Home » Dr. dasaradhi rangacharya » Krishna Yajurveda


    దేవాశ్వముల గ్రహస్థానీయమగు నీవు విష్ణువుకు ప్రీతిపాత్రమవు అగుచున్నావు. సర్వదేవతలచే కోరబడునట్టి వృషదాజ్యమా! విష్ణువు నిన్ను ప్రధానమైన దానిగా స్వీకరించినాడు. నీ మహిమ నేయి, పెరుగులతో వర్ధిల్లును గాక. ఇష్టదేవత కొరకు హుతమైనదియు, సేవించదగినదియు అయిన వృషదాజ్యఫలము నన్ను చేరును గాక. నీవు సర్వదేవతల హితము కోరుదానవు, శ్వేతగోవు యొక్క దుగ్ధమవు అగుచున్నావు.

    2. ఇంద్రా! నీ మహిమచే ద్యావాపృథ్వులు నిలిచినంతకాలము, సప్తసముద్రము ఉన్నంతకాలము ఈ పాత్రయందలి సారము నశించకుండవలెనని గ్రహించుచున్నాను.

    3. వృషదాజ్యమును నల్లని వలను పక్షి ముట్టినచో యజమానికి సంబంధించిన శూద్రులు నశింతురు. కుక్క ముట్టిన యజమానికి సంబంధించిన చతుష్పాత్తులు నశించును. హోమపాత్రము నుండి వృషదాజ్యము జారిపడినచో యజమాని మరణించును.

    4.పశువులే వృషదాజ్యము అగుచున్నది. కావున అది జారిపడినంత పశువులు జారిపడుచున్నవి. కావున యజమాని వృషదాజ్యమును మరల గ్రహించవలెను. అందువలన అతనికి పశువులు మరల లభించును.

    5. ప్రాణోవైవృషదాజ్యమ్. కావున వృషదాజ్యము జారిపడినంత యజమాని ప్రాణములు జారిపోవును. కావున అతడు వృషదాజ్యమును మరల గ్రహించవలెను. అందువలన అతని ప్రాణములు తిరిగి చేరుచున్నవి.

    6. వృషదాజ్య పాత్రయందు బంగారము వేయవలెను. దానిని యజమాని సేవించవలెను. బంగారము అమృతము. వృషదాజ్యము ప్రాణము. అట్లగుటచే యజమాని ప్రాణములందు అమృతము చేరినట్లగును. బంగారము శత పరిమాణము కావలెను. మానవుని ఆయువు శత సంవత్సరములు. అతని ఇంద్రియములు శతసంఖ్యాకములు.

    7. మరల అందుకున్న వృషదాజ్యమును అశ్వమునకు వాసన చూపించవలెను. అశ్వము ప్రజాపతి కంటినుండి పుట్టినది. అందువలన ప్రాజాపత్యమగును. వృషదాజ్యము ప్రాణము. ప్రాణము ప్రజాపతి సృష్టించినది. కావున ప్రాజాపథ్యము. ఏకయోని సంజాతలైన ఈ రెండివలన యజమాని ప్రాణనిర్మాణము చేసినవాడగును.

    8. ఏ యజమాని వృషదాజ్యము జారిపడునో అతని యజ్ఞము విచ్చిన్నమగుచున్నది. ఆ దోషనివారణమునకు విష్ణుసంబంధ ఋక్కులచే వృషదాజ్యమును పునః గ్రహించవలెను. యజ్ఞము విష్ణుస్వరూపము కదా! అందువలన యజ్ఞము చేతనే యజ్ఞమును వర్థిల్లచేసిన వాడగును.

                                    ఏడవ అనువాకము

    1. సవితృదేవా! ఉద్గాత నీకు స్తుతివాక్యములు పలికినాడు. నీవు ఆ స్తోత్రమును స్వీకరింపుము. యజ్ఞమును ఘనముగా జరిపించుము.

    ఉద్గాతలారా! నేను బృహస్పతిని. నేను బ్రహ్మను. నేను ఆజ్ఞాపించుచున్నాను. మీరు ఆయుష్మత్యఋక్కు నుండి తొలగకండి. స్తోత్రశరీరమగు ఋక్కును రక్షించునట్టి సామము నుండి తొలగవద్దు. యజమాని విషయమున మీ ఆశీస్సులు, సదభిప్రాయములు "సత్యాస్సన్తు" నిజములు అగునుగాక. ఋతంవదత - సత్యము పలుకండి. సవితృదేవత అనుజ్ఞపొంది అతనిని కీర్తించండి.

    2. స్తోత్రమా! నీవు స్తోత్రములందు ఉత్తమమైనదానవు. శస్త్రమా! నీవు శస్త్రములందు ఉత్తమమైన దానవు. మీయొక్క సారమును నేను ఆర్జించుచున్నాను. మాకు మీ ఉభయుల అనుగ్రహము కలిగినది. మాకు అంగవైకల్యము కలుగుటలేదు. అభీష్టఫలసిద్ధి కలుగుచున్నది. మేము పుత్ర, పౌత్రాదులను, అన్నమును సంపాదించుచున్నాము.

    నేను దేవతల కొరకు యాగము చేయుచున్నాను. వారి ఆశీస్సులు సత్యములు అగునుగాత. నా వద్దకు బ్రహ్మవర్చస్సు చేరునుగాత. ఈ యజ్ఞము సంపూర్ణమైనది. ఇది మరల మరల జరుగునుగాత. ఈ యజ్ఞము దేవతలను పాలించును గాత. ఇది మమ్ము మరింత అనుష్ఠాన వంతులను చేయునుగాక. మేము ధనపతులము అగుదుముగాత.

    3. యజ్ఞము యజ్ఞకర్తను పిండుచున్నదా! యజ్ఞకర్త యజ్ఞమును పిండుచున్నాడా?

    ఎవడు స్తుతుల, శస్త్రముల దోహమును తెలియని వాడై యజ్ఞము చేయుచున్నాడో అతనిని యజ్ఞము పిండివేయుచున్నది. ఆ విధమగు యజ్ఞము చేయుట వలన అతడు దరిద్రుడు అగుచున్నాడు.

    ఎవడు స్తుతుల, శస్త్రముల దోహమును తెలిసికొని యజ్ఞము చేయుచున్నాడో అతడు యజ్ఞఫలమును పిండుకొనుచున్నాడు. ఆ విధమగు యజ్ఞము చేయుట వలన అతడు ధనవంతుడు అగుచున్నాడు.

    'స్తుతస్యస్తుతమస్యూర్జం.......శస్త్రంగమ్యాత్' అనునది మంత్రము. ఇదియే స్తుతశస్త్రముల దోహము. ఇది తెలిసి యజ్ఞము చేసినవాడు నిశ్చయముగా యజ్ఞఫలమును పిండుకొనుచున్నాడు. ఆ విధముగ యజ్ఞము చేసి ధనవంతుడు అగుచున్నాడు.

                                     ఎనిమిదవ అనువాకము

    1. శ్యేన రూపమై పతనశీలమైన దానికి స్వాహా. వట్త్స్వయ మభిగూర్తాయ నమః - స్వయముగా సోమ సమీపమునకు నిశ్చయముగా వెళ్లుటకు ఉద్యుక్తులైన దేవతలకు నమః.

    శత్రువినాశము చేసి, నన్ను పోషించునట్టి దేవతకు స్వాహా. వట్త్స్వయ మభిగూర్తాయనమః.

 

    సర్వము ధరించి, జనులను ప్రఖ్యాపన చేయు దేవతకు స్వాహా. వట్త్స్వయ మభిగూర్తాయనమః.

 

    హోమకర్తలకు శక్తి రూప అన్నమునిచ్చు దేవతకు స్వాహా. వట్త్స్వయ మభిగూర్తాయనమః.

 

    హోమకర్తలకు క్షీరప్రదుడగు ప్రజాపాలకమనువునకు స్వాహా. వట్త్స్వయ మభిగూర్తాయనమః.

 

    సత్యపాలకుడు, స్వర్గము కలిగించు వాడునగు దేవా! మా యజ్ఞము నీకొరకు స్వాహా. 

 

    2. హోతచే ఆహ్వానించబడిన దేవతలు మధువు, ఆజ్యములచేత తృప్తినొందుదురు గాక.

    3. యజ్ఞపతి చైత్ర వైశాఖమాసములందు జ్యోతిష్టోమ యాగము చేయకుండుట వలన ప్రజలు అన్నము లేనివారై, ఆపదల పాలగుచున్నారని ఋషులు చెప్పిఉన్నారు. అందువలన యజమాని పాపములపాలగుచున్నాడు. కావున విశ్వకర్మ యజ్ఞపతులమైన మమ్ము చైత్ర, వైశాఖమాసములందు జ్యోతిష్టోమము ఆచరించుటకు ప్రోత్సహించునుగాత.

    4. ఋషులు ఉగ్రులు. వారికి నమస్కారము. మా కంటికి, మనసుకు సంధానము చేయుమని సవినయ నమస్కారము. ప్రజాపతికి నమస్కారము. అతడు మమ్ము కాపాడునుగాక.

    5. విశ్వకర్మా! మేము నిన్ను తప్ప ఇతరులను ఎరుగని వారము. మమ్ము సోమపానము చేసినవారినిగా గుర్తింపుము. యుద్ధములందు ఇతరుల ప్రాణములు కాపాడు ధీరుని వలె మమ్ము రక్షింపుము.

    ఈ యజమాని తమోగుణము వలన ఋషుల విషయమున మహాపరాధము చేసినాడు. అతనిని ఆ మహాపరాధము నుండి విముక్తుని చేయుము.

    6. కొందరు యాగధనమును భక్షించుచున్నారు. వారిని చూచి అగ్నులు దుఃఖపడుచున్నవి. అట్టి దుష్టకర్మకు సంబంధించిన వినాశము ఈ యాగమునకు కలుగకుండునుగాక. విశ్వకర్మ మా యజ్ఞమును చక్కగా అనుష్ఠింప చేయునుగాత.

    7. పితృదేవతలు యజ్ఞము కోరువారు. యజ్ఞము చేయించువారు. పితరులు మమ్ము చూచుచున్నారు. వారికి నమస్కారము.

    పితృదేవతలారా! మేము యజ్ఞమునందు కోరిక లేనివారమై మీకు యజ్ఞము చేయకుంటిమి. ఆ పాపముల నుండి మమ్ము విముక్తులను చేయండి.

    8. యజ్ఞమునకు వచ్చినవారందరు సదస్యులగుదురు. వారందరు దక్షిణకు అర్హులు. వారికి దక్షిణలు ఇవ్వని యజమాని సదస్యుల నుండి విడివడిన వాడగుచున్నాడు. అందుకు పరిహారముగా వైశ్యకర్మ హోమములను చేయవలెను. అందువలన యజమాని సదస్యులను సంతోషపరచిన వాడు అగును.

    9. దేవతలారా! మీరు మా శరీరములకు చికిత్సచేయండి. పాలగిన్నెలో తోడు వేసిన పెరుగు అగును. ఆ పెరుగు వలన భార్యాభర్తలు అందముగలవారలు అగుదురు. ఆ అందము వలన వారికి పుత్రుడు కలుగును. ధనము కలుగును. అతని వారందరు జ్ఞానవంతులు అగుదురు. అతని గృహము పొంగును.

    10. ఆశీర్దధినిచ్చు ఒకే ఇంటనున్న దంపతులకు మంగళము కలుగునుగాత. హింసను విడిచిన పతీ పత్నులకు ధనము కలుగునుగాత. కుండలోని దధి సోమ మిశ్రమును అంతటను చల్లిన యజమాని రోగములనుండియు, దుర్బుద్ధుల నుండియు విముక్తుడు అగునుగావుత.

    11. యజమాని భార్యా సహితుడై యజ్ఞము చేయనిశ్చయించి పూర్ణకుంభముతో ఇంద్రునకు ఆశీర్దధి సమర్పించిన వాని భార్య అవయవ పుష్టికలదియు, కోమల స్వరము కలదియు అగునుగాత. అతని పుత్రులు పరిపూర్ణ అవయవములు కలవారును, క్షీణించనివారును అగుదురుగాక.

    12. ఇంద్రా! నీవు నాకు బలము కలిగించుము. వర్చస్సుగల సంతానమును, అన్నమును, ధనమును ప్రసాదించుము. నేను శత్రుభూములను ఆక్రమించు కొనుచు ఇతర శత్రువులను ఆజ్ఞాబద్ధులను చేయుదునుగాత.

    13. ధ్రువపాత్రమా! నీవు నిత్య సిద్ధి స్వరూపవు అగుచున్నావు. నాకు స్వర్గము కలిగించుము. నీవు ముఖ్యమైనదానవు అగుచున్నావు. నన్ను ముఖ్యుడను చేయుము.

    14. ధ్రువపాత్రమా! నా దోసిలి ద్యావాపృథ్వులు కలిసినటువంటిది. అట్టి అంజలిచే నిన్ను గ్రహించుచున్నాను.

    15. ధ్రువపాత్రమా! విశ్వమానవ సంబంధులగు సర్వదేవతలును నిన్ను నీచోటునుండి కదలింతురుగాక. నీవు స్వర్గమునందలి దేవతలను, ఆకాశమందలి పక్షులను, భూమిమీద పర్వతాదులను స్థిరపరచుము. నీ చలనమున సమస్త జగములను చలింపచేయుము.

    16. గవాది జంగమ జగత్తు వ్యాధి రహితముగను, శోభన మనస్సు కలది అగునట్లును, మా ప్రజలెల్లరు వ్యాధి రహితులుగను, సుమనస్కులుగను అగునట్లును, సర్వదిశలందలి ప్రజలు మాకే అధీనులగునట్లును, ధ్రువమునందున్న సోమరసమును అడుగునకు చేర్చుచున్నాను.

                                      తొమ్మిదవ అనువాకము

    1. హోత అధ్వర్యుని అభిముఖముగా ఆహ్వానించినచో ఆ ఆహ్వానము అధ్వర్యుని వజ్రప్రహార రూపమునకు అభిముఖముగ ప్రవర్తింపచేయుచున్నది. కావున ప్రాతః సవనము నందలి శస్త్రములన్నింటికి ప్రతిగరము చెప్పి "ఉక్థశాః" అణు మంత్రమున ప్రశంసించవలెను. ఈ మంత్రము నందు మూడు అక్షరములు కలవు. అట్లగుటచే మూడు పాదములు గల గాయత్రిని స్మరించినట్లగును. గాయత్రిచేత వజ్రము అంతర్థానమగును.

    2. మాధ్యందిన సవనగత శస్త్రములకు ప్రతిగరము చెప్పి 'ఉక్థంవాచి' అను మంత్రముచేత హోతను స్తుతించవలెను. నీ వాక్కునందు శస్త్రము చక్కగా ప్రవర్తించబడినది, అని ఈ మంత్రార్థము దీనికి నాలుగు అక్షరములు. ఇది నాలుగు పాదములు గల 'త్రిష్టుప్' ఛందస్సు అగును. 'త్రిష్టుప్' వలన వజ్రము అంతర్హిత మగుచున్నది.

    3. ప్రశంసా సమయము నందలి హోత అధ్వర్యుని ఆహ్వానించినచో ఆ ఆహ్వానము అధ్వర్యునకు వజ్రప్రహారమగును. అందువలన తృతీయ సవనమునందలి శస్త్రముల కన్నింటికి ప్రతిగరము చెప్పి 'ఉక్థంవాచి ఇన్ద్రాయ' అను మంత్రమున హోతను స్తుతించవలెను. ఈ మంత్రము నందు ఏడు అక్షరములు ఉన్నవి. శాక్వర ఛందస్సు ఏడు అక్షరములది. ఇందువలన వజ్రము అంతర్హి తమగుచున్నది.

    4. సవనానుసారముగ ప్రతిగరము చెప్పబడుచుండగా ఛందస్సులను స్మరించువాడును - ప్రాతస్సవనము ముగియుచుండగా తనయందు తేజస్సు ధరించగలవాడును, మూడవ సవనము సమాప్తమగుచుండగా పశువులను సంపాదించ గలవాడును అయినవాడే అధ్వర్యుడు అని బ్రహ్మవాదులు చెప్పుచున్నారు.

    5. ప్రాతః సవనమునందు ప్రతిగరము చెప్పిన పిమ్మట 'ఉక్థశాః' అను మంత్రమున హోతను స్తుతించవలెను. ఇందలి మూడక్షరములచే త్రిపదయైన గాయత్రిని స్మరించినట్లగును. తేజస్సేగాయత్రి. ప్రాతః సవనము తేజస్సు. కావున తనయందు తేజస్సును ధరించినట్లగును.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra