Home » Yerramsetti sai » Humourology - 3


    యాదగిరీ డయిరీ తీసి చకచకా బస్ నెంబర్ రాసుకున్నాడు.

 

    సరిగ్గా అప్పుడే ఇంకో ఇసుకలారీ పెద్దగా హారన్ కొట్టుకుంటూ వచ్చి ఆగింది.

 

    అందరూ అమాంతం లారీ మీదకు ఎగబడబోయారుగానీ మేమందరం చేతులు పట్టుకుని వారికి అడ్డంగా నిలబడ్డాం.

 

    "సోదరులారా తొందరపడకండి! ఇంకో బస్ వచ్చే టైమవుతోంది! మనం ఓ గంట ఆలస్యంగా వెళ్ళినా ఫర్లేదుగానీ క్షేమంగా, సురక్షితంగా వెళ్ళాలనీ ఆర్టీసీ వాళ్ళు చెప్తున్నారుకదా!"

 

    ఆ లారీ వెళ్ళిపోయింది. ప్రతి పావుగంటకు బస్సుందన్నారుగానీ ఒక్కటీ కనిపించటం లేదు- ఈ సారి గంటయినాగానీ బస్ జాడలేదు. ఉండుండి ఎక్స్ ప్రెస్ బస్ లు మాత్రం వేగంగా వెళ్ళి పోతున్నయ్.

 

    "ఏమయ్యా మీ దిక్కుకెళ్ళి మా పన్లన్ని ఖరాబయి పాయె! ఇంకో గంటయెనా అంటే పాలుపోయించుకునేటోళ్ళు వాపస్ జేస్తారు. కూరగాయల ధరగూడ గిరాయించి పోతది- ఈ నష్టమంతా ఎవళ్ళు ఇయ్యాలె?" అన్నాడొకతను మావేపు కోపంగా చూస్తూ.

 

    మా గుండెలు ఝల్లుమన్నాయ్.

 

    ఆ నష్టమంతా మమ్మల్ని ఇమ్మంటారేమోనని.

 

    సరిగ్గా అప్పుడే దూరంగా మరో ఎర్రబస్ కనిపించింది.

 

    "అదిగో వస్తోంది. చూశారా! ఎప్పటికీ తొందరపడగూడదు! ఓర్పే విజయం! అన్నాడు శాయిరామ్.

 

    "అదిగూడ ఆగదు! మేం దినాం సూట్టంలే? ఒక్క బస్ కూడా ఆగదీడ!" అన్నాడింకొకతను.

 

    మాకు భయం వేసింది.

 

    ఆ బస్ కూడా ఆగకపోతే మా పరువు పోతుంది.

 

    "యాదగిరి! అందరం అడ్డు నిలబడదాం లేకపోతే వాడు కూడా ఆపేట్లు లేడు" అన్నాడు రంగారెడ్డి అప్పటికప్పుడే గొప్ప ప్లాన్ ఆలోచిస్తూ.

 

    అందరం రోడ్ కడ్డంగా నిలబడ్డాం.

 

    "బస్ ఓ పక్కకు ఒరిగిపోయి నెమ్మదిగా వచ్చి ఆగింది. డ్రైవర్ మావేపు కోపంగా చూశాడు.

 

    "నీయవ్వ ఎవళువయా మీరు? ఎందుకాపిన్రీడ?" అడిగాడు మండిపడుతూ.

 

    "వీళ్ళందరూ బస్ ఎక్కాలి!"

 

    "ఏడెక్కుతారు? నా నెత్తిమీదనా? జాగా ఏడున్నది? కండ్లులేవా మీకు? ఓవర్ లోడున్నది కానరాలే?"

 

    అప్పటికే జనం బయటకు వేలాడటంతో ఇంకెవరూ బస్ ఎక్కటానికి వీల్లేకపోయింది. ఆ బస్ వెళ్ళిపోయింది.

 

    మాకు భయం మొదలయింది. వీళ్ళందరూ కలసి మమ్మల్ని తిడతారేమోనని.

 

    "నీయవ్వ ఆర్టీసీ బస్ లో పొమ్మని చెప్తున్రు ఏడాగినయ్ బస్ లు?" మమ్మల్ని ఎటాక్ చేయటం ప్రారంభించాడొకతను.

 

    "ఈపాలు గిట్ట ఖరాబయినాయో- ఈ సాలెగాండ్లను ఈడనే తందాం" అన్నాడింకొకడు.

 

    "ఏయ్- ఏమ్మాట్లాడుతున్నావ్?" అంటూ ఎదురు తిరిగాడు యాదగిరి.

 

    "లేకుంటే ఏందిది? పోయేటోళ్ళను రుకాయిస్తుంటివి? బస్ ళు ఆపకపోతివి! దమాకేమన్న ఖరాబయి ఈడకొచ్చిన్రా మీరు" మూడోవాడు మీదకొచ్చాడు.

 

    దాంతో మాకు పరిస్థితి క్షీణిస్తోందని అర్థమయిపోయింది.

 

    సరిగ్గా అప్పుడే ఇంకో ఇసుకలారీ వచ్చిందిగానీ దాన్నిండా అప్పటికే జనం నిండిపోయి వుండటంతో ఆగకుండా వెళ్ళిపోయింది.

 

    "ఏయ్! ఇప్పుడేమంటవ్! గిప్పుడు లారీల జాగా దొరికెడిది కూడా భరోసాలేదు."

 

    మా దగ్గరకొచ్చి నిలదీశాడింకోవ్యక్తి.

 

    మాకేం చెప్పాలో తెలీలేదు.

 

    "ఇంకో ఎర్రబస్ ఇంకో పావుగంటలో వస్తుంది కదా?"

 

    "అది అస్సలు ఆగదు! జమానాకెళ్ళి జూస్తున్నాం"

 

    "ఇగో! ఇంకో అర్థగంటలో మేమీడకెళ్ళిపోవాలె! బస్ రుకాయిస్తరో, లారీ రుకాయిస్తరో మాకెరుకలే! లేకుంటే బొక్కలిరుగుతయ్" మరోడు వార్నింగిచ్చాడు.

 

    మా మొఖాల్లో రంగులు మారిపోయాయ్.

 

    "బుద్ధి తక్కువయి వచ్చాం" అన్నాడు శాయీరామ్.

 

    "అయినా సోషల్ సర్వీస్ గవర్నమెంట్ తో సంబంధం లేనిదయితేనే చేయాలిగానీ ఉంటే ఇలాగే అవుతుంది" అన్నాడు రంగారెడ్డి.

 

    మరో పావుగంటలో ఇంకో లారీవచ్చిందిగానీ అదికూడా కిటకిట లాడిపోతూండటం వల్ల ఆగకుండా వెళ్ళిపోయింది.

 

    మాకు టెన్షన్ పెరిగిపోతోంది.

 

    అందరూ డైరెక్ట్ గానే మమ్మల్ని తిడుతున్నా వినబడనట్లు దిక్కులు చూస్తున్నాం!

 

    ఈసారి ఇంకో లారీ దూరంగా కనిపించింది.

 

    ఆ లారీ కూడా ఆగకపోతేవాళ్లు మమ్మల్ని చావగొడతారన్న విషయం అర్థమయిపోయింది మాకు!

 

    అందుకని అందరం పరుగుతో రోడ్ మధ్యకెళ్ళి చేతులూపుతూ లారీకి అడ్డంగా నిలబడ్డాం.

 

    లారీ వచ్చి ఆగింది.

 

    దాన్నిండా కూడా జనం కనిపించేసరికి మా పై ప్రాణం పైనే పోయినట్లయింది.

 

    "ఎలాగోలా వీళ్ళను ఎక్కించుకెళ్ళండి డ్రైవరుగారూ ప్లీజ్" అంటూ బ్రతిమాలసాగాడు గోపాల్రావ్?

 

    "మాకేం ఆకలున్నదా? నీయవ్వ జగా ఏడున్నదింకా?" అంటూ లారీ భాషలో. మమ్మల్ని ఏవేవో తిట్టి మళ్ళీ స్టార్ట్ చేసుకెళ్ళిపోయాడు.

 

    మరో రెండు లారీలు కూడా జనంతో నిండి వెళ్ళిపోయినయ్.

 

    "ఏయ్! ఈ పాలకు, కూరగాయలకు మీరే పైసల్ గట్టండ్రి" అంటూ రంగారెడ్డి చొక్కా పట్టుకున్నాడో యువకుడు.

 

    అందరం అతికష్టం మీద అతని చొక్కా విడిపించాం.

 

    ఈసారి మరోలారీ కనిపించేసరికి మళ్ళా మేము రోడ్ కి అడ్డంగా నిలబడ్డాం. దగ్గరుకొస్తున్న కొద్దీ లారీ వేగం పెరిగిపోవటంతో మాకు గుండె ఝల్లుమంది.

 

    "వాడు తాగి ఉన్నట్లున్నాడు" అన్నాడు శాయిరామ్ వణుకుతూ. దగ్గరికొచ్చేసినా లారీ వేగం తగ్గకపోవటంతో అందరం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు అంచులకు పరుగెత్తాం! అందరం ఒకేసారి పరుగెత్తటంతో ఒకరిద్దరు కింద పడటం కూడా జరిగింది. పార్వతమ్మకి మోచేతులు కొట్టుకుపోయినయ్.

 

    "ఇగో ఇంకొక్క అర్థగంట టైమిస్తున్నాం! ఈ లోపట లారీ ఆపక పోయిన్రంటే మొత్తంమీద పైసలు మాకు గట్టాలె! సమజయిందా?"

 

    సరిగ్గా అప్పుడే ఇంకో లారీ వస్తూ కనిపించింది.

 

    మళ్ళా అందరం రోడ్డుకి అడ్డంగా నిలబడ్డాం.

 

    లారీ ఆగింది.

 

    సగం మేరకు జనం నిండిపోయి ఉన్నారు దానిమీద. డ్రైవరు అంతమందిని ఎక్కించుకోడానికి వప్పుకోలేదు.

 

    "ఎవళ్ళయిన కిందపడితే ఆ ఫాల్తూ కిరికిరి నాకు తగులుకుంటది భాయ్. ఇంకో లారీలో రాండ్రి" అన్నాడు మళ్ళీ స్టార్ట్ చేయబోతూ.

 

    "అట్లనకు స్వామీ! కావాల్నంటే ఓ పాతిక రూపాయలూ మేము ఎక్కువ ఇస్తాం! తీసుకో!" అంటూ బలవంతంగా ఓ పాతిక డ్రైవర్ చేతిలో పెట్టి అందర్నీ లారీ ఎక్కించాము. లారీ వెళ్ళిపోయింది.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra