లైన్ దొరకలేదు మహతికి.

 

    తిరిగి బార్ కే చేసేందుకు ప్రయత్నించసాగింది.


        
                                 *    *    *    *

 

    "విషయం నాకర్థమయింది. పదే పదే చెప్పక్కర్లేదు. అమ్మాయి చెప్పినట్లే చేయండి. మహతి ఆలోచనా విధానం హర్షణీయమైన దారిలోనే సాగుతోంది. ఎంతో ఆలోచించుకున్న మీదట కాని ఒక నిర్ణయానికి రాని నా కూతురు మహతి ఆలోచనల చివర ఔచిత్యం, వివేకం ఉంటుంది. వ్యాపారంలో సత్వర నిర్ణయాల మూలంగా దుష్ఫలితాలు గూడా వుంటాయి. కాదనను. అలాగే ఇన్ స్టెంట్ డెసిషన్స్ కి సరయిన ఆలోచనా పునాది లేదని, ఆ నిర్ణయాలు అమెచ్యూర్డ్ అని కూడా అనలేం కదా? తరాలు మారుతున్నాయి. తరాలతోపాటు అన్నిటా వేగం పెరుగుతోంది. కొత్త తరాల ప్రతినిధులకుండే ఐక్యూ ముందు మనది నామమాత్రమయి పోతుంటుంది. అమ్మాయి చెప్పినట్లు అతన్ని రెచ్చగొట్టి, బార్ ని పాతిక లక్షలకు అమ్మేసెయ్. నా తరుపున, అమ్మాయి తరపున నీవే ప్రతినిధిగా వ్యవహరించు.

 

    అమ్మాయి నీకు ప్రామిస్ చేసిన ఐదు లక్షలు నీకు అందుతాయి. అందుకు నేనూ హామీ ఇస్తున్నాను.

 

    యుద్ధంలో ఒక్కక్షణం విలువ కొన్ని లక్షల ప్రాణాలు.

 

    వ్యాపారంలో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్... విలువ 1. కోట్లలో కూడా ఉంటుంది ఒక్కోసారి.

 

    ఏదో అర్థం పరమార్థం లేందే అంత తేలిగ్గా ఒక నిర్ణయానికి రాని నా కూతుర్ని నీ ఆలోచనల్ని, అనుభవాల్ని సమర్థించటం ద్వారా కించపర్చలేను. "బై" అన్నాడు మహతి తండ్రి రాజేంద్రప్రసాద్ స్థిరంగా. ఫోన్ పెట్టేసిన మేనేజర్ లో క్షణక్షణం ఆలోచనలు స్తంభించిపోయాయి. ఆపైన షార్ప్ గా రియాక్ట్ అయి వడివడిగా మధుకర్ ఉన్న దగ్గరకు వెళ్ళాడు. అప్పటికీ ఇంకా గొడవ జరుగుతూనే వుంది.

 

    మరికొంతసేపు అతనికి సర్దిచెప్పే ప్రయత్నం చేసాడు.

 

    ఆపైన తన ఆత్మాభిమానాన్ని ప్రదర్శించుకున్నాడు.

 

    తనకు అవమానం జరిగినట్లు బాధపడ్డాడు, బాధపడ్డట్టు నటించాడు. మధుకర్ తనని కించపరిచినట్లు ప్రవర్తించాడు. చివరగా తను రెచ్చిపోయి మధుకర్ ని రెచ్చగొట్టాడు.  

 

    "పెద్ద కొనేవాడిక్కూడా చెల్లదు. కొంటావా? నీకంత దమ్ముందా? అసలు నీ దగ్గర... నువ్వూ, నీ ఫ్రెండ్ తాగిన మందుకు బిల్లు కట్టేందుకు డబ్బులున్నాయా?" అసంకల్పితంగా, సందర్భాన్నిబట్టి రెచ్చిపోయే మనిషికి, కావాలని అవతల వ్యక్తిని రెచ్చగొట్టే వ్యక్తికి మధ్య చాలా తేడా ఉంటుంది. పదాలు దొర్లింపులో వ్యత్యాసం ఉంటుంది.

 

    దూకుడు... సంయమనం.... భిన్నధృవాలు.

 

    "బిల్లుకు డబ్బులు లేవా? పిచ్చిపిచ్చిగా ఉందా? అసలు నీ బ్రతుకు నీ బార్ బ్రతుకెంతో నీకు తెలుసా? మాకు మందు సప్లైయ్ చేయగల అర్హత నీ బోడి బార్ కుందా?" మంట చల్లారిపోవడం మూర్తికి ఇష్టం లేదు. అందుకే తిరిగి మరికొంత ఆజ్యం పోసాడు.

 

    ఎవరికివారే మేనేజర్, మూర్తి సూత్రధారులు అయిపోతే మధ్యనున్న మధుకర్ మరింత ఫైరయిపోయాడు.

 

    "మర్యాదగా రేటెంతో చెప్పు" అన్నాడు మధుకర్ బేస్ వాయిస్ లో గంభీరంగా.

 

    "పాతిక. ఏం కొంటావా? చెప్పు, పాతిక అంటే పాతిక రూపాయలు, పాతిక వేలో అనుకొనేవు. పాతిక లక్షలు. ఎక్కిన నిషా రేటు చెప్పగానే దిగిపోయిందా ?" హేళనగా అన్నాడు మేనేజర్.

 

    అప్పటికి బార్ లో వున్న మిగతా కష్టమర్స్ అక్కడికి చేరుకొని గుమిగూడారు.

 

    "ఆఫ్ట్రాల్ పాతిక లక్షలు. వాటికి ఐదు లక్షలు నా టిప్ కలుపుకో. టోటల్ గా ముప్ఫై లక్షలు. ఆర్యూ రడీ?" మధుకర్ పెద్దగా అరుస్తున్నట్లుగా అన్నాడు.

 

    "రడీ..." పేపర్స్ తెప్పించనా?" కవ్వింపుగా అన్నాడు మేనేజర్.

 

    "ఏమో... మాట తప్పితే లేదా నిషా దిగాక అమ్మో అంటే... నేనేమన్నానో నాకు గుర్తు లేదంటే?" అంటూ తన వాదనను నలుగురితో సమర్ధింపజేసుకోవటం కోసం కష్టమర్స్ వైపు చూపుల్ని మరల్చుతూ అన్నాడు మేనేజర్.

 

    "అవునవును. రాతకోతలుండాలి. పేపర్స్ తెప్పించండి" అన్నారు అప్పటికే నిషా తలకెక్కి ఉన్న కొందరు కష్టమర్స్... జస్ట్ ఫర్ థ్రిల్ కోసం.

 

    మధుకర్ అలాగే చేసుకో అన్నట్లు నిర్లక్ష్యంగా సంజ్ఞ చేసాడు.

 

    సందర్భం, సంఘర్షణ రక్తి కట్టింది.

 

    చూసేవారికి థ్రిల్లింగ్ అంచుకు చేరుకున్నట్లుగా ఉంది. అప్పుడిక... అసలు వ్యక్తులు ఏ కారణం చేతనైనా వెనక్కి తగ్గే ప్రయత్నం చేసినా ప్రక్కనున్న వాళ్ళు ఊరుకునేలా లేరు.

 

    పౌరుషం, ఆత్మాభిమానం, అభిజాత్యం, అహం,పొగరు మనిషిని ఎక్కడికైనా తీసుకువెళ్తాయి. పర్యవసానాలు ఆ స్థితిలో స్ఫురణకు రావు. వస్తే మానవ జీవితంలో తరచూ రక్తి కట్టే నాటకీయతకి స్థానం ఎక్కడుంటుంది?

 

    నిమిషాల్లో స్టాంప్ పేపర్స్ వచ్చాయి.

 

    లాయర్స్ వచ్చారు.

 

    రాత కోతలయిపోయాయి.

 

    వాటిమీద సంతకాలు చేసి పేపర్స్ ని మేనేజర్ ముఖం మీదకు విసిరి కొట్టాడు మధుకర్.

 

    తుఫాన్ వెలిసినట్లయింది.

 

    థ్రిల్ ని అనుభవిస్తున్న కష్టమర్స్ కొందరు సాక్షి సంతకాలు చేసారు.

 

    ఆ నిజాన్ని ఇంకా నమ్మలేకపోతున్నాడు మేనేజర్.

 

    మధుకర్ ఇగో సంతృప్తి పడింది. గెలిచానన్న విజయగర్వం అతనిలో చోటు చేసుకుంది. గోల్డెన్ స్పూన్ ఇచ్చిన అహంకారం అతన్ని సంతోషపరిచింది.

 

    మధుకర్, మూర్తి కష్టమర్స్ వేపు విజయగర్వంతో చూస్తుండగా.... మేనేజర్ దిగ్భ్రాంతి నుంచి తేరుకున్నాడు.

 

    నిమిషాల్లో, అంతా.... ఇదంతా కళ్ళముందే జరిగింది.

 

    ఇదసలు నిజమేనా?

 

    తన చేతిలో వున్న స్టాంప్ పేపర్స్ ముప్ఫై లక్షలకు సంబంధించిన డీల్ పేపర్సేనా? చిత్తు కాగితాలా?! ఎక్కడో కర్నాటకలో పశ్చిమ పర్వత శ్రేణుల్లో, మడికేరీలో వున్న ఒక యువతి ఇక్కడి డీల్ కి ఎలా సూత్రధారి కాగలిగింది? ఇక్కడి పరిస్థితుల్ని సరీగా ఎలా అంచనా వేయగలిగింది...? ఆమె వయస్సు మహా వుంటే ఇరవై ఒకటి, లేక ఇరవై రెండు!!  

 

    మధుకర్ ఆమెకి తెలుసా?

 

    తెలీకపోయినా, ఇన్ జనరల్ అలాగే రియాక్ట్ అవ్వొచ్చని ఊహించిందా? అంతా... అయోమయంగా వుంది. ఆ రాత్రి గడిచిపోయింది... ఆలోచనలతో.. ఉద్రిక్తతలతో... అనుమానాలతో గడిచిపోయింది.

 

    మరుసటి రోజు ఉదయం - 7-10 ఎ. ఏమ్.

 

    బార్ ని అమ్మినట్లు మడికేరీలో వున్న మహతికి తెలిసిపోయింది.

 

    మరుక్షణం తన తోటి స్టూడెంట్స్ ని అక్కడే వదిలేసి బెంగుళూరు బస్ ఎక్కేసింది. ఆమెకిప్పుడు తను నిర్దేశించుకున్న లక్ష్యంవేపే సాగిపోతున్న నమ్మకం కలిగింది.

 

                              *    *    *    *    *

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra