Previous Page Next Page 
అభిలాష పేజి 14

    రేండ్రోజుల తర్వాత బైరాగి వచ్చాడు. అయినా ఆ విషయం ఇక పట్టించుకోలేదు. ఆమె ఒకసారి అతడివైపు పరిశీలనగా చూసింది. కానీ, అతడి కన్ను మామూలుగానే వుండి. అయినా ఆమె మరికొన్ని రోజుల్లో ఒకదీర్ఘ విదేశీ ప్రయాణపు హడావిడిలో వుండి. కొత్తగా పెట్టబోయే పరిశ్రమకోసం ఆమె ప్రాన్స్ వెళ్తూంది. ఎలాగూ వెళ్తూంది కాబట్టి, సెలవులు వున్నాయి. కాబట్టి మరో మూడునెలలు యూరఫ్ అంతా తిరగాలని ఆమె అభిలాష. ఈ ఫ్రాన్ త్రిఫ్వల్ల ఆమె చాలా ఉత్సాహంగా ఉంది చాలారోజుల్నుంచి.
   
                                                                               7
   
    శవం సంపాదించటం ఎలా అన్నది పెద్ద ప్రాబ్లం అయింది చిరంజీవికి.నిజమే. శవామేక్కడ దొరుకుతుంది? అందులోనూ బందువులూ, మిత్రులూలేని అనామక శవం.
   
    ఎవరో బిచ్చగత్తేగానీ, పుట్ పాట్ మీద శవం గానీ దొరకవచ్చు గానీ, అలాటివాళ్ళని హత్య చేయవలసిన అవసరం ఇతగాడికి లేదని జడ్జీ కోర్టులో కేసు కొట్టేస్తే కష్టం.
   
    ఆస్పత్రుల్లో అనామకశవాలు దొరకవచ్చుగానీ వరు డేట్ సర్టిపికేట్ నోట్ చేసుకుంటారు. తరువాత పోలీసుల పరిశోధనలో అది ఆస్పత్రిలో సహజంగా మరణించిన శవం (వాక్యం కరెక్టేనా) అని తేలితే కష్టం. ఈ ప్లాన్ లో వచ్చిన చిక్కేమిటంతే, కోర్టుకెక్కిన తరువాత ఒకసారి ఉరిశిక్ష పడకపొతే _ మళ్ళీ ఇంకోసారి నాటకమాడటానికి వీలుండదు.   
   
    శవాన్ని ఎలా సంపాదించాలా అన్న సమస్య నిజంగానే అతడిని చాలా బాధపెట్టింది. చాలరోజులు కొట్టుమిట్టులాడి సర్వోత్తమరావుని కల్సుకున్నాడు.
   
    "నిజమే" అన్నాడాయన. "మామూలు శవం అయితే లాభంలేదు. ఏదైనా మిడిల్ క్లాస్ కుటుంబపు శవం అయితే బావుంటుంది." అని ఆగి సాలోచనగా, "మనం అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కుంతామేమోఆలోచించు చిరంజీవి" అన్నారు.
   
    "నేనూ అలోచించేను గురూగారూ! కానీ మీకున్న అనుభవంతో మీరుచేప్పంది ఈ ప్లాన్ లో ఎక్కడున్నా లొసుగులున్నాయా? ప్రాణాపాయం వుందా?"
   
    "లేదనుకో" నసిగేడు అయన.
   
    "మరెందుకు భయం...." అన్నాడు ఛీరంజీవి.
   
    ట్లింగ్ ....... ట్లింగ్......
   
    "శవం ఒక అమ్మాయిది అయితే బావుంటుంది." అన్నాడాయన. "మిడిల్ క్లాసు అమ్మాయి, పెళ్లయినా, పిల్లలున్నా ఫరవాలేదు. కాని పోస్టుమారడం లో సహజమరణం కింద రాకుండా వున్న కేసు _ అంటే కేన్సర్ _క్షయ _ఇలాంటి రోగాల్తో మరణించకుండా వుండాలి."
   
    "ఎంత ఖర్చయినా ఫరవాలేదు. అవునా" అన్నాట్టు అడిగాడు ఛీరంజీవి.
   
    అవును, ఖర్చుకి వెనకాడగూడదు ."
   
    చిరంజీవి వంగి రహస్యంగా "గురూగారూ _ నా దగ్గర డబ్బుల్లేవు. ఈడ్చితంతే అర్ధరూపాయి వుంది. ఏం చేద్దాం"  అన్నాడు.
   
                      *    *    *    *   
   
    హొటల్లో శిభ్రంగా తిని డబ్బులు తక్కువై జీవితాన్ని ప్లేటుఇడ్లీ _రుబ్బురిలోతో పోల్చుకొన్న తరువాత ఆ హొటలు ప్రోప్రైటరూ, చిరంజీవి స్నేహితులైపోయారు. అయన అరువు పెట్టేవాడు చిరంజీవికి.
   
    అలాటి అరువు భోజనం చేస్తూ _ చేస్తూ తలెత్తి చూసిన చిరంజీవి ఉలిక్కిపడ్డాడు. ఎదుటిసీట్లోదారా సింగ్ భోజనం పూర్తీచేసి, చెయ్యి కడుక్కుని లేచిపోతున్నాడు. చిరంజీవికి ప్లాష్ లాంటి ఐడియా వచ్చింది. తొందర తొందరగా భోజనం పూర్తీచేసి బైటకొచ్చాడు. అప్పటికే దారాసింగ్ వీధి చివరికి వెళ్ళిపోయాడు. దాదాపు పరుగేడ్తూ చోరంజీవి ఆ వీధిచివరికి చేరుకునేసరికి దారాసింగ్ ఆ వీధి ఇంకో చివర మలుపు తిరుగుతూ కనిపించేడు. ఇలా వత్తేదారునవలలో లాగా అతడిని వెంబడించి చివరకు వూరిచివర సగంకూలిన సత్రం దగ్గరికి చేరుకున్నాడు చిరంజీవి. అప్పటికే అతడులోపలికి వెళ్ళిపోయాడు.
   
    తనూ లోపలి వెళ్ళటానికి ధైర్యం చాలక చిరంజీవి మెట్లమీదే నమ్రతగా నిలబడి "దారాసింగ్ గారూ __ అయ్యా దారాసింగ్ గారూ " అని పిల్చేడు. అలికిడిలేదు. అతడికి ఏం చేయ్యాల్లో తోచలేదు. రెండు మెట్లెక్కి మల్లీపిల్చేడు. సమాధానం రాక, లోపలి వెళ్ళాడు. లోపల అంతా గబ్బిలాల వాసన. ఏవైనా డబ్బాలుంటాయేమో__ చూసిన సినిమాల్లో లాగా అనుకున్నాడుగానీ అలాంటివేమీ లేవు. నలుగురుగూమ్దాలూ _ మధ్యలో డాన్సరు కూడా లేరు. అతడు మళ్ళీ ఇంకోసారి పిలవబోతూ వుండగా "ఎవరదీ" అన్న స్వరం గంభీరంగా వినబడింది.
   
    చిరంజీవి ఉలిక్కిపడిముందుకు తూలి పడబోయి నిలడొక్కుకున్నాడు. ఎదురుగా ఆరడుగుల మనిషి. _క్రూరంగా నిలబడి వున్నాడు.
   
    "గుడ్ మార్నింగ్ దారాసింగ్ కాదు భీమేశ్వ ర్ " అన్నాడు రౌడీ .
   
    "పేరులో యేముంది? వీరాంజనేయులుగారూ."
   
    "ఇంతకీ యేం కావాలి నీకు" బొంగురుగొంతు గది గోడలమధ్య ప్రతిధ్వనించింది. చిరంజీవి నమ్రతగా, నాకో మిడిల్ క్లాస్ శవం కావాలి దారాసింగ్ గారూ" అన్నాడు.
   
    ఈసారి దారా సింగ్  ముండుకు తూలిపడ్డాడు.
   
                                                  *    *    *    *
   
    సాయంత్రం అయిదయింది.
   
    సర్వోత్తమరావు కోర్టులో పనిముగిమ్చుకుని కారు దగ్గరికి వచ్చేడు. అయన జూనియర్స్ తో కలసి ఎక్కబోతూవుంటే, "గుడ్ మార్నింగ్  సార్" అన్న మాటలు వినిపించాయి. తల తిప్పిచూసేడు.
   
    చిరంజీవిని అర్ధరాత్రి అపుచేసిన ఇన్ స్పెక్టర్ __ దగ్గరకోస్తూ "బావున్నారా సార్" అన్నాడు.
   
    "హల్లో ఇన్ స్పెక్టర్ ! మీరా?" అన్నాడాయన.
   
    "మాకు పప్పన్నమేప్పుడు పెడ్తున్నారు?" షేక్ హాండిస్తూ అడిగేడు ఇన్ స్పెక్టర్.
   
    "దేనికి?"

 Previous Page Next Page