Home » Yerramsetti sai » Anaganaga O Honeymoon


    "అవును" గర్వంగా అన్నాడు చిరంజీవి.
    అతని చెంపమీద బలంగా చాచి కొట్టిందామె.
    అక్కడున్న వాళ్ళంతా స్టన్ అయిపోయారు. చిరంజీవి షాక్ లో కెళ్ళిపోయాడు.
    "ఇడియట్! వాళ్ళరిస్తే నీకేం? నువ్వు వాళ్ళమీద పడటంవల్లే గొడవయ్యి డ్రామా ఆగిపోయింది."
    "అయామ్ సారీ! మీ ప్రోగ్రామ్ చెడకూడదనే ఉద్దేశ్యంతో వాళ్ళమీద చేయి చేసుకున్నాను. కానీ తీరా చూస్తే నావల్లే ప్రోగ్రాం పాడయిపోయింది" పశ్చాత్తాపంతో అన్నాడతను.
    సంగీతకు అతనిమీద జాలి కలిగింది.
    "సారీ! తొందరపడ్డాను."
    "ఏం పర్లేదు. తొందరపడుట మానవ సహజం."
    "అరె! ఆ డైలాగ్ మీకెలా తెలుసు? నా డ్రామాలో ఉందది. ఆఖర్లో మాట్లాడాల్సి ఉంది నేనామాట. మీరూ రచయితేనా?"
    "కాదు! అంత ఖర్మ నాకేం పట్టలేదు."
    "రచయిత అవటం ఖర్మా?"
    "అవును నా ఫ్రెండ్ ఒకడు ఎన్ని వెధవ పనులు చేసి రచయితయ్యాడో నేను ప్రత్యక్షంగా చూశాను."
    "మైగాడ్! రచయిత లైఫ్ ఇంత హారిబులా?"
    "అవును."
    "ఎనీవే. నా మీద మీకున్న అభిమానానికి థాంక్స్."
    "రేపు కృష్ణా ఓబరాయ్ లో డిన్నర్ కి వస్తే నేనెంతో ఆనందిస్తాను."
    ఆమె ఆశ్చర్యంగా అతనివేపు చూసింది.
    సాధారణంగా తనను డిన్నర్ కి, లంచ్ కి పిలిచేవాళ్ళంతా మామూలు హోటళ్ళకు పిలుస్తుంటారు. అందుకే తను ఒప్పుకునేది కాదు.
    "కృష్ణా ఓబరాయ్ కా?"
    "అవును! సాయంత్రం ఆరుగంటల కల్లా మీ ఇంటి ముందు ఒక కాంటెస్సా కారు, ఒక మారుతి థౌజండ్ సి.సి., ఒక టాటా కారూ వుంటాయి. మీకు నచ్చిన కార్లో మీరు రావచ్చు."
    ఆమె నిశ్చేష్టురాలయింది.
    "ఇదిగో! ఇది నా కార్డ్" తన జేబులో నుంచి విజిటింగ్ కార్డ్ తీసి ఆమె చేతిలో వుంచి చకచక తన కారు దగ్గరకు నడిచాడతను.
    సంగీత కొద్దిక్షణాల వరకు కోలుకోలేకపోయింది.
    ఆమెకు చిన్నప్పుడు జ్యోతిష్యుడు చెప్పిన జ్యోతిష్యం గుర్తుకొచ్చేసింది. "యవ్వనంలో కొచ్చాక నిన్నొక ధనవంతుడు ప్రేమిస్తాడు. దాంతో స్టార్ గా మారిపోతుంది. నువ్వు సినిమా స్టార్ వయిపోతావు" అన్నాడతను.
    అది ఖచ్చితంగా నిజమవబోతుంది. చిరంజీవి పేరు పక్కన అతను ఎవరి కొడుకో, వాళ్ళకు ఎన్ని పరిశ్రమలున్నాయో అన్నీ తెలిపే లిస్ట్ వుంది. అంటే తన ప్రేమలో పడే ధనవంతుడితనే. ఆనందతో ఉక్కిరిబిక్కిరయ్యిందామె. తన సినిమాకు అతనే ప్రొడ్యూసరు. తను స్టార్ అవడానికి ఎన్నో రోజులు లేదు.
    ఆమె కళ్ళముందు బ్రహ్మాండమైన సీన్ కనబడుతోంది. జనం ఆమెను చూడ్డానికి తండోపతండాలుగా ఎగబడుతున్నారు. ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు తన డేట్స్ కోసం క్యూలో పడిగాపులు పడుతున్నారు. తనతో యాక్ట్ చేయడానికి హీరోలు పోటీ పడుతున్నారు.
    చిరంజీవి గాఢ నిద్రలో ఉండగా పెద్దపులి ఒకటి అతని బెడ్ దగ్గరకొచ్చి హఠాత్తుగా గాండ్రించింది. చిరంజీవి అదిరిపడి లేచి చెట్టుకోసం వెదకటం మొదలుపెట్టాడు పెద్దపులి నుంచి తప్పించుకోడానికి.
    "అలా పరిగెడతావేమిటి? నిన్నే పిలిచేది?" పెద్దపులి తెలుగులో మాట్లాడడం వినిపించేసరికి చిరంజీవి ఆశ్చర్యపోయి వెనక్కు తిరిగి చూశాడు.
    ఎదురుగా ఈశ్వరరావు నిలబడి ఉన్నాడు.
    "పెద్ద పులి ఏది?" అడిగాడు చిరంజీవి.
    "షటప్. నిద్రలో నుంచి బయటకురా. పెద్దపులేమిటి నీ తలకాయ్? నేనడిగిందానికి ముందు సమాధానం చెప్పు"
    "ఏమడిగారు?" కళ్ళు నులుముకుంటూ అడిగాడతను.
    "నిన్న రాత్రి ఏం జరిగింది?"
    ఆ ప్రశ్న వినగానే చిరంజీవి హఠాత్తుగా తన్మయత్వంతో చూశాడు.
    "డాడీ! నిన్నరాత్రి రవీంద్రభారతిలో దేవతను చూశాను డాడీ."
    "చూసి?"
    "డాడీ! ఆమెను ప్రేమించేశాను. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను."
    "షటప్. ఏమిటా పిచ్చి వాగుడు? పెళ్ళేమిట్రా? నువ్వు జాలీ లైఫ్ సెక్రటరీవన్నవిషయం మర్చిపోయావా?"
    "మర్చిపోలేదు డాడీ! కాని ఆ దేవత నాకు దక్కితే ఈ క్లబ్ బలాదూర్."
    "ఈశ్వరరావు హర్ట్ అయ్యి తన పక్కనున్న క్లబ్ మెంబర్స్ వేపు చూశాడు. అందరిముఖాల్లోనూ ఆందోళన కనబడుతుంది.
    "అహ్హహ్హ" అంటూ నవ్వాడు ఈశ్వరరావు.
    "హాంగోవర్ లో అలా మాట్లాడుతున్నాడు."
    "మనమయినా హోంగోవర్ లో అచ్చం అలాగే మాట్లాడతాం" అన్నాడు మరొకతను సమర్థిస్తూ.
    "నేనయితే ఇంకా హారిబుల్ గా మాట్లాడతాను" అన్నాడు ఈశ్వరరావు.
    చిరంజీవికి చిరాకేసుకొచ్చింది.
    "డాడీ! నాది హోంగోవర్ కాదు, బాంగోవరూ కాదు. నేను నిజంగానే ఆ పిల్లను పెళ్ళి చేసుకోబోతున్నాను. అంతే!" కోపంగా అరిచాడు.
    ఈశ్వరరావు మొహం ఎర్రబడింది. "హు!" అన్నాడు మండిపడుతూ. "అయినా సరే!" అన్నాడు చిరంజీవి.
    "హు! పదండి!" అంటూ మిగతావారందరితోపాటు అక్కడినుంచి వెళ్ళిపోయాడు ఈశ్వరరావు.
    ఆఫీస్ లో అతని చుట్టూ మెంబర్స్ కూర్చున్నారు.
    పోలీస్ కమీషనర్ గా పనిచేసి రిటైరయిన జాకబ్ ఉపన్యాసం ఇస్తున్నాడు.
    "మన జాలీ లైఫ్ క్లబ్ చాలా విపత్కర స్థితిలో చిక్కుకుంది. చిరంజీవి నిజంగానే ఆ పిల్లనెవర్నో పెళ్ళి చేసుకుంటే క్లబ్ కొంపలారిపోతాయి. యంగర్ జెనరేషన్ అంతా క్లబ్ కి రిజైన్ చేసిపారేసి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. దాంతో మనం క్లబ్ ప్రారంభించిన ఆశయం కాస్తా నీరుగారిపోతుంది. ఇంతకాలం రాష్ట్రవ్యాప్తంగా మనం చేసిన ప్రచారమంతా వృధా అయిపోయింది. మగాడికి పెళ్ళి ఎందుకు? కేవలం సెక్స్ కోసం. దానికోసమని పెళ్ళి చేసుకుని జీవితాంతం ఆడదానికి బానిస అవనవసరం ప్రస్తుత ప్రపంచంలో లేదు. ఈ రోజున మనిషి బ్రతుకుతున్న పరిస్థితులు వేరు. మనిషి మనుగడకు అవసరమైన జీవితం వేరు. ఫాస్ట్ నెస్! అన్నిచోట్లా వేగం! అన్ని రంగాల్లో వేగం, అన్ని కదలికల్లో వేగం. ఇవాళ ఒక ఉద్యోగం, రేపు ఇంకో ఉద్యోగం, ఇవాళ ఒక ఛాలెంజ్, రేపు ఇంకో ఛాలెంజ్... ఇవాళ ఆంధ్రప్రదేశ్, రేపు మహారాష్ట్ర...ఎల్లుండి హర్యానా. ఇంత వేగంలో యుగాలనాటి 'పెళ్ళి' పనికిరాదు. ఈ పెళ్లి పద్ధతిని సమూలంగా నాశనం చేస్తే ఆడదానికి కూడా మగాడికి బానిసలా బ్రతికే ఖర్మ తప్పిపోతుంది. కేవలం పిల్లల్ని కానీ పెంచే యంత్రం అన్న జీవితం తప్పిపోతుంది. ఆడా, మగా ఇద్దరూ ఈ బంధాల్ని వదిలించుకుంటే ఎవరి జీవితాలు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు స్వేచ్చగా, ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుంది."

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra