" మాకున్నదండీ బోలెడు. ఉదాహరణ చెప్పమంటే మా అబ్బులు ఓ కధకూడా చెప్పేస్తాడా" అన్నాడు వ్యాకర్ణ.
బోలెడు ఉత్సాహ పడుతూ కుర్చీలోంచి రవంత ముందుకి జరిగి " చెప్పమంటారా అండీ?" అన్నాడు అబ్బులు.
" మి ఓర్పు తెలుస్తూనే వుంది. కధలు వద్దు కాకరకాయలు వద్దు, నేచెప్పేది వినండి."
" అలాగే" అన్నారు ఏకకంఠంతో ముక్తసరిగ.
జయచిత్ర మొదలు పెట్టింది.
" మా యింట్లో చాలా వాటాలు అద్దెకిచ్చాము. అది మా అవసరాని కనుకోండి.
ఓ వాటాలో తల్లీ తండ్రి, ఓ కూతురు వున్నారు. కూతురి వయసు నాలబై దాకా వుంటాయి. పెళ్ళి పిచ్చి, పిచ్చి కుదిరితెగాని పెళ్ళిగాక. పెళ్ళిగాకనే పిచ్చికుదరక నలభైఏళ్ళవృద్ధకన్య అయింది.
అందంగావున్నా. ఉండకపోయినా అబ్బాయిలు కనపడితేచాలు- పెళ్ళిపిచ్చి ప్రేమతో వెంటపడి వేధిస్తుంది. ఆ వృద్ధ కన్యతో మిరు ఎలా వేగుతారో ఏమో?"
" నిజమా అండీ?" నీరుకారిపోతూ ( ఎండాకాలం వల్ల కాదని గమనించగలరు) అన్నారు యిరువురు.
" నిఝుంగా నిజం. తర్వాత, మరో వాటాలో ఓ మొగుడు పెళ్ళాం వున్నారు. పెళ్ళాంమీద అనుమానం. కనపడ్డ ప్రతి మొగాడిని అనుమానంతో వేధిస్తుంటాడు. మికూ అపనింద తప్పదు ఆ అనుమానం మొగుడితో."
" ఆయ్ బాబోయ్!" అని కుర్చీలోంచి ఎగిరిపడ్డాడు వ్యాకర్ణ.
" సంభాళించుకో, సంభాళించుకో" అని వూరడించాడు అబ్బులు, భూతద్దంలని సవరించుకుని.
" ఇప్పటికి రెండువాటాల వాళ్ళ కధలయాయి. మూడో వాటా కొద్దాం. మూడో వాటాలో చేమిటయన వున్నాడు. ఎదుటివారిని జిడ్డులా పట్టుకొని కనీసం గంట మాట్లాడుతాడు. ఆయన భార్యకి నత్తి.
అసలుమాట యీవిడ నోట్లోంచి వూడిపడటానికి అరగంట పడుతుంది. అంది చెమిటి భర్తకి వినపడటానికి రెండు అరగంటలు పడుతుంది. అయిందాండి.
ఇహ నాలుగో వాటావాళ్ళ కధ వినిపిస్తాను. వాళ్ళు మొత్తం నలుగురు. దేశంలో వున్న సగం దేముళ్ళని కొలుస్తారు. మడి, తడి, పూజ పునస్కారం, భక్తిగీతాలు భజనలు. ఆ వాటా దేముడిగుడే అనుకోండి.
ఇహ అయిదో వాటాలో..."
" ఆగండా గండి. మి యింట్లో ఎన్ని వాటాలున్నాయి? ఎందరి కద్దె కిచ్చారు? అసలు మిరెలా యిందరికిచ్చారు? అందరిలా వుంటున్నారు? ఇందరి మధ్య మిరు...?" అంటూ అబ్బులు ఆగిపొయ్యాడు.
" ఆగండాగండి. మా సంగతి మి కెందుకు గాని మిరుండగలరా అని?" జయచిత్ర అనుమానం బైట పెట్టింది.
ఈ పిల్ల మన్ని బెదరగొట్టి పంపాలని చూస్తున్న దేమో అనే అనుమానం అబ్బులికి వ్యాకర్ణకి వచ్చింది.
" చెవిటి, మూగ , గుడ్డి, కుంతి, టి, బి, లెప్రసి, పిచ్చిగిచ్చి. వగైరా ఎటువంటి వారయినాసరే వాళ్ళపక్కన వుండగలం. మా గురించి మికు దిగులక్కర లేదు" అన్నారు. డోంట్ కేర్ మాష్టార్ అన్నట్లు ముఖం పెట్టి.
" అడ్డమైన వాళ్ళపక్కన వుండటం మి కలవాటయి వుంటుంది" అంది జయచిత్ర.
గతుక్కుమన్నారు యిరువురు.
ఆపై... " ఈపిల్లకు పొగరు" అనుకున్నాడు అబ్బులు.
" పిల్ల రాక్షసి!" అని గొణుక్కున్నాడు వ్యాకర్ణ.
యిరువురూ మౌనం వహించటం చూసి జయచిత్ర నోరు విప్పింది. " అయిదో వాటా వద్ద ఆగాను కదూ?" అంది.
" ఏ వాటాలో ఎందరుంది వాళ్ళ ఆకర వికార గుణగుణాలు మేము మా వాటాలో కొచ్చి చేరిం తరువాత చుస్తాంగా. ఇప్పుడొద్దు లెండీ" అన్నాడు వ్యాకర్ణ.
" సరే జాగ్రత్తలు వివరాలు అయినా చెప్పానీయండి. అంది జయచిత్ర.
" చెప్పండి" అన్నాడు అబ్బులు.


