Home » Yerramsetti sai » Vennela Veta


    "సినిమాకు రావటం కుదరదు. మా ఇల్లు కుకట్ పల్లి కాలనీలో ఉంది. అక్కడకు రమ్మని చెప్పి నోటికొచ్చిన ఓ నెంబర్ చెప్పాను. ఇప్పుడుంటుంది తమాషా! రాత్రంతా వెతుకుతాడు ఆ నెంబరు కోసం. ఆ నెంబరు గల ఇల్లు నిజంగానే ఉంటే మరీ ఫార్స్ గా ఉంటుందిలే. ఇంట్లోకెళ్ళి 'కన్యకా' అని పిలుస్తాడు"
    ఇద్దరూ నవ్వుకుంటూండగానే రాధ తమ్ముడు పరుగుతో ఇంట్లోకొచ్చాడు.
    "అక్కా కన్యకాంటీ ఫోటో వీక్లీ మీద వేశారు" అంటూ వారపత్రిక ఆమెకిచ్చాడు.
    అది చూస్తూనే కన్యక, రాధ ఇద్దరూ విస్తుపోయారు.
    "అబ్బ! ఎంత బావున్నావే. ఈ పుస్తకం మీద. ఎప్పుడిచ్చావ్ వాళ్ళకీ ఫోటో?" ఆశ్చర్యంగా అడిగింది రాధ.
    "బాగుంది. నేనెందుకిస్తాను. నాకేం అర్థంగావటం లేదు. అసలు నా ఫోటో వీళ్ళకెలా దొరికింది. దొరికినా వీళ్ళిలా ఎందుకు ప్రచురిస్తారు"
    రాధ లోపలిపేజీ చూసింది.
    "ముఖచిత్రం మిస్ కన్యక. మల్లెలు మాసపత్రిక సౌజన్యంతో"
    విజ్ఞప్తి కుమారి కన్యక అడ్రస్ మాదగ్గర లేకపోవటంవల్ల ఆమెకి పారితోషికం పంపటానికి వీల్లేకపోయింది. ఆమె వెంటనే మా కార్యాలయానికి వచ్చి చెక్ తీసుకోవచ్చు. లేదా ఓ కార్డ్ వ్రాసినా ఆ అడ్రస్ కి పంపగలం_ఎడిటర్"
    "ఓ! ఇది శరత్ బాబుగారు చేసిన పని అయుంటుంది" అంది రాధ.
    "కాని నన్నడగకుండా ఆయనిలాంటి పనిచేయరే" ఆలోచిస్తూ అంది కన్యక.
    "ఆయన దగ్గరకెళితేగానీ అసలు సంగతి తెలీదు."
    "ఒకవేళ ఆయన నా ఫోటో ఇచ్చారే అనుకో! అయినా వాళ్ళిలా కవర్ పేజీలో ప్రచురించటం ఏమిటి. సినిమా నటిలాగా!"
    "నువ్వు మాత్రం తక్కువేముందే? సినిమాల్లో కెళ్ళాలేగానీ నెంబర్ వన్ అవటం ఎంతసేపు!"
    "ఆ అదొక్కటే తక్కువయింది." నవ్వుతూ అంది కన్యక. ఆమెకు చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. తన ఫోటో అలా వారపత్రిక మీద కనిపించటం, చాలా ఆనందంగానూ ఉంది. మరోపక్క భయంగానూ ఉంది. అదిచూచి కుర్రకారు తనవెంట పడటం, ప్రేమలేఖలు గుప్పించడం ఎక్కువయిపోతుందేమో.
    ఇప్పటికే ప్రేమికుల బెడద ఎక్కువగా వుంది.
    వారం రోజుల క్రితమే శాంతారామ్ అసభ్యకరంగా ప్రవర్తిస్తే వాళ్ళింట్లోనే చెంపదెబ్బ కొట్టింది.
    అసలు తనకు రాన్రాను మగజాతి అంటేనే చికాకు పుడుతోంది. కొంచెం ముక్కు, కన్నూ తీరుగా వున్న ఆడపిల్ల కనబడితేచాలు అంతకు ముందు ప్రేమించిన ప్రియురాళ్ళనూ, పెళ్ళాలను అందరినీ మర్చిపోయి_ఎగబడిపోతారు.
    రాన్రాను కొత్తబట్టలు కొనుక్కుని పాతవి విసిరికొట్టినట్లు కొత్తగా పరిచయమయిన అమ్మాయిలను కూడా ట్రీట్ చేస్తున్నారు. సెక్స్ ఒక్కటే వాళ్ళకు ముఖ్యంగా కనబడుతోందిగానీ_ ప్రేమకి అసలు స్థానమేలేదు.
    "వస్తానే" లేచి నిలబడింది కన్యక.
    "అప్పుడే?"
    "అవునే. ఆ శరత్ బాబుగారు_లేనిపోయింది ఈ కవర్ పేజీ ఒకటి నా నెత్తిమీదకు తెచ్చిపెట్టారుగా! వెళ్ళి నాలుగు చివాట్లు వేస్తేగానీ సంగతేమిటో తెలీదు."
    "నా ఫోటో అలా వేసివుంటే థాంక్స్ చెప్పేదాన్ని."
    "అవున్లే. నీకు ఎగతాళిగానే వుంటుంది."
    కన్యక అక్కడినుంచి బయల్దేరింది. ఆమె దృష్టి అంతా రోడ్డుమీద పుస్తకాల షాపులమీదే వుంది. ఏ షాప్ దగ్గర చూచినా తన ఫోటో ఉన్న పత్రిక కాపీలే వరుసగా వేలాడుతున్నాయ్.
    "హాయ్ బ్యూటీ. అరే వెంకటేష్. ఇదిగో_ఈ పోరి ఫోటోయే ఈ పత్రిక మీదున్నది." ఎవరో గట్టిగా అరిచాడు. మరుక్షణంలో నలుగురయిదుగురు యువకులు పరుగుతో ఆమెదగ్గర కొచ్చారు.
    కన్యకకేం చేయాలో తెలీలేదు. ఆ పక్కనే ఖాళీగా వున్న రిక్షాలో కూర్చుని 'త్వరగా పోనీ' అంది రిక్షావాడితో.
    రిక్షా వేగంగా చౌరాస్తా దాటేయటంతో వాళ్ళు ఆగిపోయారు.
    "హమ్మయ్య" అని తేలిగ్గా గాలి పీల్చుకుందామె. పది నిమిషాల్లో శరత్ బాబు ఇల్లు చేరుకుందామె. శరత్ బాబు ఆమెను చూస్తూనే ఆశ్చర్యపోయాడు.
    "నీ గురించే అనుకుంటున్నానమ్మా! పొద్దున్నే వీక్లీ మీద నీ ఫోటో చూశాను నేను చెప్పలేదూ? చాలా ఫోటోజెనిక్ ఫేస్ నీది."
    "అది సరేనండీ__ అసలు నా ఫోటో వాళ్ళకెందుకిచ్చారు?" కోపంగా అడిగిందామె.
    "నేనిచ్చానా? నేనివ్వట మేమిటి?" ఆశ్చర్యంగా అడిగాడతను.
    "మరి లోపల 'మల్లెలు' మాసపత్రిక సౌజన్యంతో అని ఎందుకు రాశారు?"
    "అలా రాశారా?"
    "అవును. మా ఫ్రెండ్ ఇంట్లో చూశానా పత్రిక"
    శరత్ బాబు ఓ క్షణం ఆలోచించాడు. "ఆ! గుర్తుకొచ్చింది. మన 'మల్లెలు' ఆవిష్కరణోత్సవం సమయంలో తీసిన ఫోటో ఒకటి చూసి అతను కావాలని అడిగితే యిచ్చాను"
    "ఎవరతను?"
    "వీక్లీ ఎడిటర్. పేరేమిటో గుర్తులేదు."
    "నా ఫోటో అతనికెందుకిచ్చారు?"
    "అతను నీ కోసమే వెతుక్కుంటూ వచ్చాడు మనాఫీసుకి__"
    కన్యక ఆశ్చర్యపోయింది.
    "నా కోసమా?"
    "అవును."
    "ఎందుకు?"
    "అడెడెడె_ ఆ విషయం అడగటం మర్చిపోయాను."
    కన్యక చిరాకుగా చూసిందతనివేపు.
    "ఆ! అన్నట్లు గుర్తుకొచ్చింది. వెంటనే అతనిదగ్గరకెళ్ళాలి నువ్వు! నీకేదో ఉద్యోగం కూడా ఇస్తానన్నాడు. ఏం ఉద్యోగమంటే_ఏం ఉద్యోగమంటే. ఆ! పువ్వుల్లో నడిచే ఉద్యోగం అంట. ఏమిటబ్బా అది."
    కన్యకకేమీ పాలుపోవటం లేదు.
    "మాష్టారూ. మనిద్దరిలో మతి ఎవరికి పోయిందో తెలీటంలేదు." అంది కుర్చీలో కూలబడుతూ.
    "ఎందుకమ్మా. ఏం జరిగింది?" ఆదుర్దాగా అడిగాడు శరత్ బాబు.
    "లేకపోతే ఏమిటండీ? అతనెవరో మీకు తెలీదు. అతను నా కోసం ఎందుకు వెతుకుతున్నాడో తెలీదు. నాకు ఉద్యోగం ఎందుకిస్తానన్నాడో తెలీదు. నా ఫోటో ఎందుకడిగాడో తెలీదు. మీరు ఫోటో ఇచ్చేశారు. అతను కవర్ పేజీమీద పబ్లిష్ చేసేశాడు. మీకిది దారుణంగా కనిపించటంలేదూ?"
    శరత్ బాబు ఆమెవేపు జాలిగా చూశాడు.
    "అవునమ్మా! నీ ఫోటో చూసి ముచ్చటపడితే యిచ్చానేగానీ__ అతనిలా ప్రింట్ చేస్తాడనుకోలేదు. పద_ ఎవర్నడిగి వేశాడో తేల్చుకుందాం. నీ అంగీకారం లేకుండా వేసేందుకు అతనికేమీ హక్కులేదు."
    "పదండి. ఆ విషయం తెల్సుకోవాలనే నేనూ వచ్చాను."
    ఇద్దరూ అరగంటలో "దేవతా పబ్లికేషన్స్" చేరుకున్నారు.


                            *    *    *    *


    కన్యకను ఎదురుగా చూడగానే భవానీశంకర్ మొదటి రియాక్షన్ నిశ్చేష్టుడవటం. ఆ తరువాత కొద్ది క్షణాలకు తేరుకుని హోరున ఆశ్చర్యపోయాడు. కళ్ళు నులిమి, చేయి గిల్లి టెస్ట్ చేసుకున్నాడు.
    అయితే కన్యక ఇదేమీ పట్టించుకునే స్థితిలోలేదు. తన చేతిలోని వారపత్రికను అతని టేబుల్ మీద లాగికొట్టి "వాటీజ్ దిస్" అంది కోపంగా.
    "యస్! ఎవర్నడిగి ప్రింట్ చేశారు?" అన్నాడు శరత్ బాబు కుర్చీలో కూర్చుంటూ.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra