Home » Vasundhara » ఆడపడుచు

    "వాళ్ళు మనింటికొచ్చారు కూడా..."
    బాలచంద్రరావు ఆమెకు గుర్తొకొచ్చాడు. అతడికి గౌతమ్ బాస్ అతడు యువకుడు. అతడి భార్య రమ అందంగా ఉంటుంది.
    "మనమూ వాళ్ళింటికి వెళ్ళాం" అంది ముక్త.
    వాళ్ళింట్లో బాస్ అన్నకారణంగా గౌతమ్ నీ, అతడి భార్య అయినందుకు ముక్తనూ - అపరిమితంగా గౌరవించారు.
    ముక్త యిబ్బందిపడి - "వీళ్ళు మరీ ఇంతలా గౌరవిస్తూంటే మొహమాటంగా ఉందండీ-" అంది బైటకు వచ్చేక.
    "కంపెనీల్లోనూ, ఆఫీసుల్లోనూ ఇది మామూలే! అంతా యిలా ఉండరనుకో కానీ యిలా ఉండేవారు తాముబాస్ అయితే జూనియర్సిలాగే ఉండాలను కుంటారు..." అన్నాడు గౌతమ్.
    అప్పుడు ముక్త మనసులో సంధ్య నభినందించుకుంది.
    "నాకు రమలా ఉండడం చేతకాదు..." అందామె.
    "నీకా అవసరముండదులే..." అన్నాడు గౌతమ్.
    "ఇప్పుడతడి గురించేదో చెప్పారు?" అంది ముక్త భర్తతో - జరిగిందంతా గుర్తుకు తెచ్చుకుంటూ.
    "రేపే బాలచంద్రరావు కంపెనీ పనిమీద టూర్ వెడుతున్నాడు. అతడు గెస్ట్ హౌస్ లోనే ఉంటాడు. కార్లోప్రయాణం...కూడా భార్య..."
    "అయితే?" అంది ముక్త. ఆమెకు కొంచెం కొంచెం అర్ధమవుతుంది.
    "బాస్ నాకిచ్చినలాంటి అవకాశమే - బాలచంద్రరావుకీ యిస్తున్నాడు. అసలు విషయం బాలచంద్రరావుకు తెలియదు. అతడు నాకంటే తెలివిగా వ్యవహరించగలిగితే - బహుశా కారు, బంగ్లా అతడికి వెళ్ళి పోతాయి..."
    "పోతే పోనీండి...."
    "అప్పుడు బాలచంద్రరావు నాకు బాస్ అవుతాడు..."
    ఉలిక్కిపడింది ముక్త.
    "ఇప్పుడు బాలచంద్రరావు దగ్గర ముగ్గురు అసిస్టెంట్సున్నారు. వారినతడు బానిసల్లా చూస్తాడు. అయినా ఆర్ధిక ప్రయోజనాలనాశించి వారతడియాజమాన్యాన్ని సహిస్తున్నారు. బాలచంద్రరావు బాస్ అయితే మనమిద్దరం అతడికి బానిసలమవుతాం ఉద్యోగం పోవడంకంటే అవమానకరమైనదిది..."
    ముక్త ఆలోచనలో పడింది. భానుప్రకాష్ తనూహించినకంటే తెలివైనవాడు అతడు భర్తనుద్యోగంలోంచీ తొలగించడు. అతన్ని ఆశపెడతాడు. ప్రలోభ పెడతాడు లొంగక పోతే జూనియర్నతడిపై బాస్ ను చేస్తాడు. అందులోను బాలచంద్రురావు వంటివాన్ని...
    తను రమ వైపు బానిసలా చూడాలంటే....
    ఊహలోనే కంపరమనిపించింది ముక్తకు.
    "నా భవిష్యత్తు మంగళవారం నాటితో తేలిపోతుంది..."
    మంగళవారం...మంగళవారం....
    మంగళవారం ప్రాముఖ్యత ముక్తకు తెలుసు.
    భారత స్త్రీ కెంతో పవిత్రమైన రోజది. శ్రావణ మాసంలో ఆమంగళవారం నాడు తను పూజలు చేస్తుంది. ఆ పూజలు తన భర్త కోసం...
    ఈ మంగళ వారం నాడు....
    భర్త కోసమే తాను పరాయిమగాడి కంకితం కావాలి.
    భానుప్రకాష్ బాలచంద్రరావును టూర్ మీద పంపుతున్నాడు. అక్కడతడు నీకాంతంలో రమను కలుసుకుంటాడు. రమ ఒప్పుకుంటే...
    తానొప్పుకుంటే....
    రమ తనకు బానిస, కారు, బంగ్లా తనస్వంతం.
    తానొప్పుకోకపోతే!
    రమ తనకు బానిస, కారు, బంగళా తన స్వంతం.
    తానొప్పుకుంటే...  
    రమ తనకు బానిస, కారు, బంగళా రమ స్వంతం.
    కారు, బంగళా - సామాన్యమైన హోదా కాదు. ఆ హోదా సంపాదించాలంటే తను చేయాల్సిన త్యాగం..  
    అది సామాన్యమైనది కాదు...
    భానుప్రకాష్ దృష్టిలో అది సామాన్యమైనదే...
    "ఏమిటలా చూస్తున్నావు ముక్తా!" అన్నాడు గౌతమ్.
    ముక్త అతడికి చెప్పలేదు. ఆమె కతడివద్ద ఆ చనువులేదు.
                                               14
    రోజులు మంగళవారంవైపు పరుగెడుతున్నాయి.
    ముక్తకు చాలా యిబ్బందిగా ఉంది. ఆమెకూడా ఎంతో ఆతృతగా రానున్న మంగళవారంకోసం ఎదురు చూస్తోంది.
    మంగళవారం తన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
    ఆరోజు సోమవారం...
    ముక్తకు భానుప్రకాష్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్లో అతడామెకు- "రమ నీకంటే తెలివైనది...." అన్నాడు.
    రమ ఎవరిని ముక్త అడగలేదు. జరిగిందేమిటో ఆమె ఊహించుకుంది.
    గెస్ట్ హౌస్ లో రమ, భానుప్రకాష్....
    "రమ తెలివికంటే నాకు నీ చురుకు చూపులే యిష్టం....
    భానుప్రకాషింకా తనను వదలడంలేదు.
    "మంగళవారం సాయంత్రందాకా నేనే నిర్ణయమూ తీసుకోను...."
    భానుప్రకాష్ మాటలామె వింటోంది. కర్తవ్యం ఆలోచిస్తోంది.
    ఇప్పుడామె కతడి మాటలు కోపం తెప్పించడంలేదు.
    "రమంటే నాకు మోజు లేదు. వచ్చిన అవకాశాన్నుపయోగించుకున్నాను. నువ్వంటే నాకాకర్షణ ఉంది. అవకాశాన్ని నువ్వుపయోగించుకో..."
    ముక్త అతడి మాటలు వింటోంది. తనేం చెప్పడం లేదు.
    "ఈరోజంతా బాగా ఆలోచించుకో. ద్రౌపతికి అయిదుగురు భర్తలు. ఆమె పతివ్రత. అహల్యను భర్తకాక ఇంద్రుడు కూడా అనుభవించాడు. ఆమె పతివ్రత, శ్రీకృష్ణుడిని ప్రేమించింది రాధ. ఆమె ప్రేమ కథలకు ఆదర్శం, శీలం, పవిత్రత కవుల కలాల్లో ఎలాంటి మలుపులైనా తిరిగి ఎలాంటి అర్దాలైనా సంతరించుకుంటాయి. నువ్వు తప్పు చేయడంలేదు. వచ్చిన అవకాశాన్నుపయోగించుకుంటున్నావు. నేనోవిలనైతే నువ్వు పతివ్రతవు. భర్తకోసం శీలాన్నే త్యాగంచేయనున్న మహాపతివ్రతవు. తప్పు నీ ఆలోచనలో ఉంది తప్ప - చేతలలో లేదు. నా మాట విను. నీభర్తను నిరుత్సాహపరచకు. రేపటి కన్ని ఏర్పాట్లూజరుగుతున్నాయి. మనం తప్పక కలుసుకుంటాం...."
    ముక్త ఫోన్ పెట్టేసింది.
    వెంటనే మళ్ళీ ఫోన్ రింగయింది.
    ముక్త ఫోన్ తీయలేదు.
    ఫోన్ ఆగకుండా రింగవుతూనే ఉంది.
    చివరకు ముక్త విసుగ్గా ఫోన్ తీసి- "హలో"!" అందామె.
    "ముక్త - నువ్వేనా - నేను గౌతమ్ ని...."
    ముక్త త్రుళ్ళిపడింది- "హలో -మీరా!" అందామె.
    "అవును - ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎంగేజి రింగిస్తోంది. చివరికి లైన్ దొరికితే నువ్వోపట్టాన ఫోన్ తీయలేదు...."
    "ఏమిటి విశేషం?"
    "విశేషమే - ఈరోజు నాకు మళ్ళీ టూరుంది, సామాను సర్దిఉంచు. కార్లో వస్తాను...సరిగ్గా నాలుగింటికి..."
    "నేను రాలేనండీ-" అంది ముక్త అప్రయత్నంగా.
    "నువ్వు కాదు. ఈసారి నేనొక్కన్నే. ఇదినాకు పరీక్ష సమయం. రెండు పార్టీలతో డీల్ చేయాలి. రేపుసాయంత్రం ఆరింటికి సరాసరి ఆఫీసులో నన్ను కలుసుకుంటాడు బాస్....ఈసారి బాగాడీల్ చేయగలననే అనుకుంటున్నాను..."
    "అంటే ఊరికెడుతున్నారన్నమాట"...
    "ఊఁ నీకేమనిపిస్తోంది? అంతాబాగా జరుగుతుందంటావా?"
    "నేనేం చెప్పగలను?"
    "చెప్పగలవు. నువ్వు నా అదృష్ట దేవతవు...."
    అతడలాగనగానే - "అందమైన భార్యలు- భర్తల ప్రగతి సోపానాలు." అన్న భానుప్రకాష్ మాట ముక్త చెవుల్లో గింగురు మంది.
    "చెప్పు- ముక్తా!
    "అన్నీ మీకేతెలుసు. మీకంటే నాకేమీ ఎక్కువ తెలియదు..."
    "అలాకాదు. అంతా నేననుకున్నట్లే జరుగుతుందని చెప్పు..."
    "సరే - అంతా మీరనుకుంటున్నట్లే జరుగుతుంది..." అనేసి - తానెవరికో అమ్ముడు పోయినట్లు ఫీలయింది ముక్త.
    "థాంక్స్ - ముక్తా! కార్లోవస్తాను. ఎంత సేపుండను...."
    "సరే -..."
    ఫోన్ పెట్టేశాడు గౌతమ్.
    ఆ తర్వాత అతడికారు సరిగ్గా టైముకి వచ్చింది, గౌతమ్ లోపలకు వచ్చాడు.
    అతడు టెన్షన్ లో ఉన్నాడని గ్రహించింది ముక్త.
    "అలాగున్నారేం - ఫ్రీగా ఉండండి..." అందామె.
    "బాలచంద్రరావు వచ్చేశాడు. చాలా హుషారుగా ఉన్నాడు బాస్ కూడా అతన్ని అందరి ఎదుటా మెచ్చుకున్నాడు...."
    "అయితే?"
    "ఈ నిమిషన్లో నేను ఫెయిలయితే - రేపట్నుంచీ అతడే నాకుబాస్ -"దిగులుగా అన్నాడు గౌతమ్.
    "అలా దిగాలు పడకండి - బాలచంద్రరావు మీకు జూనియర్ గానే ఉంటాడు. అతడికి ప్రమోషన్ వచ్చినా - మీరతడికంటే పైనే ఉంటారు...."
    "ఎలా చెప్పగలవు?"
    "ఈ విషయం నేను మీ అదృష్ట దేవతగా చెబుతున్నాను...."
    "నిజంగా-" అన్నాడు గౌతమ్.
    అప్పుడతడి ముఖంలో పసిబాలుడి అమాయకత్వం, ఆత్రుతతో కూడిన సంతోషం కనబడింది ముక్తకు.
    "ఊఁ" అందామె.
    గౌతమ్ తృప్తిగా వెళ్ళిపోయాడు.
    కారు కనుమరుగయ్యేదాకా చూసి తలుపులేసుకుంది ముక్త. ఆమె సరాసరి పడక గదిలోకి వెళ్ళి మంచంమీద పడుకుంది.
    ఆమె మెదడునిండా ఆలోచనలు...
    తనేంచేయాలో నిర్ణయించుకుందామె....
    తన నిర్ణయం తప్పుకాదని ఆమె మనసును సరిపెడుతోంది.
    సంప్రదాయం ఓ పట్టాన అందుకంగీకరించడంలేదు.
    మనసు ద్వైదీభావంలో ఊగిసలాడుతోంది.
    ఏం చేయాలన్నది కాదామె సందేహం.
    తను చేస్తున్నది తప్పా, కాదా? -అదీ
    తప్పు చేశాక తన మానసిక స్థితి ఎలాగుంటుందో తెలియదామెకు. కానీ ఆమె ఆలోచనల్లోకి భానుప్రకాష్ వస్తున్నాడు. భర్త స్థానంలో అతడినూహించుకుంటే జుగుప్సాకరంగా ఉందామెకు.
    అజంతా ఇంటర్నేషనల్ గురించి విందామె.
    రేపు భానుప్రకాష్ ఇల్లొక అజంతా ఇంటర్నేషనల్.
    అక్కడ తనకుతానే వెడుతుంది - భర్త ప్రమేయం లేకుండా.
    కానీ- నిజానికిందులో అతడి ప్రమేయం లేదా? తెరమరుగున ఉండి అతడు నిర్వహిస్తున్న పాత్ర ఏమిటి?
    అతడికి తెలియకుండానే భానుప్రకాష్ ఈ ఏర్పాట్లన్నీ చేయగల్గుతున్నాడా?
    అప్పుడో విచిత్రమైన ఆలోచన కలిగింది ముక్తలో.
    భానుప్రకాష్, గౌతమ్ స్నేహితులు, స్నేహితుడిద్వారా గౌతమ్ తన శీలాన్ని పరీక్షిస్తున్నాడు.
    రేపు భానుప్రకాషింట్లో గౌతమ్ కూడా ఉంటాడు.
    అప్పుడు....?
    అక్కడ గౌతమ్ ఉంటాడని ఆమె మనసొప్పుకోవడంలేదు. కానీ భానుప్రకాషింటికి వెళ్ళడానికామె మనసు పూర్తిగా సిద్దపడుతోంది.
                                                                     15
    మంగళవారం మధ్యాహ్నం మూడుగంటలు.
    ముక్త భానుప్రకాషింట్లో అడుగు పెట్టింది.
    ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆమె అడుగు పెట్టిన కొద్దిక్షణాల్లోనే ఎక్కణ్ణించో భానుప్రకాష్ ఆమె ముందు ప్రత్యక్ష మయ్యాడు.
    "నీ పాదాలు చప్పుడు చేయడంలేదు. కానీ నీ తనువు పరిమళాన్ని నేనెంత దూరాన్నుంచైనా గుర్తుపట్టగలను..." అన్నాడు భానుప్రకాష్.
    ముక్త ముక్తసరిగా నవ్వి - జోళ్ళు విడిచింది.
    "లోపలకురా-" అన్నాడతడు.
    ఆమె అతడిననుసరించింది.
    అతడు సరాసరి ఆమెను పడక గదిలోనికి తీసుకుని వెళ్ళాడు.
    గదిలో డబల్ కాట్....మంచంనిండా పరిచిన మల్లెలు గుబాళిస్తున్నాయి.
    ఆమె అతడివంక చూసింది.
    అతడి ముఖంలో ఉత్సాహముంది.
    ఆమె నిట్టూర్చి - "నేను వస్తాననుకున్నావా?" అంది.
    "ఊఁ"
    "నీ దృష్టిలో నేను చౌకబారు దాన్ని. కదూ?

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra