Home » Dr. dasaradhi rangacharya » Sukla Yajurveda Samhitha


    35. అగ్నీ! నీవు యజ్ఞములకు దేవతలను ఆహ్వానించు వాడవు. నీ అధికారము - కర్తవ్యములను తెలిసినవాడవు. దీప్తిమంతుడవు. నీవు నిర్దిష్ట స్థానమగు కృష్ణాజినమున ఆసీనుడవగుము. శుభకర్మలకు మూలస్థానమగు కృష్ణాజినముపై యజ్ఞమును స్థాపించుము.

    36. అగ్నీ! నీ యజ్ఞముల హవిని దేవతలకు చేర్చువాడవు. నీ అధికారమువు, విధులను తెలిసినవాడవు. దీప్తిశాలివి. హొతృ దిష్ణ్యాదులందు చేరువాడవు. క్షిప్రకారివి. అహింసత స్వకర్మవు. ప్రకృష్ణమతివి. నీ స్థానమున నిశ్చలముగా ఉండువాడవు. వేల ఋత్విక్కుల, యజమానులను భరించి పోషించువాడవు. పావక జిహ్వవు. అగ్నియజ్ఞమునకు సంపన్న రూపమగు ఉత్తర వేదిన ప్రతిష్ఠించబడినావు.

    37. అగ్నీ! నీవు ఉత్కృష్టుడవు. కమల పత్రము మీద స్థిరముగా ఆసీనుడవగుము. నీవు అనేక యజ్ఞములకు కారణభూతుడవు. నిత్య మహామహుడవు. దేవతలను కంపించేయగల నీవు ప్రదీప్తుడవగుము. నీవు దర్శనీయుడవయ్యు నిన్ను చూడనీయని ధూమమును వెలువరింపుము.

    38. అధ్వర్యులారా! భూమి త్రవ్వుచోటున ఉన్న జనులు రోగములు లేని ఆరోగ్యవంతులు కావలెను. అందుకొరకు మధుర, ప్రశస్త జలములను కలిగించండి. ఆ మధుర జలములచే ఈ నెల తడువవలెను. ఫలప్రదములగు వృక్షములు మొలకలెత్తి ఫలించవలెను.

    39. నేలతల్లీ! నిన్ను త్రవ్వుచున్నాము. నీ హృదయము పగిలినట్లు ఇది కనిపించుచున్నది. దానిని అంతరిక్ష సంచారివాయువు, జలాదులు పూరించుదురు గాత.

    వాయువా! నీవు దేవతలకు ప్రాణసముడవు. ఉపకారివి. సర్వత్ర సంచారివి. నీవు ప్రజాపతి రూపుడవు. నీకు స్వాహా.

    40. (పరచి ఉన్న కృష్ణాజినము, తామరాకు కొనలను అధ్వర్యు ఎత్తవలెను.)

    ఈ అగ్ని చక్కగా ఉత్పన్నుడైనవాడు. అతడు - తన తేజమున - సుఖముగా కృష్ణాజిన భావనమున వసించవలెను.

    అలంకార అగ్నీ! ఇది కృష్ణాజిన రూప వస్త్రము. దీనిని నీవు - ఇష్టముగా - ధరించుము.

    41. (మట్టి ముద్దను చేత పట్టి అధ్వర్యు లేచి నిలబడవలెను.)

    శుభయజ్ఞవంత అగ్నీ! ప్రజ్వరిల్లుము. నీవు దయాపరుడవు. మమ్ము రక్షింపుము. ఋత్విక్కుల స్తుతులకు ప్రసన్నుడవగుము. మా యజ్ఞమునకు విచ్చేయుము. నీ విశాల తేజమున అందరకు దర్శనము ఇచ్చుటకు ప్రజ్వరిల్లుము. నీవు కిరణములచే వెలుగొందుచు విచ్చేయుము.

    42. (అధ్వర్యు మట్టి పట్టిన తన చేతిని ఎత్తవలెను)

    అగ్నీ! మమ్ము రక్షించుటకుగాను నీవు ఆకాశమునకు చేరుము. సూర్యుని వలె నభమున నిలిచిన నీవు మాకు అన్నము కలిగించువాడవు. నిన్ను అభివ్యక్తుని చేయువారు ఋత్విజులు. వారి ద్వారా నిన్ను మేము ఆహ్వానించుచున్నాము.

    43. (అధ్వర్యు పైకి ఎత్తిన మట్టి ముద్ద ఉన్న చేతిని దించి అతని నాభి వద్ద నిలుపవలెను. అశ్వమును తెచ్చి - దానిని అగ్నిగా భావించి-)

    అగ్నీ! అశ్వమా! నీవు దర్శనీయుడవు. వివిధ ఓషధులు ధరించినవాడవు. అనేక వర్ణముల వాడవు. ప్రశంసనీయుడవు. రాత్రి చీకట్లను పారద్రోలువాడవు. ఇప్పుడు అంతరిక్షపు నాభియందు నిలిచినావు. ఇక నీవు నీ సకిలింపుల తుముల నాదములచే ఓషధులను సమార్జింపుము.

    44. (అధ్వర్యు గార్దభమును తేవలెను)

    గార్దభమా! నీవు గమనశీలవు. స్థిరపడుము. దృఢ అంగములు కలుగుము. శ్రీఘ్రగామివగుము. మాకు అన్నము కలిగించుదానవగుము. నీవు మృత్తిక సుఖముగా కూర్చుండు ఆసనమవు. మట్టి మోయుదానవు.

    45. (అథ్వర్యు మేకను తేవలెను)

    అగ్నిరూప అజమా! నీవు మానవ ప్రజకు శుభంకరివగుము. ద్యావాపృథ్వులను తపింప చేయకుము. అంతరిక్షమును - ఓషధులను తపింపచేయకుము.

    46. (అధ్వర్యు వరుసగా అశ్వము, గార్దభము, అజము మీదకు మట్టి ముద్దలను ఎత్తవలెను.)

    సకిలించి శబ్దించు అశ్వమా! నీవు సంతసముగా ముందుకు సాగుము. తన ఓండ్రుతో సకల దిశలను గర్జింపచేయుచు గార్దభము మెల్లగా సాగవలెను. పశుహిత కారియగు అగ్ని రూప మృత్పిండమును ధరించిన నీవు యజ్ఞ సమాప్తి వరకు ఆయుష్యము కలుగుము. ఫలాభివర్షణ సమర్థ గార్దభము సహితము జీవించవలెను.

    (మర్రి ముద్దను గార్ధభము మీది నుంచి దించి మేక మీద పెట్టవలెను.)

    47. అంగిరసములగు ఋత్విక్కులు ఆదిత్యుని - పశు హితకారి అగ్నిని ఆహ్వానించుచున్నారు.

    (నీటితో తడిపి చేసిన మట్టి ముద్దను తూర్పు దిక్కున పెట్టవలెను.)

    ఓషధులారా! మీ ముందు మృద్రూపఅగ్ని నిలిచిఉన్నది. దానిని ప్రసన్నను చేయండి.

    అగ్నీ! ఇట నిలిచిన నీవు మా దుర్బుద్ధులను - ఈతి బాధలను - వ్యాధులను దూరము చేసి వానిని నష్ట పరచుము.

    48. ఓషధులారా! మీరు సుందర పుష్పవంతులు. స్వాదిష్ట ఫలవంతలు. ఈ అగ్నిని స్వీకరించండి. మీరు ఋతువులను బట్టి పుష్పించువారు - ఫలించువారు. ఈ అగ్ని మృత్తిక గర్భమున చేరండి.

    49. (అధ్వర్యు మేకను, గాడిదను, గుర్రమును తూర్పు దిక్కున వదల వలెను.)

    అగ్నీ! నీవు విశాలుడవు. తేజో బలసంపన్నుడవు. దీప్తిమంతుడవు. మా శత్రువులను రాక్షసులను - వ్యాధులను దూరము చేయుము చేయుము. నీవు శరణ్యుడవు. సుఖదుడవు. ప్రౌఢుడవు. ఆవాహవీయుడవు. మేము నీకు పరిచర్యలు చేయుచున్నాము. మాకు సుఖములను ప్రసాదించుము.

    50 (అధ్వర్యు ఈ మూడు మంత్రములు చదువుచు మోదుగు పుల్లలతో కాలిన నీటిని మట్టి ముద్దల మీద పోయవలెను.)

    జలమా! నీవు సుఖ సంపదల కలిగించు దానవు. మహామహుడు - అతి సుందరుడగు బ్రహ్మను దర్శించుటకుగాను మాకు అన్నమును - బలమును ప్రసాదించుము.

    51.  జలమా! నీవు ఎన్నో శుభములు కలిగించు రసభూతమవు. తల్లులు తమ శిశువులకు వలె మాకు నీ యొక్క రసమును పంచి ఇమ్ము.

    52. జలమా! ఇది యజ్ఞ గృహము. ఇచట నీవు మా అందరను సంప్రీతులను చేయుచున్నావు. ఈ యజమానికి స్వర్గమందును సంపూర్ణముగ అనుగ్రహించుము. మమ్ము సహితము స్వర్గయోగ్యులను చేయుము.

    53. సూర్యుడు సర్వమిత్రుడు. అతడు తన ప్రకాశమున ద్యులోక భూలోకములకు సంబంధము కలిగించుచున్నాడు.

    అజ లోమ రూపాగ్నీ! నీవు చక్కగా ఉత్పన్నమైనవాడవు. జాతప్రజ్ఞుడవు. నీచే ఈ మృత్పిండమునకు సంతృప్తి కలిగించుచున్నాను. (మేకవెంట్రుకలను మట్టిముద్దలో కలుపువలెను.)

    54. (మట్టిముద్దలో ఇనుపరజను - రాతిపొడి కలుపవలెను.)

    తుడ్రులు భూమండలమున ఖనిజములను - శిలలను సృష్టించినారు. అగ్నికి మహాజ్యోతిని  కలిగించినారు. ఆ రుద్రుల అజస్రశుభ్ర తేజము నేటికి దేవతలందు కనిపించుచున్నది.

    మృత్పిండము భూగోళమునకు సంకేతము ఖనిజాదులు ఉన్నవనుతాకు ఇనుపరజను రాతి పొడిని కలుపుట. వీటిని కలుపుట వలన మట్టికి గట్టితనము కలుగును. అసలు ఈ భూమి ఖనిజనులు - శిలలవలననే నిలిచి ఉన్నదేమో!

    55.  ఈ మృత్పిండము వసురుద్ర రూపసైకతాదులచే కలుపుబడినది. శుక్ల పాడ్యమి అభిమాన దేవత యగు సినీ వాలి స్వయముగా తన కోమల హస్తములచే మెత్తగా చేయవలెను.

    56. శుక్లపాడ్యమి అభిమాన దేవత 'సినీవాలి' సుందరి - సుశోభిత - సర్వాభరణాలంకృత. ఆమె తన చేతులలో ఉఖ - కుండ - ను దేవమాత అదితికి అందించును గాత.

    57. అదితి తన బుద్ధి, శక్తి సామర్ధ్యములచే - తన హస్తములచే కుండను ఏర్పరచవలెను. అదితి నిర్మించిన ఉఖ - తల్లి తన బిడ్డను గర్భమందు వలె - అగ్నిని దాల్చవలెను.

    (యజమాని - అతనిపత్ని తమ చేత మట్టి ముద్దగైకొని ఉఖను చేయవలెను.)

    మృత్పిండమా! నీవు కీర్తి శిఖరమవగుము.

    అగ్నినిదాల్చుట కుండను కాల్చుట కావచ్చును.

    58. (కుండకు అడుగు చేయుటకుగాను మట్టిని అరచేతి వెడల్పు చేయవలెను)

    ఉఖా! అంగిరుల వంటి వసుగణములు నిన్ను గాయత్రీ ఛందముణ నిర్మించినారు. వసువులచే నిర్మించబడిన నీవు ఎంతో గట్టిదానవు- విస్తారమవు. యజమానివగు నా యందు సంతానమును ధన సమృద్ధిని - గోస్వామిత్వమును అత్యంత బలమును చేర్చుము.

    (మట్టి ఫలకమును ఎత్తి తొలి 'ధాతువు' నుంచి - ప్రథమం ధాతుమాదధాతి)

    ఉఖా! అంగిరుల వంటి రుద్రులు నిన్ను త్రిష్టుప్ ఛందముణ నిర్మించినారు. రుద్రులచే నిర్మించబడిన నీవు గట్టిదానవు- విస్తారమవు- యజమానినగు నాయందు సంతానమును ధన సమృద్ధిని - గోస్వామిత్వమును - వీరకృత్యములను చేర్చుము.

    (ఉఖను నీటితో నున్నగా చేసి రెండవ ధాతువును ఉంచవలెను)

    ఉఖా! అంగిరుల వంటి ఆదిత్యగణము జగతీ ఛందముణ నిన్ను నిర్మించినారు. ఆదిత్య గణములచే నిర్మించబడిన నీవు గట్టిదానవు - విస్తారమవు - యజమానినగు నాయందు సంతానమును ధన సమృద్ధిని గోస్వామిత్వమును అత్యంత బలమును చేర్చుము.

    (యజమాని ఉఖను నీటితో తడిపి అన్నివైపుల సమముగా చేయవలెను.)

    అంగిరుల వంటి విశ్వే దేవతలు నిన్ను 'అనుష్టుప్' ఛందముణ నిర్మించినారు. విశ్వే దేవతలచే నిర్మించబడిన నీవు గట్టిదానవు- విస్తారమవు - యజమానినగు నాయందు సంతానమును ధనసమృద్ధిని గోస్వామిత్వమును వీరత్వమును చేర్చుము. నా వారినందరిని నావశమున ఉండునట్లు చేయుము.

    59. (యజమాని ఉఖ మూతికి అంచును ఏర్పరచవలెను)

    మేఖలా! నీవు ఉఖకు వడ్డాణము వంటిదానవు. (యజమాని మూతిని తాకవలెను)

    ఉఖా! దేవమాత అదితి నీయొక్క మధ్య భాగమును స్వీకరించవలెను.

    (కుండను నేలమీద పెట్టవలెను.)

    అదితి ఉఖను అందుకుని 'పుత్రులగు దేవతలారా! అగ్నిని యోనిని చేసి దీనిని కాల్చండి' అని అందించవలెను.

    60. (ఎండిన గుర్రపు లద్దెచే ఉఖకు ఏడుసార్లు ధూపము వేయవలెను)

    అంగిరుల వంటి వసుగణము నీకు గాయత్రీ ఛందపు ధూపము వేయవలెను. అంగిరుల వంటి రుద్ర గణము నీకు త్రిష్టుప్ ఛందపు ధూపము వేయవలెను. అంగిరుల వంటి ఆదిత్య గణము నీకు జగతీ ఛందపు ధూపము వేయవలెను. అంగిరుల వంటి - విశ్వనేతలు - విశ్వే దేవతలు నీకు అనుష్టుప్ ఛందపు ధూపము వేయవలెను. అంగిరుల వంటి ఇంద్ర, వరుణ, యజ్ఞాధిదేవత విష్ణువు - నీకు ధూపము వేయవలెను.

    61. (కుండను కాల్చుటకు గాను అభ్రితో గొయ్యితీయవలెను)

    గర్తా! విశ్వే దేవయుక్త అదితి, అంగిరుల సమానమగు నేల పైపొర నిన్ను త్రవ్వవలెను.

    (గుంతలో కుండను బోర్లించవలెను.)

    ఉఖా! దేవపత్నులు, ఓషధులు, అంగిరసమమగు పృథ్వి పైపొర నిన్ను గుంతలో పెట్టవలెను.

    (బోర్లించిన కుండ ఉన్న గోతిని మూసి- దక్షిణాగ్ని నుంచి తెచ్చిన అగ్నిచే అంటించవలెను.)

    ఉఖా! విశ్వే దేవతల యుక్తవాణి - దేవపత్నులు - ధిష్ణలు - అంగిరసమీ పృథ్వి పై పొర గుంతలో నిన్ను చక్కగా కాల్చవలెను.

    (మూతలో కన్నము చేసి ఉఖను చూడవలెను.)

    ఉఖా! విశ్వే దేవతల యుక్త అహొరాత్రులు, దేవపత్నులు - అంగిరసమగు పృథ్విపై పొర నిన్ను పరిపక్వమగునట్లు చేయవలెను.

    ఉఖా! ఛందస్సుల అభిమాన దేవేరులు - అంగిరసమ పృథ్విపై పొర -  నక్షత్రముల అభిమాన దేవేరులు -నిన్ను గుంతలో చక్కగా కాలునట్లు చేయవలెను.

    62. (కుండకాలిన తరువాత మూతను తీసివేయవలెను.)

    మిత్రుడగు సూర్యుడు మానవ ప్రజను పోషించువాడు. దర్శనీయుడు. దేవతల సనాతన సంరక్షకుడు. అతనిని మేము ధనము, అన్నము యాచించుచున్నాము.

    63. ఉఖా! సుందర హస్తములు, సుందర అంగుళులు, సుందర బాహువులు గల సూర్యుడు నిన్ను గర్తమునుండి బయటికి తీయునుగాత.

    (ఉఖను తీసి ఊర్ధ్వ ముఖముగా నిలుపవలెను.)

    ఉఖా! నీవు సూర్య దేవతచే తీయబడినావు. నీవు పృథ్విమీద అచలముగా నిలువుము. అన్ని దిశలు - విదిశలను ఆహుతులచే పూరింపుము.

    64. ఉఖా! నీవు గుంత నుంచి బయటికి వచ్చినావు. మహిమగలదానవగుము. నీవు నీ కర్మమున నిమగ్నవగుము. నీవు స్వయముగనే గట్టిదానవు. పటుత్వము గల దానవు.

    సర్వోపకారివగు సవితృ దేవా! పగులకుండ చేయుటకు ఈ కుండను నీకు అర్పించుచున్నాను. దేవా! దీనిని పగులనీయకుము.

    65. (ఉఖ మీద మేకపాలు చల్లవలెను.)

    ఉఖా! అంగిరుల వంటి వసుగణము గాయత్రీ ఛందమున నీపై రస సేచనము చేయవలెను. అంగిరసములగు రుద్ర గణములు త్రిష్టుప్ ఛందమున నీపై రస సేచనము చేయవలెను. అంగిరసములగు ఆదిత్య గణములు జగతీ ఛందమున నీపై రస సేచనము చేయవలెను. అంగిరసములగు విశ్వే దేవతలు అనుష్టుప్ ఛందమున నీపై రససేచనము చేయవలెను.

    66. (నాలుగవ అధ్యాయము యొక్క 7వ మంత్రమగు "ఆకూత్యే నుండి 5 ఔద్గ్రభణ ఆహుతులు ఇచ్చి ఈ  ఏడు అగ్నిచయనసంబంధి ఔద్గ్రభణ ఆహుతులు ఇవ్వవలెను.)

    అగ్నిచయన సంబంధి అనుష్ఠానము మా సంకల్పమును స్వకర్మమున ప్రయుక్తము చేయు అగ్నికి స్వాహా. మనసును, ధారణబుద్ధిని స్వకర్మమున ప్రయుక్తము చేయు అగ్నికి స్వాహ చిత్తమును, విజ్ఞానమునకు ప్రేరణ కలిగించు అగ్నికి స్వాహా. వాణి, విధృతికి ప్రేరణ కలిగించు అగ్నికి స్వాహా. ప్రజాపతి మరియు మనువునకు స్వాహా. విశ్వనేత అగ్నికి స్వాహా.

    67. ఫలప్రదుడగు సవితా దేవుని మైత్రిని అందరు కోరుదురు గాత. అందరు ధనమును యాచింతురు. పోషకుడు. అన్నములు ప్రసాదించు సవితకు స్వాహా.

    68. (తూర్పునకు ముఖము చేసి నిలిచినా యజమాని ముంజి పరచిన అహవనీయ వేది మీద ఉఖను స్థాపించవలెను.)

    ఉఖమాతా! నీవు పగిలి ముక్కలు, ముక్కలు కాకుము. నలిగిపోకుము. నీవు దృఢపడి అగ్నిధారణ రూపమగు వీరకర్మము నివర్తించుము. మా అభీష్ట కర్మ ముగియు వరకు నీవు అగ్ని ధారణ శక్తి కలిగి ఉండుము.

    69. ఉఖా! నీవు మట్టిచే చేయబడినదానవు. మాకు శుభములు కలిగించుటకు నీవు గట్టి పడుము. అన్నమును  ఆశించి, ప్రాణములు నిలుపు మాయచే నీవు నిర్మించబడినావు. నీలోన ఆహుతిఅర్పించిన ద్రవ్యము దేవతలకు ప్రీతిపాత్రము కావలెను. నీవు ఈ యజ్ఞమున సర్వదా అక్షతవై నిలువుము.

    70. (ఉఖలో అగ్ని ప్రజ్వలితమైనంత 13 సమిధలను వేయవలెను.)

    వృక్షము అన్నముగా కలవాడును. ఘృతమున తృప్తి చెందువాడును - సనాతనుడు - దేవతల ఆహ్వాత - వరణీయుడు - బలపుత్రుడు -సర్వథా అద్భుతమగు అగ్ని ఈ  సమిధలను భస్మము చేయును గాత.

    71. (వికంకత వృక్ష సమిధలచే హొమము చేయవలెను.)

    అగ్నీ! శత్రువుతో జరుగు యుద్ధమున మా వీరుల నీరసించినపుడు వారికి జయము కలిగించుము. నేను స్వయముగా ఉన్న చోట వారిని రక్షింపుము.

    72. (ఉఖలో ఔదుంబర సమిధలు వేయవలెను.)

    అగ్నీ! నీవు రోహిత అశ్వములను ఎక్కుము. సుదూర స్వర్గాదుల నుండి శీఘ్రముగా మా యజ్ఞమునకు విచ్చేయుము. నీవు పశుహితకారివి. ఋత్విజ, యజమానాదులకు ప్రియుడవు. ఇటకు వచ్చి మమ్ము రాక్షసాది హింసకుల బారి నుండి రక్షింపుము.

    73. (ఎండికూలిన చెట్టు యొక్క సమిధలచే హొమము చేయవలెను.)

    అగ్నీ! ఎండి కూలిన సమిధలను నీకు సమర్పించు చున్నాము. అవి నీకు  ఘృతము వంటిని కావలెను. నిత్య తరుణ అగ్నీ! నీవు వానిని ఘృతమును వలెనే స్వీకరించుము.

    74. (నేల మీద పడిన సమిధలు వేయవలెను.)

    అగ్నీ! చీమల వంటి కీటకములు తిన్నవియు చెదలు పట్టినదియునగు సమిధలు నీకు ఘృత సమములు కావలెను. నిత్య తరుణ అగ్నీ! వాటిని ఘృతమునువలెనే స్వీకరింపుము.

    75. (పలాశ సమిధలు వేయవలెను.)

    అశ్వశాలలో కట్టిన అశ్వములకు నిత్యము - ఆలస్యము చేయక - గడ్డి, దాణా వేయబడును. అగ్నీ! అదే విధముగా నీకు సమిధలు సమర్పించుచున్నాము. మేము ధనపుష్టి - అన్న సమృద్ధి కలిగి - ణీ ముందు కూర్చున్నాము. మేము ఎన్నటికిని బాధించబడరాదు.

    76. అగ్ని, పృథ్వి యొక్క నాభి యగు ఆహవనీయ వేది మీద నున్న ఉఖయందు సమిద్ధుడు. హవిరన్నమున తృప్తి చెందువాడు. మహాస్తుతిమంతుడు. యజనీయుడు - యజనశీలుడు, యుద్ధములందు శత్రువులను పరాభవించువాడు.

    అట్టి అగ్ని దేవుని - మాకు విస్తృత ధనలబ్ధికిగాను ఆహ్వానించుచున్నాము.

    77. మా మీద దాడి చేయు శత్రుసేనలను - మా శరీరములను భేదించి బాధించు అస్త్ర శాస్త్రములను - బలశాలి సేనా నాయకుల శత్రుసేనలను - దొంగలను - బందిపోట్లను అగ్నీ! నీ నోట పడ వేయుదుము.

    78. మహాభాగ్యవంత అగ్నీ! దవడ పండ్లతో బందిపోట్లను - కోరలతో దొంగలను - మునిపండ్లతో తస్కరులను కొరికి ఉన్నప్పటికి చక్కగా నములుము.

    79. గ్రామాదులందు ప్రవేశించి జనులను కొట్టి, నరికి, బంధించువారలను - అడవులందు దోపిడి దొంగలను - చెట్టు పుట్ట చాటున దాగి దాడి చేయు పాపాత్ములను అగ్నీ! నీ దవడలకు అందించెదను.

    80.  మా మీద శత్రుత్వము కలవారలున్నారు. మమ్ము ద్వేషించు వారలున్నారు. మమ్ము నిందించు వారలున్నారు. వీరు కాక మమ్ము హింసించగోరు రాక్షసాధులున్నారు. అగ్నీ! అట్టివారిని అందరిని భస్మము చేయుము.

    81. అగ్నీ! నేను పురోహితుడను. మంత్ర బలము కల వాడను. నీ దయ వలన నేను తీక్ష్ణుడను అయినాను. బాల వీర్యములందు కూడ  తీక్ష్ణుడను అయినాను. నేను ఏ రాజునకు పురోహితుడనో ఆ క్షత్రియరాజు సహితము నా మంత్రాదుల వలన తీక్ష్ణుడ అయి సర్వదా విజయవంతుడైనాడు.

    82. నేను నా మంత్రబలమును నారాజు యొక్క సేనలందలి వీరుల బహుబలమును ఎంతో పెంచినాను. వారి వర్చస్సును పెంచినాను. వారి బలమును పెంచినాను. అదికాక మంత్ర బలమున శత్రువును క్షీణింపచేసినాను. నేను నా వారిని ఉన్నతులను చేయువాడను.

    (సమిధామంత్రములు సమాప్తము)

    83. అగ్నిదేవా! నీవు అన్నపాలకుడవు. అన్నదాతావు. రోగ రహితము, పుష్టికరమగు అన్నమునందలి నా భాగమును నాకు ప్రదానము చేయుము. అన్నదాతలున్నారే - వారిని ఆపదల నుండి దాటించుము. మానవులకు, పశ్వదులకు అన్నాది ఖాద్య పానములను ఏర్పరచుము - బలవీర్యములను బుద్ధిని ప్రసాదించుము.

   
       
                           దాశరథి రంగాచార్య విరచిత
            శ్రీమదాంధ్ర వచన శుక్ల యజుర్వేద సంహితయందలి
           ఉఖాది సమిధాద్యంతమను పదకొండవ అధ్యాయము సమాప్తము
.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra