Previous Page Next Page 
అమ్మో! అమ్మాయిలు పేజి 13

    " జాగ్రత్తగా వినండి. మి వాటాలోంచి లెట్రిన్ కి వెళ్ళాలంటే దారి ఎటో బాత్రూమ్ కళ్ళా లంటే దారి ఎటో చెపుతాను."

    " లెట్రిన్ కి బాత్ రూమ్ కి దారి చెప్పటమేమిటండీ. ఈ పీతబొక్క అంత యింటిలో దేనికెటు దారో కనుక్కోలేమా? కొంపదీసి బాత్ రూమ్ అంటే కృష్ణకు దారి, లెట్రిన్ కంటే కాలవ వడ్డుకి దారి చుపించరు కాదా?" అన్నాడు అబ్బులు.

    " లెట్రిన్, బాత్ రూమ్, పంపు, బావి అన్నీ మా పెరటి వేసే వున్నాయి. వచ్చిన చిక్కేమిటంటే వాటి దగ్గరకు వెళ్ళాలంటే సమాంతర రేఖలు పట్టుకుంటే లాభం లేదు. వక్ర రేఖలు పట్టుకోవాలి. ఇది పగటిమాట.

    యిహ రాత్రిళ్ళు అయితే టార్చిలైటు, మెత్తని బూట్లు కర్ర, వగైరా వస్తువులుండటం మంచిది."

    " డిటెక్టివ్ నవలలో డిటెక్టివ్  లా మెలగాలన్న మాట" అన్నాడు వ్యాకర్ణ.

    " సరీగ్గా గ్రహించారు" వ్యాకర్ణని మెచ్చికోలుగా చూస్తూ అంది జయచిత్ర.

    " గ్రహించాము సరే. ఈ జాగ్రత్తలు దేనికి!" అన్నాడు అబ్బులు.

    " జాగ్రత్తలు దేనికేమిటి? జాగ్రత్తగా వుండటానికి. మిరు బాత్ రూమ్ కెళ్ళాలంటే... పోనీ లెట్రిన్ కెళ్ళాలంటే?"

    " ఇప్పుడా అవసరం లేదండి." ఓసారి లెట్రిన్ కెళ్ళి రమ్మంటుందేమో అని కంగారుపడి అడ్డుతగిలాడు అబ్బులు.

    " మికు తొందర జాస్తీ" అంది జయచిత్ర.

    " బాగా గర్హించారు మావాడి సంహ్గతి" అన్నాడు వ్యాకర్ణ.

    " అవసర విషయాలకి ముందుకోస్తారు మిరు" అంది జయచిత్ర వ్యాకర్ణని చూస్తూ.

    "బాగా గ్రహించారు" అని వెంటనే నాలిక్కొరుక్కుని " ఆ..." అన్నాడు వ్యాకర్ణ.

    భూతద్దాలలోంచి వ్యాకర్ణను చూస్తూ " కుందిరింది రోగం, వదిలింది వాతం" అని లోలోపల రాగం తీశాడు అబ్బులు.

    " నే చెప్పేదే సాంతం వినకుండా అడ్డు తగులుతున్నారు. లెట్రిన్ కెళ్ళాలంటే మి భాగంలోంచి నాలుగు గదులు ముందుకి నడిచి ఎడమవైపుకి తిరిగి పదడుగు లేస్తే అటో సందు ఇటో సందు వస్తాయి.

    తూర్పువైపు సందులోకి తిరిగి నాలుగు గజాలు దాటి దక్షిణానికి దారితీస్తే మూడంగల్లో పడమవైపు సందు వస్తుంది. అక్కడ లెట్రిన్ వుంటుంది.

    బాత్ రూమ్ కెళ్ళాలంటే మి రూమ్నుంచి ఎడమ వైపుకి నడచి అక్కడవున్న అడ్డుగోడవైపు తిరిగి ఆ తర్వాత పడమరవైపు పదడుగు లేస్తే దక్షిణం వస్తుంది. ఆపై తూర్పు." 

    " జయచిత్రగారూ! మి తూర్పు పడమరలకో నమస్కారం. మి యింట్లో చేరిం తర్వాత లెట్రిన్ కెళ్ళకాతప్ప దు బాత్ రూమ్ స్నానం చేయకా తప్పదు.

    అప్పుడు ఎటునుంచి ఎటు వెళితే ఎటు మునిగి ఎటు తేలుతామో తెలుసుకుంటాంలేండి" అన్నాడు వ్యాకర్ణ.

    " తప్పిపోతామనే అనుమానం వచ్చిందనుకోండి. వెంటనే మా రూమ్ కిటికీకి ఓ పాతిక బారల చాంతాడు కాటి దాన్ని మా నడుంకి కట్టుకుని ముందుకు సాగుతాము.

    రూమ్ తిన్నగా లేకపోతే మళ్ళీ మా రూమ్లోకి వచ్చి పడతాము. ఎలావుంది అయిడియా?" మురిసిపోతూ అడిగాడు అబ్బులు.

    అయిడియా బాగానే వుంది. ఎటొచ్చి మిరు ఏ అవసర నిమిత్తం రూమ్ బయటి కెళ్ళదలిచారో అది ఫలించక ఆ పని రూమ్లోనే చేయాల్సొస్తుందని నా బాధ" శేరు ఆముదం తాగినట్లు ముఖం పెట్టి అన్నది జయచిత్ర.

    అబ్బులు భూతద్దాల్లోంచి ఎటో చూస్తూ " మా చెడ్డ పిల్ల" అనుకున్నాడు.

    వ్యాకర్ణ జయచిత్ర అన్నది వినిపించుకొనట్లే ముఖం పెట్టి " బామ్మగారేం చేస్తున్నారో" అన్నాడు.

    " నే చెప్పవలసింది చాలా మిగిలిపొయ్యాయి. నే చెప్పేది వినక బామ్మాగారేం చేస్తున్నది? అమ్మమ్మగారి పని అయిందా? అంటూ అధిక ప్రసంగం చేస్తారేమిటి? యిలా  అయితే మిరు మా యింట్లో వున్నట్లే?" అని గదమాయించి మళ్ళీ మ్పోడలు పెట్టింది జయచిత్ర.

 Previous Page Next Page