Home » Merlapaka murali » Maga Bhuddi


    అదే సమయంలో లోపల కరెంట్ పోవడంతో ఉక్కగా అనిపించి కాస్తంత గాలికోసం రజని, సరళ బయటకు వచ్చారు.

 

    క్యూలో కౌంటర్ ముందు మొట్టమొదటిసారి రణరంగంలో ఓడిపోయిన నెపోలియన్ లా విషాద వదనంతో నరేష్ కనపడ్డాడు.

 

    "మన చితగారు సినిమాకు వచ్చినట్టున్నారే" సరళ అంది.

 

    "మరి టికెట్టు తీసుకోకుండా అలా నిలుచుండిపోయాడే?"

 

    "బహుశా చిల్లర తక్కువై వుండచ్చు."

 

    నిజమేననిపించింది రజనికి. కౌంటర్ దగ్గర టికెట్టు తీసుకోకుండా ఆగిపోయాడంటే అదే కారణమై వుంటుంది. అయినా పని ఎగ్గొట్టి ఇప్పుడు ఈ సినిమాకే అతను ఎందుకొచ్చాడన్న అనుమానం మొదటిసారి కలిగిందామెకి. తన కోసమే వచ్చాడేమోనన్న ఆనందం ఎక్కడో ఏమూలో మెదిలింది. అయితే ఆ ఆనందాన్ని ఆమె గుర్తించలేదు.

 

    మౌనంగా నడుచుకుంటూ అతని దగ్గరికెళ్ళింది. హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులోంచి పదిరూపాయల నోటు తీసి అతనికివ్వబోయింది.

 

    "అంత డబ్బు వద్దండి. అర్ధరూపాయి తక్కువ. అది మాత్రమే ఇవ్వండి" అన్నాడు యిబ్బంది పడిపోతూ.

 

    "ఫరవాలేదు తీసుకోండి!"

 

    "వద్దండీ!"

 

    ఇక ఆమె వత్తిడి చేయలేదు అర్ధరూపాయి బిళ్ళను తీసి అతనికి ఇచ్చింది.

 

    టికెట్టు తీసుకుని వచ్చాడు. ఇద్దరూ కదిలారు.

 

    ఆమె పక్కన నడుస్తుంటే అతనికి ఎక్కడలేని బలం వచ్చినట్టనిపించింది. అంతవరకూ జీవితంలో ఎప్పుడూ పొందలేని భద్రత అతనా క్షణంలో పొందుతున్నాడు. తను అనాధ కాడని, తనకూ ఓ చక్కటి తోడుందన్న భావన అతనికి ఎంతో నిబ్బరాన్ని యిస్తోంది. అతను మబ్బుల రథం మీద తెలియని అందమైన లోకాలకు పరుగుతీస్తున్నాడు.

 

    "చిల్లర సమస్యేనా?" సరళ రజనిని అడిగింది నవ్వుతూ.

 

    అవునన్నట్టు చూసింది రజని తన స్నేహితురాలివైపు.

 

    "ఈ అమ్మాయి ముదురు రంగు చీరలకన్నా లైట్ కలర్ చీరలు కట్టుకుంటేనే బావుంటుంది" అనుకున్నాడు నరేష్ సరళను చూస్తూ.

 

    "ఏమిటి సార్! నన్ను అలా చూస్తున్నారు?" అడగనే అడిగింది సరళ. ఈ అమ్మాయి మరీ ఫాస్ట్ గా వున్నట్టనిపించి "ఏం లేదండీ" అంటూ నసిగాడు.

 

    తన చెప్పుల్ని రజని చూస్తే బావుండదనిపించింది స్లిప్పర్స్ కాకుండా మొదటిసారి చెప్పులేసుకున్నాడతను. అందునా కొత్త చెప్పులేమో మెరుస్తున్నాయి. తను వేసుకున్న వాటిలో బాగున్నవి అవే చొక్కా రంగు కోల్పోయి మురికితో అట్టలా తయారై కాగితంతో కుట్టించుకున్నట్టుంది. ఇక ఫ్యాంట్ - ఒక్కోచోట ఒక్కో రంగు కనపడుతూ అసహ్యంగా వుంది. ఈ బట్టల్లో తాను అచ్చు ఉమ్మితొట్టిలా వున్నాననిపించింది అతనికి. అందుకే ఆమెకు తన చెప్పుల్ని చూపించాలని అతను నానా అవస్థలు పడుతున్నాడు. కాళ్ళు కొడుతున్నాడు, శబ్దమయ్యేట్టు చెప్పులు లాగుతున్నాడు. పాదాలను ముందుకు చాస్తున్నాడు.

 

    వాళ్ళు ముగ్గురూ థియేటర్ లోకి వెళ్ళారు.

 

    నరేష్ తన టికెట్ లోని నంబర్ చూసుకుని, తన సీట్లో కూర్చున్నాడు. లక్కీగా అతని సీటు నెంబర్ రజని పక్క వరసలో మొదట్లో వచ్చింది.    

 

    అతను సీట్లో కూర్చుని చూపులు పక్కకు సారించాడు. అవతలి వరుస మొదట్లో రజని కూర్చోవడంవల్ల వాళ్ళిద్దరి మధ్యా ఏ అడ్డంకి లేదు, జనం వెళ్లడానికున్న దారి తప్ప.  

 

    రజని అందాన్ని అతని కళ్ళు తాగుతున్నాయి.

 

    తను వేసుకున్న కొత్త చెప్పులు ఆమెకు కనపడాలని నరేష్ కాలు మీద కాలు వేసుకున్నాడు. ఎడమకాలుమీద వేసుకున్న కుడికాలును వూపడం మొదలెట్టాడు.

 

    అప్పుడే ఒక వస్తాదు థియేటర్ ఆవరణలోకి అడుగుపెట్టాడు. నాలుగు మూరల పంచె, తెల్లటి షర్టూ వేసుకున్న అతను పొడవుగా, లావుగా చూస్తేనే భయం పుట్టేస్తున్నాడు. అతని మీసాలు మెలితిరిగి, ముఖానికి కాఠిన్యాన్ని ఆపాదిస్తున్నాయి. అతని నున్నని గుండు ఎండలో బోర్లించిన కుండలా మెరుస్తోంది.

 

    అతని పాదాలకు చెప్పుల్లేవు.

 

    ఆంజనేయ గుడిలో తన చెప్పుల్ని ఎవరో ఎత్తుకుపోయారని తెలిసినప్పట్నుంచి అతను కుతకుతా వుడికిపోతున్నాడు. వాడెవడో కనిపిస్తే వాడి కడుపు చీల్చి పేగులతో చెప్పులు కుట్టుకోవాలన్న కసితో వున్నాడు.

 

    మనసు ఏం బాగాలేక సినిమా చూద్దామని అతను ఆ థియేటరులోకి రావడం కేవలం కాకతాళీయమే. అదే నరేష్ కొంప ముంచింది.  

 

    ఆనందమోహన్ అనే వస్తాదు రిజర్వ్ డ్ టికెట్టు కొనుక్కుని థియేటరులోకి వచ్చాడు.

 

    గెట్ మాన్ చించిన సగం టికెట్ ను చేతిలో పట్టుకుని తన సీటు నెంబరు ఎక్కడుందో వెతుక్కుంటున్న అతనికి కాళ్ళూపుతున్న నరేష్ కనిపించాడు. తన భుజం మీద చేయివేసి, చెప్పుల దొంగలున్నారు జాగ్రత్తని తనను హెచ్చరించింది అతనేనని ఆనంద్ మోహన్ గుర్తుపట్టాడు.   

 

    స్టయిల్ గా కాలూపుతున్న అతని పాదాలకు మంచి బానిసల్లా అంటి పెట్టుకున్న చెప్పులు కూడా తనవేనని ఆ వస్తాదు కనిపెట్టాడు.

 

    మరిక ఆలస్యం చెయ్యకుండా ముందుకురికి, నరేష్ చొక్కా కాలర్ ను వెనక నుంచి పట్టుకున్నాడు.

 

    ఈరోజు ఎలాగయినా రజని ఇంటి అడ్రస్ తెలుసుకోవాలని తీవ్ర ఆలోచనలో వున్న నరేష్ తన చొక్కాను వెనుక నుంచి ఎవరో పట్టుకున్నారనిపించి వెనక్కు తిరిగాడు.   

 

    సరిగ్గా అప్పుడే థియేటరులో లైట్స్ ఆరిపోయాయి. స్క్రీన్ సిగ్గుపడుతూ పైకి లేస్తోంది మెల్లగా.

 

    ఇంట్రవెల్ లో నరేష్ కూర్చున్న సీటు ఖాళీగా కనిపించింది రజనికి. అంతకుమించి అతని గురించి ఏమీ ఆలోచించలేదామె.

 

    దాదాపు రెండు గంటల నుంచి థియేటర్ ఆవరణలోనే నరేష్ వెయిట్ చేస్తున్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra