ఆమెకెందుకో ఆకారణ  దుఃఖం కలిగింది. ఆ కవిపట్ల అంతులేని జాలి కలిగింది. ఒక భావం మనసులోంచి బయటకొచ్చి రూపుదిద్దుకోవాలంటే మనిషి ఎంత దహించుకుపోవాలి! ఎవరో కవి తన  పక్కనే నిలబడి  మనసులోకి తొంగిచూస్తూ దాన్ని చదివేసిన  భావన. ఎన్ని ఒంటరి రాత్రులు ఆ కవి ఆ పాత వ్రాయటానికి వ్యధననుభవించి వుంటాడు? బంగారానికి వన్నె తేవటం కోసం దాన్ని కాల్సినట్టు తమ తమ రంగాల్లో ప్రముఖులైన వాళ్ళు, వ్యధలోనే ఆనందాన్ని పొందుతూ.... తమని తాము కాల్చుకుంటూ తీక్షణతని సంతరించుకుంటారనుకుంటారేమో అనుకుంది.

    ఆమె దృష్టి తిరిగి తన చేతిలోని పుస్తకం మీద పడింది.

    తను వ్రాస్తే......

    ఆమెకు తను అనుకున్న కథ గుర్తొచ్చింది.

    అప్పుడు బావుంది. కానీ ఇప్పుడు తల్చుకుంటే సిల్లీగా అనిపిస్తోంది. విష్ణువు పెరగటం ఏమిటి? విశ్వామిత్రుడు శాపం ఇవ్వటమేమిటి?

    ఒకరోజులోనే నిన్నటి తన భావం తనకి బావోలేదనిపిస్తోంది.

    కానీ వ్రాయాలన్న కోరిక ఆమెలో క్షణాల్లో బలపడింది తమ వ్యధల్ని మర్చిపోవటానికి చిత్రకారులు పెయింటింగ్స్ ని, వాద్యల్నీ స్నేహితుల్ని చేసుకుంటారు. తన ఒంటరితనం పోగొట్టుకోవటానికి రచన ఏమన్నా ఉపయోగపడుతుందేమో చూడాలి.

    ఆమె లేచి వెళ్ళి  బల్లముందు కూర్చుంది. కలం విప్పింది. కాని మనసు తెరుచుకోలేదు. కెరటాలకి మల్లే ఆలోచన్లు వస్తున్నాయి. కానీ రూపుదిద్దుకోవటం లేదు!

    పన్నెండు దాటివుంటుంది. తవ్వుతూంటే అకస్మాత్తుగా జాలంపడినట్టు ఆమెలో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. వ్రాయటం ప్రారంభించింది.

    "ఉషా కిరణాల వెలుగులో అనాచ్చాదితంగా నువ్వు నిద్రపోతూంటావ్! నీకు నిద్రాభంగం కలక్కుండా.... సిగ్గుగా సంతృప్తిగా నీ చేతుల్లోంచి తప్పించుకుని, కిటికీ దగ్గిరగా వచ్చి బయటికి చూస్తాన్నేను. కిటికీ అవతల ఉషోదయం, పక్షుల కిలకిలరావాల మధ్య రాత్రి తాలూకు విశేషాలడుగుతుంది."

    మళ్ళీ చదివింది. తిరిగి వ్రాయటం మొదలుపెట్టింది.

    వ్రాసింది కొద్ది లైన్లె. కానీ......వాటిని చూసుకుంటే ఎంతో సంతృప్తి. ఆమె తను వ్రాసింది తిరిగి చదువుకుంది. నవల ప్రారంభం ఇలా అవునో కాదో తనకు తెలీదు. ఇంతకుముందు ఏ నవల్లోనూ చదవలేను కూడా. కొత్తగా వుంది. ఎవరికైనా తను వ్రాసింది తనకి బానే వుంటుంది.

    ప్రతిసారీ నీ కొత్త భార్యలా  ముడుచుకుపోతూ.....

    నాలో నేను నవ్వుకుంటూ, చీరె కట్టుకుంటూ, జుట్టు దువ్వుకుంటూ.......టీ కాస్తూ, వంటచేస్తూ.....

    నీ స్పర్శనీ, నీ ముద్దునీ, నీ కదలికల్నీ ఇంకా ఇంకా తల్చుకుంటూ నేను!

   అవునోయ్. నీ కసలు  ఓ అస్థిత్వముందా? నా భార్తలా... స్నేహితుడిలా.... తండ్రిలా... ప్రియుడిలా....కొడుకులా... గురువులా ...శిష్యుడిలా తప్ప నీలో ఇంకేముంది?

 నేను మాత్రం నీ భార్యలా......ప్రియురాల్లా......కూతుర్లా......స్నేహితురాల్లా......తల్లిలా......తప్ప ఇంకేమీ లేదనేగా ఆ గర్వపు చిరునవ్వు. చాల్లే గొప్ప......బోడి.

    నాకు వళ్ళు మండిపోతుంది. అప్పుడప్పుడు లెక్క పెడుతూవుంటాను. ఎవరెవరికి దగ్గిరవొచ్చో.....ఎవరి సమక్షంలో ఆనందంగా వుండొచ్చా అని! ఏడూ ఎనిమిదీ, తొమ్మిది.....

    తొమ్మిదిమంది! నాకు దగ్గిరవగలే వాళ్ళు.

    మళ్ళీ లెక్కపెడతాను.

    తొమ్మిది, ఎనిమిది, ఏడు, నాలుగు.....సున్నా ఎవరూ లేరు. ఇంకెవ్వరూ అక్కర్లేదనీ నువ్వే కావాలనీ ఇప్పుడే అర్థమవుతుంది. అదిగో మళ్ళీ......ఆ నవ్వే వద్దు.

    నువ్వు నా కొత్త నేనువి.

     నువ్వు నా బొట్టుస్టిక్కర్లు తేవటం మర్చిపోయావ్. నేను నీ ఫైళ్ళు తడిపేసేను.

    నువ్వు నా చీరె ఇస్త్రీ చేయలేదు. నేను నీళ్ళు పట్టటం మర్చిపోయాను.

    నువ్వు పుచ్చు వంకాయలు తెచ్చావ్. నేను టీ కప్పు పగలగొట్టాను.

    ఇంతే. ఇవే మన బాధలు. రేపట్నుంచీ కొత్త జీవితం ప్రారంభిద్దాం. రేపు నువ్వు స్టిక్కర్లు తెస్తావు. నేను నీళ్ళు పడతాను. నువ్వు మంచి వంకాయలు తెస్తావ్. నేను టీ కప్పు కొంటాను. మరేమో - అప్పుడు నువ్వు నా కొత్త  నువ్వువన్నమాట. నేను నీ కొత్త నేను.....నీ......"

    గడియారం అయిదు కొట్టటంతో ఆమె వులిక్కిపడింది.

    అ....యి.....దు. 

    ఈ కొద్ది వాక్యాలు వ్రాయటానికి ఇన్ని గంటలు పట్టిందా? ఆమె చేతివ్రేళ్ళు నొక్కుకుంటూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. చాలా ఆశ్చర్యంగా - ఈ  ధ్యాసలోపడి విష్ణు రాలేదన్న విషయం గమనించలేదు.

    అంతేకాదు. ఈ ఒక్క పేజీ  వ్రాయటం పూర్తి చేయగానే ఎంత  సంతృప్తి. ఒక  పిల్లాడ్ని కన్నంత తృప్తి.

    'పిల్లాడి' విషయం గుర్తు రాగానే ఆమె మనసంతా ఒక్కసారిగా అసంతృప్తి నిండింది. దాన్ని బయటకు తోలటానికి మళ్ళీ తాను వ్రాసింది చదువుకుంది. అసలు నవల ప్రారంభం ఇలాగేనా వుండాల్సింది? పాఠకులు నవ్వుతారామో. ఇంతకాలం పత్రికల్లో కథలు చదివి తను రకరకాల కామెంట్స్ చేసేది. ఇప్పుడు  తనని అలాగే ఎగతాళి చేస్తారేమో. అందరితో బావుందనిపించుకోవాలంటే తనకి మరింత అంకితభావం కావాలి. మరి అది తనలో వుందా?

    అకింతభావం అనగానే ఆమెకి ప్రహసిత్ గుర్తొచ్చాడు ఎంత అంకితభావంతో ఆడేడు? అందుకే ఇండియా నెంబర్ వన్ అయ్యాడు.

    ప్రహసిత్ గుర్తుకు రాగానే, అతడి సెక్రటరీ చెప్పింది కూడా గుర్తొచ్చింది. పాపం అతనికి ఎలావుందో ఏమో అనుకుంది. 'ఆపరేషన్ కూడా అవసరమవుతే అవొచ్చు....' అన్నాడు ఆపరేషన్ చేసారేమో.

    -అయిదున్నరయింది. తూరువు వెలుగు నింపుకొంటోంది.

    ఆపరేషన్ జరిగివుంటే......కనీసం ఆ విషయం చెప్తారు కదా అనుకుంటూ.....ఫోన్ చేసింది.

     ఫోన్  ఒక్కసారి  మ్రోగగానే దాని పక్కనే వున్నట్టు ఎవరో దాన్ని తీశారు. "......హల్లో"

    ఆమె ఒక క్షణం తటపటాయించి "ప్రహసిత్ గారికి ఆపరేషన్  అన్నారు. జరిగిందండీ" అని  అడిగింది.

    ".....లక్ష్మీ?" ఆ కంఠంలో లాలిత్యానికీ, ఎగ్జయిట్ మెంట్ కీ ఆమె షాక్ తిని "ఎవరూ? సెక్రటరీగారా?" అని అడిగింది.

    "నేను. ప్రహని"

    ఆమె గుండె క్షణం ఆగి కొట్టుకోవటం ప్రారంభించింది. ఆమె ఎక్కడ ఫోన్ పెట్టేస్తుందో అన్నట్టు"లక్ష్మిగారూ" అన్నాడు ప్రహీ కంగారుగా. ఈ లోపులో ఆమె తేరుకుంది.


    "మీ.....మీ ఆరోగ్యం బావుందా?" అని అడిగింది.

    "రాత్రంతా నిద్రలేదు"

    ఆమె ఆందోళనగా "నొప్పి బాగా వచ్చిందాండీ. అనవసరంగా ప్రొద్దున్నే డిస్టర్బ్ చేసాను" అంది నొచ్చుకుంటున్నట్టు.

    అతడు  దాన్ని పట్టించుకోకుండా "నేను రాత్రంతా ఇలాగే ఈ ఫోన్ పక్కనే కూర్చుని వున్నాను తెలుసా" అన్నాడు.

    "ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగింది.

    "మీరు ఫోన్ చేస్తారని....."

    ఇబ్బందికరమైన అనుభూతి. దాన్ని అధిగమించటానికి అన్నట్టు "నిన్న రాత్రి మీ సెక్రటరీ మీ ఒంట్లో బావోలేదని చెప్పాడండి. ఎలా వుందో కనుక్కుందామని ఫోన్ చేసాను" అంది.

    "నాకు సెక్రటరీ అంటూ ఎవరూ లేరు"

    ఆమె  నిర్వీణ్ణురాలై "మరి నిన్న....." అంది.

    "అది నేనే....." అని "ఆగండి. "నేను చెప్పేది పూర్తిగా వినండి, ప్లీజ్....." అన్నాడు అభ్యర్థిస్తున్నట్టు. ఆమెకి ఏం చెయ్యాలో తోచలేదు. అలాగే రిసీవరు చెవికి అన్చుకుని వుండిపోయంది. అతడి కంఠం అవతల్నుంచి మంద్రంగా వినిపించింది.

    "నాకు ఏ సాధువూ కనపడలేదు. కనపడి ఏ వ్యక్తి స్వరూపం గురించీ చెప్పలేదు. నిన్న మిమ్మల్ని చూడగానే మీరెవరో తెలుసుకోవాలనిపించింది. కానీ మిమ్మల్ని ఎలా  కాంటాక్ట్ చేయాలో తెలియలేదు. అంతలో దూరదర్శన్ వాళ్ళు నా  దగ్గరకి వచ్చారు. మీరు గానీ  టి.వి. చూస్తే, దాని ద్వారా మీకు సందేశం పంపించవచ్చుననుకున్నాను. అందుకే అలా చెప్పాను. నా అదృష్టం బావుండి మీరు నాకు ఫోన్ చేశారు. కానీ ఎంత అడిగినా  మీ నెంబర్ చెప్పలేదు. అందుకే నేనతని సెక్రటరీనని, ప్రహీకి గుండెపోటు వచ్చిందనీ చెప్పాను. మీకు తెలుసా? మీరు మళ్ళీ ఫోన్ చేస్తే ఆ టైమ్ కి నేను ఏ మాత్రం నిద్రపోయినా ఆ ఫోన్ మిస్ అవుతానని రాత్రంతా ఇలాగే....ఈ ఫోన్ ప్రక్కనే కూర్చుని వున్నాను. ఎందుకని అడగరేం?"

    "ఎందుకు?" అప్రయత్నంగా అడిగింది.

    "మీరెప్పుడయినా ఎవర్నయినా ప్రేమించివుంటే తెలిసేది. గంటల తరబడి ఇలా వెయిట్ చేయడం నాకూ కొత్తే. అసలు ప్రేమ ఇంత బాధాకరం అని  నాకు ఇప్పుడే అనుభవంలోకి వచ్చింది. మీకు నవ్వొస్తుందా....'ఒక్కసారి దూరంనుంచి చూసి ప్రేమలో పడ్డాడు ఇతనిదేం ప్రేమ?' అని  ఒక క్షణం ఆగి తిరిగి చెప్పటం ప్రారంభించాడు. "రాత్రంతా నిద్రలేని నా కనురెప్పల మీద ఒట్టు. చీమ చిటుక్కుమన్నా అది మీ నుంచి ఫోనేమోనని ఇలాగే కూర్చుని వున్నాను. నన్ను నమ్మండి. నన్నోక్కసారి కలుసుకోండి. నా ప్రేమలోని స్వచ్చతనీ, తీవ్రదనాన్ని నిరూపించుకుంటాను. మీరు గానీ నన్ను కలవకపోతే......నాప్రేమ చిన్న  పిల్లల వ్యవహారం కాదనీ అందులో సీరియస్ నెస్ వుందనీ మీకు తెలియచెప్పటం కోసం...... ఇక డేవిస్ కప్ ఫైనల్స్ ఆడను. అంతేకాదు.....ఇంతకాలం నా ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించిన టెన్నిస్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను......అవున్నిజం. మిమ్మల్ని చూసిన మొదటి క్షణం.....హల్లో...హల్లో.."

    ప్రహీ ముందుకు వంగి ఫోన్ టాప్ చూస్తూ ఇంకా 'హాల్లో!' అంటూనే వున్నాడు. ఆమె  ఎప్పుడు ఫోన్ పెట్టేసిందో తెలీదు.

    ఆమె నుదురంతా చెమట పట్టేసింది. గుండె శబ్దం స్పష్టంగా వినిపిస్తోంది. కుర్చీలో లాగే  వెనక్కి వాలిపోయింది. వణుకుతున్న చేతివేళ్ళతో కుర్చీకోడు పట్టుకోవటానికి ప్రయత్నించింది.

    బయట భర్త కొట్టిన కాలింగ్ బెల్ చప్పుడు వినిపించింది.

    ఆమె వెళ్ళి తలుపు ఎలా తీసిందో ఆమెకే తెలీదు.

    "సారీ _ డైరెక్టుర్స్ మీటింగ్ లో ఆలస్యమైంది".

    "ప్రొద్దున్న ఆరింటికి వచ్చి భర్త చెపుతూన్న 'సంజాయిషీ' ఆమెకి వినబడలేదు. అసలామె ఈ లోకంలోనే లేదు. ఆమె భర్త విష్ణు షూస్ విప్పి అవే బట్టలతో పక్కమీద వాలిపోయాడు.

    ఇంటివెనుక శబ్దం వినిపిస్తూంది. పనిమనిషి వచ్చినట్టుంది.

    ఆమె అటువెళ్ళే ప్రయత్నం ఏమీ చేయలేదు. అలాగే కుర్చీలో కూర్చుని కిటికీలోంచి బయటకు చూడసాగింది.

    కొత్తగా పెళ్ళయిన వధువు తొలిరాత్రి నిద్ర మేల్కొని కనులు విప్పగానే పక్కనే పురుషుడిని చూసి, తనెక్కడున్నదో తెలియక ఒక్కక్షణం తత్తరపడి తానిప్పుడు వివాహితనని గుర్తు తెచ్చుకుని.....రాత్రి విశేషాలు చరుక్కుమని గుర్తుకురాగా..... ఆ వధువు మొహం  ఎలా ఎర్రబడుతుందో.....పైకొస్తూన్న సూర్యుడు అలా వున్నాడు. రాత్రంతా ఏమేం ఘనకార్యాలు చేసేదో తెలీదు కానీ మొహం మాత్రం బాగా ఉబ్బింది. అతడు లేక.....చలికి రాత్రంతా ముడుచుకుపోయిన భూదేవిని మంచి చేసుకోవటం కోసం కిరణాలు చేతులుగా సాచి లాలిస్తున్నాడు.

    ఆమె కిటికీలోంచి బయటకు చూస్తుంది.

    ప్రహసిత్ మాటలే ఇంకా గుర్తొస్తున్నాయ్. 

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra