Home » Mainanpati bhaskar » వేగు చుక్క


    దానితో ఆ షిప్పుకీ మిగతా ప్రపంచానికీ మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది.

    అనంతంగా కనబడుతున్న ఆ అపార జలరాశిలో అల్పమైన ద్వీపంలా తేలుతుంది ఆ షిప్పు.

    ఆ లంకకి రాక్షసరాజులా ఉన్నాడు డ్రాకులా చాంగ్.

    భయంగా అతనివైపు చూసింది స్వరూప. "రాడారూ, రేడియో రెండూ నాశనం చేశావు. మనం దిక్కులేకుండా అయిపోలేదూ ఇప్పుడు?"

    విరగబడి నవ్వాడు చాంగ్.

    "పుట్టినప్పటినుంచీ సముద్రాలమీదే బతుకుతున్నాను! వెధవది ఈ రేడియో, రాడార్  లేకపోతే  నాకు దారి తెలియదా?" అంటూ  ఇంటర్ కమ్ ఆన్ చేశాడు.

    "ఇదిగో! ఓయ్ సాగర్!" అన్నాడు సాధ్యమైనంత అమర్యాదగా. "వినబడుతొందా? నేను చాంగ్ ని! డ్రాకులా చాంగ్! వెధవది! ఈ షిప్పుని కూడా నేను స్వాధీనం చేసుకోక తప్పేటట్లు లేదు! పాడు అలవాటు ఏం చేస్తాం! అందరూ వింటున్నారా? రేయ్ ఎవడ్రా ఇంజన్ రూమ్ లో. నిద్రపోతున్నారా నా కొడుకుల్లారా! స్పీడు పెంచండి! పుల్ స్పీడ్ అహొయ్!"

    అతని మాటలు షిప్పు తాలూకు మారుమూలల్లో కూడా మారుమోగడం మొదలెట్టాయి.

       
                                                           *    *    *

    అత్యంత విషపూరితమైన ఆ పుగూ చేపకూర తినగానే నోట మాట రాకుండా వుండిపోయాడు సాగర్.

    "సాగర్! సాగర్! ఏమయింది?" అంది అనూహ్య హీన స్వరంతో.

    సమాధానం చెప్పకుండా వుండిపోయాడు సాగర్.

    తన సొంత మరణ శిక్ష ఎదురు చూస్తున్న దానిలా, ఊపిరి పీల్చడం మర్చిపోయి కళ్ళార్పకుండా వుండిపోయింది అనూహ్య. నీళ్ళు నిండిన ఆమె కళ్ళకు మసక మసగ్గా  కనబడుతున్నాడు సాగర్.

    అతని మీద తనకు తెలియకుండా ఎంత ప్రేమ ఏర్పడిపోయిందో, అతను తనకి ఎంత ముఖ్యమో ఆ క్షణంలో అర్ధమయింది ఆమెకి.

    ప్రేమ జనించడానికి దోహదం చేసే పరిస్ధితులు ఏమిటి? అది ఎప్పుడు, ఎవరిమీద, ఎందుకు కలుగుతుంది? అసలు దాని కెమిస్ట్రీ ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? ఎనీబడీ? ఎనీబడీ?

    "మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ !" అన్నాడు సాగర్ ప్రయత్న పూర్వకంగా.

    "సాగర్!" అంది అనూహ్య ఆమె గొంతు గద్దకంగా ఉంది.

    ఇబూకా కలవరపడుతూ చూస్తున్నాడు.

    "అద్భుతంగా ఉంది దీని రుచి"  అన్నాడు సాగర్ కూల్ గా. చెప్పడానికి సరైనా మాటలు తోచక అలాగే  ఉండిపోయాను" అన్నాడు, తను చచ్చికూడా, తనని తిన్నవాణ్ణి చంపగల సత్తా ఉన్న ఆ చిత్రమైన పుగూ  చేపవైపు,తనకు సమ ఉజ్జీ అయిన ప్రత్యర్ధిని చూసినట్లు గౌరవంగా చూస్తూ.

    తనకు ఉన్న శక్తినంతా ఉపయోగించి అతని నెత్తిన గట్టిగా మొట్టికాయ వెయ్యాలన్న కోరికని కష్టం మీద ఆపుకుని, వాతావరణంలో ఉన్న  గాలినంతటినీ పీల్చేసుకున్నంత దీర్ఘంగా శ్వాస తీసుకుంది అనూహ్య.

    అతని ఈ ప్రాక్టికల్ జోకు ఎంత దిగులు కలిగించింది తనకి?

    అయినా ఆ విషపు చేపని ఇతను ఎందుకు తిన్నట్లు? అతనికేమన్నా అయితే తానేమైపోయేది?

    ఆమె మొహంలో మెదులుతున్న భావాలను గమనిస్తూనే ఉన్నాడు సాగర్. నెమ్మదిగా దగ్గరికి వచ్చి, ఆమె చేతులని తన చేతుల్లోకి తీసుకుని అభిమానంగా ఒత్తాడు.

    మూటలకొద్దీ మాటలతోకూడా చెప్పటానికి చేతకాని ఆ సున్నితమైన భావాలని అతని చేతుల ఆ చిన్న చేతతో అర్ధమయేటట్లు చేశాయి. 'నువ్వూ నేనూ ఇకనుంచీ ఒకటి-ఆ సూర్యుడూ, చంద్రుడూ ఆకాశంలో ఉన్నంత వరకూ మనని ఏ శక్తీ విడదీయలేదు ఈ కడలిలోని ఉత్తుంగ తరంగాలలా మన సంసార సాగరంలో ఎన్ని కష్టాలు వచ్చినా, మన జీవన నౌక ఈ షిప్పులాగే సురక్షితంగా పయనిస్తూనే వుంటుంది.

    "అనూహ్య! మైడియర్ అనూహ్య! మైడియరెస్ట్ అనూహ్యా!...." పోయిందో?" అంది అనూహ్య.

    ఆమె పెదిమల మీద చిరునవ్వు!

    ఆమె కనురెప్పల కింద కన్నీరు!

    వాళ్ళిద్దరూ తెలుగులోనే మాట్లాడుకుంటున్నారు. జపనీయుడైన ఇబూకాకి తెలుగు రాకపోయినా తెలుస్తూనే వుంది ఆ  మాటల భావము.

    ప్రేమది అంతర్జాతీయ భాష. పెదవి మెంపకుండానే, పదాలసాయం లేకుండానే ఎదుటివాళ్ళు గ్రహించగలిగే మూగభాష అది.

    నవ్వాడు సాగర్.

    "ప్రమాదాన్ని వెదుక్కుంటూ పోవడంతో కూడా ప్రమోదం ఉంటుంది అనూహ్యా! భయం అన్నది మర్చిపోయిన వాళ్ళకే ఎప్పుడూ జయం!" అన్నాడు నిబ్బరంగా.

    సరిగ్గా అదే క్షణంలో, గొరిల్లా గొంతు చించుకు అరుస్తున్నట్లు వినబడింది చాంగ్ చేసిన హెచ్చరిక!


                                                *    *    *


    ముసుగుతన్ని, గురకపెడుతూ నిద్రపోతున్న ఆనందరావు దెయ్యం తనని తట్టి పిలిచినట్లు ఉలిక్కిపడి లేచి కూర్చుని, చెవులు రిక్కించాడు.

    అతనికి ముచ్చెమటలు పోశాయి.

    "అమ్మయ్యో కొంప మునిగింది?" అని ఆదరా బాదరగా సింగ్ గదిలోకి పరిగెత్తాడు.

    సింకు దగ్గర తల వాల్చేసి వామిట్ చేసుకుంటున్నాడు సింగ్ అతనికి సీ సిక్ నెస్ తగ్గనే లేదు.

    "ఘోరం జరుగుతోంది చూశారా మిస్టర్ సింగ్ ఘోరం!" అన్నాడు గజగజ వణుకుతూ.

    సింగ్ బలహీనంగా తల పంకించి, మంచం మీద ఒరిగిపోయాడు. మాట్లాడే ఓపిక కూడా లేదు అతనికి.

    తలుపులు ధడాలున తెరచుకున్నాయి.

    చాంగ్ గ్యాంగుకి చెందిన పాల్సన్, జాన్సన్ అనే అన్నదమ్ములయిన నావికులిద్దరు గదిలోకి వచ్చారు.

    వెంటనే వాళ్ళ కళ్ళు గదిలో ఒక మూలగా ఉన్న బార్ మీదా, దాన్లోవున్న నోరూరించే మద్యాల మీదా పడ్డాయి.

    నవ్వుతూ తలుపులు గడియవేసి, బార్ వైపు నడిచారు ఇద్దరూ.

   
                                               *    *    *

    చాంగ్ గొంతు వినగానే ఉలిక్కిపడింది అనూహ్యా. సాగర్ చేపకూర తిన్నాడన్న ఆదుర్దాలో చాంగ్ విషయం మర్చిపోయింది తను.

    వెంటనే చెప్పడం మొదలెట్టింది సాగర్ తో.

    ఆశ్చర్యంగా విన్నాడు సాగర్. చెప్పడం పూర్తికాగానే ఆమె చెయ్యి అందుకుని తలుపువైపు పరిగెత్తాడు.

    అతని మనసు త్వర త్వరగా ఆలోచిస్తోంది. అయితే షిప్పులో మ్యూటినీ మొదలయింది! తను దయతలచి రక్షించిన వాళ్ళు పచ్చి రక్తం తాగే పాపాత్ములన్న మాట!

    గాడ్! వీళ్ళ మధ్య ఈ షిప్పు తాలూకా కొద్దిపాటి స్పేస్ లో, అనూహ్యా లాంటి అందమైన ఆడపిల్ల మాన ప్రాణాలు కాపాడటం ఎంత కష్టం!

    వాళ్ళు  గుమ్మాన్ని సమీపించే లోపలే దూసుకుని అడ్డం వచ్చాడు చాంగ్ అనుచరుడు తంగవేలు. బలంగా సాగర్ కి తగిలాడు.

    మరు క్షణంలో పొట్టేల్లలా ఢీ కొన్నారు  ఇద్దరూ.  బాహాబాహీ యుద్ధం మొదలయింది.

    ఒడుపుగా, చేతి అంచుతో కరాటే చాఫ్ ఒకటి ఇచ్చాడు సాగర్. కాలి మడమమీద గిర్రున బొంగరంలా తిరిగి, రెండో కాలు ఎత్తి విపరీతమైన ఫోర్సుతో తంగవేలు మొహం మీద కొట్టాడు.

    గింగిరాలు తిరిగి కింద పడ్డాడు తంగవేలు.

    "ఇబూకా! వీడి సంగతి కాస్త చూడు!" అంటూ అనూహ్యాతో సహా బయటికి పరిగెత్తాడు సాగర్.

    కింద పడి వున్న తంగవేలు పక్కన కూర్చున్నాడు ఇబూకా. "దెబ్బ తగిలిందా మాన్?"  అన్నాడు  సానుభూతిగా.

     అవునన్నట్లు బాధగా తల ఆడించాడు తంగవేలు.

    "ఇది తిను! గాయాలకి మంచి మందులా పనిచేస్తుంది" అని వ్యవధి ఇవ్వకుండా, చేప కూర అతని నోట్లో కుక్కాడు ఇబూకా.

    కోరబోయింది తంగవేలుకి కూరని ఆపళంగా మింగేశాడు. తేరుకున్న తర్వాత, "ఏమిటిది!" అన్నాడు అనుమానంగా.

    "చేప కూర పుగూ చేప!" అన్నాడు ఇబూకా ప్రశాంతంగా.

    "ఓర్నాయనో!" అన్నాడు తంగవేలు ఏడుపు గొంతుతో "ఇదెందుకు తనిపించావురా దెయ్యపు వెధవా?"

    "ముందు నీకు తినిపించి, అందులో విషం లేదని తేల్చుకున్నాక నేను తిందామని!" అన్నాడు ఇబూకా, సీరియస్ గా  మొహం పెట్టి.

    ఆ షాక్ కి తంగవేలుకు స్పృహతప్పి పోయింది.

    అతనికి మళ్ళీ స్పృహవస్తే మాడు పగిలేలా కొట్టడానికి వీలుగా కాడ ఉన్న బాణలిని చేతితో సిద్దంగా పట్టుకున్నాడు. ఇబూకా.

    పరిగెడుతున్న సాగర్ కి ఎదురొచ్చాడు, ఫకర్. "సర్ ! సర్!" అంటున్నాడతను గాభరాగా.

    "టైంలేదు నాతో రా!" అన్నాడు సాగర్.

    ఫకర్ కూడా చిన్న చిన్న అడుగులు వడివడిగా వేస్తూ పరిగెత్తడం మొదలెట్టాడు.

    షిప్ తాలూకు వెల్ దగ్గరకి చేరుకున్నారు ముగ్గురూ. షిప్పు గర్భంలోకి కార్గో (రవాణా చెయ్యవలసిన సరుకు) ఉంచుతారు లోతుగా, దిగుడు బావిలో ఉంటుంది అది.

    దాన్లోకి తాడు ఒకటి వేలాడదీసి ఉంది.

    "అనూహ్యా! ఇందులోకి దిగాలి. మనం ప్రస్తుతం ఇంతకంటే సురక్షితమైన ప్రదేశం లేదు షిప్పులో! రెడీనా?"

    "నేనా! ఇందులోకి దిగాలా? అసంభవం!" అంది అనూహ్య భయంగా.

    "టైంలేదు! దిగాలి!"

    "ఎలా?"

    అటూ ఇటూ చూసి, ఫకర్ మెడలో ఉన్న మఫ్లర్ ని లాగాడు సాగర్. దానితో అనూహ్య రెండు చేతులూ కలిపి చకచక ముడేశాడు. కట్టేసిన ఆ చేతులని తన తలమీదుగా భుజం మీదకి వచ్చేటట్లు వేసుకున్నాడు.

    పెద్ద వాళ్ళ వీపు మీద ఎక్కి ఉప్పుప్పు గోనె ఆడుతోన్న చిన్న పిల్లలా, అతని విశాలమైన వీపు మీద ఒదిగిపోయింది అనూహ్య. ఎత్తుగా ఉన్న ఆమె గుండెలు అతని వీపుకి హత్తుకుపోతున్నాయి.

    కానీ, ఆ మృదుమధురమైన అనుభూతిని అనుభవించే స్ధితిలో లేడు సాగర్.

    ఆమెని జారిపోకుండా అలా తన భుజంమీద ఎక్కించుకుని, తాడుపట్టుకు జర్రున కిందికి జారాడతను.

    ఆ వెనకనే ఫకర్ జారాడు.

    కిందికి దిగీ దిగగానే, తన హిప్ పాకెట్లో ఉన్న రివాల్వరు తీసి ఫకర్ కి అందించాడు. సాగర్. దాంగ్ వాళ్ళు షిప్పులో ఎక్కినప్పటి నుంచీ రివాల్వర్ ని దగ్గరే ఉంచుకుంటున్నాడు అతను.

    "ఫకర్! అనూహ్య జాగ్రత్త! ఎవరైనా కోతి పనులు చెయ్య బోయారో, నిర్దాక్షిణ్యంగా కాల్చిపారెయ్!" అని హెచ్చరించి. తను నిరాయుధుడిగా మళ్ళీ తాడుపట్టుకుని పైకి ఎగబాకటం మొదలెట్టాడు.

    పైకి వచ్చీ రాగానే పెద్ద సైజు ఇనప రెంచ్ తో అతని తల మీద గట్టిగా దెబ్బ పడింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra