ఒక మోసగించబడుతున్న అమాయకురాలి గురించి చర్చించుకోవడముగాని, ఆ మోసానికి సరికొత్త భాష్యాన్ని తెలియచెప్పే ధీర చెప్పేది యింకా వింటూ కూర్చోవడంగాని ఆర్తికి యిష్టం లేదు.
కానీ రాత్రినుంచీ... రాత్రి 'తేజ' రాసిన వాక్యాలు చదివినప్పటినుంచీ ఆర్తి మనసులోనూ అనూహ్యమైన ఆందోళన మొదలైంది.
ఆమె బాహాటంగా అంగీకరించకపోయినా ఆ సంచలనం తేజతో మాట్లాడి తీరాలనే సంకల్పానికి కారణమై అది క్రమంగా ఉధృతమౌతూంది.
"నువ్వు వినే మూడ్ లో లేవనుకుంటాను?" ధీర నిలదీయగానే"చెప్పు...! దయాకర్ భార్య గురించి మాట్లాడుతున్నావు" అంది ఆమె.
"మాట్లాడుతున్నామా అంటే అర్దం ఆమెను నిందించడంలేదు ఆర్తీ! ఒక దయాకర్ అనే మంచి భర్తని శృంగారపరంగా ఎలా ఆకట్టుకోలేకపోయిందీ చెప్పాలనుకుంటున్నాను.
దాంపత్యంలోని బంధాన్ని వైటల్ ఇన్సిపిరేషన్ గా మార్చగల లవ్ మేనింగ్ లో ఏ భార్యయినా ఎక్కడ పొరపాటు చేసేదీ తెలియచేయాలనుకుంటున్నా."
సమస్య ఎవరి పరంగా మొదలైనా అది భార్యకీ, భర్తకీ యిద్దరికీ చెందిన విషయం. ఆర్తికి ఆ క్షణంలో భాస్వంత్ గుర్తుకురావటం యాధృచ్చికం కాదు.
"సెక్స్ థెరపిస్ట్స్ చెప్పేదాన్నిబట్టి సెక్స్ అన్నది ఎమోషనల్ గా, ఫిజికల్ గా భార్య భర్తకి అందించే ఓ అపురూపమైన ప్రక్రియ. ఆఫీసు నుంచి వచ్చిన భర్త భార్యకి దగ్గరై చిలిపితనాన్ని ప్రదర్శిస్తున్నాడూ అంటే అందులో ప్రేమ ఒక్కటే కాదు, సెక్స్ కోసం పరోక్షంగా ఆడగడమూ వుందని ఆఢది అర్దం చేసుకోవాలి. అది బోధపడక పనులు చేసుకోనివ్వకుండా అడ్డం పడటమేమిటి అని బార్య విసుక్కుంటే మగాడి మనసు గాయపడుతుంది. దాన్నిటోటల్ రిజక్షన్ గా భావించి హర్టవుతాడు.ఎక్కువ చదువుకోని దయాకర్ భార్య తరచూ అతడ్ని యిలాగే బాధపెట్టేది."
"ఒకవేళ నీరసంగా వుండి ఆమె తిరస్కరిస్తే."
"దాన్నీ అందంగా, ప్రేమగా చెప్పే పద్దతి వుంటుంది. అలా చెప్పగలిగితే సెక్స్ కి కాదన్నా ప్రేమలో తను అతడి మనిషినే అన్న విషయం చెప్పినట్టవుతుంది కాదు - అర్దమయ్యేట్టు చెప్పగలగాలి.
ఆర్తి నిశ్సబ్దంగా వింటూంది.
"దయాకర్ కి తరచూ భార్యని ఆటపట్టించడం అలవాటు. అంటే సెన్సాఫ్ హ్యూమర్ తో ఆమెను నవ్వించాలని ప్రయత్నించడం. ఆమె విసుక్కునేది. ఒక మగాడు ఎమోషనల్ టెన్షన్ రిలీజ్ చేసుకోటానికి వేసే జోక్స్ ని పట్టించుకోని భారయ భర్త దృష్టిలో జీవితాన్ని పంచుకున్నా ఆడదిగా కాక పాఠాలు చెప్పే స్కూలు టీచరుగా అనిపిస్తూంది."
"ఒక ఆడది అలా ప్రవర్తించటానికి ఆమె పెరిగిన వాతావరణం చాలా కారణమవుతుంది ధీరా! పగలబడి నవ్వే ఆడపిల్లల్ని తల్లిదండ్రులే మందలిస్తారు. ఆ పద్దతిలో పెరిగే అమ్మాయిలు భర్త సెన్సాఫ్ హ్యూమర్ ని ఎలా షేర్ చేసుకోగలరు?"
"సుఖంగా బ్రతకాలీ అంటే పెళ్లికి ముందెలా వున్నా భర్త సన్నిధిలో ఆఢది అతడికనుకూలంగా మారాలి. నవ్వకూడదని ఆడపిల్లకి తల్లిదండ్రులు చెప్పేది పరాయి మగాళ్ళ సమక్షంలో. కానీ భర్త దగ్గరని కాదుగా."
"ఒక పరిధిలో పెరిగిన అమ్మాయి వున్నట్లుండి ఎలా మారుతుంది?"
"మార్చుకోవటానికి భర్త ప్రయత్నించినప్పుడైనా మారాలిగా. అదొక్కటే కాదు - కేవలం సెక్స్ కి, సెక్స్ లో ఆనందానికి మాత్రమైన బెడ్ మీద భర్త మంచి మూడ్ లో వుండగా ఇంటి విషయాలు చర్చించడం ప్రారంభించి ఆ ప్రక్రియని యాంత్రికంగా తయారుచేస్తుంటారు కొందరు అమ్మాయిలు. దయాకర్ భార్య ఆ కోవకి చెందిందే. అతడెన్నోసార్లు భార్యని అందంగా అలంకరించుకోమని పోరేవాడట. దానికి తగ్గట్టు చీరలు కొని ఎలా వుండాలి... ఎలా ఏ వేళల్లో వాటిని కట్టుకోవాలీ తెలియచెప్పేవాడట. ఆమె ససేమిరా వినేది కాదు. దానితో విజువల్ స్టిమ్యులేషన్ కి ఎక్కువ స్పందించే భర్తల్లో ఒకడిగా దయాకర్ పూర్తిగా నీరసపడిపోయాడు."
క్షణం ఆగిందామె.
"అయితే దయాకర్ భార్యకి భర్త తప్ప మరో ప్రపంచం లేదు. ఆమెకున్న ఇద్దరు బిడ్డలు, వాళ్ల సేవలు తప్ప యింకో లోకం ఎరగదు. అందుకే భార్యంటే ప్రేమని చంపుకోలేకపోయాడు దయాకర్."
"అది ప్రేమ కాదు ధీరా! బహుశా జాలి అయి వుంటుంది"సాలోచనగా అంది ఆర్తి. "కాబట్టే ఇంట్లో తననూ, తన పిల్లల్ని చూసుకోటానికి ఓ అన్ పెయిడ్ సర్వెంట్ మెయిడ్ లా ఆమెను వుంచుకుని నిజమైన దాంపత్య జీవితం నీతో కొనసాగిస్తున్నాడు."
"నువ్వు పొరపాటు పడుతున్నావు ఆర్తీ! ఒకవేళ దయాకర్ కి భార్యపై ప్రేమకాక జాలి మాత్రమే వుంటే ఆమెకు విడాకులు యిచ్చి మరోవర్తిగా నెలకింతని విసిరేసేవాడు."
ఉక్రోషంగా చూసింది ఆర్తి. ఆమె మనసులో ఒక్క దయాకర్ పైనే గాక భార్యల్ని బానిసలుగా, ఆడుకునే వస్తువుల్లా భావించే భాస్వంత్ లాంటి మగవాళ్ల మీద కూడా ద్వేషం పేరుకుంది. అంతకుమించి తను చేసిన తప్పిదానికి ధీర యిస్తూన్న సంజాయిషీ కూడా చాలా కృతకంగా అనిపించింది.
తనతో సుఖపడటంలేదని ఒకవేళ భాస్వంత్ కూడా యిలాంటి ఆర్గ్యుమెంట్ తో మరో ధీరని దగ్గరకు తీసుకుంటే?
ఆర్తి కంపించిపోయింది.
ఈ ప్రపంచంలో ఏ మనిషీ తన తప్పుని అంగీకరించడు.
తన ప్రతి చర్యకీ ఓ అందమైన కారణాన్ని వెదుక్కుంటాడు.
దానికి చదువు చాలా సహకరిస్తుంది.
అలాంటి వాటికి చదువుకున్న ధీరలు ఆసరా అవుతారు.
మార్పు, మనలుచుకోవడం, పాతబడిపోకుండా దాంపత్యాన్ని కొత్త దనంతో నింపుకోవడంలాంటి ట్రాష్ ని గొప్ప థియరీగా అన్వయిస్తూ ప్రపంచానికి సందేశాలుగా అందిస్తారు.