడు. అంతా వివరంగా చెప్పి "దీని వెనుకంతా వున్నది సూర్యారావు" అని పూర్తి చేశాడు.

    "నువ్వెవరిమీద అభియోగం చేస్తున్నావో తెలుసా?" ముఖ్యమంత్రి అడిగాడు.

    "తెలుసు. పదవినుంచి మిమ్మల్ని కూలదోసి, ముఖ్యమంత్రి అవుదామనుకున్న ఈ సూర్యారావు మీదా, అద్భుతమైన ప్లాన్ వేసి అతడికి సాయపడిన అనంతానంతస్వామి మీదా...."

    సభలో చీమ చిటుక్కుమంటే వినబడేంత నిశ్శబ్దం.

    "మమ్మల్ని ఎలాగైనా చంపెస్తామన్న ధీమాతో ఆ టెర్రరిస్టులు మా దగ్గర చెప్పినదాన్ని బట్టి, అనంతానంతస్వామికి ఈ సూర్యారావు సహచరుడు."

    "దీనికెవరు సాక్షులు?"

    "అడవిలో సాక్ష్యాలేముంటాయి? నేనూ ప్రవల్లికే."

    ముఖ్యమంత్రి ఆమెవైపు తిరిగి, "ఏమ్మా నిజమేనా?" అని అడిగారు. ఆమెవైపే చూశారందరూ. ఆమె ఆగి నెమ్మదిగా అంది "కాదు".

    "కాదా..." విహారికి షాక్ తగిలినట్టయింది. "నో....! ఆమె అబద్ధం చెపుతోంది" అని పిచ్చిగా అరిచాడు.  

    అతడి మాటలు పట్టించుకోకుండా ప్రవల్లిక అన్నది "మమ్మల్ని కారులో ఎక్కించుకుని అడవిలోకి తీసుకెళ్ళారు. అదృష్టవశాత్తు ఆఖరి క్షణంలో తప్పించుకున్నాం. వాళ్ళు ఒక్కమాట కూడా మాట్లాడలేదు."

    సభలో కలకలం రేగింది. విహారి ఏదో చెప్పబోతుంటే పోలీసులు వచ్చి చెరో రెక్క పట్టుకున్నారు.

    బలవంతంగా స్టేజి దింపారు. విహారి గింజుకుంటూ వుండగా కెమెరాలు క్లిక్ మన్నాయి.

    సూర్యారావు తిరిగి మైకు తీసుకున్నాడు. "నాకూ, ముఖ్యమంత్రికీ మధ్య మనస్పర్ధలు తీసుకురావడానికి ఏ ప్రతిపక్షం వాళ్ళో నియమించిన మనిషి అయివుంటాడు. అతడిని అరెస్టుచేసి విషయం రాబట్టండి."   

                                                                                                                                                                                       "వద్దు" అన్నాడు ముఖ్యమంత్రి. "ఎంతోమంది చిన్న పిల్లల్ని రక్షించిన దృష్ట్యా అతడిని క్షమించి వదిలేద్దాం."

    పోలీసులు బయటకు లాక్కెళ్తూ వుండగా అతడు అరిచాడు. "చీఫ్ మినిష్టర్! పడగ నీడలో వున్నారు మీరు. ఆ విషయం గ్రహించండి".

    ప్రవల్లిక అలాగే కూర్చుంది. కదల్లేదు.                                                                                                                    

    విహారిని బయటవరకు తీసుకొచ్చి వదిలేశారు సెక్యూరిటీ గార్డులు.           

   చీకటి పడుతోంది.

    అతడికి పిచ్చి పట్టినట్టు వుంది. కసిగా వుంది. కోపంగా వుంది. కాళ్ళతో రాళ్ళను తన్నుకుంటూ కారు దగ్గరికి వచ్చాడు.                                       

    ఇంటికి వెళ్ళలేదు. తాము నాటకాలు ఆడే రిహార్సల్స్ రూమ్ కి వెళ్ళాడు.

    లోపల మరో కొత్త నాటకం రిహార్సల్స్ జరుగుతూంది. అతడికి లోపలికి వెళ్ళబుద్ధి కాలేదు. అతడికి దేనిమీదా మనసు నిలవడంలేదు. అన్నిటిమీదా విరక్తి కలుగుతోంది. పోలీసులు తనని రెక్కలు పట్టుకుని బయటకు లాక్కెళ్ళే దృశ్యం కళ్ళముందు కదలాడుతూంది. దానికన్నా ప్రవల్లిక తన స్థానంలో కదలకుండా కూర్చుని దీన్నంతా తనకేమీ పట్టనట్టు చూస్తూ వుండిపోవడం అతడి గుండెల్లో కత్తిపెట్టి తిప్పినట్టు అవుతోంది. ఆమె యింత కూల్ గా అబద్ధం చెపుతుందనుకోలేదు. అనవసరంగా ఈ రొంపిలో ఇరుక్కున్నానన్న భావం కలిగింది.

    కారుని ఒక సినిమాహాలు ముందు ఆపి అతడు టిక్కెట్టు కొనుక్కుని లోపలికి వెళ్ళాడు. అప్పటికే సినిమా సగం అయింది. కుర్చీ వెనక్కువాలి కూర్చున్నాడు. కళ్ళు మూసుకుంటే ప్రవల్లిక భంగిమ గుర్తొచ్చి ఆమెమీద కోపం ఎక్కువ అవుతోంది. కొంచెంసేపు అయ్యాక కలకలం వినిపిస్తే కళ్ళు తెరిచాడు. సినిమా అయిపోయింది. వందమందికన్నా ఎక్కువలేరు ప్రేక్షకులు. బయటకు వస్తూ పక్కనున్న పెద్ద మనిషిని "ఏం సినిమా యిది" అని అడిగాడు. ఓ పిచ్చివాణ్ని చూసినట్టు చూసి "దమయంతీ హరిశ్చంద్ర సంవాదం" అన్నాడా పెద్దమనిషి.

    కారు దగ్గిరకొచ్చి ఎక్కబోతుంటే క్రింది క్లాసునుంచి అప్పుడే బయటకు వస్తూన్న సునాదమాల, బామ్మ కనపడ్డారు. అతడి బాధంతా చేత్తో తీసేసినట్టు అనిపించింది. దగ్గరగా వెళ్ళి "హల్లో" అన్నాడు.

    "హల్లో" అంది బామ్మ.

    "రండి. డ్రాప్ చేస్తాను" సునాదమాలవేపు చూస్తూ అడిగాడు. ఆ అమ్మాయి అప్రయత్నంగా అడుగు వెనక్కి వేయడం స్పష్టంగా కనిపించింది.

    "ఎక్కడుంది నాయనా కారు" బామ్మ అడిగింది. మాల ఆమెవైపు కోపంగా చూడడం ఆ మసక వెలుతుర్లో స్పష్టంగా కనిపించింది. ముగ్గురూ కారు దగ్గరిగా వచ్చారు. బామ్మ ముందు సీట్లో కూర్చుంది.

    "ఎలా వుంది సినిమా" సంభాషణ కలుపుతూ అడిగాడు.

    "పక్క హాలు కొచ్చాం నాయనా, టిక్కెట్లు దొరక్కపోతే అమ్మాయి దీనికి వెళదామని బలవంతం చేసింది" అంది. పక్క ధియేటర్ లో 'మన్మధలీల-రామరాజుగోల' ఆడుతోంది. పక్కన కూర్చున్న బామ్మవేపు వాలుగా చూశాడు విహారి. కొంపదీసి ఈవిడ కాదు కదా తనకి ఫోన్ చేస్తూంది?

    అతడు తన ఆలోచనకి తనలో నవ్వుకుంటూ ధియేటర్ నుంచి కారు బయటకు తీసుకొచ్చాడు. అతడివెనకే మరో కారు ఫాలో అవడం అతడు గమనించలేదు.

    "మీ విష్ణు బావున్నాడా?"

    "బావున్నాడు బాబూ. రోజూ ఒకసారన్నా నిన్ను తలుచుకుంటాడు. మీ అమ్మగారు బావున్నారా? మొన్న గుళ్ళో హరికథకొచ్చారు."

    అతడు ఆ ముసలావిడవైపు చిత్రంగా చూశాడు. ఒకవైపు గుడి అంటుంది. మరోవైపు మదనకామరాజు అంటుంది.

    "మీ మనవరాలికి బాగా సిగ్గు అనుకుంటాను."

    "పైకిలా వుంటుంది. ఇంట్లో తెగ అల్లరి చేస్తుంది" అంటూ కెవ్వున అరిచింది బామ్మ. సడన్ బ్రేక్ వేసినంత పనిచేశాడు విహారి. "చూశావా బాబు క్రిందనుంచి ఎలా గిల్లిందో" అంది కాలు రుద్దుకుంటూ.

    విహారి అద్దంలో వెనుక కూర్చున్న సునాదమాలని చూశాడు. ఆమె తలవంచుకుని వుండడంతో కనపడడంలేదు. పైకి నెమ్మదిగా కనపడుతూ కొంతమంది ఆడపిల్లలు తెగ అల్లరి చేస్తారని అతనికి తెలుసు. కానీ, మరీ మొగాడు కనబడితే అంతలా వణికిపోతూ, ఫోన్ లో విజృంభించే ఆడపిల్లని చూడడం యిదే ప్రధమం.

    అకస్మాత్తుగా అతడికో విషయం స్పురించింది.

    ...జీన్స్....

    బామ్మ మనవరాలు సునాదమాల!

    హరికథలు, దేవుడు, పూజ అన్నీ నిర్వర్తిస్తూనే ఎంతో జోవియల్ గా, అప్పుడప్పుడు ఇంగ్లీషులో మాట్లాడే బామ్మ రక్తమే సునాదమాలలోకూడా ప్రవహిస్తోంది. ఆ అమ్మాయి మరింత అల్లరి పిల్ల అయివుండవచ్చు. పైకి ఎంతో నెమ్మదిగా కనపడుతూ- ఇంత చిన్న విషయం తెలుసుకోవడానికి తనకి ఇంతసేపు పట్టింది. 

    అతడు మళ్ళీ అద్దంలోకి చూశాడు. అందులోంచే తనని చూస్తున్న మాల చప్పున తల తిప్పుకుంది. అతడు జాగ్రత్తగా చూసి వుంటే ఆమె మొహం సిగ్గుతో, రోషంతో కందిపోయి వుండడం గమనించి వుండేవాడు కారణం- ఆమె వెనుకనుంచి బామ్మ కాలూ గిల్లలేదు, నడుమూ గిల్లలేదు. వయసులో వున్నప్పుడు సదరు బామ్మ గొప్ప రొమాంటిక్ ఫిగర్ అయివుండి వుంటుంది. మనవరాలి ఫ్రిజిటిటీని పొగొట్టటానికి ఆమె చేసే ప్రయత్నాలే యివన్నీ. దానికి విహారిని ఆసరాగా తీసుకుంటుంది. ఆ విషయం తెలియని విహారి తన మధురమైన ఆలోచనల్లో మునిగిపోయి వున్నాడు. దానికితోడు ప్రవల్లికమీద కోపం.

    ఇన్ని రకాల ఆలోచనల్లో వున్న అతను- వెనుక తననే ఫాలో అవుతూ వస్తున్న కారుని చూసుకోలేదు.

    సునాదమాల ఇంటిదగ్గర కారు ఆపాడు. "కాస్త కాఫీ తాగి వెళ్ళూగాని రా నాయనా" అంది బామ్మ. మాల ఆవిడ్ని తినేసేటట్టు చూసింది. అసలిలా పరాయి మొగవాడి కారు ఎక్కడమే ప్రాణం పోయినట్టు వుంది. ఎప్పుడెప్పుడు లోపలికి వెళదామా- బామ్మని కడిగేద్దామా అని వుంది ఆమెకు.

    "కాఫీయా- సరే పదండి" అంటూ విహారి కారు దిగాడు.

    అప్పటికే వెనుక కారులోంచి దిగిన ముగ్గురు వ్యక్తులూ యితడి కారు దగ్గరికి రావడం, దిగబోతున్న విహారిమీదకు కత్తి దూయడం జరిగిపోయాయి. అయితే అతడు క్షణంముందే దాన్ని గమనించాడు. మీదకొస్తున్న వ్యక్తిని విసురుగా తోసేసి కారువైపు వాలాడు. అదే సమయానికి వెనుక తలుపు తీసుకొని దిగుతున్న సునాదమాల వెనక్కి పడిపోయింది. సీటుమీద వెల్లకిలా పడిన ఆమెమీదకు అతడు కూడా వెల్లకిలా పడ్డాడు. ఆమె కెవ్వున అరిచింది. కారుకి అటువైపున దిగిన బామ్మకీ విషయం తెలిసే లోపులో, మరో అగంతకుడు విహారి గుండెల్లోకి కత్తి గుచ్చబోయాడు. క్రిందవున్న సునాదమాల వయొలెంట్ గా కదలడంతో అది అతడి మెడమీదుగా గీసుకుపోయింది. ఈ లోపులో విహారి కాల్తో బలంగా అతడి కడుపులో తన్నాడు. క్రింద పడిపోయిన అగంతకుడిని వెనుక కారులో వస్తున్న వాళ్లు తీసుకుని వేగంగా వెళ్ళిపోయారు. అతడి చేతిలో ఒక కాగితం కుక్కబడింది. "అనవసర విషయాల్లో జోక్యం కల్పించుకుంటే జరగబోయే పరిణామాలకు యిది శాంపిల్ మాత్రమే" అని వుంది ఆ చీటీలో. అతడికి అర్ధంకాలేదు. అయినా దాన్ని గురించి అంతగా పట్టించుకోలేదు. సీటువైపు చూశాడు. వెనుక సీట్లో సునాదమాల స్పృహతప్పి వుంది, బామ్మ కంగారు పడుతూంది. కానీ మాలలాగా అరవలేదు. అతడు రెండు చేతుల్తో ఆమెను ఎత్తుకొని యింట్లోకి తీసుకొచ్చాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra