లతీఫ్ కి 'లేట్ లతీఫ్' అని పేరుపెట్టింది భావనే! అతను ప్రతీదీ ఆలస్యంగా చేస్తాడని ఆ పేరు.
    పుట్టినప్పటినుంచీ అతను అన్ని విషయాలలో లేటే! నిజం చెప్పాలంటే, అసలు పుట్టడమే లేటు! పదో నెలలో పుట్టాడు. పుట్టినప్పుడు అతని మేనమామ లతీఫ్ వాళ్ళ నాన్నకి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ఉత్తరం రాశాడు. అది పాతికేళ్ళ తర్వాత మొన్నటికి మొన్న అందింది!
    పాతికేళ్ళు లేటుగా అందడం కాదు అసలు విశేషం- ఆ ఉత్తరానికి పాతికేళ్ళ క్రితం అతికించిన స్టాంపులు ఇప్పుడు చెల్లవని చెప్పి, పెనాల్టీ వసూలు చేశారు పోస్టల్ డిపార్ట్ మెంటువాళ్ళు!!
    అది గుర్తొచ్చి నవ్వొచ్చింది సూరజ్ కి. లేచి, స్నానం అదీ చేశాక, లతీఫ్ కి కాఫీ కలిపి ఇచ్చాడు.
    "ఆ పనస చెట్టుకింద కూర్చుని తాగుదాం పద!" అన్నాడు లతీఫ్.
    "సరే!" అంటూ లేచాడు సూరజ్.
    కానీ అక్కడికి వెళ్దాం అని చెప్పిన లతీఫ్ మాత్రం లేవలేదు. బద్ధకంగా అక్కడే కూర్చుని పేపరు తిరగేయడం మొదలెట్టాడు.
    రెండు నిముషాలు చూసి, మళ్ళీ తను కూడా కూర్చోబోయాడు సూరజ్.
    "మళ్ళీ కూలబడతావేం! అక్కడ పనస చెట్టుకింద చేరదామని చెప్పాను కదా!" అని లేచాడు లతీఫ్-లేట్-లతీఫ్.
    సరిగ్గా అదే క్షణంలో -
    పనసచెట్టు పైనుంచి పెద్ద బిందె సైజులో వున్న ఒక పనసపండు దబ్బున కిందపడింది.
    లతీఫ్ చెప్పిన వెంటనే గనక వాళ్ళు చెట్టుకిందికి వెళ్ళి ఉంటే అది వాళ్ళమీదే పడి ఉండేదేమో!
    "పండు పడితే గుండు పగిలి ఉండేదిరా! చూశావా! నేను లేట్ చేయడం వల్ల ఎంత మేలు జరిగిందో! ఇంకెప్పుడూ నన్ను దెప్పకు!" అన్నాడు లతీఫ్ తమాషాగా.
    అతను బాగా పొడుగు. కొద్దిగా లావు-బూరె-పంపర పనాసకాయ డిప్పలాంటి హెయిర్ స్టయిలు.
    ఎంతో ముద్దొచ్చే జెయింట్ పండాలాగా ఉంటాడతను. అతని ఆలస్యాన్ని గురించి అందరూ ఆటలు పట్టిస్తూ ఉంటారు గానీ నిజానికి అతనొక మేధావి. చాలా మంచివాడు.
    ఇద్దరూ వెళ్ళి చెట్టుకింద కూర్చున్నారు. ఆ పనస చెట్టుకీ, ఇంకో మామిడి చెట్టుకీ తీగె ఒకటి కట్టి వుంది. దానిమీద బట్టలు ఆరేసి ఉన్నాయి.
    అరుణ చీర ఒకటి గాలికి రెపరెపలాడుతూ మన్మథుడి విజయపతాకంలా కనబడింది సూరజ్ కి. రెప్పవాల్చకుండా చూస్తూ ఎంతో ఉద్వేగంతో చెప్పాడు లతీఫ్ తో.
    "అరుణ కట్టుకునే బట్టలని చూస్తే చాలు, నాకు భలే జెలసీగా ఉంటుంది బ్రదర్! వాటికి ఎంతటి అదృష్టమో చూడు! అరుణ వంటిని అంత సన్నిహితంగా తాకుతూ, ఇష్టంగా చుట్టేసుకుని ఉండడం అంటే...అబ్బ! లతీఫ్! అరుణ కట్టిన ఆ చీరెని గనక అమ్మకానికి పెడితే ఎవరో ఒకరు హీనపకం ఓ మిలియన్ డాలర్లకి కొనకపోరు. ష్యూర్! లేదా, ఏ సౌత్ బీలోనో, క్రిస్టీస్ లో గనక వేలంపాట పెడితే అమెరికన్ మిలియనీర్లు ఎగబడి అంతకంటే ఎక్కువ ధరకే ఎగరేసుకుపోతారని నా నమ్మకం!" అన్నాడు తమకంగా.
    సూరజ్ వైపు చిత్రంగా చూశాడు లతీఫ్. ఆ తర్వాత కన్నుగీటి, తన సహజ ధోరణిలో అన్నాడు.
    "ఆడపిల్లలంటే ఆమడ దూరంలో ఉండేవాడివి, చీరెల మోజులో పడడం చిత్రంగానే ఉందిరా! ఆ పిల్ల పెడసరంగా వున్నా పారిపోకు. 'ఆడువారి మాటలకూ- అర్థాలే వేరులే' అన్నారు గదా!"
    అలా అంటున్నప్పుడు అతనికి తెలియదు. ఆ క్షణంలో అరుణ అక్కడికి కొద్ది అడుగుల దూరంలోనే, ఇంకో చెట్టు దగ్గర నిలబడి వుందని! చెట్లు చాలా గుబురుగా పెరిగి ఉండడం వలన ఆమె వాళ్ళకి కనబడటం లేదు.
    వాళ్ళ మాటలు మాత్రం అరుణకి వద్దనుకున్నా వినబడుతూనే వున్నాయి. కోపంతో ఆమె మొహం ఎర్రబడింది. పెదిమలు వణకడం మొదలెట్టాయి. అప్రయత్నంగానే పిడికిళ్ళు గట్టిగా బిగుసుకున్నాయి. అతికష్టం మీద తనని తాను అదుపులో పెట్టుకుంది అరుణ.
    "జులాయి రకం! ఆడవాళ్ళని గురించి ఇట్లాంటి చీప్ కామెంట్సు చేస్తూ వుంటారన్నమాట ఈ మొగవాళ్ళు! ఇతన్ని ఇమ్మీడియేట్ గా ఇక్కణ్ణుంచి తరిమేయవలసిందే! తప్పదు!" అనుకుంది అతి ధృడంగా.
    అంతలోనే ఆమెకి ఇంకొక ఆలోచన కూడా వచ్చింది.
    ఒకవేళ ఇతన్ని ఇప్పుడే ఇటునుంచి ఇటే బయటికి పంపించి వేస్తే, రెంటు రాదు. రెంటు రాకపోతే కరెంటు వుండదు. దోమలు!
    తన సంగతి వదిలెయ్! అమ్మ గురించే తన బెంగ!
    అందుకనే, తను తొందర పడకుండా, అటు అమ్మకి అవస్థ కలగకుండా, ఇటు భావన బాధపడకుండా ఇతగాడికి వుద్వాసన చెప్పాలి!
    అసలు తప్పంతా ఈ భావనదే! తనేదో మహా పెళ్ళిళ్ళ పేరమ్మననుకుంటోందా ఏం!
    అనవసరంగా ఇతన్ని తెచ్చి ఇక్కడ దింపి తను విశాఖపట్నం చెక్కేసింది!
    అమ్మతల్లి! ఎక్కడో!
    కనీసం తన తల్లి కోసమైనా తను తొందర పడకూడదనే అరుణ నిర్ణయానికి ఆర్రోజులు తిరగకుండానే గండి పడింది.

                                       *    *    *    *

    ఆదివారం వుదయం.
    అరుణ స్నానం చేసి బట్టల కోసం బీరువా తెరిస్తే -
    ఆరోజున సూరజ్ అంతగా ఆకాశానికెత్తేస్తూ వెగటు పుట్టేటట్లు కామెంటు చేసిన ఆ 'మిలియన్ డాలర్ల ఖరీదు చేసే చీరె' కనబడలేదు!!
    మిస్సింగ్!
    డౌటు లేదు.
    ఇతనే తన చీరెని ఎత్తుకెళ్ళిపోయి దాచిపెట్టుకుని వుంటాడు.
    ఇదోరకమైన సైకలాజికల్ వీక్ నెస్ అయి ఉండవచ్చును - ఫెటిషెస్ అంటారే - ఆడవాళ్ళ డ్రెస్సులూ, అండర్ గార్మెంట్స్ మీద మోజు పెంచుకోవడం.
    ఛీ!
    తనేమన్నా గోపికల చీరెలు ఎత్తుకెళ్ళిపోయి చెట్టెక్కి కూర్చున్న చిలిపి కృష్ణుడి ననుకుంటున్నాడా ఇతను!
    ఇంక తను ఏమాత్రం భరించలేదు. భావన బాధపడితే పడనీ - రెంటు రాకపోయినా ఫర్వాలేదు - అమ్మ సంగతి ఎలాగోలా చూసుకుంటుంది తను.
    సూరజ్ ని చివాట్లు పెట్టి తగిలేయాలా, లేక మర్యాదగానే సాగనంపాలా అని ఆలోచిస్తూ వుండగానే "అమ్మగారూ!" అన్న పిలుపు వినబడింది.    
    బయటకు వచ్చి చూసింది అరుణ.
    అక్కడ నిలబడి వుంది మైసమ్మ. ఆమె కూలీ పనులు చేస్తూ వుంటుంది. ఆమె పక్కనే నర్సింగ్. ఆమె భర్త.
    మైసమ్మ అరుణ తాలూకు మిస్సింగ్ శారీ కట్టుకుని ఉంది!
    ఒక్కక్షణం ఆశ్చర్యపోయి చూసింది అరుణ. వెంటనే ఆమె మొహంలో నవ్వు తొంగిచూసింది.
    "ఈ చీరె నీకు ఇచ్చాను కదూ! ఆ సంగతి మర్చేపోయి దీనికోసం వెదుకుతున్నా!" అంది నవ్వుతూ.
    మొన్నొకసారి మైసమ్మ వచ్చి "పాత చీరె ఏదన్నా వుంటే ఇవ్వండమ్మా!" అని అడిగితే, తను ఈ చీరే ఇచ్చింది.
    అది చూసింది జాహ్నవి.
    "అదేమిటమ్మా! పాత చీరె ఏదైనా ఇవ్వక సరికొత్త చీరె ఇచ్చేస్తావేం?" అంది ఆశ్చర్యంగా.
    "ఇస్తే పనికి వచ్చేదే ఇవ్వాలిగానీ మిగిలిపోయినదో, చిరిగిపోయినదో పాత చీరె ఇవ్వడం ఏం బావుంటుందీ?" అని తడుముకోకుండా సమాధానం చెప్పింది అరుణ.
    అదే గుర్తుతెచ్చుకుంటూ, ఎంతో కృతజ్ఞత గొంతులో పలికిస్తూ చెప్పింది మైసమ్మ.
    "పెద్దమ్మ వద్దంటున్నా కొత్త చీరె ఇచ్చేసింది చిన్నమ్మ మాయమ్మ! గదట్ల వుండనీ! వెనకసిరి అమ్మ ఇంట్లో ఆలమూ అదీ పెరికి సాఫ్ చేసినప్పుడు ఆడామెను నాకూ మా మొగాయనకూ ఒకే కూలీ ఇవ్వాలని చెప్పబట్టె! పోనీ ఇట్లగయినా అందరూ ఇచ్చే లెక్క డబ్బయ్ ఇచ్చిందా? లేదు గంద! వందయినా లేకుంటే కడుపెట్ల నిండుతదని చెప్పి చెరి వందా, జుమ్లా రెండొందలు ఇచ్చె! దొరసానమ్మ మాకు దేవత లెక్క!" అంది అభిమానంగా.
    "ఇంక ఆపుదూ" అంది అరుణ మొహమాటంగా.
    ఇదంతా కళ్ళార్పకుండా చూస్తూ చెవులప్పగించి నోరెళ్ళబెట్టి వింటున్నాడు సూరజ్.
    అతనికి అరుణ పట్ల ఆరాధనాభావం క్షణక్షణానికీ పెరిగిపోతోంది. ప్రేమరోగం సోకిన వాడికి ఆ జ్వర తీవ్రతని కొలిచే ప్రేమ 'అధర్మామీటరులో' (కాక, ప్రేమకు ఒక ధర్మమూ, దయా దాక్షిణ్యమూ వుంటాయా ఏమిటీ?) పెరిగిపోతున్నట్లుగా!
    సూరజ్ కి అనిపించింది - పెద్దలు ఏమని చెబుతూ వుంటారూ?
    మనం చేసిన మంచిని మనం మర్చిపోవాలి. మనం చేసింది గనుక నిజంగా అంతటి మంచే అయితే, దానిని ఎదుటివాళ్ళు గుర్తుపెట్టుకోవాలి.
    ఈ అమ్మాయి - అరుణ - తను ఇచ్చేసిన చీరె సంగతి తనే మర్చిపోయింది!
    అరుణ మైసమ్మతో అంటోంది అభిమానంగా.
    "నువ్వు మాత్రం మాకు తామర మొక్కలు తెచ్చిపెట్టినప్పుడు పైసలు తీసుకున్నావా ఏమిటి? ఊరికే ఇచ్చిపోలేదూ?"
    పల్లెనీటి ఫ్లోరైడ్ ఎఫెక్టుతో బ్రౌన్ కలర్ కి మారిన పళ్ళు కనబడేలా నవ్వింది మైసమ్మ.
    "వట్టి పుణ్యానికి వచ్చిన మొక్కలకి పైసలు తీస్కుని పాపం మూటకట్టుకోవాలా అమ్మ?"
    "దటీజ్ ఇట్" అనుకున్నాడు సూరజ్.
    తను చేసిన మంచి తను గుర్తుపెట్టుకోదు అరుణ.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra