పెంకులు గడిలోపలికి చెల్లాచెదరుగా వచ్చిపడ్డాయి.

    మధూహ మీదున్న విశాల్  తలెత్తి అటువైపు చూసాడు.

    మళ్ళీ ఇంకో శబ్దం. పిస్తోలు పేల్చినట్టు.

    పగిలిన కిటికీ అద్దాల సందుగుండా పిస్తోలు లోపలికి పేట్టి పేల్చారెవరో. మధూహ అతికష్టంమీద తలతిప్పి చూసింది. కిటికీ అవతల  భైరవమూర్తి మొహం కనిపించింది.

    మెడమీద తడి తగిలేసరికి మధూహ అప్రయత్నంగా తడిమి చూసుకుంది. జిగటగా....ఎర్రగా.....రక్తం. ఒక్కొబొట్టే ఆమె మెడమీద పడుతోంది. విశాల్ రెండు కనుబొమ్మల మధ్యా  బొట్టు పెట్టినట్టు ఎర్రటిగాయం.....

    అప్పటికే అతడి తల వాలిపోయింది. ఆమె తోసేసరికి అతడి శరీరం ఆపరేషన్ బల్ల పక్కనే దబ్బుమని శబ్దం చేస్తూ క్రిందపడింది. కొసప్రాణంతో కొట్టుకుంటున్నాడు.

    ఏం జరిగిందో ఆమెకి అర్థం కాలేదు. ఈలోపులో ఆపరేషన్ థియేటర్ బయట్నుంచి తలుపుని బలంగా తన్నేరెవరో. గడియపూడి తలుపు థడాలున తెరుచుకుంది.

    ఆమెకు ముందు కనపడింది భైరవమూర్తి.

    వెనుక....చేతులకి సంకెళ్ళతో రాజు. అతడి వెనుక పోలీసులు!

    మధూహ ఇంకా అయోమయం నుండి తేరుకోలేదు.

    భైరవమూర్తి లోపలికొచ్చి నేలమీద గౌనుతీసి ఆమెమీద కప్పాడు. అది అతడు చేసిన మొదటిపని.

    "వాడిని తీసుకెళ్ళి వ్యాన్ లో  కూర్చోపెట్టండి" పోలీసులకి ఆజ్ఞ ఇచ్చాడు. :ఇది అన్యాయం. నాకేమీ  తెలీదు. లోపల ఏం జరిగిందో  నాకు  తేలేదు" అరుస్తున్నాడు రాజు. భైరవమూర్తి అతడి దగ్గిరగా వెళ్ళి  దవడమీద  ఫెడేల్మని కొట్టాడు. "..... మీ క్లినిక్  పరీక్షకోసం వచ్చిన  వ్యక్తిమీద జరిగిన  అత్యాచారంలో, బైటకాపలాగా వున్నందుకు  అరెస్ట్  చేసాను. ఏం జరిగిందో  ఇప్పుడు అర్థమైందా? నీ మీద అదీ కేసు" అన్నాడు కర్కశంగా.

    పోలీసులు రాజుని పట్టుకెళ్ళారు. అతడింకా అరుస్తూనే  వున్నాడు. క్రమక్రమంగా  అరుపులు  దూరమయ్యాయి.  నిశ్శబ్దం చోటు  చేసుకుంది.

    ఆ నిశ్శబ్దం భైరవమూర్తివచ్చి విశాల్ శరీరం పక్కన కూర్చున్నాడు. మధూహ ఇంకా శిలా ప్రతిమలాగానే నిల్చుని వుంది. భైరవమూర్తి విశాల్

    శరీరంమీద ఆమె రక్కిన ప్రదేశాల్నీ, ఆమె శరీరం మీద అతడి క్షతాల్నీ పరిశీలించి, తృప్తిగా "చాలు. ఈ బుజువులు చాలు" అన్నాడు స్వగతంగా. తరువాత విశాల్ వైపు తిరిగి, "అర్థమైందా నేను చేసింది ఏమిటో?" అని అడిగాడు 'ఇండియన్ పీనల్ కోడ్ లో శిక్ష లేదు. అలా చంపింది పోలీస్  ఆఫీసరయితే అసలు కేసే లేదు' నవ్వేడు.

    "యూ బ్రూటన్....." గొణిగాడు విశాల్. అతడి ప్రాణాలు నెమ్మదిగా దూరమవుతున్నాయి.

    బైరవమూర్తి మొహంలో నవ్వు మాయమైంది. "బ్రూటస్ కాదు. భైరవమూర్తి.

 ఇన్ స్పెక్టర్ భైరవమూర్తి....." అన్నాడు. "ఈ అమ్మాయి నా దగ్గిరకొచ్చి కేసు వివరాలు చెప్తూంటేనే.....ఇందులో బలంలేదని అర్థమైంది. కోర్టులో నిరూపించటం కష్టం. ఇన్నివేల మందిని మోసం చేస్తున్నా నువ్వు, సులభంగా శిక్షనుంచి తప్పించుకో గలవు. అమాయకులయిన జనం మళ్ళీ యధావిధిగా నీ దగ్గిరకి వస్తారు. అందుకని ఈ ప్లాన్  వేసాను. నా కక్ష తీర్చుకున్నాను."

    "క....కక్షా!"

    "అవును కక్షే" గట్టిగా  అరిచాడు ఇన్ స్పెక్టర్ భైరవమూర్తి. "ఏ న్యాయా స్థానానికి  అందని కక్ష! ఏ నేరస్తుడూ వూహించలేని ప్లాన్!! నా మొహంలోకి చూసు విశాల్!! నీకే పోలికలూ కనపడటం లేదూ?"

    విశాల్.....మూతపడుతూన్న కళ్ళని తెరవటానికి ప్రయత్నిస్తూ.... "లేదు" అన్నాడు. భైరవమూర్తి పిచ్చివాడిలా అతడి మొహాన్ని అటూఇటూ తిప్పుతూ "లేదూ? లేదూ?' అని అరిచాడు. ".....సరిగ్గా చూడు. ఒక యువకుడి పోలికలు నా మొహంలో కనపడటం లేదూ? న్యాయంకోసం  నిలబడ్డ యువకుడు! .....సరిగ్గా చూడు.....నువ్వు కాళ్ళు నరికావు గుర్తుందా? ......ఆ యువకుడు !...... శివశంకరం ...... లాయరు.....గొప్ప క్రిమినల్ మైండ్ తో ప్లాన్ వేసావు కదూ. ఒక  ఆదర్శప్రాయుడైన లాయర్ని జీవితాంతం అవిటివాడిని చేసానని  మురిసిపోయావు కదూ. ఇప్పుడు చూడు. అంతకన్నా గొప్ప ప్లాన్ వేశాను. కోర్టుకన్నా పెద్ద శిక్ష నేనే  వేసేను..... హ్హహ్హహ్హ..." నవ్వుతున్నాడు. ".....ఎందుకంటే....ఎందుకంటే శివశంకరం నా కొడుకయ్యా! ......శంకరం నా ఒక్కగానొక్క కొడుకు....."


                            ఉపసంహారం

    గదిలో గడియారం చప్పుడు తప్ప మరేమీ వినపడటం లేదు. ఈ ఇద్దరూ యువతులూ స్థబ్దుగా అలాగే కూర్చుని వున్నారు. రెండు విభిన్నమైన రీతుల్లో జీవితాన్ని ప్రారంభించి.....రెండు విభిన్నమైన గమ్యల్ని చేరుకున్న యువతులు!

    సాంప్రదాయబద్ధంగా వివాహమాడి, లక్ష కలల్తో వైవాహిక జీవితంలోకి అడుగిడి, కలలు కల్లలువుతున్న తరుణంలో.....మరో యువకుడి ప్రేమని ఆస్వాదించలేక..... ద్వైదీభావంతో మానసిక రోగపు అంచులకు చేరుకుని.....కష్టపడి తన జీవితాన్ని సరిదిద్దుకున్న యువతి ఒకరైతే.....

    తెలిసీ తెలియని వయసులో ప్రేమించి, ఆ తరువాత జ్ఞానాన్ని సంపాదించి....ప్రేమని జ్ఞానం అధిగమించగా....అప్పటికే చేతులు కాల్చుకున్న యువతి మరొక ఆమె.

    ".....ప్రహసిత్ కి జరిగినదంతా తెలుసు. అతడే తన జీవితంలోకి నన్ను ఆహ్వానించాడు. అతడు మనసు కోల్పోయాడు....నేను శరీరాన్ని కోల్పోయాను. గుడ్డివాడికి కుంటివాడు తోడయినట్టు  మేమిద్దరం కలిసి జీవించాలనుకుంటున్నాం. లోకం దృష్టిలో భార్యాభర్తలం, నా  బిడ్డకి అతడు తండ్రి. అంతే....."

    "కేవలం అంతా కాకపోవచ్చు మధూ" అంది లక్ష్మి. ".....జీవితం ఎప్పుడూ ఒకేచోట ఆగిపోదు. ప్రహసిత్  ప్రేమని నేను  శంకించటంలేదు. కానీ ఎప్పటికయినా అతడు మారొచ్చు. విష్ణుని నేను మార్చుకోలేదూ....అలాగే నువ్వూ ప్రయత్నించు ప్రయత్నంలో తప్పులేదుగా."

    ఆమె మాటల్లోవున్న సత్యాన్ని జీర్ణం చేసుకోవటానికా అన్నట్టు మధూహ కొంచెంసేపు మవునంగా వుండిపోయి అంది, "ఎప్పటినుంచో నాకు ఒక అనుమానం వుంది లక్ష్మీ. నీలో ఇంతమార్పు ఒక్కసారిగా ఎలా వచ్చింది?"

    "బుద్ధుడికి బోధివృక్షం క్రింద జ్ఞానోదయం అయినట్టు ఒక అర్థరాత్రి నాకూ జ్ఞానోదయం అయింది" నవ్వింది లక్ష్మి. "ఆ బోధివృక్షమే  చెప్పింది. నేను చదువుకున్న దాన్నే. కానీ నా తెలివితేటల్ని లోకజ్ఞానంగా మార్చుకునే ప్రయత్నం  చేయలేదు. నేనెప్పుడూ.... నాలో నేను ఘర్షించుకుని, అదే నా కలల ప్రపంచమనుకుంటూ ఇంట్రావర్ట్ గా, సెల్ఫ్ పిటీ తో కుమిలిపోయాను."

     లక్ష్మి కొనసాగించింది. "భార్యభర్తల మధ్య కావాల్సింది అన్నిటికన్నా ముఖ్యంగా.....కమ్యూనికేషన్! మానసికంగా , శారీరకంగా.....రెండోది అండర్ స్టాడింగ్!! మంచిగుణాలూ, బలహీనతలూ అర్థం చేసుకోవటం....మూడోది ఇంటర్ డిపెండెన్సీ!!! అవతలి వారిని తన మీద ఆధారపడేలా చేసుకుంటూ, వారిమీద ఆధారపడటం!"

    "విష్ణు మారాడా?"

    "తెలీదు. ఒకవేళ మారినా అది తాత్కాలికమైవుండొచ్చు. కానీ ప్రయత్నం జరుగుతోంది కదా! అదీ కావాల్సింది. సకల  దుర్గణ సంపన్నుడయిన భర్తకి ఆక్సిడెంట్ జరిగి, చావు బ్రతుకుల మధ్య వుండగా భార్య రక్తం దానం చేసి అతన్ని రక్షించుకుని మంచివాడిగా మార్చుకోవటానికి ఇదేమీ సినిమాకాదుగా.....జీవితం!!! సినిమా.....శుభంతో పూర్తవుతుంది. జీవితం కొనసాగుతూనే వుంటుంది. దాన్ని శుభప్రదంగా వుంచుకోవటం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే వుండాలి."

    బయట కారుహారన్ వినిపించింది. మధూహ లేచింది.  "ప్రహసిత్ వచ్చినట్టున్నాడు. వెళ్తాను" అంది.

    లక్ష్మి కూడా లేస్తూ, "నీకు పుట్టబోయే బిడ్డని మాకిస్తావా?" అని అడిగింది. హఠాత్తుగా ఆమె అడిగిన ఆ కోర్కెకి మధూహ ఒక్క క్షణం ఆశ్చర్యపోయింది. "అవును మధూ. మాకెలాగూ సంతానం కలగదు. నీకూ ప్రహసిత్ కీ మధ్య అడ్డుగా...." అంటూండగా మధూహ తేలిగ్గా నవ్వేసి, "ఇస్తాలే....." అంది. "కానీ రాజు జ్ఞాపకాన్ని నేను వుంచుకుని, ప్రహసిత్ వల్ల కలిగిన బిడ్డని నీకిస్తే ఎలా వుంటుందంటావ్?"

    "చాలా మెలోడ్రమెటిక్ గా వుంటుంది" ఇద్దరూ నవ్వేసారు.

    ముందుగదిలోకి వస్తూండగా "ఇంకొక్క అనుమానం" అంది మధూహ.

    "ఇన్ని అనుమానాలుండటం అంత ఆరోగ్యకరం కాదే. అడుగు" అంది లక్ష్మి.

    "మగవాళ్ళు అంత సులభంగా మారతారా? కమ్యూనికేషన్, డిపెండెన్సీ, అర్థం చేసుకోవటం....ఇవే సరిపోయిన పక్షంలో ఇన్ని సంసారాలు ఇంత దరిద్రంగా ఎందుకుంటాయి? ఇంతమంది ఆడవాళ్ళు ఇంత అసంతృప్తిగా  ఎందుకుంటారు?"

    "ఒక్క ఆడవాళ్ళనే ఎందుకంటావ్? మగవాళ్ళలో మాత్రం అసంతృప్తి వుండదా?"

    "తీర్చుకునే మార్గాలు చాలావుంటాయి వాళ్ళకి"

    "నే వ్రాయబోయే తరువాత నవల అదే. ఒక స్త్రీ రకరకాలుగా ప్రయత్నించి కూడా తన భర్తని సరిదిద్దుకోలేకపోతుంది. భర్త ఎంత క్రూరుడంటే.....కత్తిపీటతో మెడవెనుక గాయం కూడా చేస్తాడు. అప్పుడామె ఒక పల్లెటూరు వెళ్ళి స్నేహితుడితో ఒక అనుభవాన్ని జీవితకాలం మిగుల్చుకుంటుంది. ఆస్ఫుర్తితో భవిష్యత్తులోకి అడుగుపెడుతుంది. నైతిక విలువలు, సామాజిక పరిణామాలూ. గాడిదగుడ్డూ.... ఏవీ ఆలోచించదు"

    "బావుందే. టైటిల్ ఏమిటి?"

    "ప్రేమ"

    "ప్రేమా? అదే ప్రేమ?"

    "తనని తాను ప్రేమించుకోవటం ముఖ్యమని నువ్వే అన్నావ్ గా. అన్నిదార్లూ మూసుకుపోయినప్పుడూ అదే చెయ్యాలి మరి. కానీ మనసులో డిఫెక్ట్ ఏమిటంటే ఆనందం అనేది ఎక్కడో వుంటుందనుకుంటాం. అరకులోయ గురించి, అలాక నందా గురించీ ఆలోచిస్తాం. కిటికీ తెరిస్తే కనపడే సూర్యోదయాన్ని చూడం"

       
                               *    *    *

    మధూహ మెట్లు దిగి, వెళ్ళి కార్లో కూర్చుంది. లక్ష్మి లోపలే వుండిపోయింది. కిటికీ తెరల మధ్యనుంచి డ్రైవింగ్ సీట్ లో వున్న ప్రహసిత్ కనపడుతున్నాడు.

    కారు కదలగానే నెమ్మదిగా దృష్టిపథంలోంచి కనుమరుగయ్యాడు.

    డ్రైవింగ్ తెలిసిన వ్యక్తి చేతిలో జీవితంలా సాఫీగా సాగిపోతోంది కారు.

   
                              (శుభం)

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra