Home » Suryadevara rammohan rao » సూపర్ స్టార్


    "ఏదైనా తెగేదాకా లాగకూడదని నీకు ఎప్పట్నుంచో చెబుతున్నాను. అయినా నీ అహంభావంతో నువు ణా మాటల్ని ఖాతరు చేయలేదు.నాకేదో అనుమానంగా ఉంది - మనం లేకుండానే ఈ లోకేషన్ లో షూటింగ్ అయిపోయిందంటే ఏమిటర్ధం ....? యూనిట్ మరో లోకేషన్ కి వెళ్ళి పోయిందంటే కూడా నీ కర్ధంకాకుండా ఉండదనుకోను.....చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పారు. మనం లేకుండానే షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారని అర్ధమవుతోంది - మాకు డబ్బులిస్తేనే షూటింగ్ జరుగుతుంది - లేదంటే పేకప్ చెప్పుకోవాల్సి వస్తుందని బెదిరించావుగా..... ఇప్పుడేమయింది.....? షూటింగ్ కి పేకప్ చెప్పకుండా మనకి చెప్పారు. నువ్వు చెడిందికాక నన్ను కూడా చెడగొట్టావు - నన్ను కూడా రెచ్చగొట్టి వాళ్ళ మీద తిరగబడేలా చేసావు - నిజం చెప్పు - ఏడుపుతో కాకపోతే, ఎప్పుడయినా హంపీ ఎవరికైనా, డబ్బులు ఎగ్గొట్టిందా....? అసలలాంటి లక్షణాలు ఆమెకున్నాయా....?" ప్రశాంత్ రెచ్చిపోయేసరికి నందిని బిక్కచచ్చిపోయింది.

    "ఐదు నిముషాలాగండి - పావుగంటాగండి అని మనల్ని ఎక్స్ ట్రాస్ క్రింద నెట్టేసి వేరే ఆర్టిస్టుల్ని పెట్టుకొని షూటింగ్ కంటిన్యూ చేసుంటారు....."

    "మరి మనతో మూడురోజులుగా షూటింగ్ చేసారుగా? దాన్నేం చేస్తారు....?" ఇంకా  సడలని బింకంతో ప్రశ్నించింది నందిని. "కాల్చిపడేస్తారు. వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిన్నాక బోడి నష్టానికి వెనకాడతారా....? బ్రహ్మాండమైన పాత్రవచ్చినట్లే వచ్చి చేజారిపోయింది.....ఛీ.... నిన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదినట్లే.... ఇప్పుడెళ్ళి ఆ సుశీల్ కుమార్ కి, దశరధకి చెప్పు..... వాళ్ళేం ఉద్ధరించగలరో తెలుస్తుంది" అంటూ నందినికేసి ఛీత్కారంగా చూస్తూ అప్పుడే అటుగా వెళ్తున్న ఖాళీ ఆటో ఎక్కి వెళ్ళిపోయాడు ప్రశాంత్.

    నందిని గుండె భగ్గుమంది.

    ఎంత అవమానం....? ఐదు నిముషాలని, పావుగంటని చెప్పి తాము చేసేది చేసుకుపోయారు...నందిని మండిపోతూ ఆవేశంగా ఆటో ఎక్కి దశరధ ఇంటి అడ్రస్ చెప్పింది.


                                           *    *    *

   
    "ఇప్పుడు చెప్పండి.... కుడితిలో పడిందెవరు....? అలా పడిన ఎలుకవరివి....? మీవేగా....?  శెభాష్.... శెభాష్.....పౌరుషమంటే అది - ఆత్మాభిమానం అంటే అది - వీళ్ళతో తీసిన ఫిల్మ్ ని కాల్చవతల పడేసుంటారు..... ఇంకెప్పుడు రేఖలా  ఫోజు లెట్టకండి - అది  రేఖకే చెల్లు.... మీలాంటి చెల్లుకాని ఆర్టిస్టులక్కాదు..." బ్రహ్మానందం నందినికేసి ఛీత్కారంగా చూస్తూ అన్నాడు.

    "డబ్బులడిగితే సీరియల్ లోంచి తీసిపడేస్తారా.....? ఎంత పొగరు....? ఎంత అహంభావం....? ఈ ఇష్యూని దూరదర్శన్ వాళ్ళ  దృష్టికి తెస్తాను..." దశరథ మండిపడుతూ అన్నాడు.

    "మీలాగా దూరదర్శన్ లో పనిచేసే అందరూ చెడిపోలేదు ఒకళ్ళిద్దరయినా మంచివాళ్లున్నా రక్కడ, వెళ్ళి చెప్పండి- మెడబట్టి బయటకు గెంటేస్తారు. ఎవరితో తీస్తే వాళ్ళకెందుకు? వాళ్ళకు కావాల్సింది క్వాలిటీ ఈమె గురించే అన్నారనుకోండి. నోరు, చెవులు మూసుకొని వెళ్ళిన దారినే  వెనక్కి తిరగాల్సి ఉంటుంది - అనవసరంగా అల్లరి చేయకండి - మీరు  అల్లరిపాలు కాకండి" బ్రహ్మనందం చిరాకుపడిపోతూ అన్నాడు.

    దశరధ మీద బ్రహ్మానందం లాజిక్ బాగా పనిచేసింది. బ్రహ్మానందం అన్నట్లుగానే దూరదర్శన్ లో కొందరు నిజాయితీపరులున్నారు. అందరిలా వాళ్లు తను చెప్పిన ప్రతిదానికీ తలూపరు- అవినీతిపనులంటే మండిపడతారు..... కనుక ఆ రూటులో వెళ్ళి ప్రయోజనం లేదు- "టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఈ ఇష్యూని రెయిజ్ చేయిస్తా...." దశరధ ప్లేట్ ఫిరాయిస్తూ అన్నాడు.

    "ఆ అసోసియేషన్ మాట వినాలని రూలెక్కడాలేదే....? అదేమన్నా గవర్నమెంట్  బాడీనా.....? రాజ్యంగం నిర్దేసించిన అసోసియేషనా....? ఇరువర్గాలు వింటేనే ఏ అసోసియేషన్ కైనా విలువా, గౌరవం...."

    "అసోసియేషన్ మధ్యవర్తిత్వాన్ని అంగీకరించకపోతే.... అది ఊరుకుంటుందా....?"

    "ఊరుకోకపోతే ఉరేసుకుంటుంది. అంతేగా?"

    "అందులో సభ్యులయిన టీవీ ఆర్టిస్టులు హంపీ సీరియల్స్ లో నటించరు."

    "హంపీ కొంపమునుగుతుందా....? అందులో సభ్యులయిన ఆర్టిస్టుల తోటే టీవీ సీరియల్స్ తీయాలని రూలేమన్నా ఉందా....? లేదే....? మరి.....?" బ్రహ్మనందం కనుబొమల్ని ఎగురవేస్తూ అడిగాడు.

    దశరథ నోరుపెగల్లేదు బ్రహ్మానందం రీజనింగ్ కి.

    "ఈ అవమానాన్ని ఎలా దిగమ్రింగుకోవాలి....?" నందిని నిష్టూరంగా అంది.

    "ఎన్నింటినో దిగమ్రింగుకున్నదానివి - నీకిదో లెఖ్ఖా....? అందులో ఇదొకటి....వేషాలు వేయటం మానేసి మిరపకాయ బజ్జీలకొట్టు పెట్టుకో కనీసం తెలుసు టీవీప్రేక్షకులు కంటినిండా నిద్రయినాపోతారు"

    "వాళ్ళనంత తేలిగ్గా వదలను" దశరథ కోపంగా అన్నాడు.

    "అవును వదలకూడదు - అసలింతకు హంపీ సీరియల్ లో కొత్త హీరో, హీరోయిన్స్ గా ఏక్టుచేస్తున్న ఆర్టిస్టులెవరు.....? వాళ్ళను లొంగదీసుకుంటే సరే....." నందిని సాలోచనగా అంది.

    "మాతల్లే.... శకుని అంశ కొంత - పాకిస్థాన్ అంశ కొంత మనలో బాగా పాతుకుపొయ్యాయి. రెండు మూడుసార్లు మక్కెలు ఇరగ్గొట్టినా ఆ పాకిస్థానీ వెధవలకు బుద్ధిరాలేదు - అలాగే నీకు..... ఛీ...... ఛీ.....నిన్ను, ఆ పాకిస్తానీ దౌర్భాగ్యుల్ని ఎవరూ బాగుచేయలేరు....." బ్రహ్మానందం విసుక్కుంటూ లేచి లోపలకు వెళ్ళిపోయాడు.

    "వీడెవడండీ బాబు..... మెదడు తినేస్తాడు....." వెళ్తున్న బ్రహ్మానందం కేసి చూస్తూ అంది నందిని.

    "అమ్మమ్మ.... వాడినేం అనకు- వాడు మనలాంటి వాళ్ళకు ఆత్మసాక్షి లాంటివాడు- విశ్వాసానికి, కృతజ్ఞతకి మారుపేరు. బయటకెళ్ళినప్పుడు చూడు- నామీద ఈగవాలనివ్వడు- మనం చేసే చెడుపనులకు స్పీడ్ బ్రేక్ లాంటివాడు. వాడులేకుంటే మనం లక్షతప్పుల్ని ఎప్పుడో పూర్తిచేసి నామరూపాలు లేకుండా మట్టిగొట్టుకు పోయేవాళ్ళం. వాడిసంగతి వదిలేయ్- ఇప్పుడేం చేయాలి....?" దశరథ లేచి పచార్లు చేస్తూ ఆలోచించసాగాడు.

    "ఏమైనా చేయండి- నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం జరిగి తీరాలి" మొండిగా అంది నందిని.


                       *    *    *

    సమయం అర్దరాత్రి పన్నెండు పదినిముషాలు...... ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీసుకు వచ్చిన ప్రభు అర్ధరాత్రయినా ఇంటిధ్యాస లేకుండా టీవీ. వి.సి.ఆర్ ముందే కూర్చుని కేసట్స్ తో కుస్తీపట్లు పడుతున్నాడు.

    ఓ ప్రక్క నోట్స్ రాసుకుంటూ, మరో ప్రక్క టీ.వీ చూస్తూ తన అసిస్టెంట్ కి మధ్య మధ్యలో ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు.

    "మరోసారి ఆ కేసట్ ప్లే చేయ్" అన్నాడు ఫ్లాస్కలోని టీని కప్పులోకి పంపుకుంటూ.

    ఎస్ . ఐ గోవా కేసట్ ని రివైండ్ చేసి ప్లే బటన్ ని ప్రెస్ చేసాడు.

    గోవా సముద్రపు ఒడ్డు అందాలు టీ.వీ తెరపై కదిలిపోతున్నాయి. వానచినుకు..... కొబ్బరి ఆకు....బంగారపు ఇసుకతిన్నెలు....కెమేరా ఆకాశాని కేసి టిల్ట్ అయి రికార్డ్ చేసుకున్న నీలితెర....క్రమంగా కెమేరా డౌన్ కి టిల్ట్ అయి రెండు వంగిన కొబ్బరిచెట్లను ఆబ్ జెక్టుగా తీసుకుంది.

    కెమేరా జూమ్ క్రమంగా ముందుకెళ్ళినట్లుగా ఆ రెండు కొబ్బరి  చెట్లు టీ.వీ తెరపై క్రమంగా దగ్గరకాసాగాయి.

    నైలాన్ ఉయ్యాల.....బహమాన్ ఎట్మాస్ పియర్.....మనోహరమైన దృశ్యం......చూట్టానికి రెండు కళ్ళు చాలటంలేదు.....క్రమంగా ఉయ్యాలలోని యువతి, ఆమె పైకి వంగుతున్న యువకుడి రూపాలు దగ్గరకాసాగాయి.

    ప్రభు తనచేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్ ఫాజ్ బటన్ నొక్కాడు. సముద్రం వేపుకు తలపెట్టుకొని పడుకొని ఉందా యువతి.....

    "సీ...... ఆమెతల సముద్రం వేపుకి ఉంది కదా....? అంటే వెస్ట్ కి తలపెట్టి  ఈస్ట్ కి కాళ్లుపెట్టి పడుకున్నట్లేగా....?" ప్రభు ఏదో ఆలోచిస్తూ అన్నాడు.

    'అవును సార్....' ఎస్.ఐ వినయంగా సమాధానం ఇచ్చాడు.

    'అతను ఉయ్యాలకు ఆవలివేపు నున్నాడు. అవునా...?"

    'అవును సార్'

    "అతనామె మీదకు వంగుతున్నాడు-అంటే అతని శరీరంలోని ఏ భాగం మన వేపుకి ఉంటుంది....?

    'ఎడం వేపు.....సార్'

    'వెరీగుడ్..... మనకు కావల్సింది కూడా ఆ భాగమే' అంటూ ఒక్కో ఫ్రేమ్ ని ముందుకు పోనివ్వసాగాడు ప్రభు.... ఏదో చిన్న క్లూ అయినా దొరుకుతుందన్న ఆశాభావం ప్రభుని ఎగ్జైట్ మెంట్ కి గురిచేస్తోంది...

    ఎస్.ఐ ఊపిరిబిగపట్టి టీవీ స్క్రీన్ కేసి చూస్తుండగా ప్రభు ఒక ఫ్రేమ్ ని తెరమీద స్టే చేసాడు.

    ప్రక్కనే ఉన్న మేగ్నిఫైయింగ్ గ్లాసెస్ తీసుకొని కళ్ళకు ధరించాడు.

    కొద్దిక్షణాల తరువాత ప్రభు భృకుటి ముడిపడింది.
   
        అ....ను....మా....నం
        ఇంకా....ఇంకా....పరీక్షగా చూసాడు....

    అతనిలో వేగంగా ప్రసరిస్తున్న రక్తప్రవాహం క్లాట్ అయినట్లు..... రైలింజన్ లా కొట్టుకొంటున్న గుండె క్షణకాలం ఆగిపోయినట్లు..... నిరాశ చివరి అంచుల్లో గొప్ప భవిష్యత్ కి దారి చూపే ఆధారం చేతికందినట్లు.... తన వృత్తికి తాను న్యాయం చేసినట్లు..... ఎంతో కాలంగా వీక్ గా  నిర్దిష్టమైన ఆధారమూ లేకుండా  చేసిన పరిశోధనకు స్ట్రాంగ్ బేస్ దొరికినట్లుగా క్షణకాలంలో ఫీలయ్యాడు ప్రభు.....

    ఎడం చెవి క్రింది భాగంలో కందిగింజంత పులిపిరికాయ..... యాదృచ్చికమేమీ కాదు.... నూటికి నూరు శాతం ఖచ్చితమైన ఆధారం..... సైంటిఫిక్ రీజనింగ్ చివర లభించే గొప్ప ఫలితం....హేతుబద్ధమైన శోధన చివర లభించే పటిష్టమైన ఆధారం....

    ప్రభుచేతులు సోఫా హేంద్ రెస్ట్స్ మీద బిగుసుకున్నాయి.... కళ్ళు రెప్పవేయటం ఆగిపోయింది.

    "నా అనుమానం నిజమైంది.....చిట్టచివరకు ఒక ఒడ్డుకుచేరాం..... జయధీర్ ఢిల్లీ నుంచి గోవా వెళ్ళాడు- హైదరాబాద్ వచ్చినట్లు రుజువు చేయగలిగితే చాలు...." ఆనందోద్వేగంతో అన్నాడు ప్రభు.

    ఎస్.ఐ గగుర్పాటుకి లోనయ్యాడు.....ప్రభు మొండితనానికి పట్టుదలకు అచ్చెరువందాడు.

    ఎంత గొప్ప తెలివిగల నేరస్థుడైనా తనకు తెలిసో....తెలియకో....చిన్న ఆధారాన్ని మిస్ దూసుకుంటాడు.....నేరస్థుడు జాగ్రత్తపడుతూ దొరక్కుండా చేసే క్లూస్ మాత్రమే అతన్ని రక్షించలేవు - వాటిని వదిలేసి మిగతా వాటి గురించి ఆలోచించే దగ్గరే నేరపరిశోధకులు తమ పరిశోధనకు ఊపిరి పోసుకుంటారు.

    ప్రభు టీవీని ఆఫ్ చేసి నోట్స్ రాసుకోవటం ప్రారంభించాడు ఉత్సాహంగా.

    ఒక పోలీసాఫీసర్ ఎంతో పట్టుదలతో, కసితో తన దిక్కుకేసే వేగంగా, కన్ స్ట్రక్టివ్ గా దూసుకువస్తున్నట్లు ఊహించని జయధీర్, హొమ్ మినిస్టర్ ఇస్తున్న ఖరీదైన పార్టీతో పీకలవరకు తాగి ఆనందశిఖరాల అంచులకు చేరుకుంటున్నాడు- వ్యక్తిగత జీవితంలో ఏ బలహీనతలూ లేని నేరస్థులు చాలా అరుదు.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra