Home » Dr. dasaradhi rangacharya » Krishna Yajurveda


    ఆరోగ్యము కోరువాడు పాత్రయందలి సోమమును చూడవలెను. పాత్రయందలి సోమము ప్రజాపతి స్వరూపము. యజ్ఞమే ప్రజాపతి యగును. కావున అతడు ప్రజాపతినే తృప్తి చెందించుచున్నాడు. సంతృప్తుడైన ప్రజాపతి అతనికి ఆయుష్యము కలిగించును.

    శత్రువును హింసించకోరు యజమాని పాత్రయందలి సోమమును చూడవలెను. పాత్రయందలి సోమము ప్రజాపతి అగును. యజ్ఞమే ప్రజాపతి అగుచున్నాడు. కావున అతడు ప్రజాపతినే తృప్తి చెందించినవాడగును. తృప్తి చెందిన ప్రజాపతి యజమాని శత్రువు యొక్క ప్రాణాపానముల నుండి, వాక్కునుండి, యోగక్షేమముల నుండి, కన్నుల నుండి, చెవులనుండి, ఆత్మనుండి, అంగముల నుండి ఆయువును విడదీయును. అందువలన శత్రువు వెంటనే మరణించును.

                                    నాలుగవ అనువాకము

    1. స్ఫ్యః స్వస్తిః - స్ఫ్యః అను యజ్ఞసాధనము మంగళకరము అగును గాత. విఘవః స్వస్తిః. పర్ముః స్వస్తిః. పరశుః స్వస్తిః. వేదిర్నః స్వస్తిః - వేది మాకు మంగళకరము అగునుగాత.

    మీరు యజ్ఞసాధనములు. మీరు యజ్ఞమును జరిపించండి. ఈ యజ్ఞమునందు నన్ను గమనించండి.

    2. ద్యావాపృథ్వులు నన్ను గుర్తించును గాక. బహిష్పవమాన దేశము నన్ను గుర్తించును గాక. ద్రోణకలశము, సోమము, అగ్ని, దేవతలు, యజ్ఞము, ఋత్విజులు ఈ యజ్ఞమునందు నన్ను గుర్తింతురు గాక.

    3. యజ్ఞమును నాశనము చేయు అగ్నికి నమస్కరించుచున్నాను. యజ్ఞపు కీర్తి నాకు లభించునుగాక. ఆ విధముగ ఆహవనీయ అగ్నికి నమస్కరించవలెను. మఖమే యజ్ఞమగును. ఆ యజ్ఞమునే అగ్ని నాశనము చేయుచున్నాడు. కావున అధ్వర్యుడు తనకు హాని కలుగకుండుటకు గాను అగ్నిని నమస్కరించియే సదస్సును సాగించవలెను.

    4. యజ్ఞమును నాశనము చేయు రుద్రునకు నమస్కారము. 'నమస్కరించినాను' నన్ను రక్షింపుము, అవి అగ్నీధ్ర అగ్నిని ప్రార్థించవలెను. తనకు హాని కలుగకుండుటకు గాను అగ్నికి నమస్కరించియే సదస్సును సాగించవలెను.

    5. "యజ్ఞమును నశింపచేయు ఇంద్రునకు నమస్కారము. నా బలవీర్యములను నాశనము చేయకుము" అని హోతృస్థానీయ అగ్నిని ప్రార్థించవలెను. దీనిని ఇంద్రియ బలములు నశించకుండుటకు ఆశీస్సుగా భావించవలెను.

    6. అగ్ని, రుద్ర, ఇంద్రాది దేవతలకు నమస్కరించనిచో వారు సదస్సునందున్న యజమానాదులను బాధింతురు. యజమాని ఆ విషయము తెలియవలెను. వారికి నమస్కరించవలెను. అందువలన దేవతలు అతనిని బాధించరు.

    7. ద్యావాపృథ్వులారా! మీరు నమస్కరించని వారి విషయమున ప్రతికూలురు కావచ్చును. నేను నమస్కరించుచున్నాను. మా విషయమున స్థిరసంకల్పులు కండు. మమ్ము ప్రతిబంధకముల నుండియు, పాపములనుండియు రక్షించండి.

    8. నేను చేసిన ద్యులోక విషయ దురితము నుండి సూర్యుడు నన్ను రక్షించును గాత.

    9. వాయుదేవత అంతరిక్షసంబంధమున నేను చేసిన దురితము నుండి రక్షించును గాత. పృథ్వి సంబంధముగ నేను చేసిన దురితము నుండి అగ్ని నన్ను రక్షించును గాత. పితృదేవతలకు సంబంధించి నేను చేసిన దురితముల నుండి యముడు నన్ను రక్షించును గాత. మానవుల విషయమున నేను చేసిన దురితముల నుండి సరస్వతి నన్ను రక్షించును గాత.

    ద్వారరూప దేవతలారా! నాకు సంతాపము కలిగించకండి.

    10. నమః సదసే. నమః సదసస్పతయే. మిత్రులకు పురోగాములకు, నేత్రస్థానీయులకు నమస్కారము. నమో దివే - నమః పృథివ్యా.

    11. యజమాని స్థానమున మొలిచిన తృణమా! నీవు ఇచటినుండి తొలగుము. నా కంటే చిన్నవాని స్థానమునకు చేరుము.

    12. నా కన్న చిన్న వారిని అతిక్రమించి పోవుచున్నాను. నాకన్న పైన ఉన్న వారిని అతిక్రమించి పోవుచున్నాను.

    13. నేను ఈనాడు చేయు యజ్ఞమును ద్యావాపృథ్వులు రక్షింతురు గాక.

    14. యజమాని సదస్సునందు ప్రవేశించును. అతనిని అనుసరించియే పితృదేవతలు ప్రవేశింతురు. వారు యజమానిని హింసించగల సమర్థులు. అది కలుగ కుండుటకు గాను - సదస్సునందు ప్రవేశించగనే, దక్షిణ ప్రదేశమును దర్శించవలెను. 'పితృదేవతలారా! మీరు ఈ సదస్సునకు విచ్చేయండి. అప్పుడు మీ వలన నేను పితృమంతుడను అగుదును. నా వలన మీరు ప్రజావంతులగుదురు. "పితృమావహం యుష్మాభిర్భూయాసగ్ం సుప్రజసోమయాయూయ"

    యజమాని తనకు బాధ కలుగకుండుటకు గాను పితృదేవతలకు నమస్కరించి సదస్సునందు ప్రవేశించవలెను.

    (నమస్కరించుట ఆదరించుట అగును. కావున అందరకు నమస్కరించవలెనని బోధించుచున్నాడు.)

                                      అయిదవ అనువాకము

    1. సేవించతగిన సోమరసమా! దీర్ఘాయువు, సుఖము, ధనసమృద్ధి, వర్చస్సు, మంచిసంతానమును కలిగించుటకు విచ్చేయుము. నా యందు ప్రవేశించుము.

    సోమమా! నీవు నివాసము ఏర్పరచుదానవు. మాకు నివాసము కలిగించుటకు విచ్చేయుము. నీవు ధనాదులు అందించగలదానవు. రమ్ము. నా హృదయమున నివసించుము.

    2. సోమరసమా! అశ్వినుల బాహువులతో నిన్ను అందుకొనుచున్నాను.

    3. సోమరసమా! నీవు జనులను చూచుదానవు. చక్కని చూపుగల నేను నిన్ను దర్శించుచున్నాను.

    4. వాగ్దేవత హర్షము కలిగించునది. విఘ్నములను తొలగించునది. యజ్ఞములకు కారణమగునది. ఆ దేవత సోమము సేవించవలెను. తృప్తిచెందవలెను.

    వాగ్దేవత హర్షము కలిగించునది. ఎదుట నిలుచునది. అఖండ, అప్రతిహత ప్రారంభము గలది. ఆ దేవత సోమమును సేవించవలెను. తృప్తిచెందవలెను.

    సోమమా! నీవు అందరను నీవారలనుగా పరిగణించుదానవు. నాకు శాంతిని, సుఖమును కలిగించుచు ఏహి-విచ్చేయుము.

    సోమమా! నీవు హరితవర్ణవు. యజ్ఞము, ఉత్సాహము, ధనసమృద్ధి, యోగ్యసంతానము, శుభములు కలిగించుచు నాయందు ప్రవేశించుము.

    సోమరాజా! నన్ను భయపెట్టకుము. నా హృదయమున నీ దీప్తిని కలిగించుము. నా ఇంద్రియబలమును, దీర్ఘాయువును, వర్చస్సును బాధించకుము.

    సోమదేవా! నీవు అష్టవసువులు కలదానవు. మనసులు తెలియగలదానవు. గాయత్రీ ఛందస్సు కలదానవు. ఇంద్రుడు, నరాశంసులు, పితరులు సేవించుదానవు. ఇది ప్రాతస్సవన సంబంధ మధుమతము. నన్ను అందరు అనుమతించినారు. నేను సోమమును సేవించుచున్నాను.

    సోమదేవా! నీవు ఏకాదశరుద్రగణములు కలదానవు. మనసులు తెలియగలదానవు. త్రిష్టుప్ ఛందస్సు కలదానవు. ఇంద్రుడు, నరాశంసుడు, పితరులు సేవించుదానవు. ఇది మాధ్యందిన సంబంధిమధుమతము. నన్ను అందరు అనుమతించినారు. నేను సోమమును సేవించుచున్నాను.

    సోమదేవా! నీవు ద్వాదశాదిత్యగణములు కలదానవు. మనసులు తెలియగలదానవు. జగతీ ఛందస్సు కలదానవు. ఇంద్రుడు, నరాశంసుడు, పితరులు సేవించుదానవు. ఇది తృతీయ సవనసంబంధి మధువు. నన్ను అందరు అనుమతించినారు. నేను సోమమును సేవించుచున్నాను.

    5. సోమమా! నీవు సర్వత్ర వర్థిల్లుము. నీ బలము విశ్వములందు వ్యాపించును గాత. అన్నము కలుగుటకు కారణమవు అగుము.

    6. హరితవర్ణ సోమమా! నా అవయవములను ఆనందపరచుము. నా పుత్రులకు తృప్తి కలిగించుము. నా శిరస్సునందలి సప్తప్రాణములను కాపాడుము. నానాభిని దాటి సాగకుము.

    7. మేము సోమరసమును సేవించినాము. అమరులము అయినాము. ఆదిత్యుని దర్శించినాము. ఇంద్రాది దేవతలను పొందినాము. ఇహ మమ్ము శత్రువు ఏమి చేయగలడు? పాపము ఏమి చేయగలదు? మానవ దేహము దాల్చిన హింస అమరులమగు మమ్ము ఏమి చేయజాలదని చెప్పవలెనా!

    8. అగ్ని సర్వము తెలిసినవాడు. విచక్షణ గలవాడు. నేను చేయు యజ్ఞమందు లోపములు జరిగిఉండవచ్చు. అగ్ని ఆ లోపములను తెలిసికొని, వానిని తీర్చునుగాత.

    9. పునరగ్నిశ్చక్షురదాత్ - అగ్ని మరల నాకు చూపును ఇచ్చినాడు. పునరిన్ద్రో బృహస్పతిః. పునర్మే అశ్వినా యువం చక్షురాధత్త మక్ష్యోః - అశ్వినులారా! మీరు నా కన్నులకు మరల చూపును ప్రసాదించినారు.

    (యజ్ఞమున లోపము జరిగినపుడు యజమానికి నేత్ర దోషము కలుగును. అగ్నిని ప్రార్థించినంత దేవతలు మరల దృష్టిప్రసాదింతురు.)

    10. సోమదేవా! నీవు యజుస్సులు, స్తోమములు, ఉక్థలు కలదానవు. హరితవర్ణపు ఇంద్రాదులచే సేవించబడిన దానవు. మాధుర్యము కలదానవు. ఎల్లరు ఎరిగిన దానవు. అనుజ్ఞాతుడనైన నీ యొక్క రసమును ఆస్వాదించుచున్నాను.

    11. లాజలారా! మీరు అంతటను నిండిఉన్నారు. నన్ను సంతోషముతోను, ధనముతోను నింపండి.

    12. పితృదేవా! ఇది మీకు అన్నము అగునుగాక. మిమ్ము అనుసరించు వారికి కూడ ఇది అన్నము అగునుగాక. పితామహా! ఇది నీకు అన్నము అగునుగాక. నిన్ను అనుసరించు వారికి సహితము ఇది అన్నము అగునుగాక. ప్రపితామహా! ఇది నీకు అన్నము అగునుగాక. నిన్ను అనుసరించు వారికి సహితము ఇది అన్నము అగునుగాత.

    పితృదేవతలారా! మీరందరు ఈ కర్మయందు మీ మీ భాగములను అనుభవించండి.

    13. పితృదేవతలారా! మీ శక్తికి నమః. మీ బలమునకు నమః. మీ జీవాత్మకు నమః. మీ స్వధకు నమః. మీ కోపమునకు నమః. మీ ఉగ్రకార్యమునకు నమః. మీకు నమః.

    పితృదేవతలారా! పితృలోకమందు మీ వెంట ఉంటున్నవారు మిమ్ము అనుసరింతురుగాక. ఈ లోకమున ఉంటున్న మీరు నన్ను అనుసరింతురుగాక.

    పితరులారా! పితృలోకమున ఉన్న ఇతరులకు మీరు నివాసములు కలిగించండి. ఈ లోకమునందు నాతో ఉంటున్న వారికి నేను నివాసములు కలిగించగలను.

    14. ప్రజాపతీ! నీవు కాక అన్యుడు ఈ విశ్వములను సృష్టించజాలడు. సంహరింపజాలడు. కావున మేము ఏది కోరి యజ్ఞము చేయుచున్నామో దానిని మాకు కలిగించుము. మేము ధనపతులము అగుదుముగాక.

    15. పురోడాశ శకలమా! నేను దేవతల విషయమున చేసిన పాపములను రూపుమాపుము. మనుష్యుల విషయమున చేసిన పాపములను రూపుమాపుము. పితృదేవతల విషయమున చేసిన పాపములను రూపుమాపుము. స్వవిషయమున చేసిన పాపములను రూపుమాపుము. ఇతరుల విషయమున చేసిన పాపములను రూపుమాపుము. సర్వపాపములను రూపుమాపుము.

    16. సోమదేవా! నీవు నీటితో కడుగబడినావు. నరులచే నలగకొట్టబడినావు. యజుస్సులు, స్తోమములు, ఉక్థలచే స్తుతించబడినావు. నీయందు గోవులకు భాగమున్నది. అశ్వములకు భాగమున్నది. పితరులకు భాగమున్నది. ఇతరులు నాకొరకు అనుమతించిన నీయొక్క భాగమును అందరిచే అనుజ్ఞాతుడనై సేవించుచున్నాను.

                                        ఆరవ అనువాకము

    1. వృషదాజ్యమా! నీవు గోవుల క్షీరము అగుచున్నావు. సర్వదేవతల దేహము అగుచున్నావు. నేడు నీవు దేవాశ్వములకు గ్రహస్థానమగుచున్నావు. నిన్ను నేను వర్థిల్లచేయుమన్నాను.

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra