Home » Mainanpati bhaskar » వేగు చుక్క


    నోటమాట రాకుండా ఆ తలనుచూస్తూ ఉండిపోయింది అనూహ్య.

    ఆమె భయం అతనికిఆనందాన్ని కలిగించింది. గుడ్లు తిప్పుతూ ఇంకా చెప్పడం మొదలెట్టాడు.

    "నరకమూ, స్వర్గమూ రెండూ ఈ భూమిమీదే ఉన్నాయే పిల్లా! చాంగ్ తో సజావుగా వుంటే అదే స్వర్గం! డ్రాకులాతో పేచీ పెట్టుకుంటే జిరావో జాతి ఇండియన్ల పేరు విన్నావా? వాళ్ళకంటే భయంకరుడిని నేను!"

    ఊపిరి పీల్చడం మరిచిపోయి చూస్తుంది అనూహ్య?

    స్పెషల్ ఎఫెక్టుకోసం ముక్కుతో బుర్రుమని శబ్దం చేశాడు చాంగ్. ఉలిక్కిపడింది అనూహ్య.

    "జిరావో జాతి ఇండియన్లు శత్రువుని చపడంతో ఊరుకోరు. వాడి తలని నరికి, చిన్నదిగా చేసేసి, వాడి ఆత్మ దేవినీ చూడకుండా కళ్ళు కుట్టేసారు. ఆ ఆత్మ తప్పించుకు పారిపోకుండా నోరు కుట్టేస్తారు, లేకపోతే ఆ చనిపోయిన శత్రువు తాలూకు ఆత్మ తమమీద ప్రతీకారం తీర్చుకుంటుందని వాళ్ళ భయం!"

    "అలా ష్రింక్ చేసిన తలని భద్రంగా బట్టల్లో చుట్టి. జాడీల్లో దాచిపెడతారు, ఊరగాయ దాచినట్లు. పండగలకీ, సంబరాలకీ దాన్ని తీసి మెళ్ళో వేసుకుంటారు ఇలా" అని మెడలోని బంగారపు గొలుసును బయటికి లాగాడు చాంగ్.

    దానికి లాకెట్ లా ఒక రుద్రాక్ష వేలాడుతోంది.

    కళ్ళు చిట్లించి చూసింది అనూహ్య. అది రుద్రాక్ష కాదు, రుద్రాక్ష సైజులో వున్న మనిషి తల!

    చాంగ్ చెబుతూనే వున్నాడు.

    "మామూలుసైజు తలను ఇంత చిన్నదిగా చెయ్యడానికి ఆర్రోజులు పడుతుంది. ఎందుకంటే, తలలోని మాంసం ఎండాలి  కదా? అందుకని? మొదటగా కపాలాన్ని తీసేస్తారు. దానికోసం తల వెనక భాగాన్ని మెడదాకా చీల్చి చర్మాన్ని వలుస్తారు. కపాలాన్ని కళ్ళూ,  పళ్ళతో సహా నదిలోకి విసిరేస్తాడు. ఆ తల చర్మాన్ని నీళ్ళలో ఉడక బెడతారు. అది సగం సైజుకి ప్రింక్ అవుతుంది. దాన్ని కర్రతో ఎత్తి పట్టుకుని చల్ల బరుస్తారు. లోపలిభాగాన్ని శుభ్రపరిచి, కనురెప్పలు కుట్టేస్తారు. రెప్పలు సహజంగా కనబడటానికిగానూ. రెప్పలోపల గింజ ఒక దానిని ఉంచుతారు.
   
    అప్పటికి  ఆ చర్మం   లేత పసుపురంగుకి మారి రబ్బరులా  మారుతుంది.

    ఆ తలని ఇంకా చిన్నది చేయటానికిగానూ జీరావో ఇండియన్లు చిన్న చిన్న రాళ్ళను మంటలమీద  వేడిచేసి, మెడద్వారంగుండా లోపలికి వేసి అటూ  ఇటూ  తిప్పుతారు. తర్వాత వేడి వేడి  ఇసుక పోస్తారు. అందులో.

    ఇలా చేయడం వల్ల తల   ఒరిజనల్  షేపు  చెడిపోకుండా ఉంటుంది. ఈ తతంగమంతా పూర్తయ్యేసరికి పిడికిలి  సైజుకి వచ్చేస్తుంది ఆ తల. అప్పుడు దాని మొహంమీద వెంట్రుకలన్నీ పీకేసి, ద్రాక్షతీగెతో మెడని బిగించి కట్టేస్తారు.

    ఈ పద్దతినే  మరింత  డెవలప్ చేసి  తలని  గోలీ  సైజుకి దింపే విధానం  కనుకున్నాడు మా జిరావో ప్రెండ్  ఒకడు. వాడికో రివాల్వర్  ఇచ్చి  ఆ పద్దతి  నేను  నేర్చుకున్నాననుకో!

    సరే ఏం చెప్పుతున్నానూ, అప్పుడా తల తాలూకు పెదిమలని  తాడుతో  కుట్టేసి , చర్మానికి  మసి పూస్తారు. అందువల్ల  ఆ ఆత్మ పర్మనెంటుగా చీకట్లో ఉండపోతుందని వాళ్ళ నమ్మకం! అర్థమయిందా?

    చివరగా, తలకి ఒక కన్నం  పొడిచి, తాడు కడతారు, సంబరాల్లో మెళ్ళో వేసుకోవడానికి వీలుగా!

    అదిగో పిల్లా! నన్ను పూర్తిగా  సంతోషపెట్టలేకపోయావో, నీ తల రాకెట్ లా నా మెళ్ళో వేలాడుతుంది! ఏదీ! ఆ డ్రస్సు విప్పు! సిగ్గు వదిలెయ్! డామిట్! ఊ! విప్పు!"

     అసహ్యంతో వళ్ళు జలదరించింది అనూహ్యకి. కడుపులో తిప్పి నట్లయింది.

    ఈ నరరూప రాక్షసుడు తనని పాడు చెయ్యకుండా వదలడు. అది తథ్యం! తర్వాత దారుణంగా చంపేస్తాడు, అదీ నిశ్చయమే!

    అంతటితో వూరుకోడు. తన తలని స్రింక్ చేసి మెడలో వేసుకుంటాడు.

    అంత ఘోరమైన శిక్షకంటే, తనంతట తాను ఇప్పుడే సముద్రంలోకి దూకేసి, ఏ జలచరానికో ఆహారమై పోవడం ఉత్తమం?

    చాంగ్ లేచి ఆమె రొమ్ములమీద చెయ్యి వెయ్యబోయాడు.

    చప్పున నీళ్ళలోకి దూకేసింది అనూహ్య.

    ఆమెకి ఈతరాదు.


                                                                  *    *    *

    మునిగిపోతున్నవాడికి గడ్డిపోచ ఒకటి ఆధారంగా దొరికినట్లు షిప్పునుంచీ విడివిడిన లైఫ్ బాయ్ ఒకటి కొట్టుకొచ్చింది సాగర్ దగ్గరికి.

    దాన్ని అదుముకుని  నడుముకి తగిలించుకున్నాడు.

    అంతలో దగ్గరలోనే మాటలు వినబడ్డాయి. కలకలం_దభేలుమని ఎవరో నీళ్ళలోకి దూకిన శబ్దం!

    "అనూహ్య!" అన్నాడు సాగర్ అనిమానంగా. "అనూహ్యా! అనూహ్యా!"

    "సాగర్ !" అని అస్పష్టంగా సమాధానం వినబడింది. ఆ గొంతులో చెప్పలేనంత ఆనందం. నీళ్ళు తాగేస్తున్న మ్,మనిషి గొంతులా ఉంది అది. సాగర్ కి కుడివైపున, ఒక గజం దూరంలోనే వినబడుతోంది. కానీ మనిషి కనబడటంలేదు.

    ఎదుటి మనిషేకాదు, తన చెయ్యే తనకి కనబడటంలేదు సాగర్ కి. అంత దట్టంగా ఉంది పొగమంచు.

    "అనూహ్యా? అనూహ్యా?" అన్నాడు బిగ్గరగా.

    "సాగర్....." ఈసారి ఎడమవైపు నుంచీ వినబడింది గొంతు అలలు అనూహ్యని అటూ విసిరేస్తున్నాయి.

    "అనూహ్యా?"

    "సాగర్ !" అని హీనస్వరం, దూరంగా.

    "అనూహ్యా !"

    ఈసారి సముద్రం ఘోషే వినబడింది. అనూహ్యా పలకలేదు.

    మూడుసార్లు లేచి, చివరిసారిగా  నీళ్ళలో మునిగిపోయింది అనూహ్యా.


                                   *    *    *

    కొంతసేపు నీళ్ళలో అల్లల్లాడి, కడుపునిండా నీళ్ళు తీగేసిన తర్వాత చచ్చీచెడి కిచెన్ ప్లోరును లంకించుకుని, పైకి ఎగబాకాడు ప్రొఫెసర్ ఆనందరావు, ఫకర్, ఇబూకా అప్పటికే దాని మీదికి చేరారు.

    ప్రొఫెసర్ కడుపుని వత్తి, నీళ్ళను బయటకు తెప్పించాడు ఫకర్.

    "ప్రొఫెసర్ సాబ్ లేచాక భలే తమాషా చేస్తాను చూడు" అన్నాడు ఫకర్.

    నవ్వాడు ఇబూకా. "ఖుషీగానే ఉన్నావు నువ్వు ఫకర్, ఇంత కష్ట సమయంలో కూడా!"

    "ఏడుస్తూ కూర్చున్నంత మాత్రాన కష్టాలు తొలిగిపోయేటట్లుంటే అన్నా, ప్రతోడూ అదే పని చేసేవాడు అవునా?"

    ఒప్పుకుంటున్నట్లు తల ఊపాడు ఇబూకా. "కెప్టెన్ గారు సురక్షితంగా ఉన్నరంటావా?"

    తల ఎగరేశాడు ఫకర్. "మన కెప్టెన్ అలాటిలాటివాడనుకున్నావా ఏమిటి! ఒక దెయ్యమూ, ఒక భూతమూ కలిసి ఆయన మీద పడ్డా తొణక్కుండా నిలబడి, రెండింటి పిలకలూ ముడేసి తన్ని తగిలెయ్యగలడు తెలుసా?"

    ప్రొఫెసరు కదిలాడు. కళ్ళు తెరిచి, జబ్బుపడ్డ చేపలా కాసేపు చూసి తర్వాత గబుక్కున లేచి కూర్చున్నాడు 'దెయ్యమా! వెళ్ళిపోయిందా ఆ దెయ్యం! ఆమ్మ ! చిటికెలో గండం తప్పిపోయింది! అవునా?"

    ఏమీ అర్థంకానట్లు మొహం పెట్టాడు ఫకర్. "ఏమిటి ప్రొపెసర్! ఏమిటి మీరు మాట్లాడేది? ఏమీ అర్థం కావడంలేదు."

    "దాని దుంపతెగ! దాన్ని చూసి ఐలాండ్ అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది అదేమిటో!" అన్నాడు ఆనందరావు.

    అదేమిటని? ఎవరూ అడక్కముందే మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు అతను.

    "సముద్రంలో కొన్ని రకాల ప్రాచీన రాక్షస జంతువులు ఇంకా మిగిలే ఉన్నాయన్న రిపోర్టులు అప్పడప్పుడు వినబడుతూనే ఉంటాయి. అయితే అవి పూర్తిగా నిర్ధారణ కాలేదు. ఇంతవరకూ  తిమింగలాలని అమాంతం మింగేసే సముద్ర  సర్పాలని  చూశామని  చెబుతారు కొంతమంది నావికులు. అది నిజమైన కాకాపోయినా, తిమింగలాలని చుట్టేసి, వాటికి ఒళ్ళంతా గాయాలు చెయ్యగల జెయింట్ సైజ్ జంతువు ఒకటి ఉంది! ష్యూర్! క్రాకెన్ అంటారు దాన్ని! దాదాపు మన అష్టపాద జంతువులా ఉండొచ్చు అది! దాని టెంటకిల్సుని చూస్తే సర్పాలని భ్రమపడివుంటారు కొంతమంది నావికులు!"

    అతన్ని వింత జంతువుని చూసినట్లు చూస్తున్నారు ఫకర్, ఇబూకా.

    "పునోషా మీద ఎక్కిన మొదటి మనిషిని నేను కాలేకపోయినా, క్రాకెన్ వీపుమీదెక్కి కాసేపు సవారీ చేసి, అలాంటి జంతువు ఒకటి నిజంగా ఉందని రూఢి చేసుకున్న మొట్టమొదటి శాస్త్రవేత్తను నేనే! ఓహొ! ఓహొహొ!" అన్నాడు ప్రొఫెసర్ కులుకుతూ.

    ఫకర్, ఇబూకా మొహామొహాలు చూసుకున్నారు. కన్నుగీటి, మొదలెట్టాడు ఫకర్.

    "ప్రొఫెసర్ సాబ్! నిద్రలో మాట్లాడుతున్నారా ఏమిటి? ద్వీపమేమిటి? పునోషా ఏమిటి? క్రాకెట్ ఏమిటి? ఏమి అంతుబట్టడంలేదు" అన్నాడు అమాయకంగా.

    "అవును!" అన్నాడు ఇబూకా.

    ప్రొఫెసర్ వెర్రెత్తినట్లు చూశాడు. "ఓరి మిమ్మల్ని ఉప్పు పాతరెయ్యా! మీరు ఇందాక నాతోనే ఉంటిరిగా? ఈ ఇబూకా టీ చెయ్యడం కూడా మొదలెట్టాడు గదా! మర్చిపోయారా ఏమిటి?"

    సానుభూతిగా చప్పరించాడు ఇబూకా.

    ఫకర్. జాలిగా చూశాడు. "మంచు కమ్మింది కదూ? అందుకని మగత కమ్మి ఉంటుంది ప్రొఫెసర్ సాబ్ కి! పాపం!"

    "అవును !" అన్నాడు ఇబూకా.

    తను కన్నది కలో నిజమో తేల్చుకోలేక అనుమానంగా చుట్టూతా చూశాడు ప్రొఫెసర్.

    చుట్టూ అలముకున్న మంచు అతనికి మాయలా గోచరించింది.


                                                               *    *    *

   
    మూడుసార్లు నీళ్ళలో మునిగిన అనూహ్యకి పట్టరాని దుఃఖం కలిగింది.

    అతి సమీపంలోనే దగ్గరికి వచ్చి మళ్ళీ దూరమైపోయాడు సాగర్.

    ఇంక తనకు చావు తప్పదు! ష్యూర్ !

    'సాగర్! మళ్ళీ జన్మంటూ ఉంటే నీ ప్రియురాలిగానే పుడతాను. ఈసారి నీకు భార్యనయి తీరతాను. నీ పిల్లలకు తల్లి నవుతాను. గుడ్ బై సాగర్! గుడ్ బై డియర్!' అనుకుంది ఆర్ద్రంగా.

    అప్పుడు-

    ఆమెని సుతారంగా ఎవరో నీళ్ళ అడుగునుంచి పైకి తోసినట్లయింది.

    మరుక్షణంలో నీళ్ళ ఉపరితలానికి వచ్చింది అనూహ్య.

    ఆమె కింద మృదువుగా తగులుతోంది ఏదో.

    చేతులతో కళ్ళు తుడుచుకుని, ఆశ్చర్యంగా చూసింది, అనూహ్య.

    అది ఒక డాల్ఫిన్! నాలుగు మీటర్ల  పొడుగు ఉంది.

    సముద్రంలోనే ఉన్నా. తిమింగలాలు చేపల జాతికి ఎలా చెందవో అలాగే డాల్ఫిన్స్ కూడా అవి కూడా స్తన్య జంతువులే.

    దాదాపు యాభై మిలియన్ల సంవత్సరాల ఒక జంతువు. నీటిలో దిగి, చేపలనీ, తదితర జలచరాలనీ పట్టి తింటూ ఎక్కువకాలం నీటిలోనే గడుపుతూ ఉండటంవల్ల చివరికి అది కూడా ఒక జలచరంగా, మారి పోయింది. దాని కాళ్ళు మొప్పలాంటి ఆకారానికి వచ్చేశాయి. తోక కూడా చేప తోకలా మారిపోయింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra