"అన్నిటినీమించి వదయారు చాపక్రింద నీల్లాలా రోజు రోజు ఎదిగిపోతున్నాడు. అతడి బిజినెస్ వాల్యూమ్ పెరిగినకొద్దీ మన ఇమేజ్ తగ్గిపోతుంది. ఇప్పుడు వదయారు కూతురు షిప్పింగ్ కార్పోరేషన్ ప్రారంభిస్తుంది ఆ వ్యాపారంలో లాభాలు ఎంత అన్నది సెకండరీ. ఆడపిల్ల ఆ ప్రాజెక్ట్ చేపట్టడం_ ఎన్నో సంవత్సరాలక్రితం రాయల్ ట్రెజర్ లో వస్తున్న ఓడ మునిగిపోవడం, ఇంత కాలానికి ఆ ఓడలోని అమూల్యమైన వస్తువులుగా కొన్నిటిని తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టడం. పత్రికలలో పెద్ద పబ్లిసీటీ రావడం జరుగుతుంది. ఆ ఓడలో తెస్తున్న వజ్రాలు, వైద్యూర్యాలు గురించి ఎవరూ పట్టించుకోరు. కాని ఆ వజ్రాలు దాచినపెట్టెలుమాత్రం మ్యూజియంలో దర్శనమిస్తాయి. ఆ పెట్టెలు పట్టుకుని ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వరు కధలు కధలుగా ప్రచారంలో తీసుకొస్తారు. దానితో ఆ అమ్మాయికి వచ్చే పబ్లిసేటీ అనూహ్యం__ ఆ పోటీని తట్టుకోవడానికి అంతకు రెట్టింపు గుర్తింపు, గౌరవం సంపాదించడానికి మనోహర్ మరేదైనా చేయాలి. వాడి శక్తియుక్తుల్ని, కాలాన్ని ఈ చిన్న ప్రాజెక్ట్ కోసం వినియోగించడం నాకు ఇష్టంలేదు. ఆ అమ్మాయి స్థానంలో మరేవరయినా ఆ పని చేసివుంటే నేనూ ఆ అమ్మాయిని అభినందించేవాణ్ని. సహాయ సహకారాలు అందజేసేవాణ్ని. కాని ఆ పని చేస్తున్నది వడయారు కూతురు. ఆమె ఆ పని చేయకుండా చూడటం న్నాకు ఎంత అవసరమో, అమతకుమిమ్చిన ప్రాజెక్ట్ మనోహర్ చేపట్టేలా చూడటం అంతకు రెట్టింపు అవసరం. ఇప్పుడు నా తక్షన్ కర్తవ్యమ్ కూడా అదే. ఈ విషయంలో రాజీలేదు. ఇప్పటివరకు వడయారు తనకు పోటీ కాకుండా, పోటికి రాకుండా ఏం.వి. అయ్య తీసుకోవలసిన చర్యలన్నీ తీసుకున్నాడు. కాని వడయారు కూతురు__ ఏం.వి.అయ్య. కొడుకు కేరీరుపంతంలో ప్రారంభమవుతోంది."
* * * *
విగ్రహం ముందు ప్రమిదలో దీపం ఉజ్వలంగా వెలుగుతోంది. వడయారు కంఠంనెమ్మదిగా మంత్రాలు గోణుగుతోంది. కావ్య చేతులు రెండూ జోడించి, మోకళ్ళామీద కూర్చుని, కళ్ళు మూసుకుని ప్రార్దిస్తుంది.
ఆ పూజ పూర్తీ కావడానికి పావుగంట పట్టింది. కొత్త పట్టు వస్రంలో పోతపోసిన వెండివిగ్రహంలా వున్నా వడయారు పూజగదిలో నుంచి కూతురుతోపాటు బయటకొచ్చారు. ఆమె ఊహించని రీతిలో నేల మీదకి చతికిలపడ్డారు. తండ్రి చర్యకు త్రుటి కాలంలో సర్దుకున్న కావ్య తండ్రికి అభిముఖంగా కూర్చుంది. అంత తీరిగ్గా, హొమ్లీగా కూర్చున్న సంఘటనలు అమెఅనుభావంలో అయిదారుకి మిమ్చిలేవు. పచ్చని పట్టు చీరే_ తలారా స్నానంచేసి వదులుగా కట్టిన జుట్టు, నుదుట బొట్టు__ మూర్తీభవించిన స్రీత్వం!
కూతుర్నే చూస్తున్న అయన అన్నాడు___ "ఆడపిల్లకి తల్లిలేనిలోటు ఎవరూ తీర్చలేరమ్మా"... అని!
తండ్రి పిచ్చాపాటిగా మాట్లాడటం ఆమెకు ఆనందంగానూ, ఆశ్చర్యంగానూ, వుంది. "అదేమిటి నాన్నగారూ_పోతిళ్ళలో బిడ్డగా మీ కప్పాగిమ్చి పోయిన అమ్మను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు" అనడిగింది.
"ఆడపిల్లా అవసరాలు తల్లికి తెలిసినట్లుగా తండ్రికి తెలియనమ్మ. మీ అమ్మా బ్రతికుంటే నీ పెళ్ళికోసం నన్నెంతగా తొందర పెట్టోదో! మీ అమ్మ వుండగా_ ఇంట్లోకి పప్పులు, ఉప్పులు, కూరగాయలు దగ్గర్నుంచి పండగలు పబ్బాలకి అయ్యే అదనపుఖర్చుల వరకు అన్నీ బడ్జెట్ వేసుకునేవాళ్ళం ఆర్దికంగా ఎదిగాం. మన చుట్టూ ఎత్తయిన గోడలు కట్టుకున్నాం__ మనకుమనంగా బాహ్యా ప్రపంచానికి దూరమయి పోతున్నాం. సగటు మనిషి అనండ విషాదాలకు నోచుకోకుండా మెకానికల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం ఎప్పుడూ 'వ్యాపారం_ కోట్ల రూపాయలు' వీటి చూట్టూ తానేగా మన సంభాషణ సాగేది.
ఏ వయసులో జరగాల్సిన అచ్చట్లు ముచ్చట్లు ఆ వయసులో జరిపించలేక పోతున్నానన్న బాధగా వుందమ్మా_ అన్నాడు వడయారు.
"డాడీ! జనరేషన్ గేఫ్ వచ్చింది. ఆడపిల్ల ఆలోచనల్లో మార్పువచ్చింది. ఎవడో ముక్కూ మోహం తెలియని వాడ్ని పెళ్ళిపేరుతో కట్టుకోవడం, వాడికి అకలయినప్పుడు వాడు కోరుకున్న తిండి రెడీచేసి వుంచడం, వాడికి పిల్లల్ని కానీ, ఆ పిల్లల్ని పెంచే కాం సేపట్ మారిపోయింది. ఇప్పుడు దృక్పథం మారిపోయింది. మగవాడు చేయవలసింది- ఆడపిల్ల చేయగూడనిది అంటూ ఏదీలేదు. ఎకనామిక్ స్టేబిలీటీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటోంది. దానికోసమే స్ట్రగుల్ అవుతోంది. ఈ విషయంలో కమ్యూనిస్ట్ ల్ని చూస్తె బాధ కలుగుతుంది. వారు ఇంకా 'భూపోరాటం' ప్రదర్శనలు ఇస్తూనే వున్నారు. ఇప్పుడు కావలసింది 'భూపోరాటం' కాదు 'భుక్తిపోరాటం' ఆడపిల్ల కోరుకునేది మగవాడి నీడకాదు, తననుతాను పోషించుకోగల ఆర్దికబలం_ భవిష్యత్తుకి భద్రత హిందూ వైవాహిక వ్యవస్థ పూర్వంలా లేదు. మ్యరేజేస్ రిజిస్టరు స్థాయికి_కంట్రాక్టుల స్థాయికి వచ్చేశాయి స్రీ ఆర్దికంగా తనను తాను పోషించుకునే ఉద్యోగానికి ప్రాధాన్యత ఇస్తోంది. తర్వాత పెళ్ళి! మీరు ఈ రోజున ఈ స్థితిలో వున్నాందువల్ల నేను కొత్తకొత్తగా వెంచర్స్ చేయగాల్గుతున్నాను. లేకుంటే ఏదో చిన్న ఉద్యోగం. సంపాదించుకునే దాన్ని... అదీగాదూ ఎవడికో భర్యగా వాడికి, వాడి పిల్లలికి దిగని ఫైడ్ సర్వెంట్ మెయిడ్ గా లైఫ్ లో సేతిలయ్యే దాన్ని " అని చెబుతున్న కూతుర్ని చూసి పకపకా నవ్వాడు వడయారు.
"పిచ్చిపిల్లా?" అని, "తల్లి పెంపకంలో పెరిగిన పిల్లకు_మగవాడు పెంపకంలో పెరిగిన పిల్లకు తేడా ఇదేనేమ్మా" అన్నాడు.
తిరిగి అన్నాడు.
"ఈ గొడవసరేగాని ఆడపిల్లలు చేయావాల్సిన పని మగవాళ్ళు, మగవాళ్ళు చేయాల్సిన పని ఆడివాళ్ళు చేస్తున్నారడానికి ఒక ఎగ్జాంపుల్_ వీపు షిప్పింగ్ కార్పోరేషన్ ప్రారంభించడం, ఏం. వి. అయ్య కొడుకు పోలిలెన్స్ ఫైబర్ గ్లాసు ఫ్యాక్టరీపెట్టడం! సాధారణంగా ఏం.వి అయ్యప్లానింగ్ చాలా డిఫరెంట్ గా వుంటుంది. మరి కొడుకు విషయంలో ఇలాఎమ్దుకు చేస్తున్నాడో అర్ధంకావడంలేదు" అని!