Home » Yandamuri veerendranath » అష్టావక్ర


    అవగాహన లేక 12-16 మధ్య వయసులో తామెంత బాధపడ్డారో, ఆ వయసు దాటాక ఈ పెద్దవాళ్ళు మర్చిపోతారు. తమ కొడుకులూ, కూతుళ్ళూ ఈ 'స్టేజి' లోంచి నడిచి తమంతట తామే బయటకు రావాలని ఆశిస్తారు. ఇదంతా ప్రకృతిసిద్ధమనీ ప్రకృతే నేర్పుతుందనీ భావిస్తారు. తాము చెప్పకపోతే ఈ చిన్నవాళ్ళు, ఇంకెలాగెలాగో దీన్ని తెలుసుకుంటారనీ, అది నిశ్చయంగా ఎక్కువ హానికరమనీ గ్రహించరు. తెలియటం కన్నా 'తెలియకపోవటం' వల్లనే పిల్లల ఆలోచన్లు ఎక్కువ ఆ విషయం చుట్టూ పరిభ్రమిస్తాయనీ ఆలోచించరు.*

    భవానీశంకరానికి సరీగ్గా ఇదే సమస్య కొన్నేళ్ళ క్రితం వచ్చింది.**

    కేదారగౌరి సైన్సు పుస్తకంలో ఒకచోట ఇంగ్లీషులో ఇలా వుంది: "స్వపరాగ సంపర్కం కేవలం వృక్షజాతిలోనే సంభవం. మనుష్యుల్లో కాదు...." అని తరువాత దాని తాలూకు వివరణ వుంది.

    ఏవైనా అనుమానాలు వస్తే ఆమెకి తండ్రిని అడగటం అలవాటు.

    ఆయన ఒక క్షణం కూతురివైపు సాలోచనగా చూశాడు.
_________________________________________________________________
    * As far sex eduction goes, I see two main difficulties. First, secuality is more than pure biology and less thas pure spirituality, but a uniqui combination of both. Ethics, Aesthetics and religion must come under consideration and sex education must fit sex into the whole pattern of our life. Can this be done? How? By whom?
                                                        - The road Maturity by E.F. Griffith.

    ** The wave of inquisitiveness swamps the child at the age of 9-13. He wants toi know how things are made; stars, watches, babies etc. There are two questions linked up together-when to tell and what to tell ! when a littile girl for the first time sees the organ of her younger brother, it is very natural that she should ask what this little strange thing is! But this is by no means a sexual question, but rather a scientific question. What to tell, and where to stop depends on the age of the child.


                                                         - Oswald Schwarz on sex Education.   

     
    సమయం వచ్చింది. చెప్పే వయసు వచ్చింది అనుకున్నాడు.

    మెన్ స్ట్రుయేషన్ సైకిల్ గురించీ, ఓవమ్ ఫార్మేషన్ గురించీ వివరించి చెప్పి, Do you know the basic difference between a man and a woman baby" అని అడిగాడు.

    ఆమె కొంచెం తటపటాయించి తెలుసన్నట్టు తలూపింది.

    "నేనిప్పుడు పురుషుడి ఫిజియాలజీ గురించి చెపుతాను" అని ఆగాడు. "...పదిహేను, పదహారు ఏళ్ళు దాటిన పురుషుడికి స్త్రీ గురించిన ఆలోచన వచ్చినపుడు అతడి శరీరంలో కొంచెం సేపు ఒక చిన్న మార్పు వస్తుందమ్మా... ఆ మార్పు కొద్ది నిముషాలపాటు వుంటుంది. తర్వాత మామూలుగా అయిపోతాడు. మెదడులో స్త్రీ పరమైన ఆలోచన రాగానే పురుషుడి శరీరంలో రక్తప్రసరణ హెచ్చుతుంది. ముఖ్యంగా జెనిటిక్ ఆర్గన్ లో... ఎల్లప్పుడూ మామూలుగా వుంటే ఈ అవయవం ఇలా కొద్దిసేపు పాటు గట్టిపడటాన్ని ఇంగ్లీషులో 'ఎరక్షన్' అంటారు. కొన్ని పదాలు తెలుగులో మాట్లాడటానికి బాగోవే. ఇంగ్లీషులో నీకు అర్ధమవుతుందికదా..."

    ఆమె తలూపింది. తన తండ్రి మొహంలోకి చూడటానికి సిగ్గు పడాలేమో అనుకుంది కానీ చిత్రంగా అటువంటి భావమేమీ కలగలేదు.

    "అలా ఎరక్ట్ అయిన తన అవయవాన్ని పురుషుడు స్త్రీ వెజీనాలోకి 'ఇన్ సర్ట్' చేయటాన్ని, ఇందాక నువ్వు అన్నావే సంపర్కం అని- అదే ఇంగ్లీషులో మేటింగ్ అంటారు. పురుషుడికి స్త్రీకి వేర్వేరు అవయవాలున్నాయి కాబట్టి మనుష్యుల్లో స్వపరాగ సంపర్కం సాధ్యంకాదు. పోతే ఈ మేటింగ్ కి క్లైమాక్స్ అనేది మూడు నాలుగు నిముషాలుంటుంది. సృష్టిలో ఇంకో గొప్ప అద్భుతమైన శారీరక నిర్మాణం ఏమిటంటే మామూలు సమయాల్లో యూరిన్ ని బహిర్గతపరిచే పురుషుడి అవయవం- ఈ క్లైమాక్స్ పూర్తయిన సమయంలో ఒక ద్రవాన్ని విడుదల చేస్తుంది. విడుదల చేయగానే మళ్ళీ మామూలుగా అయిపోతుందనుకో.... అది వేరే సంగతి-! పోతే ఆ ద్రవమే స్పెర్మ్!" అతడు ఆగాడు.

    "ఒక చిక్క స్పెర్మ్ లో అసంఖ్యాకమైన శుక్లకణాలుంటాయి. వీటిలో ఏ ఒక్కటయినా సరే, స్త్రీలో వుండే అండాన్ని సరైన సమయంలో చేరుకుంటే అప్పుడు స్త్రీ గర్భాన్ని దాలుస్తుంది. ఒక్కొక్క కణంలో 23 క్రోమోజోములుంటాయి. అలాగే స్త్రీ అండంలో మరో 23 క్రోమోజోములుంటాయి. రెండూ కలిసి 23 జతలుగామారటమే సృష్టి" ఆయన నవ్వేడు. "-ఎప్పుడో చదివిన చదువు ఇది. ఆ తరువాత పూర్తిగా మర్చిపోయాననుకో. కానీ జెనెటిక్ ఇంజనీరింగ్ చాలా మంచి సబ్జెక్టు. దీనికి సంబంధించిన రహస్యాలు ఇంకా చాలా బయటపడాలి. నువ్వుగానీ ఈ సబ్జెక్టు చదివితే తప్పకుండా రీసెర్చి చేయి. ఏమో ఎవరు చూడొచ్చారు. నీ ద్వారానే ఒక కొత్త విషయం బయట పడవచ్చు-"

    ఆమె చదవలేదు. వ్యవసాయానికి సంబంధించిన శాస్త్రం చదివింది. అదీ పట్టభద్రులయ్యే వరకే. తర్వాత ఆమె గృహిణి అయింది. అదంతా తరువాతి సంగతి.... అప్పుడు మాత్రం ఆమె చిన్న ప్రపంచంలో ఒక కొత్త ద్వారం విచ్చుకున్ననట్టయింది. అప్పటివరకూ అలాంటిది ఒకటి వుందని తెలియని స్థితి.

    ఎందుకో ఆమెకి తన తల్లి గుర్తొచ్చింది. అంతా విన్నాక ఆమె ఒకటే అనుకుంది. ఈ విషయాలు 'తన తల్లి చెబితే ఎంత బావుణ్ణు'. ఈ సూడో సభ్యతా సమాజంలో తల్లి కూడా ఈ విషయాలు చెప్పదని ఆమెకి తెలీదు.

    "నాన్నా".

    "ఏమిటమ్మా?"

    "Are you canvasing for sex education?"

    "కొన్ని ప్రాథమిక విషయాలు సరి అయిన వ్యక్తిద్వారా, సరి అయిన రీతిలో సవ్యమయిన మనిషి ద్వారా తెలుసుకోవటం చాలా అవసరమమ్మా. ఈ దౌర్భాగ్యపు దేశంలో ఈ విజ్ఞానం లేక సగంమంది జనానికి పెళ్ళయ్యేవరకూ పిల్లలు కడుపు చీల్చుకుని పుట్టరని తెలీదు. అంతవరకూ ఎందుకు? A recent interview revealed that 25% of girls below 16 years age do not know that they have two passages, one for urination and the other for child delivery."    

    ఆమె తండ్రివైపు చూసింది. అతడు కోపంగా వున్నాడు. ఎవరి మీదో కోపంగా వున్నాడు. ఎవరిమీదో తెలియని కోపం....

    అకస్మాత్తుగా ఆమె చైల్డ్ పేరెంట్ బాంధవ్యం నుంచి పేరెంట్ చైల్డ్ గా మారింది. "ఇదంతా తెలుసుకోవటం అవసరమా నాన్నా" అంది.

    ఆయన కొంచెంసేపు మౌనంగా వుండి నెమ్మదిగా అన్నాడు. "నాకు తెలిసిన ఒక అమ్మాయిని పధ్నాలుగేళ్ళ వయసులో వాళ్ళమావయ్య దగ్గరికి తీసుకుని, ఈ విషయాన్ని ఇలా సైంటిఫిక్ గా కాకుండా, రహస్యంగా చెప్తూ చెప్తూ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి ప్రయత్నించాడు. సరైన సమయానికి ఆ అమ్మాయి అంతరాత్మ హెచ్చరించటం వల్ల అదృష్టవశాత్తూ తప్పించుకున్నదనుకో. కానీ తరువాత బాధపడింది. ఇప్పుడు చెప్పు. 'ఇది యిలా జరుగుతుంది. మీమీ జీవిత పంథా ఏమిటో మీరే నిర్ణయించుకోండి' అని విద్యార్ధి జీవితంలోనే చెప్పటం తప్పా? దీనివల్ల కనీసం 'అమాయకత్వం' నష్టపోవటం అంటూ వుండదు. అవునా..."

    ఆమె దానికి సమాధానం చెప్పలేక, నవ్వుతూ మాట మార్చి, "ఎవరు నాన్న ఆ అమ్మాయి?" అని అడిగింది.

    చాలా నెమ్మదిగా- స్పుటంగా ఆయన అన్నాడు-

    "మీ అమ్మ".

    ఆమె జీవితంలో అంత షాక్ ఎప్పుడూ తినలేదు.

    ..........

    "ఏమిటి ఆలోచిస్తున్నావ్?"

    ఆమె చప్పున తేరుకుని సిద్ధార్థవైపు చూసి "ఏమీలేదు" అన్నది. ఏదో ఇబ్బందిగా వుంది. ఏదో...

    సిద్ధార్థ మాత్రం ఆమెవైపే చూస్తున్నాడు. ఆమె, తనకి డబ్బు, సమాజంలో అంతస్థు- ఇవేమీ లేకపోయినా తనను కోరుకోవటం అతడికి అమితమైన సంతృప్తి నిస్తూంది. ఆ సమయంలో ఆ సంతృప్తే కోరిక అవుతూంది. ఆ కోరిక అనే అగ్నిలో, పూలమీద నుంచి వచ్చేగాలి ముంగురుల్ని కదిపి ఆజ్యం పోస్తూంది.

    అతడు ఆమెని దగ్గరికి తీసుకున్నాడు.

    ఆమె కళ్ళు మూసుకుంది.

    అతడు వంగి నెమ్మదిగా ఆమె పెదవులమీద ముద్దు పెట్టుకున్నాడు. జీవితపు మొదటి ముద్దు...

    మనసూ, శరీరమూ భర్తకే ఇవ్వటం ఒక పద్ధతమ్మా, సెక్స్ కి ఏ విలువా ఇవ్వకుండా అదొక శారీరక అవసరంగా భావించి, అనుభవించి, మిగతా విషయాల మీద ఏకాగ్రత నిలపటం రెండో పద్ధతి. శారీరకంగా పాడవకుండా, కేవలం మానసికంగా పాడవటం అంటే పెళ్ళి కాకుండా గంటల తరబడి మాట్లాడటం. నెక్కింగ్; పెట్టింగ్... ఇది మూడో పద్ధతి. నా కూతురు మొదటి రెండు పద్ధతులలో ఏది ఎన్నుకున్నా సంతోషిస్తాను. కానీ హీనమైన మూడోది మాత్రం ఎన్నుకోకూడదని కోరుకుంటాను.

    ఆమె మొదటి పద్ధతి ఎన్నుకుంది. అందుకే ఆ క్షణం ఒక ఆలౌకికమైన స్థితిలో తదాత్మ్యతని అనుభవిస్తూంది. మొదట్లో ఆ ఆరుబయట ప్రదేశం కాస్త బిడియాన్ని కలుగజేసింది. కానీ అతడి మాటలు ఆ జంకుని పోగొట్టినయ్. ఆ తరువాత మరి పరిసరాలు తెలియలేదు. అంత గాలిలోనూ ఒక చెమట చుక్క ఆమె నుదుట నిలిచింది. అంత చలిలోనూ ఆమె సిగ్గుతో కనులు మూసుకుంది. చంద్రుడు మేఘం చాటుకి వెళ్తూ వెళ్తూ మిగిలిన గంధాన్ని ఆమె శరీరం మీద పూత పూయగా, వెన్నెల్లో ఆమె శరీరం గంధపు చెక్కలా మెరిసింది. చంద్రుడు అలా కాస్త కనుమరుగు అవగానే, నక్షత్రాలు విజృంభించి ఆకాశంలోనూ, ఆమె కన్నుల్లోనూ మరింతగా మెరిశాయి. దాంతో కోపం వచ్చిన మేఘం ఆమె కనురెప్పలుగా మారి, కళ్ళని అరమోడ్పులు చేసింది. ఓడిపోయిన నక్షత్రాలు జడనుంచి పూలులాగా విడివడి పక్కంతా చెల్లా చెదురుగా పడినాయ్. గెలిచిన మేఘం వర్షమై శాంతించింది.

    అరణ్యంలో వర్షం... చెమటతో తడిసిన పర్వతాలు... ఎడారుల్లో ఇంకిపోయిన ఒయాసిస్సులు...గాడ్పులైన ఆయాసాలు- అలసిపోయి విశ్రాంతి తీసుకునే ప్రకృతి...

    ఆ నిశ్శబ్దంలోంచి...పొదలో చిన్న అలికిడి. అది తోడేలుపిల్లో, నక్కపిల్లో చీకట్లో తెలియటం లేదు. బయటకు వచ్చి తల్లి కోసం భయంకరంగా అరిచింది. ఒక పక్షీ- ఒక కాకీ భయంగా చూశాయి. 'వద్దు వద్దు' అన్నట్టు భూదేవి ఆక్రోశించింది. ప్రకృతి ఆ క్షణం స్థంభించిపోయినట్టు గాలికూడా ఆగిపోయింది. చుట్టూ వున్న చెట్లు, ఆకాశం, నక్షత్రాలు, మేఘాలు అన్నీ అశక్తులైనట్టు ప్రేక్షకులయ్యాయి.

    అతడు తనలోని ఇరవైమూడు అంశాల్ని తీసుకుని ఆమెలోని ఇరవైమూడు అంశాల్ని చేరబోయే సమయాన... పర్వతాంతర్భాగాల్లో, అడవుల్లో అలుముకున్న చెత్తా చెదారం క్రింద, ఎండుటాకుల అడుగున... ఎక్కడో ఏ మూలో ఎవరో బద్ధకంగా నిట్టూర్చిన ధ్వని... మంద నుంచి విడివడి దూరంగా వచ్చిన గొర్రెపిల్లని కనురెప్పపాటులో మ్రింగి, బద్ధకంగా చెట్టుకు చుట్టుకుని పడుకున్న కొండచిలువను సుషుప్తావస్థలో నుంచి ఎవరో లేపినట్లు హడావుడిగా లేచి మరింత పైకి వెళ్ళింది.

    ప్రపంచమంతా ఏదో ఇబ్బందిగా లిప్తపాటు అలజడి చెందిన క్షణం....కేవలం కొందరు మాత్రమే ఆనందంతో పైశాచిక నృత్యం జరిపిన క్షణం- చిన్న తల పెద్ద తోక వేసుకుని ఒక శుక్లకణం ఒక బీజాన్ని చైతన్యవంతం చేయబోయే సమయాన...

    ఆ గర్భంలో నిక్షిప్తం అవటం కోసం- సుషుప్తిలోంచి లేచి నెమ్మదిగా కనులు విప్పింది-

    కాష్మోరా.

    ఆ పిండానికే ప్రాణం వస్తే- ఉస్సోక్ సభ్యుల ఆశ నెరవేర్చటం కోసం- కుట్టిసైతాన్ రాజ్యాన్ని స్థాపించటం కోసం- సరిగ్గా తొమ్మిది నెలల తరువాత పుడతాడు-

    "అష్టావక్ర".

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra