Home » Chandu harshavardhan » The investigator


    ఇన్ స్పెక్టరు వీరేష్ కేసు దర్యాప్తు నిమిత్తం జూనియర్ కాలేజీకి వచ్చాడు.
    మొదట విద్యార్థినులను ఒక్కొక్కరినీ పిలిచి విచారించాలని నిర్ణయించుకున్నాడు.
    ప్రిన్సిపాల్ గదిలో కూర్చున్న ఇన్ స్పెక్టర్ దగ్గరకు ఒక్కొక్క విద్యార్థినినీ పంపే బాధ్యత లెక్చరరు మూర్తికి అప్పజెప్పాడు ఆ కాలేజీ ప్రిన్సిపాల్.
    నిండా పదహారు సంవత్సరాలు కూడా లేని ఆ పిల్ల అమాయకంగా ఆ గదిలో నాలుగువైపులా ఉన్న దేశనాయకుల ఫోటోలను చూస్తున్నది. ఆమె అసలు ఇన్ స్పెక్టర్ ఉనికినే పట్టించుకోనట్టున్నది!
    "నీ పేరేమిటమ్మా?"
    "శశికళ..." కళ్ళు చక్రాల్లా తిప్పుతూ అంది.
    "చూడమ్మా శశికలా...ఆరోజు...అంటే మీరంతా పిక్ నిక్ కు వెళ్ళిన రోజున అమరావతిలో ఏం జరిగింది?"
    "మొన్నే కదా అడిగారు. ఇవ్వాళ కొత్తగా చెప్పేదేముంటుందండీ?" ఎదురుప్రశ్న వేసింది.
    "షటప్! ఆడపిల్లవని మర్యాదగా అడుగుతుంటే పొగరుబోతులా ఎదురు ప్రశ్నలు వేస్తావా? నీ తోటి ఆడపిల్ల, సురేఖ జీవితం మొగ్గలోనే నాశనం అయిపోతే, కనీసం నీకు కొద్దిపాటి బాధఅన్నా లేదే?" ఆవేశంగా అన్నాడు వీరేష్.
    ఆమెకు ముచ్చెమటలు పోశాయి. ఇక ఏం మాట్లాడితే ఏం తంటా వస్తుందోననుకుని మౌనంగా ఉండిపోయింది.
    "నిన్నే...నోరు విప్పవేం?...సురేఖ ఆత్మహత్య చేసుకోవడానికి నువ్వే కారణం అని నేనంటున్నాను. నువ్వేమంటావు?"
    ఆ మాటతో శశికళ కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి. వెక్కిళ్ళు మొదలయ్యాయి.
    ఇక ఆ పరిస్థితిలో ఆమెనుంచి ఒక్క విషయాన్ని కూడా రాబట్టడం కష్టమేననిపించింది వీరేష్ కు.
    "సరే! ఇక నువ్వు దయచేయి తల్లీ..." కసురుకున్నాడు.
    గది బయట ఉన్న మిగిలిన ఆడపిల్లలు ఏడుస్తూ వెళ్ళిపోతున్న శశికళను చూసి గతుక్కుమన్నారు.
    తరువాత సీతామహాలక్ష్మిని పంపాడు లెక్చరరు మూర్తి.
    ఆమె గదిలోకి రాగానే వీరేష్ కూర్చోమని సైగచేశాడు.
    "థాంక్స్" అంది కాని కూర్చోలేదు.
    "ఫర్వాలేదు. నేను చెపుతున్నాగా_కూర్చో!"
    ఆమె కూర్చోలేదు.
    "ఏం భయంగా వుందా?" ఈసారి అనునయంగా అన్నాడు.
    సీతామాహాలక్ష్మి ఒక్కసారిగా బావురుమంది.
    "ఛ! ఛ! ఏమిటా ఏడుపు? నీ క్లాసుమేటు సురేఖ ఆత్మహత్య చేసుకోవటానికి కారణం ఏమిటో నీకు తెలిస్తే చెప్పు. లేకపోతే వచ్చిన దారినే బయటకు దయచేయి తల్లీ...!" అసహనంగా అన్నాడు వీరేష్.
    సీతామహాలక్ష్మి మెల్లిగా అక్కడ నుంచి జారుకుంది.
    వనజ వచ్చింది.
    "చూడమ్మా వనజా! నేనేమీ నరరూప రాక్షసుడిని కాదు. నీ అన్నలాంటి వాడిని. నా దగ్గర జరిగిన విషయాలన్నీ చెప్పడానికి నువ్వేమీ భయపడనక్కరలేదు. అంచేత ఏ విషయాన్నీ నా దగ్గర దాచకుండా అన్నీ చెప్పాయి తల్లీ..." మరో విధంగా ప్రయత్నించాడు.
    వనజ మౌనం వహించింది.
    "చూడు వనజా! ఇప్పటికే నీకు ముందు వచ్చినవాళ్ళు అంతా చెప్పేశారు. ఇప్పుడు నువ్వు విషయాలు దాచి చెడ్డపేరు తెచ్చుకోకమ్మా!" ఆఖరి అస్త్రంగా చిన్న అబద్దమాడాడు.
    సరిగ్గా అక్కడే దర్యాప్తు అనూహ్యమైన మలుపు తిరుగుతుందని అతను వూహించలేదు.
    క్షణం వనజ కళ్ళు మిలమిల మెరిశాయి. అప్పటివరకు ఆమెలో ఉన్న భయం పోయింది.
    "వాళ్ళు అంతా చెప్పేశారా సార్? నాకు మాత్రం అంతకంటే ఏం తెలుసు చెప్పండీ!" అమాయకంగా అంది.
    వీరేష్ కు ఒళ్ళు మండిపోయింది. అయినా తను ఆవేశపడి లాభం లేదనుకున్నాడు. మనసును ప్రశాంతం చేసుకుని మరల అనునయంగా అడిగాడు!
    "చూడమ్మా వనజా! ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విషయం చెప్పారు. ఇక నువ్వు అన్ని విషయాలు చెప్పాలి. లేకపోతే అసలు జరిగిన విషయాలన్నీ ఇప్పటివరకూ నువ్వు దాచిపెట్టినందుకు నీ మీద కూడా కేసు పెట్టవలసి వస్తుంది మరి!" చిన్న చురక వేసినట్టు అన్నాడు.
    "నామీద కేసు పెడతారా?" కంగారుగా అడిగింది.
    "ఇప్పుడు జరిగింది చెబితే, నీమీద ఏ కేసూ ఉండదు. చెప్పకపోతే మాత్రం పెట్టవలసి వస్తుంది మరి!"
    "అయితే, నాకు తెలిసింది చెబుతాను...మరి, ఆ రోజున పిక్ నిక్ లో మేమంతా స్వీట్స్ కావాలన్నాం సార్! తను స్వీట్స్ తెస్తానంటూ మా క్లాసుమేట్ రవికుమార్ వెళ్ళాడు సార్. అతను తీసుకువచ్చిన హల్వా అందరమూ తిన్నాం సార్! ఆ తరువాత కొన్ని నిముషాలకే మా అందరికీ మైకం కమ్మింది సార్! సాయంత్రం వరకు ఆ మైకంలోనే కృష్ణానది ఒడ్డున గడిపాం సార్. తరువాత చీకటి పడుతుండగా మైకం వదిలింది సార్. అంతేసార్. ఇక అంతకంటే నాకేం తెలియదు సార్..." దుఃఖాన్ని దిగమింగుకుంటూ అంది.
    ఇన్ స్పెక్టరుకు విషయం అర్థమయింది. ఇందులో రవికుమార్ కుట్ర ఏదో ఉన్నట్టు అనిపించింది.
    "ఓ.కే! వనజా! నువ్వు వెళ్ళమ్మా!"
    ఆమె రివ్వున వెళ్ళిపోగానే రవికుమార్ కోసం కబురుపెట్టాడు.
    రవికుమార్ పిక్ నిక్ కు వెళ్ళివచ్చిన రోజు నుంచీ మళ్ళీ కాలేజీ ముఖం చూడలేదని తెలిసి హతాశుడయ్యాడు ఇన్ స్పెక్టరు వీరేష్.
    పిక్ నిక్ కు విద్యార్థులను తీసుకువెళ్ళిన లెక్చరర్ మూర్తి బాధ్యతగా ప్రవర్తించి ఉంటే బావుండేది. ఒకవేళ మూర్తి కూడా ఈ కుట్రలో భాగస్వామి కాదుగదా? కాకపోతే ఈ విషయం ఎందుకు దాచినట్టు....? ఆలోచించాడు ఇన్ స్పెక్టరు.
    లెక్చరర్ మూర్తి గదిలోకి రావడంతోనే, గది తలుపులు గడియపెట్టాడు ఇన్ స్పెక్టరు.
    ఈ హఠాత్ పరిణామానికి మూర్తి ఖంగుతిన్నాడు.
    ఇన్ స్పెక్టరు ముఖం కందగడ్డలా ఉంది. అతని కళ్ళల్లో ఎర్ర జీర ఏర్పడింది. ఛాతీ కదలిక అతని కోపాన్ని, దాని స్థాయిని తెలియజేస్తున్నది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra