Home » Yerramsetti sai » Nee Kalala Bandheeni


                                 6

    మరో వారపత్రికలో సీత రెండో నవల సీరియల్ గా ప్రారంభించారు. ప్రారంభించిన రెండు మూడి వారాల్లోనే అమితమయిన ప్రచారం పొందిందది. ఎవరు చూసిన ఆ నవలలోని పాత్రల గురించే మాట్లాడకొంటున్నారు. ఆ వార పత్రిక సర్క్యులేషన్ కూడా పెరిగిపోయింది. ఈ విషయమై ఆ పత్రిక సంపాదకుడే ఆమెని అభినందిస్తూ ఉత్తరం రాశాడు. మాధవరావు కిదంతా విపరీతమయిన ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆమె నవలలు అంతటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్నాయంటే నమ్మబుద్ది కావటం లేదు. ఆమె రాసే ప్రతి రచనా తను చదువుతూనే ఉన్నాడు. వాటిల్లో సహజత్వం అనేది మచ్చుకయినా కనిపించలేదు. కాకపోతే, కధ, కధనం చాలా బాగుంటున్నాయి. అంతే ఈ మాత్రానికే పాఠకులు , పత్రికలూ, ఆమెని ఆకాశానికేత్తేయడం తమాషాగానే ఉంది. ఏదేమయినా సీతకి రచయిత్రిగా ఉజ్వలమయిన భవిష్యత్తు ఉందనిపించింది అతనికి. మరో ముఖ్య విషయం , ఆమె ఇదేవిధంగా కొంతకాలం రచనలు చేస్తే ప్రస్తుతం తామున్న ఆర్ధిక సమస్యల నుంచి బయటపడే రోజు ఎంతో దూరం ఉండదు.
    ఇప్పుడు సీత సుభాషిణితో సగర్వంగా మాట్లాడగలుగుతుంది. సుభాషిణికి డబ్బుంది. తనకు రచయిత్రిగా పేరుంది. అంచేత ఆమెకు ఏ విధంగానూ తీసిపోదు. హటాత్తుగా మాధవరావు మేనమామ సంజీవయ్యకు జబ్బు చేసింది. అతనిని వెంటనే గుంటూరు హాస్పిటల్లో చేర్చాలనీ, ఆపరేషన్ అవసరమనీ తేల్చారు డాక్టర్లు. ఆ భాద్యతంతా మాధవరావే తీసుకోక తప్పలేదు. నెలరోజులు ఆఫీసుకి శెలవు పెట్టి, సీతను వాళ్ళ పుట్టింటి దగ్గర వదిలి సంజీవయ్యను తీసుకొని గుంటూరు బయల్దేరాడు. అతి కష్టం మీద హాస్పిటల్లో ఎడ్మిషన్ దొరికింది. కాని ఆపరేషన్ చక్కగా జరగాలంటే డబ్బు ఖర్చు పెట్టాలని చెప్పారెవరో. అతనికి ఆపరేషన్ జరిగాక కూడా ఒక నెల హాస్పిటల్లోనే ఉండాలని చెప్పాడు డాక్టరు. వెంటనే హాస్పిటల్ దగ్గరలోనే ఓ ఇల్లు అద్దెకు తీసుకొని అత్తయ్యనూ, పిల్లలనూ అక్కడ నెల రోజులు గడపాలంటే కనీసం వెయ్యి రూపాయలయినా కావాలి. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలో అర్ధం కాలేదతనికి.
    "పోనీ సగం పొలం అమ్మేస్తే......" అంది అత్తయ్య.
    అది మాధవరావుకు కిష్టం లేక పోయింది. ఉన్నదే కొంచెం పొలం. దాని మీదే ఆధారపడి బ్రతుకుతోందా కుటుంబం- ఇప్పుడు అందులో సగం అమ్మేస్తే ఆ కుటుంబం రోడ్డున పడక తప్పదు.
    వెంటనే సీత దగ్గరకు బయల్దేరాడతను. ఆమె పేర బాంకులో ఏడు వందల రూపాయలున్నాయి. అవి అడిగి తీసుకొంటే కొంత వరకూ ఫరవాలేదు. అవి అయిపోయాక --- అప్పటి విషయం అప్పుడు చూసుకోవచ్చు. ఈ ఏడాదిన్నరలోనూ మామయ్యకు ఒక్క దమ్మిడి కూడా పంపనే లేదు తను. అలా అనుకుని సీత వద్దకు వచ్చెడతను.
    "ఎలా వుంది మీ మామయ్యగారికి?" అతన్ని చూడగానే అడిగిందామె.
    "హాస్పిటల్లో చేర్చాను. కనీసం నెల రోజులయినా హాస్పిటల్లో ఉండాలన్నారు."
    "మరి .........అయన దగ్గర ఎవరుంటారు?"
    అత్తయ్య వాళ్ళను తీసుకెళ్ళి ఓ అద్దె ఇల్లు తీసుకొని అక్కడ వుంచాను. వాళ్ళ దగ్గర డబ్బేమీ లేదు. మామయ్య క్షేమంగా హాస్పిటల్ నుంచి ఇంటికి రావాలంటే కనీసం ఓ వెయ్యి రూపాయలయినా వాళ్ళకి అవసరం ఇప్పుడు" సీత వంక చూస్తూ అన్నాడతను. ఆ చూపులోనే అతని అభిప్రాయం సీతకి అర్ధమయిపోయింది.
    ఇప్పుడు తన అకౌంట్ లో ఉన్న డబ్బంతా అతనికిచ్చేయాలి. ఇదే అతని క్కావలసింది . కానీ,  అదంతా తను సంపాదించుకొన్న డబ్బు! ఆ డబ్బు తను కూడబెట్టటానికి కారణాలున్నాయి. తను చాలా రోజులనుంచీ కలలు కంటున్నా డేకోలం మంచాలు కొనాలి. ఇప్పుడు ఈ డబ్బు కాస్తా వాళ్ళ కిస్తే ఇక తను వాటి గురించి పూర్తిగా మర్చిపోవాల్సిందే. ఎలాగూ ఈ డబ్బు తిరిగి వచ్చేది కాదు. నిజమే వాళ్ళు ఆయనకు సహాయం చేశారు. తల్లిదండ్రులు పోయిన దగ్గిరనుంచి పెంచి పెద్ద చేశారు. దానికి అయన ఋణపడి ఉండాల్సిందే. కాని తను కూడా వారికి ఋణపడి వుండాలను కోవడం తన డబ్బంతా వారికి ఇవ్వాలనుకోవడం తనకి నచ్చని విషయం.
    "ఇప్పుడెం చేయ్యదల్చుకొన్నారు మరి?" తనకేమీ సంబంధం లేనట్లు అడిగిందామె.
     "అదే అర్ధం కావటం లేదు" ఇబ్బందిగా అన్నాడతను. ఆమె తనంతటతానే డబ్బు తీసుకోమని ముందు కోస్తుందేమోనని ఆశించాడతను.
    సీత మట్టాడలేదు. ఏదో పుస్తకం తీసుకొని చదువు తున్నట్లు నటించసాగింది. తనే ఆ విషయం చెప్పక తప్పదని నిర్ణయించుకొన్నాడతను. సీతకు తన మనోభావం అర్ధం కాకుండా ఉంటుందా? అయినా మౌనం వహించిందంటే ఆమెకు డబ్బివ్వటం ఇష్టం లేదనే అనుకోవాలి.
    "పోనీ , ప్రస్తుతం నీ దగ్గరున్న డబ్బు వాడదాం సీతా! తర్వాత చూసుకోవచ్చు. మిగతా డబ్బు సంగతి" అయిష్టంగానే మాట్లాడతను.
    సీత చివుక్కున తలెత్తి అతని వంక చూసింది. ఆ చూపులో చాలా అర్ధాలున్నాయి.
    "సరే తీసుకోండి' అంది కోపం అణచుకుంటూ.
    ఆమె మాటలు అతనికి అసంతృప్తిని కలిగించాయి. డబ్బివ్వడం మనసు కిష్టం లేకపోయినా , కనీసం ఆ విషయం తనకు తెలీకుండా ఉంచడానికి ప్రయత్నిస్తే తను సంతోషించేవాడు.
    "నీకు కోపంగా ఉంది కదూ. నీ డబ్బు తీసుకుంటున్నానని?" అడిగాడతను.
    "కోపమెందుకూ? అయినా ఇది నాడబ్బెందుకయిందీ? అంతా మీది కాదా?" విసురుగానే అందామె.
    "నీ డబ్బు నీకు మళ్ళీ ఇచ్చేస్తాను సీతా! ప్రస్తుతం మరొకరి దగ్గర తీసుకొచ్చే సమయం లేదు. కనుక - తీసుకోవాల్సి వస్తోంది! అంతే!"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra