"జీవితం కారులాంటిది సాబ్" అని ఫస్ట్ గేర్ వేసేడు హుస్సేన్. కారు పెద్దగా శబ్దంచేసింది. "పెళ్ళాంక్లచ్ లాటిది సాబ్. ఎప్పుడూ నొక్కిపట్టివుమ్చాలి వదిలేస్తే......" కారు పెద్ద జర్కుయిచ్చిముందుకు దూకింది.
"ప్రే......ప్రే....." అంటూ గేరు మార్చటానికి అవస్థపడుతూఅన్నాడు హుస్సేన్.
"ప్రేమ" అన్నాడు చిరంజీవి విసుగ్గా. అతనికి ఈ డ్రైవింగ్ నేర్చుకోవడం పరమ బోరుగా వుంది. అతడు అర్చనని కలుసుకొనే తొందరలో వున్నాడు. చాలా కొద్దిరోజుల్లోనే ఆమె ఫారెన్ త్రిఫ్ వెళ్తూంది. ఈ లోపులోనే అమెకితన ప్రేమని వెల్లడించాలి.
"ప్రేమ అక్సిలేటర్ లాటిది సార్. నొక్కేకొద్ది వేగం హెచ్చుతుంది." అని చట్టుక్కున ఆపుచేసి, "పెళ్ళి బ్రేకులాటిది" అన్నాడు వేదాంతిలా చివరికి నవ్వి.
చిరంజీవి నుదురు ఎదురు నాకు డ్రైవింగ్ " అని అడిగేడు, ఇకీ కారునే జీవితంలో ప్రయాణం చేయలేక .
"ఏంట సాబ్" అన్నాడు హుస్సేన్. "రేండు నెలల్లో బెజవాడలో కూడా డ్రైవ్ చేసేయ్యగలరు మీరు."
"అక్ఖర్లేదు అలా అయితే" అన్నాడు చిరంజీవి.
"అర్చన పడిరోజుల్లో వెళ్ళిపోతుంది. ఈ లోపులో....." అని మోటార్ సైకిల్ నడపటం వచ్చా సాబ్ " అని అడిగేడు.
"రాడు."
"పోనీ సైకిలు"
"వచ్చు."
"చాలు సాబ్" అన్నాడు హుస్సేన్, సమస్య తేలిపోయినట్టు హొటల్ వరకూ వెళ్ళి వచ్చేయ్యడమెగా ! నా దగ్గరో స్టాండర్డ్ కారుంది. సైకిల్ తొక్కడం తెలిస్తే చాలు__ దాన్ని నడిపెయ్యేచ్చు. ఒక్కసారికి పెద్ద డ్రైవింగ్ తెలిక్ఖర్లేదు. దాన్ని తీసుకెళ్ళండిసార్. ఫస్టుగేరూ___ లాస్టుగేరూ చెప్తాను" అన్నాడు. అతడుచేయ్యి వూపగానే ఇద్దరు కుర్రవాళ్ళు. కాకీ బట్టలమీద గ్రీజు పూటవున్నవాళ్ళు బెహారుగా వున్న కారు నొకదాన్ని తోసుకువచ్చారు. చిరంజీవి దానివైపు అనుమానంగా చూసేడు. హుస్సేన్ అతడికి అభయమిస్తున్నట్టూ "ఎక్కండి సాబ్" అంటూ ఎక్కించి దాన్నెలా నడపాలో వివరించేడు. అతని వివరణ చిరంజీవికి రంగా _బిల్లా కేసు జడ్జిమేంటూ లా సగం అర్ధమయి సగం అర్ధమవలేదు. మీ ఫీజు?" అని అడిగేడు.
"ప్రేమకి ఫీజులేదు సాబ్. ఈ త్రిప్పుమా కంపెనీ కానుక."
చిరంజీవి ఇగ్నిషన్ తిప్పగానే రేసుగుర్రంలా ముందుకు దూకి, ఆ తరువాత ఎందుకో ఆగి, మళ్ళీ పరుగేత్తింది.
అటే చూస్తూ నిలబడ్డాడు హుస్సేను. అతడికి ముందు అల్లా, తరువాత అంజనేయస్వామి జ్ఞాపకం వచ్చేరు. మౌనంగా వాళ్ళిద్దర్నీ ప్రార్ధించి, గంభీరంగా తల పంకిస్తూ లోపలి వెళ్ళబోతూవుంటే అప్పుడు జ్ఞాపకం వచ్చిందతనికి _చిరంజీవి రివర్స్ గేరు వెయ్యటం నేర్పలేదని.
* * * *
కోటు సవరించుకుని కారుదిగి, తనవైపే ఆశ్చర్యంగా చూస్తున్నా గూర్ఖావైపు ఓ చూపు విసిరేసి, స్టయిల్ గా హరన్ నొక్కేడు. పెద్దశబ్దంతో 'బోయ్' మని ఆ కాంపౌండ్ ప్రతిధ్వనించింది. అర్చన బాల్కానీ మీదనుంచి చూసి, వస్తున్నానన్నట్టు చెయ్యివూపి పరుగెత్తుకు వచ్చింది.
స్టీరింగ్ దగ్గర కూర్చోబోతున్న చిరంజీవికి చప్పున గుర్తొచ్చింది. అమ్మాయి కారెక్కటానికి వస్తూంటే డోర్ తెరచి పట్టుకోవాలని. దిగి అటువైపు వెళ్ళి, ఆమె వస్తూంటే డోర్ తెరవబోయెడు.
రాలేదు. బొటనవేలుతో నాబ్ వట్టి బలంగా లాగేడు.
అర్చన ఆగి, సూటులో కొత్తగావున్న అతడివైపు వింతగా చూసింది నిజంగా సూట్ లో అతడు చాలా బావున్నాడు. ఆమె కళ్ళల్లో అభినందన కనబడ్తోంది. అయితే అతడు మాత్రం దాన్ని గుర్తించే స్థితిలోలేదు చెయ్యి మార్చి__ అతి సులువుగా వున్నట్టు కనబడటానికి ప్రయత్నం చేస్తూ తలుపు తెరవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నుదుటిమీద చెమట పడ్తూంది.
"గుడ్ మార్నింగ్ " అంది అర్చన.అతడు రేండు చేతుల్తోనూ హాండిల్ పట్టుకుని లాగేడు.ముందు కిర్రుమని తరువాత టప్ మంది. తలుపు వూడి వచ్చి తెరుచుకుంది.
అయితే తెరుచుకోవడానికి, వూడి తెరుచుకోవడానికి డిఫరెన్స్ ఉంది. తన చేతిలో వున్న తలుపు తాలూకు బరువు ఎక్కువ అవటంతో అతడికి అర్ధమయింది. తలుపు వూడిండని ఒకవైపు స్క్రూ విరిగి వేలాడుతూంది. ఏడ్వలేక నవ్వటం అంటే ఏమిటో అర్ధమయింది. అలా నవ్వుతూ తలుపు తెరచి, ఆమె కూర్చున్న తరువాత భద్రంగావేసి, స్టీరింగుముందు కూర్చోన్నాడు.
"ఎక్కడికి వెళ్దాం."
"హొటల్ ఏషియానా" అమ్తూచిరంజీవి కారు స్టార్టు చేసేడు. పెద్ద చప్పుడు తర్వాత నిశబ్ధం.... మళ్ళీ ఇగ్నిషన్ తిప్పేడు. ఈసారి పెద్ద గాజుగ్లాసు భళ్ళున బ్రద్దలయిన శబ్దమ్. అతడు తలతిప్పి అర్చనవైపు చూసేడు. మొహంలో ఏ భావమూ లేకుండా ఆమె బైటకు చూస్తుంది. అతడు తల రెండోపక్కకి తిప్పాడు. రామయ్య, బైరాగీ, రంగమ్మ బాల్కనీలో నిలబడి చూస్తున్నారు. దూరంగా గూర్ఖా నిలబడి వున్నాడు. ఈ సారి బలంగా వేళ్ళతో పట్టుకుని పెదవులు బిగించి తాళం తిప్పాడు. భూకంపంవచ్చినట్టు కదిలింది కారు. జరక్ ఆగింది.
"కారు గేరులో వున్నట్టుంది. అన్నది అర్చన.ఆమె మొహంలో ఎభావమూ లేకపోవటం అతడినిమరిమ్తకంగారు పెడ్తూ౦ది. గేరు ముందుకుతోసి, క్లచ్ నొక్కి వెనక్కీ వెళ్ళడాన్నిఅసలు వూహించని చిరంజీవి కంగారుపడి బ్రేకు నొక్కెడు. అయితే అతడు బ్రేకు అనుకున్నది అక్సిలేటరు.
అప్పుడు మొదలైంది సర్కసు.
ముందు, వేనుకచక్రం మేట్లేకింది. ముందుదికూడా ఎక్కబోతూ అతడు స్టీరింగ్ గుర్రున తిప్పటంతో__ పడవలా పక్కకి తిరిగి రెండు పూల కుండిల్ని శత్రుసైనికుల్ని పడగొట్టినట్టూ పడగొట్టి_ ఆ తరువత ఎర్రమట్టిదుమ్ము లేపుకుంతూ ఫాంటెన్ పక్కనుంచి లన్ లోకి ప్రవేశించిది. అక్కడ చిన్న గుంటలో పడి గుర్రంలా ఎగిరి, రెట్టించిన ఉత్సహంతోగుల్బీ తోటలోకి ప్రవేశించింది. అక్కడ మన్ను లూజుగా వుండటంతో ఎరువులకోసం వేసిన గుంతలమధ్య పెద్ద శబ్దంతో ఆగింది. కారు చప్పుడు ఆగిందికానీ, చిరంజీవి గుండెశబ్దం మాత్రం ఇంకా బైటకి వినిపిస్తూనే వుంది.