Home » D kameshwari » Chikati Tolagina Ratri


                                                                                 మనిషి మారలేదు


    ఆరోజు సీతకి రోజులా ఆరు గంటలకి కాక ఐదు గంటలకే తెల్లవారింది. పెరట్లో ఆరుబయట మంచం వేసుకుని పడుకున్న సీతకి ఆరోజు లేవగానే రోజూ మాములుగా కనిపించే మల్లెచెట్టు, మందార చెట్టు, పారిజాతం చెట్టు అన్నీ సినిమాలో లాగా సంతోషం పట్టలేక ఊగిపోతున్నట్టనిపించాయి. రోజూ గోలగా అనిపించే పిచికల కాకుల గోల ఆరోజు కిలకిలారావాలుగా వినిపించాయి. రోజూ నీర్సంగా నిర్లిప్తంగా లేవక తప్పదన్నట్టు లేచే సీత చెంగున మంచం దిగి లోపలికి నడిచింది.
    కాఫీ కుంపటి, బొగ్గుల డబ్బా, బిందెలు, గిన్నెలు , కూరల బుట్టా బియ్యం డబ్బా, మాసిన వాయిల్ చీరలు, కుక్కి మంచంలో పడుకుని మూలిగే పక్షపాతం తల్లి --- విసుగ్గా కనిపించే యీ దృశ్యాలేవీ సీతకి విసుగనిపించలేదు ఆరోజు.
    చకచక కాఫీ పని, వంటపని , తల్లికి స్నానం చేయించి భోజనం పెట్టడం, తన స్నానం , భోజనం అన్నీ పూర్తి చేసి తొమ్మిదిన్నర కల్లా ఆఫీసుకి బయలుదేరిపోయింది. ఏనాడూ పదిన్నర లోపల ఆఫీసు చేరని సీత ఆనాడు.
    పది గంటల తరవాతే ఆరుగంటలయి పోతుందేమో నంత ఉత్సాహంతో గబగబ అడుగులు వేసి బస్ స్టాప్ చేరింది సీత.
    ఆరుగంటలు సాయంత్రం ఆరుగంటలు ! సీత జీవితంలో ఆరోజు ఆరుగంటలకి ప్రాముఖ్యం వుంది.
    'ఆరుగంటలకి గార్డెన్స్ దగ్గర మీకోసం చూస్తుంటాను..... వస్తారా, వస్తారు కదూ !" అన్న మూర్తి మాటలు తప్ప సీతకి రోడ్డు మీద కోలాహలం ఏం వినిపించడం లేదు.
    సీతని గార్డెన్ కు రమ్మని పిలిచాడు.
    ఇన్నాళ్ళకి ఇన్నేళ్ళ కి ఆమెను ఓ స్త్రీ గా గుర్తించి ఓ పురుషుడు మాట్లాడాడు, ఆహ్వానించాడు! ఆనందంతో సీతకి మతిపోయింది ఆరోజు.
    పుట్టిన ముప్పై ఏళ్ళకి సీత ఓ పురుషుడి దృష్టిని ఆకర్షించింది అంటే సామాన్యమైన సంగతి కాదు.
    మగవాళ్ళని ఆకర్షించే ఏ అందమూ లేదు సీతకి. చామనచాయ రంగుతో ఐదడుగులు దాటని పొడుగుతో , ముందుకు తోసుకు వచ్చిన పళ్ళతో భుజాలు దిగని జడతో, ఏ కళాకాంతీ లేని ముఖంతో వుండే సీతని ఏ మగాడూ వలచ లేదంటే ఆశ్చర్య మాక్కర్లేదు.
    సీత తండ్రి బ్రతికుండగా తల తాకట్టు పెట్టి అయినా ఓ మూడు నాలుగు వేలు తెచ్చి సీత పెళ్ళి చేసి బరువు దించుకుందామని విశ్వ ప్రయత్నం చేశాడు. అంత తక్కువ ధరకి సీత లాంటి ఆడపిల్ల మెడలో పుస్తె కట్టడానికి ఏ నాధుడూ కనపడక పోవడంతో, ఆ దిగులుతోనే అయన కన్ను మూశాడు. ఆ వున్న ఒక్క ఆధారం తెగిపోవడంతో మెట్రిక్ చదువు ఆధారంతో ఆడపిల్లలు ముగ్గురిలో అఖరిదయిన సీత ఆ యింటి భారం చేపట్టక తప్పలేదు.
    ఐదారేళ్ళ నుంచి ఉద్యోగం చేస్తున్నా మగవాళ్ళ మధ్య రోజూ మసలుతున్నా సీత అనే అమ్మాయి వున్నట్టు ఏ మగాడూ ఏనాడూ గుర్తించలేదు ఆఫీసులో. టైపిస్టు సుమతి , స్టెనో వాసంతి తోనే అందరూ ఎందుకు మాట్లాడతారో , టీ, కాఫీలు వాళ్ళిద్దరికే తెచ్చి అందరూ ఎందుకు అందిస్తారో వాళ్ళిద్దరి పని నేనేంటే నేనని ఎందుకు అందరూ పోటీలు పడి చేస్తారో , తనతో అందరూ ఎందుకు అలా వుండరో సీతకీ చాలా రోజులకి గాని అర్ధం గాలేదు. అర్ధం అయ్యాక ఉక్రోషం వచ్చింది. ఆ ఉక్రోషం ఎవరి మీద చూపాలో తెలియక తనని తానె అసహ్యించుకోసాగింది..... ఆ అసహ్యం కొన్నాళ్ళకి నిర్లిప్తత, ఉదాసీనతగా మారింది. ఈ గానుగెద్దు జీవితం ఎంత రోత పుట్టించినా బ్రతకాలనే యిచ్చ లేకపోయినా, చావడం ఎలాగో తెలియని సీత అలాగే రోజులు నెట్టు కొస్తుంది.
    సీతకి ముప్పై నిండి ఏడాది దాటింది. తనకింక పెళ్ళవుతుందని , తన జీవిత చరిత్రలో మొగుడు, పిల్లలు , సంసారం అన్న చాప్టర్లు ఎన్నటికి నిండవని సీతకి దృవపడిపోయింది.
    అలాంటి సీత చీకటి జీవితానికి ఓ చిన్న వెలుగు రేఖ కనపడింది. ఆ రేఖ మూర్తి!
    మూర్తి ఆ ఆఫీసుకి వచ్చి రెండు నెలల అవుతుంది. ఎవరు వస్తున్నారో ఎవరు వెడుతున్నారో సీతకి అక్కరలేని సంగతులు. ఎవరు వచ్చినా వెళ్ళినా సీతకి సంబంధించని సంగతులుగా సీతే కాక తక్కిన వాళ్ళు కూడా నిర్ణయించడంతో ఆ ఆఫీసుకి మూర్తి వచ్చిన సంగతి సీతకి చాలా రోజులకి గాని తెలియలేదు. ఓనాడు ఏదో కాగితం రిఫరెన్స్ కోసం మూర్తి వచ్చి మాట్లాడాక మూర్తి అన్న మనిషి ఆ ఆఫీసుకి వచ్చినట్టు తెల్సింది సీతకి. సీత దృష్టిలో ఏ ప్రాముఖ్యతా లేదు.
    తర్వాత ఓ నెలకి గాబోలు బస్ స్టాప్ దగ్గిర మూర్తి యధాలాపంగా పలకరించాడు. 'మీరు ఎక్కడండీ వుండడం' అంటూ మాట్లాడింది. నాలుగు మాటలే అయినా జవాబు చెప్పడానికి సీత తబ్బిబ్బు అయిపొయింది. బహుశా ఓ మగాడు తనతో మాట్లాడడం అదే మొదటిసారి అవడం వల్ల, చెమట పట్టింది. మాట తడబడింది. ముఖంలోకి చూడకుండానే ఎలాగో చెప్పింది.
    మరోసారి, "ఏమండీ , మీరేం మరీ అంత ముభావంగా వుంటారు. ఆఫీసులో ఎవరితోనూ మాట్లాడరేం?" అని మాములుగా అడిగిన ఆ ప్రశ్నకి సీతకి దుఃఖంతో గొంతులో ఏదో అడ్డం పడింది. "నాతొ ఎవరు మాట్లాడరు. నేనేం చేసేది! " అంటూ ఆవేదన అంతా వెళ్ళబోసుకోవాలన్నంత .....ఆప్తుడుగా మూర్తి ఆ క్షణాన కనబడ్డాడు. కాని ఆ మాట ఎలా చెప్పాలో తెలియక అదేదో తన స్వభావం అన్నంత తెలిగ్గా చిన్న నవ్వు నవ్వింది.
    ఓ నాలుగైదుసార్లు మూర్తి ఏవేవో మామూలు మాటలు మాట్లాడాడు. సీతకి ఏదో చిన్న ఆశతో పాటు కాస్త ధైర్యం కూడా వచ్చింది. ఆఫీసులో రోజులో ఎప్పుడో ఒకప్పుడు మూర్తి పలకరించకపొతే తనే చొరవ చేసి, కలుగ చేసుకొని మాట్లాడేంత ధైర్యం వచ్చింది సీతకి. ఓనెల రోజులు గడిచేసరికి మూర్తి, సీత చనువుగా మాట్లాడుకునే స్టేజికి వచ్చారు.
    మూర్తి కాఫీకి పిలిస్తే నిస్సంకోచంగా , నిరభ్యంతరంగా , సంతోష పూర్వకంగా వెళ్ళింది. తరువాత బస్ స్టాండ్ వరకు జంటగా వెళ్ళేందుకు ఏ మాత్రం సందేహించ లేదు సీత.
    ఆఫీసులో గుసగుసలు , వెక్కిరింతలు, వేళాకోళాలు , అన్నిటినీ భరించి, నిర్లక్ష్యం చేయగలిగింది సీత.
    మూర్తి ఉద్దేశం ఏమిటో సీతకి తెలియదు. మూర్తి గురించిన వివరాలు అరా తీసే ఓపిక, పట్టించుకునే స్థితిలో లేదు. కాని మూర్తి వంటరిగా ఓ గదిలో అద్దె కుంటున్నాడన్న విషయం మాత్రం సీతకి తెలుసు.
    అందరూ హేళన చేస్తున్నా, వ్యంగ్యంగా విసుర్లు విసురుతున్నా లెక్క చేయకుండా తనతో మాట్లాడుతూనే వున్నాడంటే నిజంగానే తన మీద ఇంటరెస్టు వుందనడానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలని నమ్మింది సీత. పొంగిపోయింది. ఎండి నేల రాలిపోతుందనుకున్న తన జీవన లతకి లభ్యమయిన యీ కాస్త అలంబనాన్నీ దూరం చేసుకోకూడదని నిర్ణయించుకుంది సీత మనసులో.
     సీత ఆరాటం అర్ధం చేసుకోలేనంత అమాయకుడు కాడు మూర్తి. నవ్వుకున్నాడు మనసులో. ఏ మూలో కాస్త జాలి కూడా తొంగి చూసింది.
    ఆరుగంటలయింది. అంతకు అరగంట ముందుగానే సీత పబ్లిక్ గార్డెన్స్ గేటు దగ్గర మూర్తి కోసం ఆరాటంగా ఎదురుచూస్తూ నిల్చుంది. రావాల్సిన దానికంటే ముందు వచ్చానని తెల్సినా క్షణక్షణానికి వాచి చూసుకుంటూ రోడ్డు మీదికి దృష్టి సారించి అశాంతిగా నిల్చుంది సీత.
    ఆరు ఇరవైకి మూర్తి కనపడగానే హృదయం మీద నించి పెద్ద బరువు దిగినట్టు ఫీలయింది సీత. సంతోషంతో మొహం వెలిగింది.
    "సారీ, కాస్త ఆలస్యం అయింది. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా." అన్నాడు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra