Home » Mainanpati bhaskar » Mandu Vennela

ఈ మాటలన్నీ అతను భానురేఖతో చెప్పలేకపోయినా, అలా చెయ్యాలని మాత్రం ఒక గట్టి నిశ్చయానికి వచ్చేశాడు.
అది మొదలు!
ఆ క్షణం నుంచి ఆ అమ్మాయి క్షణక్షణం తనకి గుర్తొస్తూనే ఉంటుందని అతనికి తెలియదు - అప్పట్లో!
ప్రేమ్ నగర్ అపార్ట్ మెంట్సుకి దూరంగా ఉన్న తన రూంకి వెళ్ళిపోవాలంటే అతనికి మనసొప్పలేదు.
అయినా తప్పనిసరి కాబట్టి వెళ్ళిపోయాడు, మనసుని అక్కడే వదిలిపెట్టి.
ఆ రాత్రి ఒక్క సెకెండు కూడా నిద్రపోలేదు అతను. ఆలోచనలు! ఆలోచనలు! ఆలోచనలు! తెల్లవారుఝాము అయ్యేసరికి తూర్పుతోబాటు అతని కళ్ళు కూడా ఎర్రబదిపోయాయి నిద్రలేమితో.
ఆలోచనల హేంగోవర్ ఇంకా వదలలేదు.
లోకం అంటే తెలియని ఒకమ్మాయే తన లోకం అయిపోతుందని ఇంతకుముందు ఎప్పుడూ ఊహించలేదు తను!
అసలు ఈ ఆమ్మాయంటే ఎందుకింత ఇంట్రెస్టు కలిగింది తనకి? చీరెల రెపరెపలు వినబడగానే రెప్పలార్పడం మర్చిపోయి వెంతబడే మనిషి కాడు తను. మీద మీద పడిపోతున్న సులక్షణని దూరంగా ఉంచగలగడమే అందుకు మంచి ఉదాహరణ.
కానీ ఈ అమ్మాయి భానురేఖ! షీ ఈజ్ సో డిఫరెంట్ అండ్ సో స్పెషల్!
ఆ అమ్మాయిని గురించి ఆలోచించకుండా అర క్షణం కూడా ఉండలేకపోతున్నాడు తను.
అయితే -
భానురేఖ మీద తనకి ఉన్న ఈ ఇంట్రెస్టుకి సరైన పేరేమిటి?
అద్భుతమైన ఆమె అందాన్ని చూసి ఆకర్షణా?
కారు ప్రమాదంలో తల్లిని పోగొట్టుకున్నదని జాలా?
ఎనిమిదేళ్ళపాటు కోమాలో ఉన్నందుకు ఆశ్చర్యమా?
పదేళ్ళ పసి మనసుతో, పద్దెనిమిదేళ్ళ పసిడి వయసుతో హాస్పిటల్ నుంచి తిరిగివచ్చి, సెటప్ మారిపోయినట్లు కనబడుతున్న ఈ కొత్త వాతావరణంలో ఇమడలేకపోతున్నందుకు సానుభూతా?
ఏమాటకి ఆ మాటే చెప్పుకుంటే, ఆమెని మొదటిసారిగా డిపార్ట్ మెంటల్ స్టోర్స్ లో చూసినప్పుడు విపరీతమైన ఆకర్షణకు గురయ్యాడు. తను పార్కులో ఆ అమ్మాయి ఒంటరిగా బొమ్మను పెట్టుకు ఆడుకుంటున్నప్పుడు చూసి జాలిపడ్డాడు. లిఫ్టులో ఆ కుర్రాడి బలత్కారానికి గురయినప్పుడు సానుభూతి చూపించాడు.
ఆ అమ్మాయి ఆత్మహత్యా ప్రయత్నం గురించి తెలిసిన తర్వాత తను ఆమెకి ఆజన్మాంతం అండగా నిలబడాలని ఆరాటపడ్డాడు.
ఈ భావాలన్నింటి టోటల్ ఎఫెక్టునీ కలిపి ఏమనాలి?
అతనికి ఇంకో విషయం గుర్తొచ్చింది.
తనకి బోంబేలో పోస్టింగ్స్ వచ్చాయి! వెళ్ళిపోవాలి! వచ్చే వారమే! కానీ తను భానురేఖని వదిలేసి వెళ్ళిపోగలడా? మనసొక చోటా మనిషొకచోటా ఉండడం సాధ్యమేనా?
తను భానురేఖకి దూరంగా బాంబేలో ఉండడం అసంభవం! అసలు ఈ ఊళ్ళోనే, ఇంత దూరంలో ఉండడం కూడా వెలితిగా అనిపిస్తోంది.
ఇక్కడే పోస్టింగ్స్ కోసం ట్రై చెయ్యాలి. పోస్టింగ్స్ గనక ఇక్కడే వస్తే, ఈ రూము ఖాళీ చేసి తను కూడా ప్రేమ్ నగర్ అపార్ట్ మెంట్సుకి మారిపోవాలి.
అద్దె ఎక్కువే ఉండొచ్చు.
కానీ జీతం కూడా బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి ప్రాబ్లెం ఉండదు.
పోస్టింగ్స్ ఇక్కడే వచ్చేలా చూసుకోవాలి. అది ముఖ్యం! చాలా!
భోజనం కూడా చెయ్యకుండా సాయంత్రం నాలుగింటిదాకా అలాగే పడుకుని, అప్పుడు ఉన్నట్లుండి లేచి, డ్రెస్ చేసుకోవడం మొదలెట్టాడు రవిచంద్ర. ఆఫీసులో పోస్టింగ్స్ సంగతి ఇవాళే తేల్చేసుకోవాలి!
నోటీసు లేకుండా చటుక్కున లోపలికి వచ్చేసింది సులక్షణ. అతన్ని మింగేస్తున్నట్లు ఆపాదమస్తకం ఒక్కసారి చూసి నవ్వేసింది. "ఏ అండర్ వియర్ తాలూకు అడ్వర్ టెయిజ్ మెంట్ షూటింగ్ లోకో వచ్చేశాననుకున్నాను ఒక్కక్షణం పాటు! నిజంగా నీది సూపర్బ్ ఫిజిక్! 'హెర్క్యూలెస్ అన్ చెయిన్డ్' సిన్మాలో స్టీవ్ రీల్స్ లా ఉంటారు మీరు" అంది గొంతు మత్తుగా పెట్టి.
వళ్ళుమండిపోతున్నా బలవంతంగా కోపాన్ని తొక్కిపట్టాడు రవిచంద్ర. షర్టు బటన్స్ పెట్టుకుంటూ బయటికొచ్చి నిలబడి, "ఎక్స్యూజ్ మి! నేను అర్జెంటు పనిమీద బయటికెళ్తున్నాను. మీరు కూడా దయచేసి బయటికొస్తే రూమ్ లాక్ చేస్తాను" అన్నాడు.
"మీరు లేకపోతే నేను కాసేపు రూంలో కూర్చోకూడదా ఏమిటి? నాకు తెలుసులెండి మీ జెంట్స్ సీక్రెట్లు - ఫోర్న్ నావెల్సూ, అడల్డ్ ఫిలిమ్ కాసెట్లూ. లిక్కర్ సీసాలు ఉంటాయ్! అవన్నీ ఎవరికంటనన్నా పడిపోతాయేమోనని భయం! అవునా?
"అనుభవంతో తల పండిపోయినట్లు చెబుతున్నారే!" అన్నాడు రవిచంద్ర నవ్వు తెప్పించుకుంటూ, "అవేం లేవుగాని, నేను రామకోటి రాస్తున్న పుస్తకం ఉంది. అది చూసి షాకయి పోతారేమోనని భయం! అంతే!" అని గబగబా మెట్లు దిగాడు.
అతను ఆఫీసుకి వెళ్ళేసరికి కంపెనీ స్టాఫ్ చాలామంది ఇళ్ళకెళ్ళిపోయారు. సీనియర్ ఎక్సిక్యూటివ్ లూ, వాళ్ళ సెక్రటరీలూ మాత్రమే ఉన్నారు.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra