Home » Suryadevara rammohan rao » సూపర్ స్టార్


    ఎప్పుడయితే అనిల్ శిరీషలు హీరో, హీరోయిన్స్ గా నటించటానికి ఒప్పుకున్నారో, ఆ క్షణం నుంచే హంపీ పూర్తి సంతృప్తితో ఒక డైరెక్టర్ గా, కెమేరా వుమెన్ గా విజృంభించి శ్రమిస్తోంది.

    తల్లి, దండ్రుల దగ్గర నవ్వుతూ, నవ్విస్తూ, చిన్న పిల్లలా బిహేవ్ చేసే హంపీ కెమేరా వెనక్కు రాగానే గంభీరంగా మారిపోతుంది- మోములో మెచ్యూరిటీ, కళ్ళలో తీక్షణత, కసి, పట్టుదల గూడుకట్టుకుంటాయి.

    తన అద్భుత హావభావాలతో, అందానికి, ఆకర్షణకే వంకలు పెట్టగల అనన్య సామాన్యమైన అందంతో, మేని విరుపులతో, తన పాత్రలో పూర్తిగా లీనమైపోయి నటిస్తోంది శిరీష.

    దశాబ్దం నుంచి రంగస్థలం మీద ఎన్నో విభిన్న భూమికల్ని పోషించి వైరుధ్యం వైవిధ్యం గల పాత్రల్ని అద్భుతంగా మెప్పించి. తండ్రికి తగ్గ తనయుడనిపించుకున్న అనిల్, ఏ షాట్ నీ రెండోసారి చేయకుండానే ఓకే అనిపించుకోగలుగుతున్నాడు.

    "అవకాశాలే మన దగ్గరకు రావాలని బద్దకించకుండా, అవకాశాల కోసం మనం శ్రమిస్తే ప్రతి ఒక్కరికి మంచి అవకాశాలు తప్పకుండా సొంతమవుతాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒక్కసారి లక్ష్మీదేవి తలుపుతడుతుందని నా విశ్వాసం...... అదే ఇప్పుడు మన నలుగురి జీవితాల్లో సంభవించింది. మనమీ అవకాశాన్ని వివేకంతో ఉపయోగించుకుందాం.... అంది శిరీష.

    ఓ ప్రక్క షూటింగ్ అరేంజ్ మెంట్స్ జరుగుతున్నాయి. వాటితో హంపి, విల్సన్, భవానీ బిజీగా ఉన్నారు.

    శిరీష చెప్పిందానికి టాగూర్, నారాయణ్ నిజమే అన్నట్లుగా చూసారు.

    అనిల్ మాత్రం ఎక్కడో ఆలోచిస్తున్నాడు.

    శిరీష వారితో మాట్లాడుతున్నా, కధనాయిక పాత్రలో నటిస్తున్నా,ఆమె  ఆలోచనలు మాత్రం అనిల్ చుట్టూ- అనిల్ ప్రశాంత్ మీద తిరగబడిన తీరు చుట్టూ పరిభ్రమిస్తున్నాయి.

    హంపీ యూనిట్ అప్పుడు మాదాపూర్ గ్రామానికవతల ఉన్న రెండు కొండల మధ్య ఉంది.

    సమయం సాయంత్రం నాలుగంటలు కావస్తోంది.

    మరో నాలుగు కాల్ షీట్లు వర్క్ చేస్తే పైలట్ షూటింగ్ పార్ట్ పూర్తయిపోతుంది.

    అలాగే అనిల్ క్కూడా శిరీషతో ఒంటరిగా మాట్లాడాలని ఉంది. కాని కాలం కలసి రావటంలేదు.

    క్రితం రాత్రంతా నైట్ ఎఫెక్ట్ లో షూటింగ్ జరిగింది.

    తెల్లవారు ఝామున ఏ రెండు గంటలో రెస్టుతీసుకుంది యూనిట్. తెల్లవారుతూనే ఆ రోజు షూటింగ్ మొదలయింది.
   
    మాట్లాడేందుకు, మనస్సును పంచుకొనేందుకు, నిశ్శబ్దంతో కూడిన ఏకాంతం దొరకటం లేదు..... అందుకే ఆమెకు అసంతృప్తిగా ఉంది...... అది క్షణక్షణానికి పెరుగుతూ ఆమెని అశాంతికి గురిచేస్తోంది.

    అవన్నీ అలా ఉంచితే, అనిల్ జీవితానికి దగ్గరగా  ఉన్న ఆ సీరియల్ లోని కధానాయకుడి పాత్ర ఆమెనే కాదు, అనిల్, టాగూర్, నారాయణ్ లను కూడా దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

    అనిల్ తను ధరిస్తున్న పాత్రనే పదేపదే జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాడు.

    ఇంతటి అద్భుతమైన యాదృచ్చికం నిజజీవితంలో సంభవించటం నమ్మశక్యం కాకుండా ఉంది.

    ఆ పాత్రలో వచ్చిన మార్చే తనలో కూడా వస్తే....?

    ఆ ఆలోచనకే ఉలిక్కిపడ్డాడు అనిల్...... ఆలోచనల కల్లోలం.....

    తనలోని కల్లోలానికి అంతఃపరిశీన.....ఆత్మ పరిశీలన కారణమా.....? అంతఃపరిశీలన, మౌనంలో కూర్చోవటం శాస్త్రీయమైన పద్ధతికాదు; ప్రాణశక్తిచే ముడిపడి ఉన్న మనస్సునూ ఇంద్రియాల్ని బలవంతంగా  విడదియ్యటానికి చేసే ప్రయత్నమిది.

    నిజమైన, వ్యక్తిత్వమున్న మనిషిగా రూపాంతరం చెందటాని ప్రయత్నిస్తూ ఉండే ఏకాగ్రతల మనస్సును ప్రాణశక్తి ప్రవాహాలు నిరంతరం ఇంద్రియాలవేపు వెనక్కి లాగుతూనే ఉంటాయి. ప్రాణశక్తి ద్వారా మనస్సును నేరుగా అదుపులోకి తెచ్చుకొనే క్రియాయోగం, అన్నిటికన్నా సులువయినదీ, ఫలవంతమయినదీను. అనూహ్యమైన ఎత్తులకు ఎదగటానికి అది అనువైన, అత్యంత శాస్త్రీయమైన మార్గం కూడా.

    తన శరీరంమీదా, మనస్సు మీదా తానే ఆధిపత్యం వహించిన వ్యక్తే ఎదుగుతాడు.

    అలాకాక తన శరీరం మీద తనలోని పిరికితనం, తన మనస్సు మీద తనలోని దౌర్భల్యం ఆధిపత్యం వహిస్తే తనకు సంభవించే ఓటమికి కారణం బహిర్గత  శతృవులు కారు.

    ముందు తనను తాను జయించుకుంటే ఇతరుల్ని జయించటం అంత కష్టతరమైన ప్రక్రియకాదేమో.....

    ఎప్పుడో...... ఎవరో..... అన్నారు..... గుర్తుకుతెచ్చుకొనే ప్రయత్నం చేసాడు.

    అది  ఎవరో కాదు.... తనకు అత్యంత ప్రియమైన శిరీష.....

    ఎలాంటి జీవితం తనకు అత్యంత ప్రియమైన శిరీష.....

    ఏ మనిషయినా మూడు రకాలుగానే బ్రతుకుతాడు-

    మొదటిది- తనకుతాను. తన ఆలోచనలకు తాను విలువ ఇచ్చుకుంటూ గౌరవించుకుంటూ తనకై తానుగా, వ్యక్తిత్వమున్న వాడిగా, వెన్నుముక ఉన్నవాడిగా బ్రతకటం.

    రెండవది- తనను కనిపెంచిన వారినో, తనకు అండగా నిలిచిన వారినో, తనకు ఆధారమైన వారినో, తనను భయపెట్టేవారినో, గౌరవిస్తూనో, వారి ఆజ్ఞలను శిరసావహిస్తూనో వెన్నుముక, వ్యక్తిత్వం లేకుండా బ్రతికేయటం.

    మూడవది- పరిస్థితులకు తలవంచి కాలానుగుణంగా, ఎలాగోలా బ్రతికేయటం.

    ఏ విధంగా ఆలోచించినా, మొదటి తరహావ్యక్తులే దీర్ఘకాలంలో గౌరవింపబడేది. వారు మాత్రమే సంతృప్తిగా, ఆనందంగా బ్రతకగలిగేది.

    జీవితగమనంలో ఏ మైలురాయి దగ్గర ఆగి తమ గత జీవితాన్ని సమీక్షించుకున్నా, సిగ్గుపడకుండా తలెత్తుకు ముందుకు వెళ్ళగలిగే స్థయిర్యం వీరికి మాత్రమే ఉంటుంది.

    అదే....సరిగ్గా ఆ తరహా జీవన విధానమే తనకు కావాలి.....

    ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒక మలుపులో అనూహ్యమైన మార్పుకు గురవుతుంది...... అది ఎవరి ఉద్దేశపూర్వకమూ కాకపోవచ్చు..... రాజకీయాలంటే ఏవగించుకొనే పైలట్ రాజీవ్ గాంధీ రాజకీయాల్లో పూర్తిగా దిగిపోతాడని, దేశప్రధాని అవుతాడని ఎవరన్నా ఊహించారా? సంజయ్ గాంధీ కావాలని రాజకీయాల్లోకి వచ్చినా, ఇంకెన్నో దశాబ్దాలు రాజకీయాల్లోనే అత్యున్నత స్థానంలో ఉండాలని భావించిన ఇందిరాగాంధీ కాలగర్భంలో కలిసిపోవటం ఏమిటి.....? సడన్ గా ఎన్టీఆర్ సినిమా రంగాన్ని వదిలేసి రాష్ట్రమంత్రయి పోవటం, చిన్న చిన్న  అభిప్రాయబేధాలే పెద్దవయి రాజీవ్ గాంధీతో విభేదించి, మంత్రి పదవిని త్యజించి వి.పి.సింగ్ ప్రధాని కావటం...... అన్నీ  అద్భుతాలే.....

    ఒకప్పుడు పెద్ద లంచగొండిగా, చందాల మనిషిగా ప్రతిదానికి రేటు  నిర్ణయించి కోట్లు గడించిన వ్యక్తి ముఖ్యమంత్రి కావటం కూడా అద్భుతమే.....

    ఆరునెలల్లోపు ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో ఊహించి, ప్రస్తుత పార్టీ నుంచి విడిపోయి, కొత్త ప్రభుత్వంలో మంత్రికావటం ఒక రాజకీయవేత్త విషయంలో ప్రతిసారి జరగటం కూడా అద్భుతమే.

    స్కూల్ టీచర్ కొడుకు అంబానీ టాటా, బిర్లాల స్థాయికి ఎదగటం, కెమికల్ ఫ్యాక్టరీలో గుమస్తాగా చేసిన నిర్మాపటేల్ పెద్ద పారిశ్రామికవేత్త కావటం....

    చిన్న చిన్న పాత్రలు ధరిస్తూ ఎవరి అండ, ఇంకెవరి బ్యాగ్రౌండ్ లేకుండా స్వయం కృషితో అగ్రస్థాయికి చేరుకున్న చిరంజీవి.....

    సంకీర్తన, కెప్టెన్ నాగార్జున చూసి నాగార్జునను గేళిచేసిన వాళ్ళు గీతాంజలి, శివ చూసి  నోర్లు కుట్టేసుకోవటం.....

    దశాబ్దంపాటు క్రియాశీలక రాజకీయాల నుంచి దూరమై, మరుగున పడిపోయిన కరుణానిధి తిరిగి ముఖ్యమంత్రి కావటం....

    రెండు దశాబ్దాల నుంచి సినీరంగంలో ఎన్నో అపజయాలను చవిచూసినా, ధైర్యంగా ముందుకుసాగి హేట్రిక్ సాధించిన ఎమ్మెస్....

    రెండవ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనమైపోయి, ప్రపంచదేశాలు చూస్తుండగానే ప్రపంచ వాణిజ్య సామ్రాజ్యానికి  పట్టమహిషి అయినా జపాన్.....

    ఏమిటవన్నీ..... అద్భుతాలుకావా....?

    ఏదైనా మానవ ప్రయత్నానికి ఎదురునిలవలేదు-పరిపరి విధాలుగా ఆలోచిస్తుండగా షాట్ రడీ అయిందని బాయ్ వచ్చి పిలవటంతో ఆలోచనల్ని కట్టిపెట్టి కెమేరా ముందుకి వెళ్ళిపోయాడు అనిల్.

   
                        *    *    *

    తన కూతురిలో ప్రోదిచేసుకున్న వృత్తిపరమైన సంతృప్తిని, ఆనందాన్ని చూసి సీతారామారావు సంతోషించాడు.

    "ఏమ్మా..... ఇప్పుడు నీకు సంతృప్తిగా ఉందా.....!"

    "ఉంది నాన్నగారు- ప్రొఫెషనల్ సేటిస్ ఫేక్షన్ కి నిజమైన అర్ధాన్ని ఇప్పుడు తెలుసుకోగలిగాను- కాని, ఇంకా కొంత అసంతృప్తి మిగిలిపోయింది నాన్నగారు"

    "ఇంకానా.....?"

    "అవును నాన్నగారు- సుహాసిని తనకున్న స్టేటస్ తో, ఇన్ ప్లుయన్స్ తో, పరిచయాలతో ఇళయరాజా, తోటతరణి, జి.పి. కృష్ణ, లెనిస్ లాంటి అత్యున్నత ప్రతిభాపాటవాలు గల టెక్నీషియన్స్ తో సీరియల్ ని ప్రొడ్యూస్ చేసింది. ఇప్పటికే పెణ్ నాలుగు భాగాలు ప్రసారమయి తమిళ టీ.వీ ప్రేక్షక ప్రపంచంలో అపూర్వమైన ఆదరణను చూరగొంది-"

    కూతురింకా ఏ విషయంలో అసంతృప్తికి గురవుతుందో అర్థం చేసుకున్న సీతారామారావు ఒకింత బాధపడ్డాడు.

    "ఈ ప్రపంచంలో నూటికి నూరుశాతం రాజీలేని జీవితాన్ని లీడ్ చేస్తున్న వాళ్లు ఒక్కరైనా ఉంటారంటే అత్యద్భుతమైన విషయమే అవుతుంది. ఇలాంటి వాదనల్ని నీకు వినిపించటంలో నా పరంగా ఎలాంటి మర్మమూలేదు. రాజీపడి  వృత్తిని కొనసాగించమని పరోక్షంగా  చెప్పటం కూడా కాదు. బ్రతకవలసింది వాస్తవంలో అయినప్పుడు మన చుట్టూ జరిగే వాస్తవాల్ని పట్టించుకోకుండా బతికితే అనుక్షణం కొండంత మానసిక అసంతృప్తితో సహజీవనం చేయవలసి ఉంటుంది. అప్పుడు చేస్తున్న పనిలో పర్ ఫెక్షన్  తగ్గిపోతుంది. డైరెక్టర్ కి ఏం  కావాలో తెలీకపొయినా ఏం వద్దో తెలియాలి- లేదా ఏంవద్దో తెలీకపొయినా  ఏం కావాలో తెలియాలి. ఏం వద్దో- ఏం కావాలో రెండూ తెలీని డైరెక్టర్ కి  జడ్జ్ మెంట్ ఉండదు. జడ్జ్ మెంట్ లేని డైరెక్టర్ చేతిలోంచి వచ్చే ప్రోడక్ట్  ఎవరికీ  రుచించదు- ఎనర్జీ ప్రశంసలు అందుకోదు. బ్లైండ్ హిట్స్ తీసిన డైరెక్టర్  సృజనాత్మకత ఉన్నవాడు కాదు- మాస్ లో జమవుతాడే తప్ప- మేధావుల సరసలోకి ఎప్పటికీ రాలేడు.  

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra