Home » Mainanpati bhaskar » వేగు చుక్క



    వేడిగాలి అటు మళ్ళింది. మంటలు చురచుర కల్చేస్తూ గెలీవైపు వస్తున్నాయి.

    "పద వెదుకుదాం!" అన్నాడు ఇబూకా.

    వెంటనే ఫెటేలుమని శబ్దం. షిప్పులో కొయ్యతో చేసి ఉన్న భాగం మొత్తం రెండుగా పగిలి సముద్రంలో పడిపోయింది.

    దానిమీదే ఉన్నారు ఫకర్, ఇబూకా, ప్రొఫెసర్ ఆనందరావు.


                                 *    *    *


    తలమీద గాయమై, స్పృహతప్పి పడివున్న సాగర్ ని సమీపించాయి మంటలు. ఆ సంగతి అతనికి తెలియడం లేదు.

    మరోక్షణం గడిస్తే అతని బట్టలు అంటుకునేవే కానీ సరిగ్గా అదే సమయంలో ప్రేలింది షిప్పు. విసిరివేయబడ్డట్టు సముద్రంలో పడ్డాడు సాగర్. పడటం పడటం రెండు మీటర్ల లోతుకు మునిగిపోయాడు.

    ఆ విసురుకి, చల్లటి నీళ్ళలో మునిగేసరికి అతనికి తెలివి వచ్చింది. వెంటనే జ్ఞానేంద్రియాలన్నీ అమోఘమైన కోఆర్దినేషన్ లోకి వచ్చేశాయి. ఇంకెవరన్నా అయివుంటే అలాంటి పరిస్ధితిలో ఉక్కిరి బిక్కిరై ముక్కలలోకీ, నోట్లోకీ నీళ్ళు పోయి  ప్రాణాలకు ముప్పు తెచ్చుకునే వారే!

    తక్షణం శ్వాస బంధించాడు సాగర్. నీళ్ళ పైకి తేలాడు. కొద్ది సెకండ్ల సేపు పరిసరాలన్నీ గమనించగానే. జరిగిందేమిటో అతనికి అర్ధమై పోయింది.

    షిప్ రెక్ కేప్టెన్ గా చివరి క్షణంవరకూ షిప్పుని రక్షించవలసిన బాధ్యత తనమీద ఉంది. కానీ తను ఇంక రక్షించే పరిస్ధితిలో లేడు షిప్పు జ్వాలాతోరణంలా మండుతూ మునిగిపోతోంది. ప్రేలుడువల్ల కేబిన్లు అన్నీ ధ్వంసమైపోయాయి. లైఫ్ బొట్లూ, లైఫ్ బాయ్ లూ అన్నీ దూరంగా చుక్కల్లా కనబడుతున్నాయి. అందరూ ఎవరి ప్రాణాలను వారు రక్షించుకునే హడావుడిలో వాళ్ళున్నారు. ఇంక తనొక్కడే మిగిలాడన్నమాట! అయితే అనూహ్య ఎక్కడ? ఆమెని ఎవరన్నా కాపాడి ఉంటారా? లేక.........

    అంతకంటే ముందుకి ఆలోచించడానికి అతని మనసు ఒప్పుకో లేదు.

    చాంగ్!......చాంగ్ ఎక్కడున్నాడు? అతని అనుచరుల ఏమయ్యారు? షిప్పుని తగలబెట్టింది వీళ్ళేనా?

    అల్లంత దూరంలో నల్లటి చుక్కలా కనబడుతోంది ఒక బోటు.

    అందులోనుంచి ఒక ఆడపిల్ల ఆర్తనాదాలు అలలమీద తేలి వస్తూ అస్పష్టంగా వినబడుతున్నాయి.

    చెవులు రిక్కించి విన్నాడు సాగర్.

    సందేహంలేదు, అది అనూహ్య గొంతే!

    "నోరెత్తవంటే గొంతు చీరేస్తాను!" అని గద్దింపు వినబడింది. అది డ్రాకులా చాంగ్!

    అది వినగానే వంట్లోని శక్తి అంతా కూడదీసుకున్నాడు సాగర్. అతి వేగంగా ఆ బోటు వైపు ఈదడం మొదలెట్టాడు.

    అప్పుడు కనబడింది__

    బోటుకీ తనకీ మధ్య తేలుతున్న నల్లటి ఆకారం ఒకటి!

    పరీక్షగా చూశాక, అదేమిటో అర్ధమయింది సాగర్ కి.

    నల్లటి రాకాసిలా ఉండే కిల్లర్ వెల్!

    కదిలి, దగ్గరగా రావడం మొదలెట్టింది అది.

    అతి క్రూరమైన ఆ తిమింగలం పైభాగం అంతా నల్లగా, పొట్ట భాగం తెల్లగా ఉంది. దాదాపు ఎనిమిది; తొమ్మిది మీటర్ల పొడుగు ఉందది. తిమింగరాలు  జలచరాలే అయినా, చేప ఆకారంలోనే ఉన్నా, అవి  చేపలుకావు. స్తన్య జంతువులు. పిల్లలకు పాలు ఇచ్చి పెంచుతాయి.

    అవి సంఘజీవులు, నలభై, యాభై కలిసి గుంపుగా జీవిస్తాయి. అన్నీ కలిసే వేటాడుతాయి ఆహారాన్ని.

    తోకతో నీటిని అల్లకల్లోలం చేస్తూ వచ్చేస్తోందది. శ్వాస వదిలినప్పుడల్లా నీళ్ళు పౌంటేన్ లా ఏడెనిమిది అడుగుల ఎత్తుకి గాలిలో ఎగిసి పడుతున్నాయి.

    చుట్టుపక్కల అంతా జాగ్రత్తగా గమనించి చూశాడు సాగర్.....ఆ ఒక్క తిమింగలమే ఉంది.

    ఇది ఇప్పుడు సిగ్నల్ ఇచ్చి తక్కిన తిమింగలాలని పిలుస్తోంది కాబోలు.

    అతనికి కొద్ది దూరంలో ఆగింది కిల్లర్ వేల్. అతన్ని అంచనా వేస్తున్నట్లు కొద్ది సెంకడ్ల పాటు చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది.

    సాగర్ కి రిలీఫ్ కలగలేదు. ఈ నల్ల తిమింగలాల అలవాట్లు బాగా తెలుసు అతనికి.

    ఇది ఇంత దగ్గరికి వచ్చికూడా తనను తినెయ్యకుండా వెళ్ళిపోయిందంటే రెండు కారణాలు ఉండవచ్చు. ఒకటి: కనీసం ఒక డజను రెండు డజన్లమంది మనుషులని తింటేగానీ తిమింగలం కడుపు నిండదు. 'ఇంత చిన్న  ఎరకోసం ఎందుకు ప్రయాస పడడం' అనుకుని అది మరో పెద్ద చేపను వెదుక్కుంటూ వెళ్ళిపోయి ఉండవచ్చును.

    రెండు: అది పిల్లలు ఉన్న ఆడ తిమింగలం అయితే, ఆహారం కనబడగానే వెనక్కి వెళ్ళి తన పిల్లలని తీసుకొచ్చి వాటి ముందు దాన్ని చంపి, వేటాడే పద్ధతుల్ని ప్రాక్టికల్ గా డిమాన్ స్ట్రేట్ చేసి చూపిస్తుంది.

    ఈ కిల్లర్ వేల్ వెనక్కి వెళ్ళిపోవడానికి పై రెండు కారణాల్లో ఏది ప్రేరేపణ అయి ఉంటుంది?

    అతని సిక్స్ త్ సెన్సు. రెండో కారణమే నిజమై ఉండవచ్చుననీ, కిల్లర్ వేల్ తన పిల్లలని వెంట బెట్టుకుని తిరిగి వచ్చి తన మీద దాడి చెయ్యడం తధ్యమనీ చెబుతోంది.

    తన చావుకి మానసికంగా సిద్దమయ్యాడు సాగర్. అతని భయం అంతా అనూహ్య క్షేమం గురించే.

    మళ్ళీ బోటువైపు ఈదడం మొదలెట్టాడు.

    అతను బోటుకి కొద్ది మీటర్ల దూరంలోకి రాగానే ఉన్నట్లుండి వాతావరణం చల్లబడిపోయింది. మసకమసకగా అయిపోయి, బోటు రేఖామాత్రంగా కనబడటం మొదలెట్టింది.

    పొగమంచు కమ్ముకొస్తోందని గ్రహించాడు సాగర్. చూస్తూ ఉండగానే, మరింత దట్టంగా కమ్ముకొంది పొగమంచు. చాకుతో కొయ్యడానికి వీలయినంత చిక్కగావుంది అది.

    చాంగ్ బోటు ఇప్పుడు అసలు కనబడటమేలేదు.

    క్రమక్రమంగా దూరమైపోతున్నాయి అనూహ్య ఆర్తనాదాలు.


                                                                     *    *    *

    బల్లకట్టులా తేలుతూ, మునగానాం. తేలానాం అన్నట్లు ఉన్న ఆ కిచెన్ ఫ్లోరింగ్ మీద ఉన్నారు ఫకర్, ఇబూకా, ఫ్రొఫెసర్ ఆనందరావూ.

    ఎవరికీ మాట్లాడాలనిపించడంలేదు. ఎవరి భయాల్లో, ఎవరి ఆలోచనల్లో వారు ఉండిపోయారు. అలా ఒక గంట గడిచిపోయింది.

    ఉన్నట్లుండి కళ్ళు మిటకరించి చూశాడు ఆనందరావు, వెంటనే ఆనందంతో లేచి నిల్చుని వెర్రికేక పెట్టాడు.

    "లాండ్! లాండ్ అహొయ్!!"

    మిగతా ఇద్దరూ విస్తుపోయి చూశారు.

    నిజంగానే నేల కనబడుతోంది దగ్గరలో, చిన్న ద్వీపంలా ఉంది అది.

    సముద్ర మధ్యంలో , ఇంత లోతు నీటిలో, ద్వీపమా?

    "ఇదేమిటో మీకు తెలియదు! నాకు తెలుసు!" అన్నాడు హుషారుగా. "ఆ మధ్య బంగ్లాదేశ్ కి దగ్గరగా  సముద్రంలో ఒక ద్వీపం పుట్టిక్కిన పైకి లేచింది గుర్తుందా? అది మాదంటే మాదని బంగ్లాదేశ్, ఇండియాలు  వాదించుకున్నాయి కూడా ఇదీ అలాంటి రకమే! పేపర్ల లో చదవలేదూ బంగళాఖాతంలో కొత్త ద్వీపం ఒకటి పుట్టుకొచ్చిందని? పునోషా అని పెట్టారు దీని పేరు! పునోషా!"

    ఆశ్చర్యంగా మొహమొహాలు చూసుకున్నారు వంటవాళ్ళిద్దరూ.

    దాని మీద భద్రంగా కుడి పాదం మోపి, "శుభం!" అంటూ దిగాడు ఆనందరావు. అతని ఉత్సాహానికి పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. చంద్రుడి మీద మొదటిసారిగా అడుగు పెట్టిన మానవుడు నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కి కూడా అంత సంతోషం కలిగి వుండదు.

    "ఈ బ్రాండ్ న్యూ ఐలాండ్ పునోషామీద మొట్టమొదటిసారిగా లాండ్ అయింది నేనే! నేనంటే నేనే!" అన్నాడు సంబరంగా. "ఇదిగో! ఇబూకా! మేడమీద మిడత వాలినట్లు అలా కళ్ళప్పగించి చూడకు. సెల్ బ్రెట్ చేసుకోవలసిన సమయం ఇది చూపించు నీ పాక ప్రావీణ్యం తాగించు! మాంచి టీ! త్వరగా!"

    ఇబూకా తల ఉపాడు. కిచెన్ ప్లోరు మీద అడ్డదిడ్డంగా చాలా  సామాన్లు వున్నాయి. కిరోసిను స్టౌ ఒకటి, డబ్బాపాలు, టీ పొడి, అవీ ఇవీ____

    స్టవ్ అంటించాడు ఇబూకా.

    పైపు వెలిగించి, ఆ ద్వీపానికంతా తనే మకుటంలేని మహారాజు అయినట్లు కలయదిరిగి చూస్తున్నాడు ప్రొఫెసర్ ఆనందరావు.

    స్టౌ వేడెక్కగానే ఆ "ద్వీపం" ఎద్దు ఒళ్ళు జలదరించినట్లు చలించింది.

    ఉలిక్కిపడ్డారు అందరూ.

    వెంటనే బుడుంగున నీళ్ళలోకి మునిగింది "ద్వీపం."

    దానితోబాటే మునిగారు ఆ ముగ్గురూ.


                                                                      *    *    *

    దుఃఖాన్ని అణిచి పెట్టుకుంటూ, చాంగ్ ని దాహించేలా చూసింది అనూహ్య.

    అతను బోటుని అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

    "దేవతలందరూ తనమీద అగ్రహించినట్లు ఈ కష్టాలన్నీ ఏమిటి?" అనిపించింది అనూహ్యకి. సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి విశాఖపట్నం వచ్చిన తను షిప్పు ఎక్కడం, అందులో ట్రాప్ అయిపోవడం, ఆ షిప్పు కేప్టెన్ ప్రేమలో పడిపోవడం, షిప్పుని చాంగ్ గ్యాంగ్ స్వాధీనం చేసుకోవడం, తర్వాత అగ్నిప్రమాదం-

    ఇప్పుడు ఈ బోటులో, ఈ మోటు మనిషితో బాటు ప్రయాణం!

    ఎక్కడికి తీసుకెళతాడు ఇతను తనని? ఏం చేస్తాడు? సాగర్ క్షేమంగా ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? తన ఆచూకీ కనుక్కుని రక్షించగలడా అతను?

    ఆమె పెదిమలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి.

    అంతలో పొగమంచు కమ్మేసింది భూమి, సముద్రం, ఆకాశం, అన్నీ ఏకమైపోయినట్లు కనబడుతున్నాయి. అందుకని బోటుని ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం విరమించాడు చాంగ్. మంచు తొలిగేదాకా అతను చెయ్య గలిగింది ఏమీ లేదు.

    ఈ వ్యవధిలో టైం పాస్ చెయ్యడానికి కాసేపు అనూహ్యతో వినోదించదలుచుకున్నాడు అతను.

    "ఏయ్ పిల్లా! ఇట్రా!" అన్నాడు తీరుబాటుగా వెనక్కి జారగిలబడి.

    రోషంతో అనూహ్య ముక్కుపుటాలు పెద్దవయ్యాయి.

    "రమ్మంటుంటే!"

    "నన్ను తాకితే నువ్వు నరకానికి పోతావ్!" అంది అనూహ్య మండిపడుతూ.

    విరగబడి నవ్వాడు చాంగ్. ఆ నవ్వుకి బోటు అటూ ఇటూ ఊగిసలాడింది.

    "నరకానికి పోతావ్!" అని ఆమె గొంతుని అనుకరించాడు వెక్కిరింపుగా. వెంటనే నిప్పులు కక్కుతూ, తన కాళ్ళదగ్గర దొర్లుతున్న మహేంద్ర తలను చూపించాడు.

    "ఇది చూశావా? నరకం అని నన్ను భయపెట్టకు! నేనెక్కడ ఉంటే నరకం అక్కడ ఉంటుంది! దానికి రాజుని నేనే! తెలిసిందా? మహేంద్రగాడి తలని నరికినట్లు నీ తలనీ నరికి ష్రింక్ చేసెయ్యగలను!"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra