Previous Page Next Page 
వేగు చుక్క పేజి 17



    నీటి జంతువుగా మారినా, పాట అలవాట్లు కొన్ని పోలేదు దానికీ. గాలి పీల్చుకోవడానికి మాటిమాటికీ నీటి ఉపరితలానికి వస్తుంది డాల్ఫిన్. చేపల్లాగా మొప్పలతో గాలిని పీల్చలేదు అది.

    డాల్ఫిన్స్ చాలా తెలివైన జంతువులు. వాటికి ప్రత్యేకమైన భాషా, అందులో పదాలవంటి శబ్దాలూ కూడా ఉన్నాయని శాస్త్రజ్ఞులు నమ్ముతున్నారు. ఆ భాషని అర్థం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.

    తెలివితోపాటు చాలా మంచి మనసు కూడా గల జంతువులు డాల్ఫిన్స్. ఆటలంటే ఎంతో ఇష్టం వాటికి ఒక్కోసారి షిప్పుల దగ్గరికి అవంతటవే చనువుగా వచ్చేసి తమ "ఫీట్లతో" సెయిలర్స్ కి వినోదం కలుగజేసి వాళ్ళు పెట్టె  ఆహార పదర్ధాల అందుకుంటాయి.

    అనూహ్యని తన వీపుమీద జాగ్రత్తగా బాలన్స్ చేస్తూంది ఆ డాల్ఫిన్. మానవ శ్రవనేంద్రియానికి వినబడని శబ్దాలు చేస్తూ, తన సహచరులకు సిగ్నల్ పింపింది.

    అతి త్వరలో ఇంకా చాలా డాల్ఫిన్స్ వచ్చి, ఆప్యాయంగా ఆమెను చుట్టేసి, అక్కడనుంచి దూరంగా, సురక్షితమయిన ప్రదేశానికి తీసుకెళ్ళి పోయాయి.

    సాగర్ ఇంకా అక్కడే వెదుకుతున్నాడు అనూహ్యకోసం.

    ఇందాకా వెళ్ళిపోయిన కిల్లర్ వేట్ తిరిగి వస్తూ కనబడింది చాలా దూరంలో.


                                                                          10


    మృత్యువు తాలూకు నీడలాగా ఉన్న తిమింగలం చెప్పలేనంత వేగంగా సాగర్ ని సమీపిస్తోంది.

    దాన్ని ఎదుర్కొనే మార్గం ఏదన్నా ఉందా అని ఆలోచిస్తున్నాడు సాగర్.

    క్షణాల్లోనే అది దగ్గరయింది.

    అప్పుడు అర్థమయింది. సాగర్ కి అదేమిటో అతను భయపడినట్లు, అది ఇందాక కనబడిన తిమింగలం కాదు.

    అది ఒక సబ్ మెరైన్! జలాంతర్గామి!

    జలాంతర్గామి అంటే చేపలాగా నీటి అడుగున కూడా పయనించ గల ఒక రకమైన నౌక. చేపలకు గాలి తిత్తులోకి గాలిని పీలుస్తుంది నీటిలో మునగదలుచుకుంటే గాలి నంతటిని బయటికి వదులుతుంది.

    అలాగే జలాంతర్గామికి కూడా రెండు వైపులా రెండు టాంకులు ఉంటాయి ఆ టాంకులలోకి నీరు నింపుకుని, మునగడానికి కావలసిన బరువును సమకూర్చుకుంటుంది జలాంతర్గామి పైకి రావలసినప్పుడు, ఆ టాంకులలో గాలిని నింపుకుని, నీళ్ళని బయటికి వదులుతుంది.

    జలాంతర్గాములను ఎక్కువగా మిలిటరీ అవసరాలకు ఉపయోగిస్తారు. నిశ్శబ్దంగా నీళ్ళ అడుగునుంచి వచ్చి, శత్రు నౌకలను కిందనుంచి 'టార్పెడో' లతో ధ్వంసం చేస్తాయి అవి.

    ఆ సబ్ మెరైన్ ని చూడగానే చెప్పలేనంత ఆనందం కలిగింది సాగర్ కి. దీని సాయంతో ఈ చుట్టుపక్కలంతా గాలించి, అనూహ్యనూ, తన మిగలిన సహచరులనందరినీ రక్షించుకోవచ్చు.

    అనూహ్య ఈ దరిదాపుల్లోనే వుండి ఉంటుంది. ఆ లైఫ్ బోటు ఉనికిని కనుక్కుని అనూహ్యని రక్షించి ఆ బాస్టర్డ్  చాంగ్ గాడి పనిపట్టాలి.

    అతని దగ్గరలో ఆగింది జలాంతర్గామి. మెల్లిగా దానిమీదకు ఎగబాకాడు సాగర్. అతను ఎక్కగానే, దాని పైభాగాన మూతలా ఉన్న ఒక తలుపు తెరుచుకుంది.

    సంకోచంగా అందులోకి దిగాడు సాగర్.

    "కుడిచేతివైపు మెట్లు ఉన్నాయి. జాగ్రత్తగా దిగిరా?" అని వివబడింది ఒక గొంతు ఇంటర్ కమ్ లో.

    చూశాడు సాగర్.

    సన్నగా, నిచ్చెనలా ఉన్న ఇనుప మెట్లు కనబడుతున్నయి.

    దిగడం మొదలెట్టాడు అతను పైన మూతలా ఉన్న తలుపు ఆటో మాటిక్ మూసుకుపోయింది.

    వెంటనే జలాంతర్గామి, తల పక్కలన ఉన్న, కంపార్ట్ మెంట్స్ లోకి నీరు నింపుకుని, సముద్ర  గర్భంలోకి పోవడం మొదలెట్టింది అలా దాదాపు ఏడు వందల అడుగుల లోతుకి వెళ్ళాక, ముందుకి పయనించడం సాగించింది.

    అంత లోతుకి వెళ్ళాక, నీటి వత్తిడి విపరీతంగా ఉంటుంది. డానికి తోడు పొడుగ్గా, సన్నగా ఉండే జలాంతర్గాముల లోపలి భాగం అంతా ఇరుకు ఇరుగ్గా వుంటుంది. అలవాటులేని వాళ్ళు జలాంతర్గామిలో పయనిస్తే క్లాస్ట్రో ఫోబియా (ఇరుకు ప్రదేశంలో బంధింపబడినట్లు ఆందోళన చెందడం) లాంటి మానసిక వైపరీత్యాలకు గురి అవుతారు.

    సాగర్ కి జలాంతర్గామిలో ఎక్కడం అదే మొదటిసారి అయినా అతనికి అలాంటి మానసిక వికారాలేమీ కలగలేదు.

    ఇద్దరు మనుషులు ఉన్నారు ఆ సబ్ మెరైన్ లో. ఒకతను కంట్రోల్స్ దగ్గర కూర్చుని ఉన్నాడు. రెండో అతను మెట్ల దిగువనే నిలబడి, సాగర్ ని పలకరించాడు.

    "ఎవరు నువ్వు?"

    "నేనొక మార్చంట్ షిప్పుకి కెప్టెన్ ని. నా షిప్పు అంటుకుని ధ్వంసమై పోయింది. షిప్పులో చేరిన కొంతమంది దొంగలే అందుకు కారణమనుకుంటాను. షిప్పులోని జనం అంతా ఇంకా ఈ చుట్టు పక్కలే ప్రాణాలు దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండి వుంటారు. దయ చేసి వాళ్ళని రక్షించే మార్గం చూడండి."

    అతని సూచనని పట్టించుకోకుండా, "షిప్పు కెప్టెనువా నువ్వు? ఏం షిప్పు ?కార్గో షిప్పా?" అన్నాడు ఆ మనిషి ఆదుర్దాగా.

    "కార్గో షిప్పు."

    "ఎక్కడి కెళుతోంది?"

    "అండమాన్స్."

    "ఏం సరుకు రవాణా అవుతోంది దానిలో!

    చెప్పాడు సాగర్.

    "అంతేనా?" అన్నాడు ఆ మనిషి తేలిగ్గా.

    "దయచేసి మా వాళ్ళని రక్షించటానికి ఏర్పాట్లు చేయండి. ఎక్కువ టైం లేదు" అన్నాడు సాగర్.

    అది వినిపించుకోకుండా అతను కంట్రోల్స్ వద్ద ఉన్న రెండో మనిషి దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరూ తలలు దగ్గరకి చేర్చి గుసగుసగా మాట్లాడుకోవడం మొదలెట్టారు మధ్య మధ్యలో తలలు తిప్పి సాగర్ ని చూస్తున్నారు.

    సందేహంగా చుట్టుపక్కలంతా పరికించి చూశాడు సాగర్. జలాంత ర్గాముల్లో ఎప్పుడూ  ఎక్కకపోయినా, వాటి గురించి చాలా తెలుసుకున్నాడు అతను, కూతుహంలం కొద్దీ.

    ఇది మామూలు బలాంతర్గామి కంటే చాలా పెద్దదిగా కనబడుతోంది. ఇంత పెద్ద జలాంతర్గాములు సాధారణంగా అణుశక్తితో నడిచేవి అయి ఉంటాయి.

    మామూలు సైజు జలాంతర్గాములు బ్యాటరీల శక్తితో నడుస్తాయి. అయితే అవి బాటరీలు రీచార్జీ చేసుకోవడానికి తరచుగా నీటి ఉపరితలానికి రావలసి వస్తుంది.

    అదే అణుశక్తితో నడిచే సబ్ మెరైన్స్ అయితే, నెలల తరబడి నీటి అడుగునే ఉండగలవు.

    ఇంత పవర్ పుల్ సబ్ మెరైన్ ఇక్కడ ఎందుకు ఉంది?

    దాన్ని నడపటానికి ఇద్దరేనా సిబ్బంది వున్నది?

    చాలా ఆశ్చర్యం కలిగింది సాగర్ కి.

    ఆ మనుషులు ఇద్దరూ గుసగుసగా మాట్లాడుకోవడం పూర్తీ అయింది.

    ఒకతను వైర్ లెస్ ఆన్ చేశాడు.
   
    "హెడ్ క్వార్టర్స్? ఇక్కడ ఒక కార్గోషిప్ రెక్ అయింది. దాని కెప్టెన్ సజీవంగా దొరికాడు. రోటీస్ సరుకుని అండమాన్స్ తీసుకెళుతున్నానని చెబుతున్నారు సర్?"

    ".............."

    "యస్సర్! శిథిలాలని చెక్ చేసి చూస్తాం ఈ కేప్టెన్ ని ఏం చెయ్యమంటారు?"

    ".............."

    "సర్! యస్సర్. అలాగే చేస్తాం!"

    వైర్ లెస్ డిస్ కనెక్ట్  చేసి, ఎర మీదకు దూకబోయే క్రూర మృగంలా సాగర్ వైపు రావడం మొదలెట్టాడు ఆ మనిషి.

    కీడు శంకించాడు సాగర్.

    వెంటనే కాలి మడమమీద గిర్రున తిరిగి ఆ మనిషి మోకాలిమీద కొట్టాడు.

    ఆశ్చర్యం!

    ఆ దెబ్బకి అతని కాలు విరిగి, వూడిపడింది.

    అయినా__

     అతను ఆగలేదు.

    ఒంటికాలిమీదే ఎగురుతూ సాగర్ వైపు వస్తున్నాడు.


                                                          *    *    *

    పడవలాగా భద్రంగా నీళ్ళమీద తేలుతూ, తనకు ముందే నిర్ణయింపబడిన దిశలో పయనిస్తోంది సింగ్ కేబిను.

    సీ సిక్ నెస్ తగ్గిపోయింది. సింగ్ కి ఒక్కసారి బద్దకమంతా పోయేటట్లు ఒళ్ళు విరుచుకుని అభిమానంగా చూశాడు స్వరూప సమ్మోహనంగా చిరునవ్వు నవ్వుతూ.

    "నేను సీ సిక్ నెస్ తో నరకయాతన పడుతుంటే, నువ్వు నాకోసం ఆరాటపడిపోయినందుకు."

    "చాల్లెండి. మీరే నా పంచప్రాణాలయినప్పుడు మరి ఇంకోలా ఉండగలనా?" అని నాటకీయంగా కొనగోటితో, లేని కన్నీరు తుడుచుకుంది స్వరూప. "మీకోసం ఎంత తలక్రిందులైపోయానో తెలుసా? మీ బాధ చూస్తూ కేబిన్ లో కూర్చోలేక, షిప్పంతా పిచ్చేట్టినట్లు తిరిగేదాన్ని. మీరు తప్ప నాకు ఇంకెవరూ అఖ్కర్లేదని బాగా అర్ధమయింది ఈ  కొద్దిరోజుల ప్రయాణంలో."

    సంతోషంతో పులకరించిపోయింది సింగ్ హృదయం.

    దగ్గరగా వచ్చి అతని మనం ఎటు వెళుతున్నాం?" అంది.

    "అండమాన్స్ కే వెళుతున్నాం" అన్నాడు సింగ్. "అయితే దీనికి అమర్చిన ఇంజను కొంచెం చిన్నది అందుకే స్లోగా వెళుతున్నాం మనం. కానీ నిశ్చయంగా అండమాన్స్  చేరి తీరతాం. కొద్దిరోజుళు అక్కడ హాయిగా ఎన్ జాయ్ చేసి, ఫ్లయిట్ లో తిరిగి వచ్చేద్దాం! చెప్పు ఈసారి ఎక్కడికేద్దాం! ట్రిప్పు?"

    "పోనిస్తురూ వెధవ ట్రిప్పు" అంది స్వరూప విరక్తి నటిస్తూ. "అంత ఖరీదైన షిప్పు మునిగిపోయింది. ఉసూరుమంటోంది నా ప్రాణం. ఈ నష్టంలో నుంచీ తేరుకునేదాకా మనం ఎక్కడికీ వెళ్ళొద్దు."

    నవ్వాడు సింగ్. "పోతేపోయింది వెధవ షిప్పు! మన ఆస్తిలో ఇదెంత అనీ! నువ్వు నాకు దక్కావు. అదే పదివేల కోట్లు చెప్పు ఈసారి స్విన్ ఆల్ప్స్ కి వెళదామా? రోమ్ కి వెళదామా? పారిస్ కి వెళదామా? లేకపోతే సింపుల్ సింగపూర్ వెళ్ళి వచ్చేద్దామా?"

    సింగపూర్ అని వినబడగానే ఉలిక్కిపడింది స్వరూప. ఆమెకి దుర్భరమైన తన గత జీవితం గుర్తొచ్చింది.

    "వద్దు వద్దొద్దు! సింగపూర్ నాకు బాగుండదు పారిస్ వెళదాం!" అంది కంగారుగా.

    ఆశ్చర్యంగా ఆమెని చూసి, దగ్గరగా లాక్కుని, గాఢంగా కౌగలించుకున్నాడు సింగ్. "అలాగే డియర్. పారిస్ వెళదాం!"

    "ఉండండి. మంచి డ్రింక్ ఏదన్నా తెస్తాను మీకోసం." అని వదిలించుకుని లేచి, స్ట్రాంగ్ కాక్ టెయిల్స్ రెండు గ్లాసులనిండా కలిపింది స్వరూప. సింగ్ అంటే ఇష్టలేదు ఆమెకి. అతని సాన్నిహిత్యాన్ని భరించాలంటే వళ్ళు తెలియనంతగా తాగాలి తను.

    నిదానంగా మద్యాన్ని చప్పరిస్తూ, కబుర్లు చెప్పుకుంటూ కొంచెం సేపు గడిపారు ఇద్దరూ.

    ఆ తర్వాత అతను ఆమెని తన దగ్గరికి లాక్కున్నాడు.

    వెంటనే కళ్ళు మూసుకుంది స్వరూప.

    ఆ సమయంలో ఆమె మనోనేత్రం ముందు మెదులుతోంది సింగ్ కాదు.

    అనూహ్య!

    ఆమె అందమే గుర్తువస్తోంది స్వరూపకి. నొక్కితే ఆరోగ్యం కారేటట్లున్న ఆ అమ్మాయి ఒళ్ళే  గుర్తువస్తోంది. సముద్రపు అలలులాంటి వంకు వంకుల జుట్టే గుర్తువస్తోంది.

    అలలు అనుకోగానే ఇంకోటి కూడా గుర్తుకు వచ్చింది స్వరూపకి. ఈ కెరటాల మీద  నురగకంటే తెల్లటి బ్రాసరీ, పాంటీస్ వేసుకుని ఉంది అనూహ్య ఆ రోజున!

    ఇంకొంచెం వ్యవధి ఉంటే తను....

    అసంతృప్తితో, బాధతో మూలిగింది ఆమె హృదయం.

    ఆ అమ్మాయి అందాలని  తను తనివితీరా రుచి చూడకుండానే చెయిజారిపోయి సముద్రం పాలయింది.

    ఏమయివుంటుంది అనూహ్య? చనిపోయి ఉంటుందా?

    'గభీ' మని ఏదో జంతువు కాబిన్ మీదికి దూకినట్లు అనిపించడంతో ఉలిక్కిపడి, ఆలోచనలలో నుంచీ బయటపడింది స్వరూప. చటుక్కున సింగ్ ని పక్కకు తోసేసి, లేచి కూర్చుంది. సింగ్ కూడా భయంగా చూశాడు.

    ఆ అడురుకి ఒకవైపుకి ఒరిగిపోయి కొద్దిక్షణాల తర్వాత మళ్ళీ సరైన పొజిషన్ కి వచ్చింది.

    అప్పుడు తలుపు అద్దాలలోనుంచి త్రీ-డి సినిమా తెరమీద రాక్షసుడి మొహంలా కనిపించింది.

    చాంగ్ మొహం!

    దబదబ తలుపు బాదుతున్నాడు అతను.

    తలుపు కిర్రుకిర్రుమంటూ రోదనలాంటి శబ్దం చేస్తున్నాయి.

    భయంతో నిశ్చేష్టురాలపోయింది స్వరూప.

    చాంగ్ వచ్చేశాడు. తనకు కోపం వస్తే చిత్రహింసలు పెట్టి చంపే చాంగ్ వచ్చేశాడు.


                                                              *    *    *


    బల్లకట్టులా ఉన్న కిచెన్ ప్లోర్ మీద తేలుతూ కొట్టుకుపోతున్నారు ప్రొఫెసర్ ఆనందరావు. ఫకర్, ఇబూకా.

    వాళ్ళ ముగ్గురి బరువునీ అది ఎంతసేపు మోసేలాలేదు.

    ప్రొఫెసర్ ఆ ఫ్లోర్ మీదకు నీళ్ళు వచ్చినప్పుడల్లా గంగవెర్రులెత్తి పోయి, కేకలు పెడుతున్నాడు.

    ఏమీ మాట్లాడకుండా నిర్లిప్తంగా  కూర్చుని ఉన్నాడు ఇబూకా.

    'నిండా మునిగిన వాడికి చలేమిటి?' అన్నట్లు ఫకర్ మాత్రం హుషారుగానే వున్నాడు. తమాషా పదాలతో వున్న జనపద గీతం ఏదో పాడుకుంటున్నాడు అతను.

    అప్పుడు__

    మెల్లిగా తేలుతూ దగ్గరయింది ఏదో.

    ముగ్గురూ తెరిపారి చూశారు.

    ఒక దుంగ దాని మీద ఒక వృద్దుడు కూర్చుని నల్లమందు భాయిలా బద్దకంగా జోగుతున్నాడు.

    తేలుతున్న కిచెన్ ఫ్లోర్ కి బాగా దగ్గరికి వచ్చి తగిలి, ఆగింది దుంగ.

 Previous Page Next Page