Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 16

    అబ్బబ్బబ్బ ! ఈ మగాళ్ళ కేం ఫాషన్లో! మనిషి అందంగా వున్నాడు చాలదూ? పెద్ద హిందీ అక్టరులా తయారయాడు. అలంకరణ ఎక్కువయింది.

    మగాడు అచ్చమయిన మగాడిలా వుంటే చాల దేమిటి ఆడాళ్ళ బట్టలు తొడుక్కుని అడవి రాముడి లాగను దసరా బుల్లోడు లాగను తయారవతున్నారు.

    మగాడు గోచీ పెట్టుకుంటే సరిపోతుంది మరే, వ్యాకర్ణ గోచీ పెట్టుకుంటే యెలా వుంటాడో ఛీ... సిగ్గు లేకుండా యిదేంటమ్మా! ఆడపిల్ల కాదా! సిగ్గు సిగ్గి" అని ఆలోచించి వ్యాకర్ణ గోచిలో వున్న ఆకారంతో ఊహించుకుని సిగ్గుపడి తన్ని తానే కోప్పడుతుంది.

    ఆపై ఆలోచన అబ్బులు వైపు మళ్ళింది.

    " అబ్బులు పేరెంత ముద్దుగా వుందో! అబ్బూ! అని పిలవొచ్చు. చందమామ కధల్లోలా ఏడిపించాలంటే అబు , సిరి, గిరి అంటూ పిలవ్వొచ్చు.

    మనిషి చూడబోతే జైట్ విల్ లో ఇంతెత్తు వున్నాడు. వైట్ ఫాంట్ లో వైట్ షర్ట్ టక్ చేశాడు. చాలా వైట్ గా వున్నాయి.దుస్తులు. సర్ఫ్ పెట్టి రాణీపాల్ లో ముంచాడేమో? వచ్చిం తరువాత కనుక్కోమ్వాలి.

    క్రాఫు నున్నగా వుంటేనేం అమితాబ్ నడిగి ఎరువు తెచ్చుకున్నట్లుంది.పాపం భూతద్దాలే. ఆ.. అవీ బాగానే వున్నాయి. అల్లరిపిల్లాడిలా లేడు. అమాయికంగా మాటకు ముందు భయపడే వాడిలా వున్నాడు.

    నిజంగా భయామా? ఉత్తుత్తి భయమా? ఏమోగాని యిద్దరూ మంచాళ్ళు లాగానే వున్నారు. నిజంగా మంచాళ్ళో ఉత్తిత్తి ఫోజో, వస్తారుగా?" అనుకొని తెలెగరేసి యింట్లోకి నడిచింది జయచిత్ర.

    అన్నట్లుగానే శనివారం వ్యాకర్ణ, అబ్బులు నాలుగు నలభైకి మూటాముల్లే, పెట్టేబేడాతో బామ్మాగారిం టికి రెండు రిక్షాల మిద వచ్చి దిగారు.

    జయచిత్ర చెప్పిన ప్రకారం కుడికాళ్ళు ( వొకటి వ్యాకర్ణది, రెండోది అబ్బులిది) గదిలో ముందుగా పెట్టి గృహ ( గది) ప్రవేశం చేశారు.

    బామ్మగారు సంతోషిస్తుందని రూపాయిపావాలా కొబ్బరికాయ గుమ్మంలో కొట్టారు.

    ఖాళీ వాటాలోకి యిద్దరబ్బాయి లొచ్చి దిగటం ఆ యిద్దరితో బామ్మగారు, బామ్మాగారి మనవరాలు జయచిత్ర గలగల మాట్లాడటం చూసి ఆ కాంఫౌండ్ లో వున్న అన్ని  వాటాల్లో వాళ్ళూ పలకరింపుగా పలకరించి, చూసి పోదామని వచ్చారు.

    ముందుగా వచ్చింది. వృద్ధకన్య పేరు సుకన్య. ఆమెతో పాటు ఆమె తల్లి, తండ్రి.

    " చూడండి అల్లుడూ! మిరు ఏ పేటలో ఏ యిల్లు ఖాళీచేసి వచ్చారు?" అని అడిగాడు సుకన్య తండ్రి సుందర్రామయ్య.

    " నా పేరు అల్లుడు కాదు అబ్బులు, వీడి పేరు వ్యాకర్ణ" వళ్ళుమండి గట్టిగా అన్నాడు అబ్బులు.

    " అట్లాపెట్టండి" అంది జయచిత్ర సామాన్లు సర్దుతున్న వ్యాకర్ణ వైపు ముఖంపెట్టి సుందర్రామయ్యకు తగిలేట్టు.

    " చూడండి అల్లుడూ! ఏదో వరసకి పెద్దముండా వాణ్ణి కాబట్టి పిలిచాను. నీ పేరు అబ్బులా! బాగుందండోయ్." అన్నాడు సుందర్రామయ్య.

    " ముందా అండీ, ఆ తర్వాత అల్లుడూ తీసి పారేంయండి. చిన్న వాళ్ళని పేరు పెట్టి పిలుస్తే  ఆయుక్షణం ఆమాత్రం తెలిదాండీ! పైగా పెద్దముండావాణ్ణని చెప్పుకుంటున్నారు?"

    " మామయ్యగారికి ఏం తెలియదు బాబూ! నే చేవుతాలే" అంది సుకన్య తల్లి తులశమ్మ.

    తులశమ్మ వెనుకనే నుమ్చిని నోట్లో వేలు పెట్టుకు చికుతున్న సుకన్య మేలు తీసి బోలెడు సిగ్గుపడుతూ వుంది.

    " అల్లుళ్ళకి పెళ్ళి కాలేదనుకుంటాను" అన్నాడు సుందర్రామయ్య.

    " అదిగో మళ్ళీ అల్లుడు అంటున్నారు?" అన్నాడు అబ్బులు. 

 Previous Page Next Page