Home » Dr c. ananda ramam » Dasavataralu


    గుండెలలో ఏదో బరువుపేరుకుంటున్నట్లయి ఎదురుగా ఉన్న పుస్తకం తెరిచి చదువుతున్నట్లు నటించసాగింది నీరజ...
    కూనిరాగం తీస్తోన్న యశోధరను చూసి ఆశ్చర్యపోయింది నీరజ.
    "నువ్వు పాడగలవా?" అంది...
    "నేను ఏం గలనో ఏం కానో ఈనాటివరకూ నాకే తెలియదు! ఇప్పుడు ఒక్కొక్కటీ తెలుస్తున్నాయి...."
    ఏం మెరుపు ఆ కళ్ళలో...
    "చాలా హుషారుగా ఉన్నావే!"
    "అవును. చాలా ఆనందంగా ఉన్నాను. ఇవాళ నేను పెట్టిన టిఫెన్ విశ్వం తిన్నారు. బాగుందని కూడా అన్నారు..."
    ఎక్కడో ఏదో భగ్గుమంది నీరజకు ...
    "నీరజా..."
    పిలిచి ఆగిపోయింది యశోధర...
    "ఏమిటీ?"
    ఏదో అడగరానిది అడుగుతున్నట్లు కొన్ని క్షణాలు తటపటాయించి చివరకు తెగించి అడిగింది...
    "ఇవాళ నీ లేత నీలం పట్టుచీర నాకియ్యవూ ?"
    తన చెవులు తను నమ్మలేకపోయింది నీరజ. ఇదివరలో ఎన్నోసార్లు తన చీరలు కట్టుకోమంటే నిర్లిప్తంగా "నా లాంటిది ఎలాంటి చీరలు కట్టుకున్నా ఒకటే!" అని తిరస్కరించిన యశోధర...
    "అలాగే!..." అంది మరొకలా అనగలిగే శక్తి లేక ...
    ఆరోజు పార్టీకి విశ్వంకూడా వస్తున్నాడు. యశోధరకు లేత నీలంచీరమీది ఆసక్తికి అదీ కారణం....
    తను ప్రక్కన లేనప్పుడు విశ్వం యశోధర పెట్టిన టిఫిన్ తిన్నాడు. బాగుందనికూడా అన్నాడు!
    ఏం మొగవాళ్ళు ! విశ్వంతో మాట్లాడకూడదు ఇంక ! హమ్మో ! విశ్వంతో మాట్లాడకుండా బ్రతకగలదా? అతడులేని తన బ్రతుకును ఊహించుకోగలదా?
    ఆరోజు అద్దంముందు నించుని శ్రద్ధగా అలంకరించుకుంది. కానీ ప్రతిబింబాన్ని చూసుకొంటున్నకొద్దీ ఎంత అందంగా ఉన్నా ఏదో లోపం తోచసాగింది. అక్కడికి యశోధర వచ్చింది మామూలు తెల్ల చీరలో...
    "నా లేత నీలంరంగు పట్టుచీర కట్టుకోలేదూ!"
    "కట్టుకున్నాను. కానీ ఏమిటో ఆ చీర నా వంటిమీద హరించినట్లనిపించింది. విప్పేసి ఇదే కట్టుకున్నాను. నా ఆనందాన్ని, అందాన్ని చీరలతో తెచ్చుకోగలనా?"
    నవ్వింది యశోధర. నీరజను మెప్పుదలతో చూస్తూ ఎంత అందంగా ఉన్నావు నీరజా! పరవాలేదులే! దృష్టి మరల్చకుండా నీ ప్రక్కనే ఉంటాను!" అంది ...
    నీరజ మాట్లాడలేదు. పార్టీలో ప్రతివారి చూపులూ నీరజమీదనే ఉన్నాయి. విశ్వం చూపులలో ఆరాధన ఇంతా అంతా కాదు. గర్వంతో పొంగిపోతూ ఉన్న నీరజ మనసులో యశోధర నవ్వు ముల్లులా గుచ్చుకుంటూనే ఉంది ....
    అటు యశోధర, ఇటు విశ్వం కనపడటం లేదు. ఇల్లంతా గగ్గోలయింది. సుందరమ్మ యధేచ్చిగా నోరువిప్పింది...
    వాడిలాంటి వాడని నాకు తెలుసు. అందుకే ముందే హెచ్చరించాను. నా మాట వింటేనా! పోనీలే! కొంప మునగకముందే తెలిసొచ్చింది. అయినా దీనికింత బుద్ధిలేదేం ? వాడు నాలుగు రోజులుంచుకుని వదిలేస్తే దీని బ్రతుకేం కావాలి! ఏమోలే! ఎవడి కర్మ వాడిది!"...
    నీరజ కామాటలేవీ చెవులో పడటంలేదు. విశ్వం తనను కాదని యశోధరతో వెళ్ళిపోయాడు ! నమ్మలేకపోతోంది ఈ విషయాన్ని.
    బల్లమీది ఉత్తరం పైన పడ్డాయి నీరజ కళ్ళు... విశ్వం వ్రాశాడు.
    "నీరజా ! అందాల రాణీ !
    నేను నిన్నెంతో ప్రేమించాననీ, ఇప్పటికీ ప్రేమిస్తున్నాననీ అంటే ఎంతో హాస్యాస్పదంగా ఉంటుందని నాకు తెలుసు. నేను అల్పుణ్ని నీరజా! నీ ప్రేమకు తగను. యశోధరపైన నాకు ప్రేమలేదు. ఆకర్షణ అసలేలేదు. కానీ, ఏదో శక్తి నన్ను అటువైపు ప్రబలంగా లాగుతోంది!
    ఎంత బలహీనుణ్ని! నీ సమక్షంలో నిన్ను చూస్తూ__నిన్ను వదులుకోవలసి వస్తుందనే భయంతో యశోధరను తిరస్కరించినా. మళ్ళీ ఎందుకో అటువైపు మొగ్గుతున్నాను. నిన్న రాత్రి దేవతలా ఉన్న నిన్ను.... సాకార దైన్యంలా ఉన్న యశోధరను ప్రక్కప్రక్కల చూసాను. ఎందుకో, ఏమిటో నిన్ను నా దాన్ని చేసుకోటానికి భయం తోచింది. పూవులాంటి నీ జీవితాన్ని నా బలహీనతలతో నలిపివేస్తాననిపించింది. యశోధరను పెళ్ళిచేసుకోవాలని నిర్ణయం చేసుకున్నాను.
    నా బలహీనతలన్నీ సహించి భార్యగా ఒదిగి ఉంటుందనే ఆశతో...
    ఇంతకంటె గొప్ప జీవితం యశోధరకు రాదు! అంచేత యశోధరకు అన్యాయం చేస్తున్నానన్న బాధ నాకు లేదు. అన్ని విధాలా ఆనందమయం కావలసిన __ కాదగిన నీ బ్రతుకులోకి నేను రాలేను. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ __
                                                                               విశ్వం ..."
    ఆ ఉత్తరం పదేపదే చదువుతోంటే ఆనాటి తన అలంకరణలో లోపం స్పురించింది అకస్మాత్తుగా...
    బాహ్యాలంకరణలో ఏ లోపమూ లేదు ... కానీ యశోధర ప్రక్కన తాను ఎంత అందమయినదో నిరూపించుకోవాలనే అహం తన మొహాన్ని మ్రబ్బులా క్రమ్ముకుంది ...
    విశ్వం తనను ఎంతగా ఆరాధిస్తాడో ప్రత్యక్షంగా యశోధరకు చూపించాలనే క్రౌర్యం తన కళ్ళలో నుండి విశ్వాన్ని భయపెట్టింది ...
    అందమంటే ఏమిటని ఎన్నోసార్లు తనలో తను ఆలోచించింది...
    సత్యమూ, శివమూ, సుందరమూ అని కీర్తింపబడే ఈ సృష్టిలో సుందరత దేనినాశ్రయించుకొని ఉందని ఎన్నోసార్లు వితర్కించుకుంది...
    అర్ధమయీ కానట్లుగా ఏదో అర్ధం కాసాగింది... విశ్వంతో పెరిగిపోతూ కాంతి అతని నిష్కాపట్యం... అతనిలో ఆకర్షణ సౌరార్ద్రం నిండిన సరసత...
    అతి సాధారణమయిన యశోధరలో విశ్వాన్ని ప్రబలంగా తనవైపుకు లాక్కున్నది. మట్టిబొమ్మలను మహా శక్తులను చేయగలిగిన ఆరాధన...
    నిర్గుణ నిరాకారాన్ని సుగుణ సాకారంగా సాక్షాత్కరింప చేసికోగల సంకల్పబలం...
    రేగిపోయిన జుట్టుతో__నలిగిపోయిన చీరతో అద్దంముందు నుంచుంది__
    "నేను అందంగా ఉన్నానా?" అనుకొంది...
    దౌర్భాగ్యురాలయిన యశోధర బ్రతుకు కుదుటబడింది. అనే సంతృప్తితో మెరిసిన సౌందర్య రేఖను కన్నీళ్ళతో చూసుకుంది.

                               * * *

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra