"దానికి 1947 ఆగస్టు పదిహేను అన్నాడు మిస్టర్ జగన్నాధ్" గుర్తు చేశాడు క్విజ్ మాస్టర్.
"మీరు రైట్ అన్నారు."
"కాదా?"
"నో" అన్నాడు రుత్వి.
"అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఎర్రకోట పై తొలిసారి ఎగురవేసింది 1947 ఆగస్టు పదహారో తేదీ ఉదయం ఎనిమిదిన్నర గంటలకు.
పదిహేనో తేదీన ప్రజల సందర్శనం కోసం మాత్రమే ఢిల్లీ ప్రిన్సెస్ పార్క్ ఇప్పటి ఇండియన్ గేట్ దగ్గర ఎగురవేశారు."
"అబద్దం"
"ఎక్స్ క్యూజ్ మీ సర్!"
రుత్విలో అదే ప్రశాంతత.
"మీరు అరిచినంత మాత్రాన నిజం అబద్దమైపోదు.
ఇకపోతే మిస్టర్ సురేంద్రని అడుగుతూ మన జాతీయ చిహ్నంలో మూడు సింహాల క్రింద ఏముంటాయి అంటూ ఓ ప్రశ్న వేశారు. ప్రశ్న్ తప్పంటాను.
కారణం....
నిజానికి ఓ సింహం మనకి అభిముఖంగా కనిపించకపోయినా జాతీయ చిహ్నంలో వుండేవి నాలుగు సింహాలు."
"హీ ఈజ్ రైట్" అంటూ పత్రికా విలేఖర్లలో నించి ఓ వృద్దుడు నిలబడి రుత్విని సమర్దించాడు.
క్విజ్ మాస్టర్ సుందరం ముఖంలో రంగులు మారుతున్నాయి.
ఇంతసేపు రుత్వి చెప్పాలని మొండికేసిన సుందరంగారు రుత్వి ఇలా ఎన్ని ఏకరువు పెడతాడో అన్న టెన్షన్ లోకి జారుకున్నాడు.
"మరో ప్రశ్న మిస్టర్ జగన్నాధ్ ని అడుగుతూ మన జాతీయ గీతాన్ని తొలిసారి ఆఫీషియల్ గా పాడిందెప్పుడు అన్నారు.
1911 డిసెంబర్ 27 వ తేదీన కలకత్తాలో జరిగన భారత జాతీయ కాంగ్రెస్ సదస్సులో అంటే కరక్టనేశారు."
ప్రేక్షకులు ఊపిరి బిగపట్టుకుని చూస్తుంటే చెప్పాడు రుత్వి.
"ఆ సదస్సులో పాడిన మాట నిజమేగానీ అప్పటికి - ఆ గీతం జాతీయ గీతంగా ప్రభుత్వం ఆమోదించలేదు.
అలా ఆమోదముద్ర పడింది 1950 జనవరి ఇరవై నాలుగో తేదీన.
అలాంటప్పుడు ప్రశ్నలో జాతీయ గీతాన్ని అఫీషియల్ గా అంటూ అడ్రస్ చేయడం ఎంతవరకూ న్యాయం?"
"హుర్రే" అంటూ విద్యార్దులు కొందరు చప్పట్లు కొట్టారు.
విలేఖరులు చాలా సీరియస్ గా నోట్ చేసుకుంటుంటే అన్నాడు రుత్వి.
"నన్నడిగిన ఓ ప్రశ్న గురించిన ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. పాము విషం లేకుండా ఓ రకమైన ఆకు తింటం మూలంగా అంటూ జవాబు తప్పని తేల్చేశారు. "
క్విజ్ మాస్టర్ గొంతు నీరసంగా పలికింది.
"అది నిజం.'
"ఒకప్పుడు"
ఠక్కున జవాబిచ్చాడు రుత్వి.
"సైన్స్ సరైన జవాబు తెలుసుకోని రోజుల్లో. ఇప్పుడు శాస్త్రజ్ఞులు సైంటిఫిక్ రీజన్ని పరిశోధించి గుర్తించారు.
సామాన్యంగా పాము విషంలోని అల్ఫాన్యూరోహక్విన్ ప్రాణి కండరాల మీద వుండే ఎసిటిల్కో లైన్ రిసెప్టర్ మాలిక్యూల్స్ పై ప్రభావం చూపుతుంది.
ఈ రిసెప్టర్ నరాల నుంచి సూచనలని అందుకని కండరాల సంకోచ వ్యాకోచాల గురించి, విశ్రాంతి గురించి బాధ్యతల్ని నిర్వహిస్తుంటాయి.
ఈ రిసెప్టర్సు ఏం తీయకుండా పక్షవాతానికి గురి చేస్తుంది పాము విషం. ప్రాణహానీ కలిగిస్తుంది"
సాలోచనగా చూశాడు ఏకాగ్రతగా వింటున్న ప్రేక్షకుల వైపు.
"కానీ ఇజ్రాయిల్ లోని ఇమ్యూనాలజీ విభాగం పరిశోధన ప్రకారం ముంగిస శరీరంలో నిరిసెప్టర్ మాలిక్యూల్స్పై పాము విషం ఏ ప్రభావాన్నీ చూపించలేదు.
అంటే ముంగిస శరీరంలోని ఆరిసెప్టర్స్ నిర్మాణమే అలా వుంది.
ప్రేక్షకులంతా రుత్వి పక్కనే వున్నట్టు కేకలు కేరింతలతో చప్పట్లు కొడుతుంటే - "
అవమానభారంతో నడవబోయి క్విజ్ మాస్టర్ సుందరాన్ని చూస్తూ అన్నాడు రుత్వి -
"మిమ్మల్ని కించపరచడం నా వుద్దేశం కాదని మరోసారి వినమ్రంగా తెలియజేసుకుంటున్నాను"
నిర్వాహకులు ఎక్స్ పర్ట్ కమిటీదాకా ఆగకుండా వెంటనే డయాస్ పై అనౌన్స్ చేశారు మరోసారి ఓ వారంలోగా పోటీ నిర్వహించబడుతుందని.
విజూష మనసు తేలికపడింది.
రుత్వి ఓడిపోలేదు.
అలా అని గెలవనూలేదు.
ఆ ఫలితం తేలడానికి ఇంకా వారం వ్యవధి వుంది.
జనం మధ్య నుండి రుత్వి తప్పించుకుంటూ కారు పార్కింగ్ ఏరియాకి వెళ్లడానికి సుమారు పది నిముషాలు పట్టింది.
విజూషకే తెలియనంత సాహసం చేయగలదు.
అసలు చేయాలని చివరి క్షణందాకా అనిపించలేదు.
ఓ కారు దగ్గర నశ్య నిలబడి వుంది. రుత్వితో మాట్లాడుతూ...
అది అసూయో లేక తన నుంచి తనకి ప్రతిపాత్రమైనదాన్ని ఎవరో లాక్కుపోతున్న ఆందోళనో స్పూర్తి చూస్తుండగానే రుత్వి ముందుకు నడిచింది విజూష.
"ఐయామ్ విజూష" అహాన్ని చంపుకుని తనని తాను పరిచయం చేసుకుంది.
"మీరంటే..."
ఆ తర్వాత ఏం మాట్లాడాలో అర్దం కాలేదు క్షణంపాటు.
"అదే... ఒక మగాడు ఆరు నెలల కాలంలో తండ్రిగా ప్రపంచజనాభా అంత సృష్టికి కారణం కాగలడు అని క్విజ్ మాస్టర్ ఇందాక అడిగారు."