Home » Yerramsetti sai » Corner Seat


    "నాకేదోగా ఉంది..."
    "బాగుండలేదా ఇలా?"
    "... ... ..."
    అతని కౌగిలి మరింత బిగిసింది...స్పృహ తప్పేట్లుంది.
    "సావిత్రీ__" చెవిలో రహస్యంగా అతని గొంతు నాగస్వరం ఊదుతున్నట్లుంది. పూర్తిగా ఆమెను ఆక్రమించుకుంటున్నాడతను.
    ఇంకొద్ది క్షణాల్లో ఏం జరగబోతోందో అర్ధమయిందామెకి.
    "శ్రీరామ్__ప్లీజ్..." అంది భయంగా.
    "ఎందుకలా భయపడుతున్నావ్?" నడుము చుట్టూ తాకుతోందతని చేయి.
    మరికొద్ది క్షణాలు__అంతే...తన సర్వస్వం...
    "వద్దు శ్రీరామ్...వదిలేయండి."
    అతను నవ్వాడు.
    "ఇంత దూరం వచ్చాక...మళ్ళీ వెనక్కు ప్రయాణమా?"
    "శ్రీరామ్...దయచేసి వదిలేయండి__" పెనుగులాడసాగిందామె.
    ఆమె పెనుగులాట మరింత ఉద్రేకం కలిగిస్తోందతనికి.
    ఆమె అర్ధనగ్న శరీరం దీపపు కాంతిలో కళ్ళు మిరిమిట్లు గొలుపుతోంది.
    "సావిత్రీ_మనం కాబోయే భార్యాభర్తలమేగా సంకోచమెందుకు?"
    "కానీ...పెళ్ళి కాకముందే ఇలా...నాకు ఇష్టంలేదు..."
    "ఎందుకని సావిత్రీ? ఇందులో తప్పేముందీ?"
    "ఏమో! ఇది తప్పనే అనిపిస్తుంది నాకు..."
    "అంటే...నామీద నమ్మకం లేకనా?"
    "అలా అని నేననలేదు. నన్ను బలవంతం చేయకు ప్లీజ్!"
    అతని కౌగిలి సడలిపోయింది.
    నెమ్మదిగా ఆమెను వదలి లేచి కూర్చున్నాడు. అతని ఉద్రేకం, ఆవేశం, మత్తు అన్నీ మాయమయిపోయినాయ్.
    కొద్దిసేపు ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు.
    నిశ్శబ్దం ఎంతో భయంకరంగా అనిపిస్తోందామెకి. హఠాత్తుగా ఇద్దరిమధ్యా పెద్ద అగాధం ఏర్పడిపోయినట్లుంది.
    "సావిత్రీ!" పిలిచాడతను.
    "ఊ!"
    "నీకు నామీద ఉన్నది ప్రేమ కాదు కదూ?"
    "మరేమిటి?"
    "నెసిసిటీ!"
    "అంటే?"
    "అదే...'పెళ్ళి' అవసరం కోసం నువ్వు నాకు దగ్గరయ్యావ్__అంతేగాని ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకోవటం లేదు."
    "మీరు నా మనసునలాగే అర్ధం చేసుకుంటే నేనింకేం చెప్పను?"
    "నేను సరిగ్గానే అర్థంచేసుకున్నాను సావిత్రీ! నా దగ్గర "నటన" అనేది ఎప్పుడూ లేదు. ఎవరితో స్నేహం చేసినా, ఎవరిని ప్రేమించినా మనస్పూర్తిగా ప్రేమించాను.
    నువ్వూ నన్ను అలాగే ప్రేమిస్తున్నావని నమ్మాను. నేను ఎదుటిమనిషిని ఎంత గుడ్డిగా నమ్ముతానో ఎదుటిమనిషి కూడా నన్నలాగే నమ్మాలని కోరుకుంటాను. నీకు నామీద ఉన్నది నిజమయిన ప్రేమ అయినట్లయితే...నామీద పూర్తి నమ్మకం వుంటే__ఇలా ఈ చిన్న విషయాన్ని పట్టించుకోవు. ప్రేమంటే ఎలాంటి సంకోచాలూ లేకుండా ఒకరికొకరు అర్పించుకోవటం...శారీరక సంబంధాల విషయంలోనే కాదు. అన్నివిధాలా!"
    సావిత్రి కళ్ళవెంబడి నీళ్ళు తిరిగినాయి.
    "మీ ఇష్టం! మీ మనసుకి నచ్చిన నిందలు వేయండి. నాది ప్రేమ కాకపోయినట్లయితే మీమీద నమ్మకం లేకపోయినట్లయితే...మీతో ఇంత దూరం వచ్చేదానిని కాదు. మీతో ఈ గదిలో గడిపేదానినీ కాదు."
    "అదే నిజమయితే ఆ విషయంలో మీకంత పట్టుదల ఎందుకో చెప్పండి...! వివాహమయితే కాదనగలిగేవారా?"
    "ఆ ప్రశ్నే మీకు వేస్తున్నాను. పెళ్ళి అవ్వకముందే మీకింత పట్టుదల ఎందుకో? అది కేవలం సెంటిమెంట్. ఎందుకు అర్ధం చేసుకోరు?"
    అతను మాట్లాడలేదు.
    సావిత్రి మనసంతా ఆందోళనతో నిండిపోయింది. తను అతనికి అభ్యంతరం చెప్పటం నిజంగానే తప్పా. ఆమెకంతా అగమ్య గోచరంగా వుంది. అతని ప్రేమమీద తనకెలాంటి అనుమానం లేదు. కేవలం తనను అనుభవించడానికే అతను తననిలా టూర్ కి తీసుకొచ్చాడని కూడా తను అనుకోవటం లేదు.
    నిజానికి అతనికి తనను అర్పించుకున్నా జరిగే నష్టం ఏమీ వుండదు. అతను తనను తప్పక వివాహం చేసుకుంటాడన్న నమ్మకం తనకుంది.
    అయినా తనకంటూ కొన్ని ఇష్టాలూ అయిష్టాలూ, నమ్మకాలూ, కోరికలూ ఉంటాయనీ, వాటిని గౌరవించాలనీ అతననుకోకపోతే ఎలా? అదీగాక అతను నిగ్రహం గల వ్యక్తి ప్రేమకు సరైన అర్ధం చేసుకోగలడా?
    అతను లేచి పచార్లు చేయసాగాడు.
    అద్దాల్లోనుంచి నగరంలో లైట్లన్నీ నక్షత్రాల్లా కనబడుతున్నాయి.
    సావిత్రి కూడా లేచి బట్టలు సరిచేసుకుంది.
    ఆమెకు దుఃఖం పొంగుకొస్తోంది. అతనితో టూర్ రావడానికి నిరాకరించి ఉంటే ఈ గొడవ వచ్చేది కాదు. అప్పుడు తను ఏం మాట్లాడినా ఏం చెప్పినా ప్రయోజనం వుండదు__గాయం మానటం అసాధ్యం.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra