Home » Vasireddy seeta devi novels » బంధితుడు


    "అదేమిటి సరోజా! నీకు చాలా పట్టుచీరలు వున్నాయ్ గా!" వింటూ ఉండలేక అనేసింది పద్మ!

    "ఎక్కడున్నా యేమిటి? అన్నీ  ఉతుకుడుపడ్డవేగా? పెళ్ళిలో ఉతికిన చీరే కట్టుకోమంటావా? అసలు అందుకే ఆ పెళ్ళికి రానన్నాను. ఆయనకు కోపం వచ్చింది. ఇక్కడకు  వచ్చేశాను. ఎంచేస్తాను? ణా కర్మ  అని ఊరుకుంటాను"

    "పెళ్ళికి వెళ్ళకపోతే ఏంబాగుంటుందీ? చీరకోంటాలే" అన్నాడు సత్యనారాయణ గొంతు తగ్గించి అపరాదిలా.

    పద్మ అక్కడనుంచి లేచి విసురుగా వెళ్ళిపోయింది.

    "వద్దులే అన్నయ్యా! వదినకు యిష్టం లేనట్టుంది" రాగం తీస్తూ అన్నది సరోజ.

    "అదేం లేదులే. నేను కొనిపెడ్తాగా?"

    "ఆ చెల్లెలికి లేకపోతే మీకైణా వుండాలి" అన్నం వడ్డిస్తూ అన్నది పద్మ.

    "ఏమిటి?" సత్యనారాయణ తలెత్తకుండా అన్నాడు.

    "బుద్ధి జ్ఞానం!"

    "ఏమిటే నీ ఏడుపు?" గట్టిగా అనలేకపోయాడు.

    "ణా బ్రతుకే ఒక యేడుపు యిక యేడవక ఏం చేస్తాను ఇలాంటి మొగుడు దొరికాక!"

    "ఆ అనేదేదో సూటిగా అను! డొంకతిరుగుడుగా మాట్లాడకు" అతి సాధారణంగా,అమామూలు విషయంలా అన్నాడు.

    "నేను సూటిగానే మాట్లాడుతున్నాను. పెళ్ళయి నాలుగేళ్ళు దాటింది. ప్రతి ఆరు నేలలకూ వచ్చి తిష్టవేస్తుంది. పోనియ్ వచ్చిందేమో, నాలుగు రోజులుండి పోవచ్చుగా? వచ్చినప్పటినుంచీ అవి కావాలి.ఇవికావాలి అని అడగటం.  ఆవిడగారు అడిగిందే తడవుగా తమరు అప్పులు చేసి కొనివ్వటం....ప్రతిసారీ నెలల కొద్ది ఉండటం...."

    "నువ్వెళ్ళడంలా నీ పుట్టింటికి?" మధ్యలో అందుకున్నాడు.

    "నాతో పోలికా?" కసిగా అన్నది పద్మ.

    "ఏం? నా చెల్లెలే అంతగతిలేని దనుకుంటున్నావా?"

    "మా అన్నయ్యలకు అప్పులుచేసి నాకు చీరలు పెట్టె అవసరం లేదు."

    "అప్పులు చేసయినా నా చెల్లెలి అచ్చట్లు, ముచ్చట్లు నేను తీరుస్తాను. తెలిసిందా? ఇందులో నువ్వేం కలుగచేసుకోకు" కోపంగా అన్నాడు సత్యనారాయణ.

    మాటా మాటా పెరిగింది.

    సత్యనారాయణ తింటూ తింటూ ఒక్కసారిగా కంచంలో చెయ్యి కడుక్కొని లేచి వెళ్ళిపోయాడు.

    ఒక వైపు భర్త  అన్నం తినకుండా వెళ్ళాడనే బాధ, రెండోవైపు చెల్లెల్ని వెనకేసుకొచ్చి తనను అపమానిస్తున్నాడనే కసి.

    పద్మ కూడా భోజనం చెయ్యలేదు. ఏడుస్తూ వంటింట్లోనే కొంగుపరచుకొని ఆ రాత్రి పడుకుంది.

    సత్యనారాయణ పడుకొని ఆలోచిస్తున్నాడు.

    అది తన అన్నం దగ్గర తెచ్చుకుంటుందట, తన చెల్లెలికి దానితో పోలికలేదట.

    ఎందుకో?
   
    తను ఆవిడగారి అన్నలంత సంపాదనా పరుడు కాదనేగా దాని పొగరు?

    ఈ ఆడవాళ్ళే ఇంత!

    మొగుడికి సంబంధించిన బంధువులు తన ఇంటికి రాకూడదు.

    తను మాత్రం పుట్టింటికి వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి.

    ప్రతికోడలూ తనూ ఒకింటి ఆడపడుచు అనే విషయం విస్మరిస్తుంది.

    సరోజ మాత్రం? దానికి ఆడుబిడ్డలు లేరుగనుక సరిపోయింది. ఉంటే ఇంకెన్ని గొడవలు పడేదో?

    తన చెల్లెలుపోడ దీనికి బొత్తిగా గిట్టకుండాపోయింది.

    ఏమైనా సరే రేపు తను సరోజను పట్టుచీర తెస్తాడు. దాని ముఖం మీద కొట్టినట్టు, దానికి అన్నలు పెట్టిన చీరల కంటే మంచి చీరే తెస్తాడు.

    ఆలోచిస్తూపడుకున్న సత్యనారాయణకు ఆరాత్రంతా నిద్రపట్టలేదు కళ్ళుమంటలు. తలలో నాదు.

    రెండో రోజు సాయంకాలం ఆఫీసునుంచి ఇంటికి వస్తూ అట్టపెట్టె తీసుకొని వచ్చాడు.  సత్యనారాయణ.

    వస్తూనే "సరూ! సరూ!" అంటూ కేకలు పెట్టాడు.

    "ఆఁ ఏమిటన్నయ్యా? చీర తెచ్చావా?" సంతోషంగా అన్నచేతిలో పెట్టె అందుకుంది సరోజ.

    పాకెట్ గబగబా విప్పింది.

    జానెడు జరీఅంచుతో , జరీబుట్టాలువున్న మబ్బురంగు కంచిపట్టుచీర. కళ్ళు "జిగేల్ మనిపించింది.

    సరోజ కళ్ళు సంతోషంతో మెరిసిపోతున్నాయి.

    "చాలా బాగుంది అన్నయ్యా!" అన్నది ఆనందంగా.

    పద్మ సరోజ చేతుల్లో వున్న చీర చూసి ఆశ్చర్యపోయింది.

    ఆ చీర  ఖరీదు ఆరు వందలకు పైనే వుంటుంది. ఇంత డబ్బు ఎక్కడ నుంచి తెచ్చారు? అప్పుచేసి వుంటాడు.

    తనకు  కట్టుడు చీరలు లేనంటే "ఇప్పుడు డబ్బు లేదు. వచ్చే నెలలో కొనుక్కో" అన్నాడు!

    ఇప్పుడింత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో?

    పద్మ మనసు భగ్గుమన్నది.

    ఆమె అహం లోతుగా గాయపడింది. అభిమానం మీద సుత్తి దెబ్బ పడింది!

    రెండో రోజు సరోజ హైదరాబాద్ వెళ్ళిపోయింది.

    వారం రోజుల దాకా భార్యా భర్తలు ఎడముఖం పెడ ముఖంగానే వున్నారు!

    ఇదీ అంతవరకు జరిగిన కధ!


                                                                                       13


    సరోజ హైదరాబాద్ వెళ్ళి పూర్తిగా నెల కాలేదు!

    సరోజ నుంచి అంత పెద్ద ఉత్తరం రావడం పద్మకు ఆశ్చర్యంతో పాటు, అసహ్యంకూడా కలిగింది, భర్తమీద మొదటిసారిగా అసహ్యం వేసింది! ఇంత కాలం భర్తమీద ఆమె కోపం వచ్చింది! ఈసారి అసహ్యం వేసింది.

    ఎంత అన్నా చెళ్ళెలైణా ఇదేం విడ్డూరం. మధన పడు సాగింది పద్మ!

    ఎన్నేళ్ళు వచ్చినా ఏంలాభం! వివేకంలేని మనుషులు! ఇద్దరూ ఇద్దరే!

    బాధ్యతల్ని విస్మరించే అనురాగాలు ఎందుకు?

    దేనికైనా ఓ హద్దు అంటూ వుండాలి!

    పద్మ మనసులో తాటాకులు మంటలు లేస్తునాయ్!

    ఏ నిమిషంలోనైనా పగలటానికి సిద్ధంగా వున్న మందు పెట్టిన కొండలాలా వుంది బుర్ర!

    ఆ అగ్నా చెల్లెళ్ళకు బుద్ధిలేకపోతే అతగాడికి వుండక్కర్లా?

    నాలుగు రోజులకు ఒకసారి పుట్టింటి మీదకు దండయాత్ర పంపిస్తాడా పెళ్ళాన్ని?

    పైగా కధలుకూడా రాస్తాడు! ఆదర్శాలు వల్లిస్తాడు!

    అసలు ఈ నాటకం మొగుడూ పెళ్ళాం కలిసే ఆడుతున్నా రేమో? ఈ మనిషికి  అర్థం అయి చస్తేగా!

    పిచ్చి మనిషి!

    ప్రేమించడం తప్ప ద్వేషించడం తెలియనివాడు!

    ఆయన మంచితనాన్ని మొగుడూ పెళ్ళాలు ఉపయోగించుకుంటున్నారు! ఇది మంచి తనమా? లేదు. చవటతనం!

    ఇలా ఇంకెంత కాలం సాగుతుంది?

    తమ పిల్లలూ పెద్ద వాళ్ళవు తున్నారు!

    బ్యాంకులో వున్న డబ్బులో సగం ఖర్చుపోయింది!

    తనకు పుట్టింటి అండ వుంది! కనుక ఎలాగో నెట్టుకొస్తుంది! కానీ ఎంతకాలం ఒకర్ని ఒకరు ఆదుకోగలరు?

    ఎవరి సంసారాలు వాళ్ళకు ఏర్పడిన తర్వాత ఎవరి కష్టసుఖాలు వాళ్ళు అనుభవించాలి! ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకాలి!

    ఈయన చవట తనాన్ని ఆ చెల్లెలు బాగా ఉపయోగించుకుంటోంది!

    సరోజ అమాయకురాలుకాదు! అలాఅనుకున్న తనే అమాయకురాలు.

    ఆలోచిస్తున్న పద్మదృష్టి గడియారం మీద పడింది!పదకొండు దాటింది.

    ఇంకా ఆయన ఆఫీసుకు బయలుదేరలేదేం? ఇంకా ఆ మాయదారి ఉత్తరం పట్టుకొనే కూర్చున్నాడా? ఏం రాసిందో?

    మళ్ళీ ఏమొచ్చిందో కొంపమీదకు?

    ఏం రాసిందో ఏం పాడో?

    పద్మకు దిగులుగా వుంది.

    కోపంగా వుంది.

    విరక్తిగా వుంది.

    కసికసిగా వుంది చివ్వునలేచింది

    విసవిసా మెల్లా ఇంట్లోకి వచ్చింది

    సత్యనారాయణ ఉత్తరం పట్టుకొని శూన్యంలోకి చూస్తూ కూర్చుని వున్నాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra