Home » Mainanpati bhaskar » Mister U

 

    అ మొగమనిషి వంటి మీద దెబ్బల తాలుకూ వాతలు !
    ఎవరు ఇంతగా హింసించారు ఇతన్ని?
    రాక్షసుడా
    "ఏమయింది?" అన్నాడు రాజు.
    నెమ్మదిగా దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పాడు అతను.
    "అడవిలో అధికార్ల జులుం భరించలేకుండా ఉన్నాము సార్! అడవిని నమ్ముకున్న వాళ్ళం. బతకలేకుండా వున్నాం. అడవిని అమ్ముకుంటూ బతక నేర్చినవాళ్ళు వున్నారు. అడవి సేద్యంలో -- మూడేళ్ళయి పంటలు పండక, ఆకలి నోళ్ళకి మామిడి టెంకెలూ, చింతపండూ, బూడిదా కలిపి తింటున్నాం సార్! చింతకాయలు ఏరినామని నా పెద్దకోడుకుని పట్టుకుపోయి దొర బంగ్లాల ఎట్టి చేయించుకుంటున్నారు. ఇంక ఇక్కడ ఉండలేమని గుడిసె పీక్కుని వెళ్ళిపోతుంటే - అయ్యా -- మా నాయనకాలం నాటి ఈ వెదురుబొంగులూ, తాటి దుంగా చూసి, ఇది అడవిలో కలప కొట్టిన బాపతని కేసు పెట్టినారు సార్!
    దొంగ కేసు మాఫీ చెయ్యడానికి దొరలు నా పెద్ద కూతుర్ని పట్టుకుపోయినారు సార్! నేనూ మా ఆడదీ పెద్ద వయసోళ్ళం సార్! ఈ పిల్లలు పసివాళ్ళు సార్! ఈ ఎద్దు ముసల్ది సార్! మా తాన ఇంకేం లేదు సార్!" అన్నాడు కాళ్ళు వదలకుండా.
    అర్ధమయింది రాజుకి.
    అడవిలో బతకలేక బిబాణా ఎత్తేసి , తనకున్న కొద్ది పాటి సామానులతో బాటుగా గుడిసె తాలుకూ తాటి దుంగా, వెదురు బొంగులూ తరలించుకు వెళ్తుంటే, అది అడవిలో కొట్టిన కలప అని ఉత్త పుణ్యానికే పాపం అంటగట్టి, చాకిరీ కోసం వీళ్ళ కొడుకునీ విలాసానికి వీళ్ళ కూతుర్నీ ఎత్తుకు పోయారన్నమాట!
    ఎక్కడుంది న్యాయం ?
    గుండె నీరయిపోతుండగా "నీపెరేమిటో .....మేము మిమ్మల్ని బెదిరించి ఏదైనా లాక్కొవడానికి రాలేదు లే!" అన్నాడు రాజు.
    తనని పీడించని ఒక మనిషి ఇన్నాళ్ళకు కనబడినందుకు బ్రహ్మాంనందభరితుడయి పోతున్నట్లుగా ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు ఆ మనిషి.
    "నీ పేరేమిటి ?" అన్నాడు రాజు ఆప్యాయంగా.
    "ఏమిరా అంటే పలికేవాణ్ణి -- నా పేరేమైతే నేమి దొరా......అడిగినావు గనుక చెబుతున్నా -- నా పేరు హనుమంతు " అన్నాడు అతను.
    "ఓర్నాయనోవ్!" నీపేరు ఇంకా నీకు గుర్తుందే!" అంది అతని భార్య.
    హటాత్తుగా తేలికయిన వాతావరణాన్ని తనూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా.
    తల్లిదండ్రులు ఇద్దరూ ఎప్పుడూ నవ్వు మొహాలతో ఉండగా చూడని పిల్లలిద్దరూ ఏడుపు మాని కొద్ది క్షణాలు ఆశ్చర్యంగా చూసి, వాళ్ళు కూడా కేరింతలు కొట్టారు.
    "నాకు తెలుసు -- ఈ దొర మంచోడు -- మన కొడుకుని , బిడ్డనీ మళ్ళీ మనకు దొరికేలా చేస్తాడు " అంది హనుమంతు భార్య పరోక్షంగా తన అభ్యర్ధనని వెల్లడిస్తూ.
    "అందరం కలసి ప్రయత్నం చేద్దాం " అన్నాడు రాజు.
    అతని మాటలు పూర్తి కాక ముందే , ఒక లారీ వస్తున్నా శబ్దం వినబడింది.
    వెంటనే విహ్వలంగా చూశాడు హనుమంతు. ఎద్దుని తుప్పల్లోకి తోలాడు. రక్షించమన్నట్లు రెండు చేతులూ ఎత్తి దణ్ణం పెట్టి, తను కూడా పొదలచాటున అదృశ్యం అయ్యాడు.
    ఎందుకైనా మంచిదని, సృష్టిని కూడా చెట్ల చాటుకి వెళ్ళమన్నాడు రాజు.
    లారీ ఆగింది. డ్రైవర్ అనుమానంగా చూస్తూ కిందికి దిగాడు. లారీ నిండా శ్రేష్ఠమైన కలప లోడ్ చేసి వుంది.
    "సర్! ఇందాకే కృష్ణ కి ఇచ్చాం -- కావాలంటే సెల్ లో అడిగి కనుక్కోండి. అన్నీ పక్కగా ఉన్నాయ్ సార్ - చూడండి ' అని రాజు అడక్కముందే కొన్ని కాగితాలు తీసి చూపించాడు డ్రైవర్.
    వచ్చిన అవకాశం వదులు కోకుండా , ఆ కాగితాలు అందుకుని పరిశీలనగా చూశాడు రాజు. అతని వళ్ళు భగభగమండినట్లయింది.
    ఆ కాగితాల్లో యేమని రాసి వుందీ? అడవిలో ఒక చిన్న కాటేజ్ వుందిట. దాని యజమాని ఆ కాటేజ్ ని డిమాలిష్ చేసి, దాని తాలుకూ కలపని ఇంకో ఊళ్ళో తను కట్టుకోబోతున్న ఇంటి కోసం తరలించడానికి పర్మిషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. అధికారులు అందుకు పర్మిషన్ ఇచ్చారు.
    ఈ ఫలానా నెంబర్ లారీలో ఉన్నది ఒక చిన్న కాటేజ్ తాలుకూ కలప అని సర్టిఫికేట్ వుంది.
    పబ్లిగ్గా దోపిడీ!
    ఎవరో ఫారెస్ట్ కాంట్రాక్టర్లు -- అధికారులతో కుమ్మక్కయి కలప కొట్టేసి తరలిస్తున్నారు -- ఇదే కాటేజ్ తాలూకు పాత కలప అన్న నెపంతో !
    ఎవరికి అందాల్సిన ముడుపులు వాళ్ళకి అందుతున్నాయి గనక అందరూ చూసీ చూడనట్లుగా పోతున్నారు.
    కానీ నిజంగా తన గుడిసెని తనే కూల్చుకుని నాలుగు వెదురు బొంగులు బండిలో వేసుకు వెళ్తున్న ఈ హనుమంతు కొడుకూ, కూతురూ మాత్రం అన్యాయమైపోయారు.
    "నిజంగానే కృష్ణకి లక్ష రూపాయలు ఇచ్చాను సార్!" అంటున్నాడు డ్రైవరు. అతనిలో భయం కనబడటం లేదు. కేవలం కన్ ఫ్యూజన్ కనబడుతోంది. అంతే !
    "ఇక్కడ కలెక్షన్ సెంటర్ ఒకటి వున్నట్లు నాకెవ్వరూ చెప్పలేదే - పంపకాలు సరిగ్గా జరగట్లేదే" అన్నాడు రాజు , దబాయింపు సెక్షను మొదలెడుతూ.
    "సార్ ! తమరు కొత్తగా వచ్చినట్లున్నారు -- మెల్లిగా అన్నీ తెలుస్తాయి. అన్యాయం ఏమీ ఉండదండీ
    ఎవరికి కావాల్సిన షేరు వాళ్ళకి అందకపోతే ఓనరు ఊర్కోడండి- మహా స్ట్రిక్టు మనిషి! తాట వల్చేస్తాడు -- కృష్ణ సంగతి కనుక్కుంటాడు లెండి -- మీక్కావాలంటే పేమెంటు ఇప్పుడే చేస్తాం సార్. తేడా ఏం వుండదు. మా దగ్గర ఎప్పుడూ రిజర్వుగా డబ్బు వుంచుతాడు సార్ ఓనర్. మాట రాకూడదు ." అన్నాడు.
    లాభాలతో బాగా నున్నగా అయ్యాడన్నమాట - రెట్లు పెంచుతున్నాను. "రెండు ఇమ్మను " అన్నాడు రాజు.
    డ్రైవరు మారు మాట్లాడకుండా డబ్బు తీసి ఇచ్చాడు.
    "డబ్బు ఇంటికి పంపించి వస్తా - మీ రూటు ఎటురా?" అన్నాడు రాజు కావాలనే రూడ్ గా.
    "డీప్ ఫారెస్టు లోకి వెళ్ళి , అడవికి అటువేపు చేరుకోవాలి లారీ . " చెప్పాడు  డ్రైవర్.
    "మేం కూడా ఆటే వెళ్ళాలి" అన్నాడు రాజు.
    "మేం" అంటే ఎవరు ? అని అడగలేదు డ్రైవరు. విషయాలని గమనించమని మాత్రమే అతనికి ఆదేశాలు గానీ పై అధికారులని నోరు విప్పి ప్రశ్నలు అడగటం అక్కడి ఆనవాయితీ కాదు.
    పొదల చాటుకి వెళ్ళాడు రాజు.
    పాము చెవులతో వింటున్నాడు డ్రైవర్.
    "సృష్టీ! మనం లారీలో వెళ్తున్నాం" అన్నాడు రాజు పెద్దగా -- డ్రైవర్ కి తమ మాటలు వినబడాలి.
    "వెహికలు దొరికిందన్నమాట!' అంది సృష్టి తనూ అంత పెద్దగానే . 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra