Home » Dr c. ananda ramam » రేపటి మహిళ


    మృదులని హత్యచేసి ఆ నేరాన్ని మృదుల ప్రియుడిమీదకి తొయ్యాలి. ఈ ఆలోచన రాకుండా మానటం లేదు భాగవతార్ కి. వచ్చినప్పుడంతా మనసు ముళ్ళడొంకలా అయిపోతోంది. చెవిదగ్గిర గాడిద ఓండ్ర వినబడడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగాడు. ప్లాస్టిక్ గాడిద మొహం! తొడుక్కున మృదుల వెనకనుంచి ముందుకొచ్చి కిలకిల నవ్వుతూ ప్లాస్టిక్ ముఖం తీసేసింది. వేయి చంద్రకాంతలలు చల్లగా విసిరినట్టు- పారిజాతాలు జలజలా కురిసినట్టు ఉల్లాసంగా- హాయిగా- ఉత్సాహంగా ఉందా నవ్వు. భాగవతార్ ముక్కుపట్టి ఊగిస్తూ "డిళ్ళ! బెదిరిపోయాడు అబ్బాయిగారు" అంది వుడికిస్తూన్నట్లు నవ్వుతోన్న ఆమె ముఖం ఆనందాలు విరజిమ్ముతూ అప్పుడే విచ్చుకున్న పద్మంలా స్వచ్చంగా వుంది. ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు భాగవతార్. జాలిగా, అనునయంగా, "నన్నెందుకిలా ఏడిపిస్తావు చెప్పూ" అన్నాడు.
    "అదేమిటి? నిన్నేం యేడిపించాను. నేను నవ్వాను. అంతేకదా నేను నవ్వితే నీకేడుపొస్తుందా? పోనీ నేనేడుస్తే నీకు నవ్వొస్తుందా?"
    చేతులతో కళ్ళు నులుముకుంటూ, "ఊఁ.... ఊఁ...." అని దొంగేడుపు యేడ్చింది. "బాగా యేడ్చానా?" అడిగింది అతడి గడ్డం పట్టుకుని ముఖం పైకెత్తి తనకి తెలియకుండానే నవ్వేసాడు భాగవతార్.
    "అదీ! అలా నవ్వాలి. అంతేకాని...." చెక్కిళ్ళమీద కొట్టింది మృదువుగా బుద్ధి చెపుతున్నట్టు.
    "నేను చెప్పినట్లు ఎందుకు వినవూ?" అడిగాడు భాగవతార్.
    "ఎంత అర్ధంలేని ప్రశ్న యిది. మనం మనుష్యులం. పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళం. ఒకరి నొకరు ఇష్టపడి కలిసి జీవించాలని పెళ్ళి చేసుకున్నాము. జీవితం సుఖంగా - సరదాగా, ఆనందంగా గడిచిపోవాలి. ఆ జీవితానికి ఒక ధ్యేయం ఉండాలి. భార్యాభర్తలిద్దరూ ఒకరి ధ్యేయ సాధనకి మరొకరు సహకరించుకుంటే మంచిదే. లేదా ఎవరి మార్గంలో వాళ్ళు సుఖంగా బ్రతికినా ఫరవాలేదు. మనం రోబర్డ్స్ మా? రిమోట్ కంట్రోల్ తో మనం యిష్టం వచ్చినట్లు ఆపరేట్ చెయ్యడానికి."
    "భార్యాభర్తలమధ్య అండర్ స్టాండింగ్ లేకపోతే ఎలాగ?"
    "అది వేరు ఏవేనా సమస్యలున్నప్పుడు ఓపెన్ గా చర్చించుకుని ఒక నిర్ణయానికి రావచ్చు. అంతేకాని అవతల వాళ్ళకి యిష్టమైనా - అయిష్టమైనా నీ మాట మరొకరు విని తీరాలని శాసించడం- బానిసత్వం అవుతుంది కాని సాహచర్యం అనిపించుకోదు. అయినా యేం చెప్తావో చెప్పు. నువ్వు చెప్పినట్లు వినడానికి ప్రయత్నిస్తాను- వినలేకపోతే యెందుకు వినలేనో వివరిస్తాను."
    "మొదటిది- నువ్వు పాంట్స్ లోను తిరగడం నాకిష్టంలేదు. లక్షణంగా అందరిలా మర్యాదగా చీర కట్టుకోరాదూ!"
    "మర్యాదగానా! అంటే చిన్న పార్టీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ ల మీద జారి జారిపోయే షిపాన్ చీరలు కట్టుకున్నారే నీ స్నేహితుల భార్యలు- అంత మర్యాదగానా!- డ్రెస్ అనేది అందంకోసం- కంఫర్ట్ కోసం. పాంట్స్ లోను- జీన్స్ లోను నేను యేమీ అమర్యాదగా కనిపిస్తున్నాను. నా శరీరంలోని యే భాగము ఎబ్బెట్టుగా బయటికి కనిపించడం లేదే. చీరల్లో వున్నవాళ్ళ కంటె డబుల్ గా కవర్ చేసుకుంటున్నాను. ఇంటీరియల్ విలేజస్ కు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి గుర్రాలమీద వెళ్ళవలసి వస్తుంది. అందుకు ఇలాంటి డ్రెస్ యెంతో అనుకూలంగా వుంటుంది. అదీగాక జారిపోయే పయిటని సవరించుకుంటూ వయ్యారాలు కురిపిస్తూ నడవడం నాకిష్టం లేదు - అలవాటు లేదు. నా క్విక్ మూవ్ మెంట్స్ కి ఈ డ్రస్సే బాగుంటుంది. సరే నెక్ట్స్?"
    "ఇంటీరియర్ విలేజస్ కి నువ్వెందుకు వెళ్ళడం?" 
    "ఈ ఎందుకు? అన్న ప్రశ్నకి అర్ధం లేదు. ఉదాహరణకి నువ్వెందుకు పాడటం? ప్రోగ్రామ్స్ కి అక్కడికి ఇక్కడికి యెందుకు వెళ్ళటం? పట్టమ్మాళ్ రికార్డులే యెందుకు ఇష్టపడటం? కర్నాటక సంగీతంతో పాటు బీటిల్స్ నేర్చుకోవాలని సరదా దేనికి?- ఈ "ఎందుకులలో" ఒక్క దానికైనా నువ్వు కారణం చూపించగలవా?"
    "నేను ప్రోగ్రామ్స్ కి వెళ్ళడం నువ్వు తిరగడం ఒకటేనా?"
    "కాదు. నువ్వు కేవలం నీ పేరు కోసం - నీ కీర్తి కోసం- డబ్బు సంపాదించుకోవడం కోసం- నువ్వు వెళుతున్నావు. నేనున్న సమాజానికి యెంతో కొంతమేలు చేద్దామని నేను ప్రయత్నిస్తున్నాను."
    "అయితే ఇలా తిరగటం మానవన్నమాట."
    "మానను. నేను చేస్తూన్నది తప్పు అని అనుకోనంత వరకు- తప్పు అని హేతుబద్ధంగా- నువ్వు నన్ను నమ్మించలేనంత వరకు- నా జీవిత విధానం నేను మార్చుకోను."
    "అంతేనా! పోనీ ఏండెటోతో- అనంగ్ వాళ్ళతో వీళ్ళతో ఫ్రీగా వుండటం మానలేవా?"
    "ఫ్రీగానా! అంటే, అవతార్! ఏ యుగంలో వున్నావు నువ్వు. ఒకప్పుడు ఆడది వీధి గడప దాటి గుమ్మంలో నిలబడితే మహాపరాధం అనేవారు. ఒక రాజారామ్మోహనరాయి- మరొక వీరేశలింగం- ఇంకో చలం- మా రంగనాయకమ్మ- ఎందరు ఎన్ని విధాలుగా సమాజాన్ని ప్రబోదించినా, ఈనాటికీ ఆడది మగవాడితో మాట్లాడితేనే మహాపరాధం అనుకునే దశ నుంచి బయటపడలేదన్నమాట. స్పష్టంగా చెపుతున్నాను ఒక విషయం అర్ధం చేసుకో. నేను వంటింటికే జీవితాన్ని పరిమితం చేసుకున్న గృహిణిని కాను. సోషల్ వర్కర్ ని. నా జీవిత విధానాలలో ఇలాంటి సంకుచిత నిర్భంధాలు పనికిరావు. ఈ విషయం నీకు పెళ్ళికి ముందే చెప్పాను".
    పెళ్ళికి ముందు మృదుల యేం చెప్పిందో భాగవతార్ కి గుర్తులేదు. అంత చిన్నపిల్ల- అందమైనది- పెద్దింటి నుంచి వచ్చింది. తనంతట తను పెళ్ళి చేసుకుంటానంటూ వస్తే ఆనందాశ్చార్యాలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఆ అమ్మాయి మాటలన్నీ యేదో సంగీతం వింటున్నట్లు విన్నాడు. ఆ మాటల అర్ధం గురించి యేమాత్రం పట్టించుకోకుండా పెళ్ళయిపోగానే ఆడదానిమీద మగవాడికి యేమాత్రం పట్టించుకోకుండా పెళ్ళయిపోగానే ఆడదానిమీద మగవాడికి సర్వాధికారాలు వచ్చేస్తాయనుకునే చాలామంది మగవాళ్ళలో అతడూ ఒకడు.
    "డాక్టర్ ప్లెమింగ్ తో నీకెలాంటి పరిచయం?"
    "ఎలాంటి పరిచయం లేదు. మొదటిసారిగా పార్టీలోనే చూశానతనని."
    "అతడు పూర్వపరిచయం ఉన్నవాడిలా మాట్లాడాడేమిటి?"
    "ఆ విషయం నీకెంత తెలుసో, నాకూ అంతే తెలుసు."
    "అతడూ - దేవకిని పెళ్ళి చేసుకున్నాడా?"
    "అది కూడా నాకు తెలియదు."
    "నువ్వు దేవకి ఎడ్రస్ ఎందుకడిగి తీసుకున్నావు? క్లబ్బుల్లోనూ, హోటళ్ళల్లోనూ డాన్స్ లు చేసే ఆ మనిషితో నీకేమిటి స్నేహం?"
    "క్లబ్బుల్లోనూ - హోటళ్ళలోనూ డాన్స్ చెయ్యడం నీచం అనుకుంటే మీరంతా అలాంటి వాటిని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు. సభ్య సమాజమంతా యిలాంటి వాటిని బహిష్కరిస్తే ఇలాంటి కాన్సర్లే వుండరుగా! మీ పురుష పుంగవులంతా ఆ డాన్స్ లు చూసి ఆనందిస్తూ విజిల్స్ వేసి రెచ్చగొట్టచ్చూ- రెచ్చిపోవచ్చూ. మీ భార్యలు మాత్రం ఆ డాన్సర్లతో మాట్లాడకూడదు. అంతేనా!"
    ఎంతో అమాయకంగా నోట్లో వేలుపెడితే కరవగలదా అనిపించేటట్టుండే మృదుల ఇంత లోతుగా- భావగర్భితంగా మాట్లాడటం ఎప్పటికప్పుడే ఆశ్చర్యంగా వుంటుంది భాగవతార్ కి.
    "ప్లీజ్! నా మాట విను. దేవకితో స్నేహం పెంచుకోకు. దానికి దూరంగా వుండు."
    "సారీ! లాయర్ యశోధరాదేవిగారికి దేవకిని ఆమె దగ్గిరకి తీసుకొస్తానని మాటిచ్చాను. ఆవిడ తీసుకునే నిర్ణయాలలో నాకు సంపూర్ణ విశ్వాసముంది."
    నిట్టూర్చాడు భాగవతార్. మృదుల నవ్వేస్తూ. "ట్రాజడీ లవ్ స్టోరీలో హీరోలా ఓవర్ యాక్షన్ చెయ్యకు. సినిమాకు పోదామా అంది.
    ఇలాంటి భార్యకి యెలా నచ్చజెప్పగలడు - ఏం చెయ్యగలడు - తప్పదు అనుకున్నది- అనుకున్నట్లు జరగవలసిందే.
                              *    *    *
    కునుకునూరు కరీంనగర్ జిల్లాలో అడవుల మధ్యవున్న గిరిజన ప్రాంతం. కనుకునూర్ లోను ఆ పరిసర గిరిజన పల్లెలోను తిరిగిన వాళ్ళ అవసరాలేమిటో తెలుసుకొని వాళ్ళల్లో విజ్ఞానం వ్యాపింపజేయటం మృదుల చేపట్టిన ప్రాజెక్ట్స్ లో ఒక భాగం. ఒక్కొక్క గ్రామంలోనూ కనీసం వారం రోజులేనా వుంటుంది. వాళ్ళతో కలిసి మెలిసి తిరుగుతుంది. వాళ్ళకి చదువు చెపుతుంది.అలా చెపుతున్నప్పుడు వాళ్ళల్లో చురుకైన వాళ్ళని, ఉత్సాహవంతుల్ని ఎంపిక చేసుకుని వాళ్ళని సిటీకి పంపించి ప్రత్యేకమైన కోచింగ్ ఇప్పించి వాళ్ళకి మిగిలిన వాళ్ళని ఎడ్యూకేట్ చేసే బాధ్యత అప్పగిస్తుంది. అడవులలో బాగా లోపల వుండే పల్లెలకి రావాణా సౌకర్యాలుండవు. జీపులు వెళతాయి కాని పుల్లో వెళ్లే పర్మిషను పోలీసు డిపార్ట్ మెంట్ కి, ఫారెస్ట్ అఫీషియల్స్ కి, గవర్నమెంటు ఉద్యోగులకు మాత్రమే దొరుకుతుంది. అందులో ఆ ప్రాంతాలలో తీవ్రవాదులున్నారనే రూమర్ వుంది. అందుచేత పోలీసు నిఘా కూడా ఎక్కువగానే వుంది. మృదుల సాధారణంగా నీలంపల్లి విలేజి వరకూ బస్సులో వెళ్ళి అక్కణ్నుంచి గుర్రం మీద ఇంటీరియర్ విలేజస్ లో తిరుగుతుంది సాధారణంగా ముగ్గురు నలుగురు కలిసివెళతారు. అప్పుడప్పుడు మృదుల ఒకర్తే కూడా వెళుతుంది. గిరిజనులతో కలిసిమెలిసి తిరుగుతూ వాళ్ళ విశ్వాసం సంపాదించడం వల్ల మృదులకి ఆ అడవి దారులన్నీ కొట్టినపిండి. అడవి దారులతో ఎంతో పరిహాయం వున్న వాళ్ళు తప్ప ఆ అడవుల్లో ప్రయాణం చేయడం సాహసం. మృదులని గిరిజన గ్రామాల్లో అందరూ "చిట్టెమ్మ తల్లీ" అంటారు. స్వంత మనిషిలా అభిమానిస్తారు. ఆ గ్రామాలలో సైతం వాళ్ళల్లో యిప్పటికీ పాతకాలపు సంస్కృతి ఆ ఆచారాలు అలవాట్లు నిలిచివున్నాయి. యువతరంలోకి మాత్రం ఆధునికత నెమ్మది నెమ్మదిగా వచ్చేస్తోంది. పైతరం వాళ్ళల్లో యిప్పటికీ యెంత దూరాన యే సవ్వడియైనా ఆ ధ్వని బట్టి అదియే జంతువో లేక యెవరైనా కొత్త మనుషులో సునాయాసంగా చెప్పగలరు. పగటివేళ సూర్యకిరణ ప్రసారాన్ని బట్టి రాత్రివేళ ఆకాశంలో నక్షత్రాల స్థితినిబట్టి కాలాన్ని సరిగ్గా నిర్ణయించి చెప్పగలరు. మూలికలతో అద్భుతమైన వైద్యం చెయ్యగలరు. కాని యువతరంలో ఆధునిక నాగరికత మీద మోజు పెరిగి పాత విద్యలు వెనకబడిపోయాయి. యువతరంలో చాలామంది వేష భాషల్లో నాగరికత అలవర్చుకున్నారు. కాని చదువుల్లో మాత్రం ఇప్పటికీ బాగా వెనకబడే వున్నారు. గిరిజనుల్లో యువతరం ఉభయభ్రష్టత్వం పొందుతున్నారా అని భయం వేస్తూ వుంటుంది అప్పుడప్పుడు మృదులకి. ఎందుకంటే వయసులో వున్న ఆడపిల్లల్లో చాలామంది సినిమాలు చూడ్డం- నైలాన్ చీరలు కట్టుకోవడం- కాటుక రేఖలు దిద్దుకోవడం- ఇదే నాగరకత అనే భ్రమలో వున్నారు. వాళ్ళ మనస్సులని చదువుల వేపు మళ్ళించడం కూడా కష్టంగానే వుంది. 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra