Home » Kommanapalli ganapathi rao » Pranaya Prabamdham


    నిజమే! క్విజ్ కాంపిటీషన్ లో పార్టిసిపెంట్స్ ఎంట్రీస్ ని అందించడానికి మిగిలింది మరో రెండు గంటలు మాత్రమే.
    
                                                              * * *
    
    "మీరా?" నిశ్చేష్టుడిలా చూశాడు ఆదిత్య.
    
    కింగ్ జార్జి హాస్పిటల్ కార్డియాలజీవార్డుకి అభిముఖంగా నిలబడ్డ ఆదిత్య ప్రణయ అక్కడికి రావడంతో ఆశ్చర్యపోయాడు.
    
    ఉదయం పదకొండు గంటల సమయాన హాస్పిటల్ చాలా సందడిగా వుంది.
    
    అప్పటికి సరిగ్గా పధ్నాలుగు గంటలుగా నిద్రాహారాలు మాని నాన్నమ్మ ఆరోగ్యం కోసం కలవరపడుతున్న ఆదిత్య, మానసికంగా ఎంతనలిగిపోతున్నదీ అర్ధంచేసుకుంటూ అడిగింది మీ "నాన్నమ్మగారికెలాగ వుంది?"
    
    "టెస్ట్ రిజల్ట్స్ ఇంకా రాలేదు" నెమ్మదిగా అన్నాడు.
    
    ఆదిత్యకి జ్ఞానం తెలిశాక నాన్నమ్మ విషయంలో ఇలా ఆందోళన చెందడం ఇదే తొలిసారి.
    
    వయసు ఉడిగినా యంత్రంలా ఉత్సాహంగా కదులుతూ తమకే ఆసరా కాగలిగింది కానీ, ఏ రోజూ మంచం పట్టి ఎరగని మనిషామె.
    
    తల్లిదండ్రులు లేని లోటు  ఇంతకాలం తెలీకుండా పెంచిందే తప్ప వున్నట్టుండి ఆ లోటేమిటో యిప్పుడే తెలిసేట్టు చేస్తుంటే దిక్కుతోచనట్లు కంగారు పడుతున్నాడు.
    
    అతడు పెరిగింది చాలా చిన్న ప్రపంచంలో అక్కడ లేమి వున్నా దాని వునికికి అర్ధంలేకుండా చేసింది లక్ష్మమ్మ చాలా సమస్యల్ని చిరునవ్వుతో గెలుస్తూ బ్రతుకుని ఒక స్ఫూర్తిగా మార్చి ఇన్నాళ్ళూ ఇద్దర్నీ బ్రతికించుకుంది.
    
    "అంతా సవ్యంగా జరిగిపోతుందని ఆశిద్దాం" నిర్లిప్తంగా అంది ప్రణయ.
    
    క్షణాలు భారంగా గడుస్తున్నాయి.
    
    "మనిషి పెరగడానికి పెద్ద ఉద్గ్రంధాల ఆసరా అక్కరలేదు ఆదిత్యా! మీ నాన్నమ్మలాంటి ఒక వ్యక్తి సంపర్కముంటే చాలు."
    
    అప్పటికీ ఆదిత్య మాట్లాడలేదు.
    
    "ఇనెవిటబుల్ ఇష్యూస్ అంగీకరించాలి తప్ప కాదని కుమిలిపోయినా ఫలితం శూన్యం పరిష్కరించలేని సమస్య ఏర్పడినప్పుడు ఇట్ కెనాట్ బి ఆదర్ వైజ్ అనుకోవాలి."
    
    "కానీ నాకీ ప్రపంచంలో చాలా ప్రశ్నలకు జవాబులా కనిపించింది నాన్నమ్మ మాత్రమే" ఓ పసికందులా కంపించిపోతున్నాడు.
    
    "FOR EVERY AILMENT UNDER THE SUN
    THERE IS A REMEDY OR THERE IS NONE
    IF THERE BE ONE TRY TO FIND IT
    IF THERE BE NONE NEVER MIND IT"
    
    ఓ రైమ్ ని గుర్తుచేసుకుంటూ నిర్వేదంగా అంది ప్రణయ. "మీకు తెలియదని ఈ రైమ్ ని చెప్పలేదు ఆదిత్యా! ఇట్స్ లైఫ్. యథాతథంగా అంగీకరించాలి" ఆమె జాప్యం చేయలేదు. అడగాలనుకున్న విషయానికి సూటిగా వచ్చింది. "ఇదంతా ఎందుకు చెబుతున్నానూ అంటే మీరు కాంపిటీషన్ లో పాల్గొనడం లేదని సూరి చెప్పగా తెలిసింది."
    
    "ఇష్టం లేదు అందులోనూ ఈ స్థితిలో పార్టిసిపేట్ చేయడానికి అసలు మనస్కరించడం లేదు."
    
    "అన్నిటినీ మనసులోకి తీసుకుంటే అవకాశాలు చేజారిపోతాయి. ఏడాది పొడుగునా చదివాక తలనొప్పిగా వుందని ఎగ్జామ్ కి వెళ్ళడం మానేయం."
    
    "కానీ ఇది తలనొప్పిలాంటి సమస్యకాదు."
    
    "కావచ్చు మీరు ఇక్కడ వుండి చేసేదేముంది?" నిజాయితీగా నచ్చచెప్పింది. "పేషెంట్ కి కావాల్సింది డాక్టర్ల పర్యవేక్షణ. మీ మనోవేదన కాదు."
    
    "కానీ..."
    
    "మిస్టర్ ఆదిత్యా! నాకు తెలుసు మీరు చేయాల్సింది నేను చెప్పడమంత సులభం కాదని. కాని ఒక్క విషయం మీ జీవితం కూడా వడ్డించిన విస్తరికాదు. ఎప్పుడో గతి తప్పాల్సిన స్థాయి నుంచి మీ నాన్నమ్మగారి మూలంగా ఈ స్థాయిదాకా నడిచింది. అసలు ఇంతకాలమూ ఆమె సాగించిన పోరాటం కూడా మీ పురోభివృద్దికోసమే తప్ప పతనానికి కాదుగా? ఒక వేళ తన అనారోగ్యం మీ అవకాశాన్ని ఇలా దెబ్బతీసిందని తెలిస్తే ఆమె మాత్రం హర్షిస్తుందనుకున్నారా?"
    
    "అసలు ఈ కాంపిటీషన్ అంత ముఖ్యమెలా అవుతుంది ప్రణయా?"
    
    "ఒక చిన్న గెలుపు చాలా గెలుపులకుకరణమవుతుంది. ఒక్కోమారు జీవితాన్నే మలుపు తిప్పుతుంది అసాధారణంగా ఆదిత్యా! మీ మీద మరొకరికి ఎంత అధికారం వుందో నాకు తెలియదు కాని, అసలు మీ పేరు ఇన్ క్లూడ్ చేయడంకోసం ఎన్ని వందలమంది విద్యార్ధులు పోరాడారో మీరు వూహించలేరు. కారణమున్నా కాని వాళ్ళందర్నీ నిరాశపరిచే హక్కు మీకు లేదు  ప్లీజ్! నా మాట వినండి."
    
    నిశ్శబ్దంగా వుండిపోయాడు.
    
    "కౌంట్ యువర్ బ్లెస్సింగ్ నాట్ ట్రబుల్స్ డోంట్ ట్రైటు సాది సాడెస్ట్....ప్లీజ్ థింకోవర్..."
    
    అది అభ్యర్ధనలా వున్నా అందులో అణువంత అధికారం వుంది. అంతకు మించిన ఆత్మీయత వుంది.
    
    "ఎంట్రీ ఫారం సైన్ చేస్తే నేను హాండోవర్ చేస్తాను. మిగిలింది అరగంట వ్యవధి."
    
    అప్పుడు చూశాడు టైం పదకొండున్నర కావస్తోంది.
    
    "సరే!" ఎంట్రీ వరకు అభ్యంతరం కూడదనిపించి "మరి పార్టనర్ గా మీరుంటారా?" అన్నాడు.
    
    అసంకల్పితంగా ఆదిత్య పార్ట్ నర్ అంటూ ఆమెను అడ్రస్ చేయడంతో ఉలిక్కిపడింది.
    
    ప్రబంధతో పాటు సుధీర్ పార్టిసిపేట్ చేస్తున్నాడుగా? అలా మీరు నాతో కలిసి క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొనాలి.
    
    "నేనా?"
    
    "అంతలా మీరు ఆశ్చర్యాన్ని ప్రకటించనక్కరలేదు. మీరూ ఆ ట్రాక్ లోనే వున్నారుగా?"

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra