Home » Yandamuri veerendranath » ధ్యేయం


    "హాయ్ వరూధిని, కాలేజీకా కమాన్" కైనెటిక్ హొండా ఆపుచేస్తూ అన్నాడు. సుభాష్. బ్లూ కలర్ జీన్ ప్యాంట్, మోకాలి దగ్గర లవ్ సింబల్ లో ఎరుపురంగు రెక్జిన్ క్లాత్ కుట్టబడి, దానిమీద 'ఐ లవ్యూ' అని రాసి వుంది. కొబ్బరినూనె రాసుకోకపోవడంవల్ల జుట్టు చిందరవందరగా రేగిపోయి వుంది.

    "కాలేజీకే..... ఆహా కాదు......." తడబడింది వరూధిని.

    కాలేజీలో బెంచీలమీద కూర్చుని లెక్చరర్స్ చెప్పే లెసన్స్ వింటే ఈ కోపం పోదు. ఏదో  చెయ్యాలి.

    ఆమెకి రజనీ గుర్తొచ్చాడు. అతని పెళ్ళాం ఏమంత అందంగా వుందని చేసుకున్నాడు.....అప్పుడేమో తన వెనకాలపడి ఎంతో ఇష్టమనీ, ప్రేమనీ కోతలు కోశాడు. ఆ రాజేశ్వరి తాన్ కాలి గోటికి సరిపోదు. అయినా ఇప్పుడామె కొంగుపట్టుకు తిరుగుతున్నాడు.

    "వరూధిని....... వరూధిని...... ఏమిటలా రోడ్డుమీద నిలబడి డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయావ్?" పిల్చాడు సుభాష్.

    "ఓహ్.......సారీ" ఈ లోకంలో కొచ్చింది వరూధిని. ఆమె కళ్ళలో కదులుతున్న నైరాశ్యం నీడల్ని పసిగట్టాడు సుభాష్.

    "ఏమిటీ ఏదైనా ప్రాబ్లమా? పెద్దవాళ్ళేమైనా అన్నారా? ఈ పెద్దవాళ్ళకి బుద్ధిలేదు వరూధిని. వాళ్ళేదో అంటూనే వుంటారు. మనం డోంట్ కేర్ అనాలి. కాస్త సరదాగా బయట తిరగనివ్వరు. ఇంటికి కొంచెం ఆలస్యంగా వస్తే లక్ష ఆరాలు తీస్తారు. నీ అంత అందమైన మొహంలో డల్ నెస్ చూసి  నాకు బాధగా  వుంది" తల్లిదండ్రులు ఏదైనా అన్నారేమోనని అంచనావేసి అతను అన్న మాటలవల్ల వరూధిని పెద్దగా రియాక్ట్ కాలేదు. కారణం వరూధిని పేరెంట్స్ అదుపాజ్ఞల్లో పెట్టేవాళ్ళు కాదు. అయితే అతనన్న చివరిమాటకి ఆమె కళ్ళల్లో కాంతి వచ్చింది.

    "నిజంగా.......నిజంగా నేను అందంగా వుంటానా?" అని అప్రయత్నంగా అడిగింది.

    "మన కాలేజీయే కాదు, ఈ అంధ్రప్రదేశ్ కాదు. సౌత్ ఇండియా హీరోయన్స్, బాలీవుడ్ హీరోయిన్స్ నీముందు దిగదుడుపే. అసలు నీతో మాట్లాడాలని ఎంత  ప్రయత్నం చేస్తున్నానో నీకు తెలీదు. నీ ఫోటో ఒకటి అడగాలని కొన్ని లక్షలసార్లు అనుకున్నాను. ప్రతిక్షణం నీ పేరే తల్చుకుంటుంటాను". కొంచెం ఎడ్వాన్స్ అయ్యాడు సుభాష్.

    "అయితే ఆ రజనీకాంత్ ఎందుకలా చేశాడు?' చాలా అనాలోచితంగా ఆ మాటలు పైకి అనేసింది వరూధిని. చిన్నతనం నుండి పిల్లలకి ఒక వ్యక్తిత్వం అంటూ ఏర్పరచడంలో శ్రద్ధ వహించక తల్లిదండ్రులు ప్రదర్శించే నిర్లక్ష్య వైఖరికి  ప్రాక్టికల్ ఉదాహరణ వరూధిని. ప్రతి విషయమూ, చివరికి ఇంటి సంగతులు కూడా 'ప్రాణ స్నేహం' పేరిట స్నేహితురాళ్ళతో చర్చించే సాధారణ అమ్మాయికి  భిన్నంకాదు వరూధిని. మనం మన ఓ  'ఉచిత సలహా' పారేసే అవకాశం కల్పిస్తున్నామని చాలామందికి తెలీదు. అలా సలహా ఇవ్వడం ద్వారా మన  మీద  అధికారం సంపాదించే అవకాశం ఇస్తున్నామని కూడా చాలామంది గుర్తించరు. ముఖ్యంగా తల్లిదండ్రులకి దూరంగా, హాస్టల్ లో వుండి చదివేవారికి ఈ అలవాటు ఎక్కువ వుంటుంది. ఏ విషయాలు మనసులో వుంచుకోవాలో, ఏ  విషయాలు ఎవరితో పంచుకుని సమస్య పరిష్కరించుకోవాలో తెలియనితనం వయసుతోపాటు పోకపోతే అది చాలా దురదృష్టకరమైన విషయం.

    సమస్యలు అందరికీ వుంటాయి. సమస్యలు లేని మనిషే వుండడు. కానీ ఆలోచించే మెదడునిబట్టి ఆ సమస్యలోని డెప్త్ వుంటుంది.

    "పూర్ వరూధిని, ఎవడో యూస్ లెస్ ఫెలో నీ మనసు పాడుచేసినట్టున్నాడు. ఆత్మీయులకి ఏదైనా బాధ కలిగితే, ఆ ఆత్మీయుల  ఆత్మీయులకు కూడా  బాధ కలుగుతుందంటారు. ఇక నేనుకూడా ఏ పనిమీద కాన్ సన్ ట్రేట్ చేయలేను. సో. ఈ రోజు మనం  కాలేజీకి వెళ్ళడంలేదు. నీ బాధని పొగొట్టడానికి నా సర్వశక్తులా  ప్రయత్నిస్తాను. కాసేపు అలా వెళ్ళి ఇందిరా పార్కులో కూర్చుందాం. కమాన్  సిడౌన్" చెప్పాడు సుభాష్.

    మౌనంగా కూర్చుంది వరూధిని. ఏమీ ఆలోచించే స్థితిలో లేదు. తన అందాన్ని రజనీకాంత్ ధిక్కరించాడన్న గిల్టీకాన్షస్ నెస్ తో కృంగిపోతున్న  వరూధినికి సుభాష్ ఓదార్పు అమృతపు జుల్లులా హృదయాన్ని తాకుతోంది. వేదన కొంచెం దూరమైనట్టుంది.

    సుభాష్ మరోవిధంగా ఆలోచిస్తున్నాడు. అమ్మాయి ప్రస్తుతం వేడిగా వుంది. కారణాలు అనవసరం. అడగటం, వినటం అన్నది ఫార్మాలిటీయే. కాసేపు పార్కులో కూర్చోబెట్టి కబుర్లు చెప్పాలి. అప్పుడు పూర్తిగా లైన్ లో కి  వచ్చేస్తుంది. తరువాత ఏ హొటల్ లోనో భోజనం చేసిన తరువాత పరిస్థితిని  బట్టి మిగతా కార్యక్రమం ఆలోచించాలి.

    కనీసం నామమాత్రంగానైనా పార్కుకి వెళ్ళడం గురించి మొదట్లో అభ్యంతరం పెడుతుందనుకున్నాడు సుభాష్. కానీ ఏ విధమైన వ్యతిరేకతా వరూధినిలో కనబడలేదు.

    వెనుక మెత్తగా తగులుతున్న ఆ అమ్మాయి స్తనద్వయం, సుభాష్ హృదయాన్ని గిలిగింతలు పెడుతోంది. కొత్తగా విరుస్తున్న కన్నెతనంలోని అందాల్ని అనుభవించడంలో గొప్ప థ్రిల్ వుంది. "తంతే బూరెల గంపలో పడటం' అంటే ఇదే కాబోలు అనుకున్నాడు. అసలు కాలేజీకని బయలుదేరలేదు. వరూధినిని చూసిన తరువాత ఆ మాట ఆమెకోసం అనడం జరిగింది.

    అయినా సుభాష్ తొందరపడదల్చుకోలేదు. ఆడవాళ్ళు అంత ఈజీగా వలలో డిపోరని తెల్సు. కంగారుపడి మీద చెయ్యివేస్తే సాచిలెంపకాయ కొట్టిందంటే కథ అడ్డం తిరుగుతుంది. ఏ వాహనానికైనా స్టెఫినీ టైర్  కావాలి. ఈ వరూధినిని కూడా ట్యూన్ చేసి పెడితే ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు.

    కావాలని సడన్ బ్రేక్  వేశాడు. వీపుకి వరూధిని బలంగా వచ్చి తగిలింది.

    "ఐ యమ్ సారీ వరూధిని" అన్నాడు.

    ఆమె సర్దుకుని కూర్చుంది. కొంచెం ఆగి "నాకు ఏదైనా ఫ్రాంక్ గా మాట్లాడటం అలవాటు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నీ బ్రెస్ట్ పెద్దదిగా వుంది" ఇంజక్షన్ చేసిన  తరువాత డాక్టర్ పేషెంట్ రియాక్షన్ గమనిస్తున్నట్లు వ్యూ ఫైండర్ లోంచి వరూధినినే గమనిస్తూ అన్నాడు సుభాష్.

    వరూధిని బుగ్గల్లో ఎర్రగులాబీ మొగ్గలు ప్రత్యక్షం అయినాయి. కళ్లు పత్తిపువ్వుల్లా విచ్చుకున్నాయి.

    తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు సుభాష్. ఇంత సులభంగా వ్యవహారం పూర్తవుతుందనుకోలేదు. 'అమ్మాయి లందరూ యిలాగే వుంటే మాలాంటి కుర్రాళ్ళకి ఒక్కరోజు కూడా తీరికుండదు' అనుకున్నాడు. కానీ ప్రతి అమ్మాయి తల్లిదండ్రులు వరూధిని తల్లిదండ్రుళ్ళా వుండరని సుభాష్ కి తెలియదు.

    ఇందిరాపార్కు వచ్చింది. గేట్ కి పదిగజాల దూరంలో వున్న రేకుల షెడ్ లో స్కూటర్ పార్క్ చేసి, టోకెన్ తీసుకుని రూపాయిచ్చాడు. ఇద్దరూ లోపలి నడిచారు.

    ఉదయం అవ్వడంవల్ల పార్కులో    అంత సందడి లేదు, అక్కడక్కడా ఒక్కళ్ళిద్దరు తప్ప ఎవరూ లేరు. "మళ్ళీ హొటల్ కెందుకు దండగ. ఇక్కడే ఆ పనికూడా పూర్తి చేసుకుంటే బావుంటుంది" అనుకున్నాడు సుభాష్. పార్కుకి ఆనుకునివున్న రామకృష్ణమఠంలోంచి ప్రార్థనలు వినబడుతున్నాయి. ట్యాంక్ బండ్ మీదనుండి డబుల్ డెక్కర్ బస్ వెళుతోంది.

    మొగలి పొదలు దట్టంగా పెరిగిన స్పాట్ దగ్గర ఆగాడు సుభాష్. చాలా  చల్లగా కూడా వుంది. పొడుగయిన అశోకచెట్లు వుండటంవల్ల ఎండ అసలు రావటం లేదు.

    "ఇక్కడ కూర్చుందామా?" అడిగాడు. కొంచెం దూరం ఆలోచించి ఆ ప్లేస్  సెలక్ట్ చేశాడు సుభాష్. లోపల మనుషులున్నట్టు ఎవరికీ కనబడే అవకాశం లేదు.

    "మొగలి పోదలున్న చోట పాములుంటాయి కదా?" అనుమానంగా అడిగింది. సుభాష్ పాముకన్నా ప్రమాదకరమైన వాడని ఆమెకి తెలియదు.

    "డోంట్ వర్రీ. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు" నవ్వుతూ కూర్చున్నాడు. వరూధిని రెండడుగుల దూరంలో వుంది.

    "సో, నౌ టెల్ యువర్ స్టోరీ" చేతులు వెనక్కి చాపుతూ  అడిగాడు.

    ఒక్క క్షణం ఆలోచించింది వరూధిని. మనసు వూగిసలాడుతోంది. తన  అందాన్ని మెచ్చుకున్న  సుభాష్ కి, రజనీకాంత్ తనని చిన్నచూపు చూశాడు. చెప్పాలా? వద్దా? అన్న సందిగ్థావస్థ. తన మొదటి లవ్ అఫైర్ గురించి చెప్తే  సుభాష్ ముందు  తన వేల్యు డౌన్ అయిపోతుందేమోనన్న అనుమానం వస్తోంది.

    "సీక్రెట్ అయితే చెప్పోద్దులే. అంటే నువ్వు నన్ను ఆత్మీయుడిగా గుర్తించడం లేదన్నమాట" మొహంలో విచారం కనపరుస్తూ అన్నాడు. ఆమె  కరిగిపోయింది. అంతా చెప్పింది.

    "మీ మామయ్య ఒక ఫూల్. అలాంటి వాడికోసమా నువ్వు బాధ పడుతున్నావ్? బట్, దట్ ఫెలో డన్ ఎ గ్రేట్ ఫేవర్ ఫర్ మి. నేను ప్రేమించిన అమ్మాయిని నాకే వదిలిపెట్టి చాలా మంచిపని చేశాడు" దూరాన్ని ఒక అడుగుకి తగ్గించాడు.

    ఇప్పుడు చేయికి అందేంత దూరంలో వుంది. "ఆ ఫూల్ ని పొగడకు తల్చుకుంటేనే ఒళ్ళు మండుతోంది" అంది.

    "అంత కోప్పడకు డియార్. నువ్వెంత అందంగా వుంటావో నాకు  తెల్సు. మీ మామయ్య కళ్ళమీద నాకు అనుమానంగా వుంది. మంచి కంటి డాక్టరుకి చూపించుకొమ్మని సలహా ఇవ్వు" అడుగు దూరాన్ని జీరో చేశాడు సుభాష్ ఆమె చేతిమీద చేయివేస్తూ.

    ఆ ఓదార్పుకి అతని వొళ్ళో వాలిపోయింది వరూధిని. చెట్టుమీద నుండి వస్తున్న గాలి చల్లదనం, గుండెలకి తగులుతున్న వక్షసంపద వెచ్చదనం, ఉక్కిరి బిక్కిరి అయ్యాడు సుభాష్. ఉచ్చ్వాస, నిశ్వాసాలు త్రాచుపాము బుసల్లా మారాయి. ఆమె మొహాన్ని దగ్గరగా తీసుకుని "ఐ లవ్వూ......ఐ లవ్వూ......" అంటూ బలంగా పెదవులని ముద్దుపెట్టుకున్నాడు.

    వరూధిని ఒళ్ళంతా తేలిపోతోంది. ఈ అనుభవం బాధని తగ్గించే మత్తు పానీయంలా అనిపిస్తోంది. తీగెలా సుభాష్ ని అల్లుకుపోయింది. పరిసరాల సంగతి ఇద్దరికీ గుర్తులేదు.

    ఆ ఇద్దరూ ధరణినే పాన్పుగా, పచ్చగడ్డివే దుప్పటిగా చేసి ఏకమయ్యే క్షణంలో..... ఎవరో కాలర్ పట్టుకుని వెనక్కి లాగడంతో ఉలిక్కిపడి చూశాడు సుభాష్.

    ఒక సబ్ ఇన్ స్పెక్టర్, ఇంకా ఇద్దరు కాని స్టేబుల్స్ నిలబడి వున్నారు. పోలీసుల్ని చూడ్డంతో ఇద్దరి గుండెలూ బేజారయిపోయాయి. క్షణంలో వళ్ళంతా చెమటతో తడిసిపోయింది.

    "ఏరా పట్టపగలే నడిపిస్తున్నావు వ్యవహారం. ఏ ఊరు మనది?" అడిగాడు ఇన్ స్పెక్టర్.

    "ఈ......ఊరే....." భయంగా సమాధానం చెప్పాడు సుభాష్.

    "నీ పేరేమిటి?" అడిగాడు వరూధిని కేసి చూస్తూ. వరూధిని సమాధానం చెప్పలేదు. భయంతో వణికిపోతోంది.

    ఇన్ స్పెక్టర్ రెట్టించాడు.

    "వరూధిని" ఏడుస్తూ చెప్పింది.

    "నా కూతురి వయసులో వున్నావ్. మగాడు, వాడికి సిగ్గులేకపోవచ్చు. ఆడపిల్లని నీకు సిగ్గూ లజ్జా లేవా?" అని పోలీసులవైపు తిరిగి "ఇద్దర్నీ స్టేషన్ కి తీసుకురండి" అని చెప్పి ముందుకు నడిచాడు.

    విహారం కోసం వచ్చి వెళ్ళిపోవాల్సిన ఇందిరా పార్క్ ఇలాంటి వ్యవహారాలకి నిలయంగా మారిందన్న గొడవ కొద్ది సంవత్సరాల క్రితం వచ్చింది. అప్పట్నించీ పోలీస్ పెట్రోలింగ్ జరుగుతుంది. ఆ విషయం సుభాష్ కి తెలీదు. గబా గబా ముందుకు నడిచి ఇన్ స్పెక్టర్ ని  చేరుకొని..... "ఇది తీసుకోండి సార్" అంటూ పర్సులోంచి వందరూపాయల నోటు అందించబోయాడు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra