Home » Dr c. ananda ramam » Suryanethram


    నృసింహస్వామికి బలి అనేది ఎక్కడా వినలేదు. ఈ పూజా విధానంలో "తంతు" అనేది ఎలా పెరుగుతుందో ఎవరూ ఊహించలేరు. నిజానికి ఏ పూజలోనైనా ఏకాగ్రమైన ధ్యానం ప్రధానం. ఆ ధ్యానానికి ఆలంబనంగా తాము ఏ శక్తిని ధ్యానిస్తున్నారో, ఆ లక్షణాలుండే విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవటంతో విగ్రహారాధన ప్రారంభమయింది.
    ఆ తరువాత ఎవరి ఆచార వ్యవహారాలకు తగినట్లుగా వారు ఆర్ధిక స్థోమత బట్టి ఈ తంతు పెంచుకుంటూ పోయారు. దీనికి ప్రధానం పురోహిత బ్రాహ్మణులు కారణమంటారు. ఇక్కడి అడవి జాతులవారికి గొర్రెలని బలి ఇస్తేకాని పూజ పూర్తయినట్లు కాదు. ఆ నైవేద్యాలు మళ్ళీ వాళ్ళకే గదా!
    నృసింహస్వామి గర్భాలయం గోడలమీద దశావతార శిల్పాలున్నాయి. ఇక్కడ మత్స్యావతారాలు ఎక్కువగా లేకపోవటం గమనించాడు రవి.
    గర్భాలయం లోపలి భాగంలో పాతకాలపు జరీ పని ఉన్న తివాసీల పైన నృసింహస్వామికి అటు వైపూ, ఇటువైపు కూర్చుని వున్నారు యజ్ఞనారాయణ్, దేవనారాయణ్ కుటుంబాలవారు. ఆ లోకాలలో ఏమో కాని, ఈ లోకంలో మాత్రం దేవుడికి దగ్గిర సీట్ వి.ఐ.పి. లకే?
    నృసింహస్వామి కనపడడం లేదు. విగ్రహమంతా రకరకాల పూల దండలతో కప్పబడి ఉంది. పూజారి ఏవో మంత్రాలు చదువుతున్నాడు గొంతు చించుకుని.
    "లక్ష్మీ నృసింహ! మమదేహి కరావలంబం"
    అసంకల్పితంగానే రవి మనసు నిశ్శబ్దంగా పలికింది ఆ ప్రార్థన! దేవుడిలో నమ్మకంలేని తన మనసు ఆ ప్రార్థన పలకటం అతనికే గమ్మత్తుగా తోచింది! మనకు తెలీకుండానే మనలో జీర్ణించుకు పోతాయి సంస్కారాలు.
    పూజారి దేవుడి మీద దండలు తీసి, విగ్రహానికి దగ్గిరలో ఉన్న ప్రముఖులకి పంచుతున్నాడు. ఒక దండ దేవుడికి బాగా దూరంలో ఉన్న రవి మీద వచ్చి పడింది. విభ్రాంతితో చూశాడు అటువైపు! అనిల కళ్ళు నవ్వుతున్నాయి. చూపు తిప్పుకోలేకపోయాడు ఆ కళ్ళమీద నుంచి. దేవనారాయణ్ కుటుంబ సభ్యుల మధ్య కూర్చుని తన మీదికి దండ విసిరిందా ఈ అమాయకంగా కనిపించే సాహసి?
    అతనికి భయం వేసింది. గర్వం కలిగింది.
    ప్రయత్నం మీద చూపు తిప్పుకున్నాడు. నృసింహస్వామి మీద పడింది అది. దండలన్నీ తీసి అందరికీ పంచటం వల్ల విగ్రహం స్పష్టంగా కనిపిస్తోంది. నృసింహస్వామి తోడ మీద విగ్రహం...ఎవరిది?
    పోల్చుకోవటానికి కొన్ని క్షణాలు పట్టింది. లక్ష్మీ! చెంచు లక్ష్మీ! చెంచిత వేషంలో ఉన్న లక్ష్మీదేవి. విక్రమాదిత్యుడు అప్పుడు నృసింహస్వామిలో కూడా చెంచుదొర ఆనవాలు కనిపించాయి. సింహం తలలా ఉన్న ఆ ముఖంలో ఏదో విలక్షణత? ఏమిటది? జాగ్రత్తగా పరిశీలిస్తే అర్థమయింది.
    ఆ ముఖంలో ఒక కన్ను సూర్యబింబం! మరో కన్ను చంద్రబింబం. ఈ విభేదం తెలియటానికే ఒక కన్ను తీక్షణంగానూ, మరో కన్ను ప్రసన్నంగానూ చెక్కాడు శిల్పి.
    సూర్యచంద్రులే విష్ణుమూర్తి నేత్రాలనే ఆధ్యాత్మిక భావనతో చెక్కిన శిల్పం ఇది! ఆ శిల్పాన్ని అలాగే చూస్తోంటే, మెరుపులా స్ఫురించింది. సూర్యనేత్రం శిల్పం కింద ఉన్న సమస్యలోని మొదటి వాక్యం.
    "చెంచు దొర ఒక కన్ను పశ్చిమాన తెరచుకున్నప్పుడు..."
    కాలిబాట పక్కన ఒకవైపున వరసగా పాతకంబళ్ళు పరచుకుని కూర్చున్నారు. గాజుల బేహారీలు, అడవుల మధ్య ఉంటున్నా, ఆడవాళ్ళకి అలంకారాల మీద మోజే!
    ఒక్కొక్క బేహారీ చుట్టూ గుంపులు, గుంపులుగా మూగుతున్నారు. ఆడవాళ్ళు గోటులున్న గాజులు (చెమ్కీ ఉన్న గాజులు) ఎంచుకుని వేయించుకుంటున్నారు. ధగధగలకి మోసపోకూడదని వాళ్లకి తెలీదు. ఎప్పటికప్పుడు కృత్రిమాల వలలో పడటమే వాళ్లకి అలవాటు. మోసపోతూ కూడా మోసపోతున్నామని తెలీని మూర్ఖులు.
    ఒక గాజుల బేహారీ దగ్గిర తనకి కావలసిన గాజులు ఎంచుకోకే తంటాలు పడుతోంది పదహారేళ్ళ గిరిజన కన్య. ఇప్పుడిప్పుడు వాళ్ళూ నాగరికంగానే ఉంటున్నారు. అందులోనూ నవతరం ఆధునిక వేషాలను బాగా అనుకరిస్తున్నారు.
    ఆ అమ్మాయి అద్దకం నేత పరికిణీ కట్టుకుంది. పట్టంచు రవిక తొడుక్కుంది. చవకరకం నైలాబ్ బట్ట వోణీగా వేసుకుంది. వదులుగా జడ వేసుకుని రిబ్బన్ పువ్వులా కుచ్చు పెట్టుకుంది. ముఖం మీద పౌడర్ లేదు. బొట్టూ, కాటుకా వున్నాయి. తీరుగా ఛామనఛాయలో ఉన్నా చక్కని అంగసౌష్టవంతో కళకళ లాడుతూ ఉంది.
    "తాతా! నాకీ గాజులు బావుంటయ్యా?" ఆకుపచ్చ గాజులు చూపించి అడిగింది.
    "అవి బాగుండవు. ఎర్రవి బాగుంటాయి. వాటిపైన నగీషీ బాగుంది." ఆ అమ్మాయినే చూస్తూ కొద్ది దూరంలో నిలబడ్డ రవి చెప్పాడు. ఆ పిల్ల గతుక్కుమని, రవివైపు ఓరగా చూసి పైట సర్దుకుంది. కోపంగా చూడబోయిన ఆ అమ్మాయి పెదాలమీదకు నవ్వు వచ్చెయ్యటంతో చటుక్కున తలదించుకుంది.
    "ఈ ఎర్రయ్యేనా? ఇంకేం లేవూ?"
    "ఆ ఊదా రంగువి కూడా బాగున్నాయి. నీ చేతికి బాగుంటాయి."
    "ఆటికి గోట్లు లేవు"
    "పోనీ, ఆ లేత నీలంవి తీసుకో! నీలం మీద తెల్ల చుక్కలు బాగున్నాయి. చమ్కీ పూతల కంటే ఇవే బాగుంటాయి."
    "అవి మరీ సన్నగున్నాయ్. పని పాటలు సేసుకునేటోళ్ళం ఇట్టే పుటుక్కుమంటయ్! పోనీ, ప్లాస్టిక్ గాజులున్నాయా"
    "ప్లాస్టిక్ వి వద్దు. మంట దగ్గిరకెళ్తే ప్రమాదం. అదీగాక కొందరి వంటికి ప్లాస్టిక్ పడదు. ప్లాస్టిక్ గాజుల్లో కళ వుండదు. ఆ గాజుల చేతులు చక్కగా గలగలలాడవు. ఆ చిలకపచ్చని చూడు, మరీ సన్నగా లేవు. అందంగా ఉన్నాయ్. డబ్బు కావాలంటే నేనిస్తాను."
    "ఛీ బొత్తిగా సిగ్గూ, లజ్జా లేదు"
    వెనుకనుంచి వినపడ్డాయి మాటలు. గిర్రున వెనక్కి తిరిగాడు. అనిల! ఎప్పటినుంచి వచ్చి నిలబడి ఉందో?
    ఆ గిరిజనుల అమ్మాయి రవి వంక వాలుగా చూస్తూ గాజుల బేహారీని అడుగుతుంటే రవి సమాధానాలు చెప్తున్నాడు. గాజుల బేహారీ నవ్వుకుంటూ చూస్తున్నాడు. వాళ్ళిద్దరినీ అమాయకురాలైన ఆ అమ్మాయితో అలా సంభాషణ జరపటం రవికి చాలా సరదాగా ఉంది.
    అనుకోకుండా అనిలని చూసి మొదట గతుక్కుమన్నాడు. గిరిజనుల అమ్మాయితో అల్లరి చేస్తూ దొరికిపోయినందుకు సిగ్గుపడ్డాడు. కానీ, అంతలోనే కోపమూ వచ్చింది! ఈవిడెవరు, తనను చీదరించుకోవటానికి? దేవనారాయణ్ రమ్మనగానే కీ ఇచ్చిన మరబొమ్మలా వెళ్ళి అతడి పక్కన కూర్చున్న వ్యక్తికి తన చిలిపి అల్లరిని విమర్శించే అధికారం ఎవరిచ్చారు?
    "మీకే లేదు సిగ్గూ, లజ్జా! అనవసరంగా నా విషయాల్లో కల్పించుకుంటున్నారు?"
    అనిల దేవనారాయణ్ పక్కన కూర్చుని జీప్ లో వెళ్ళినప్పటినుంచీ తన మనసులో రగులుతోన్న కసినంతా ఆ మాటల్లో గుమ్మరించాడు.
    "మీకు ఇక్కడివాళ్ళ సంగతి తెలీదు. ఆ అమ్మాయికి గాజులు కొనుక్కోటానికి డబ్బులిస్తానంటున్నారు. ఆ మాటలు వాళ్ళెవరన్నా వింటే! మీకు ఇక్కడికిక్కడే దేహశుద్ధి చేసేస్తారు. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది. సిగ్గూ, లజ్జా ఎవరికి లేవో?"
    కొద్దిగా జంకాడు రవి. కానీ అది బయటపడనివ్వలేదు!
    "నాకెందుకు దేహశుద్ధి చేస్తారు ఎవరైనా? నేను ఆ అమ్మాయితో మాట్లాడుతున్నానా? ఆ అమ్మాయికి డబ్బులిస్తానన్నానా?"
    "ఒక రోడ్ సైడ్ రోమియోలాగా మాట్లాడుతున్నారు. బాధ్యతగల యూనివర్శిటీ రీడర్ నోటినుంచి రావలసిన మాటలేనా ఇవి?"
    "రీడర్ని యూనివర్శిటీలో! బయట నేనూ మామూలు మొగవాణ్నే!"
    "అందరిలో ఉండే అల్లరీ ఉత్సాహమూ, చిలిపితనమూ, హుషారు నాలోనూ ఉంటాయి. మీరేమీ అనుకోకపోతే నేనొక మాట అంటాను!"
    "ఏమిటది?"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra