Home » Yandamuri veerendranath » అంకితం


    అతడి కళ్ళముందే నేనీ విషం మింగుతాను. అప్పుడేం చేస్తాడు అతడు?
   
    అతడో సాడిస్టు. సాడిస్టుల సైకాలజీ భయంకరంగా వుంటుంది. అందులో తర్కం కూడా వుండదు. ఎప్పుడు ఏవిధంగా ప్రవర్తిస్తాడో ఎవరికీ తెలీదు. అందులోనూ కృపానంద్ భయంకరమైన సాడిస్టు.

    అతడు అరుంధతిని నగ్నంగా నిలబెట్టినా, కిడ్నీలు వొలుస్తానని బెదిరించినా- అది నామీద పగ తీర్చుకోవటం కోసమే! నేనే మరణిస్తే-?

    ఏం చేస్తాడు అతడు? ఎవరి మీద పగతీర్చుకుంటాడు?

    ఒకవేళ అతడు నా కళ్ళముందే అరుంధతిని చంపేసినా అందువల్ల వచ్చే నష్టమేమీ లేదు.

    అంకిత్ కోసం మేమిద్దరం ఆ త్యాగానికెప్పుడో సిద్ధపడ్డాం. ఒక రకంగా చెప్పాలంటే- ఈ నరకానికన్నా అదే మేలు!!!

    ఈ విధంగా ఆలోచిస్తూ కారుని కొండదగ్గిర మలుపు తిప్పాను.  పెజర్ లో "ట్రింగ్, ట్రింగ్" మని చప్పుడు వచ్చింది. తీసి చూసాను.

    "మూడవ క్రాస్ రోడ్డులో కుడివేపు తిరుగు" అని ఉంది.

    ఇక అక్కడనుంచి ప్రతి రెండు నిముశాలకీ ఒక మెసేజ్ రావటం ప్రారంభించింది. ఆ సూచనలని అనుసరించి నేను ముందుకు సాగాను. కృపానంద్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అనిపించింది. అయితే, అతడు ఎంత ఆలస్యంచేస్తే అంత మంచిది. అక్కడ ఆపరేషన్ పూర్తి అయిపోతుంది.

    అందుకే నేనేమీ తొందరపడలేదు. నెమ్మదిగా కారు డ్రయివ్ చేసుకుంటూ అతడు సూచించిన "ఆఖరి మజిలీ" చేరుకున్నాను. ఐదంతస్థుల భవనం అది.

    కారు ఆపాను.

    లిప్టు ఎక్కాను.

    చివరి అంతస్థు చేరుకున్నాను. బహుశా అతడు అక్కడినుంచి కిటికీగుండా చూస్తూ, నా వెనుక ఎవరయినా వస్తున్నారేమో అని గమనిస్తూ వుండి వుంటాడనుకుంటాను. అందుకే ఆ ప్లాట్ లోకి ప్రవేశించగానే....

    "సుమ ఏది?" అనడిగాడు.

    "అరుంధతి ఏది?" తిరుగు ప్రశ్న వేసాను.

    "ఎదురు సమాధానం కాదు కావల్సింది" కటువుగా అన్నాడు.

    అప్పుడు చూసాను అతడిచేతిలోని పిస్టల్ ని. అయినా అది నన్ను అంతగా బాధపెట్టలేదు. అన్నీ తెగించినవాడికి భయమేముంటుంది?

    "చెప్పు! నా భార్య ఎక్కడుంది?"

    "అదే ప్రశ్న నేనూ అడుగుతున్నాను" అన్నాడు.

    అయిపోయింది! ఇక ఆఖరి అంకానికి తెరతీసే సమయం ఆసన్నమయింది.. "నీ భార్యని నేను తీసుకురాలేదు" అన్నాను.

    అతను దగ్గిరగా వచ్చి నా చెంపమీద ఫెడీల్మని కొట్టాడు. చాలా గట్టిగా తగిలిందా దెబ్బ. కష్టంమీద నిభాయించుకుని, అనునయంగా అన్నాను...... "చూడూ.......ఎటువంటి పరిస్థితుల్లోనైనా అంకిత్ ని రక్షించుకోవాలనే నిర్ణయంతో వచ్చాను నేను. అందుకే అతడి కన్నతల్లిని అక్కడే ఉంచేసి బయలుదేరాను. డానికి ప్రతీకారంగా నువ్వు నాకే శిక్షవేసినా ఫర్వాలేదు. అయితే నా భార్య కిడ్నీస్ చిద్రం చేయటంద్వారా నువ్వు సాధించేదేమీ లేదు. కేవలం నన్ను హింసించటానికే నువ్వాపని చేయదల్చుకుంటే అది కూడా చెయ్యలేవు. ఎందుకంటే-నీ కళ్ళముందే నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను."

    చెప్పటం క్షణం ఆపాను.

    అతడు తెల్లబోయి చూసాడు. నేను చెప్పింది అర్థంకావటానికి అతడికి కొంచెం సేపు పట్టింది. అతడి మొహంలో క్రమక్రమంగా మార్పు వచ్చి తెల్లగా పాలిపోయింది.

    గెల్చాను! ఆఖరివిజయం నాదే! ఇన్నాళ్ళూ అతడి చేతిలో వోడిపోతూ వచ్చాను. ఇప్పుడిక ఏ చివరిక్షణంలో నేను ఓడి గెల్చాను.

    అతడి ఓటమి అతడి మొహంలోనే ప్రతిబింబిస్తోంది.

    తెల్లబోయి చూస్తున్నాను.

    నేనిలా నా జీవితాన్ని ఫణంగా పెట్టి గెలుస్తానని వూహించి ఉండడు అయితే ఈ "తాత్కాలిక విజయ శిఖరం మీద నేను ఎక్కువసేపు ఉండదల్చుకోలేదు. వీలయితే అరుంధతి బ్రతికేలా చేయటం నా ఉద్దేశ్యం. అందుకే బ్రతిమాలుతున్నట్టు అన్నాను........ "నేనెలాగు మరణించబోతున్నాను కాబట్టి నా భార్యని వదిలిపెట్టు. ఆ అమాయకురాలికి మనిద్దరి మధ్యనున్న గొడవల్తో ఏ సంబంధమూ లేదు."

    అతడు నావేపు సాలోచనగా చూస్తూ-"....... అంతేనంటావా?" అనడిగాడు.

    చాలు!

    ఆమాత్రం వెసులుబాటు చూపిస్తే నేను సాధించుకోగలను.

    "అవును" అన్నాను. "నీక్కావాల్సింది నా ప్రాణం! లేదా నేను బెదిరింపులకి భయపడి అంకిత్ ఆపరేషన్ ఆపుచేయటం!!! రెండోది ఎలాగూ జరగలేదు. మొదటిది అమలుజరుపు. నా ప్రాణాలు తీసుకో! అరుంధతిని వదులు. ఎందువలనంటే, ఒకవేళ నువ్వు అరుంధతి కిడ్నీలు తొలగించి హత్యచేసినా, నాతో ఆ విషయం చెప్పి ఆనందం పంచుకోవటానికి నేనుండను" అంటూ విషంతీసి చూపించాను. అతడు దాన్ని చేతుల్లోకి తీసుకుని పరీక్షగా  చూసాడు. అది విషమేనని నిర్ధారించుకున్నాక, ఒక కాగితం నా ముందుకు తోసి "నీది ఆత్మహత్య అనీ, నీ కొడుకుస్థితి చూడలేక ఆత్మహత్య చేసుకుంటున్నాననీ ఈ పేపరుమీద వ్రాయి" అన్నాడు.

    "అరుంధతికీ, అంకిత్ కీ ఏ హానీ తలపెట్టవనే షరతుమీద....."

    "ఓ.కే!"

    నేను సంతకం పెట్టాను.

    "విషం పుచ్చుకో" కామ్ గా అన్నాడు. అతడి కంఠంలో ఏ భావమూ లేదు.

    నేనతడి మొహంలోకి ఓ క్షణం సూటిగా చూసి విషం నోట్లో వేసుకున్నాను.

    "ఎంతసేపటికి నీ ప్రాణం పోతుంది?" ఓ మెడికల్ విద్యార్థి తన ప్రొఫెసర్ ని అడిగినట్టు- ఉత్సుకతతో అడిగాడు.

    "పావుగంట పట్టవచ్చుననుకుంటాను."

    "గిలగిలా కొట్టుకుంటావా?"

    అతడి సాడిజానికి బాగా కోపం వచ్చింది. తమాయించుకున్నాను. "ఈ విషం ఊపిరితిత్తుల మీదే డైరెక్ట్ గా పనిచేస్తుంది. గుండె ఆగి మరణం సంభవిస్తుందని చదివాను. ఇక ఈ వివరాలు చాలు. అరుంధతిని వదిలిపెట్టు!"

    అతడు కాలుమీద కాలు వేసుకుని స్థిమితంగా కూర్చుంటూ అన్నాడు. "వదిలిపెట్టననుకో- ఏం చేస్తావ్?"

    అప్పటికే విషం తన ప్రభావాన్ని చూపిస్తోంది. కానీ అంతకన్నా ఎక్కువగా అతడి మాటలు!! అప్పటికీ కంట్రోల్ లోనే నన్ను నేను ఉంచుకోవటానికి ప్రయత్నించాను. "...........నేను మరణించాక నా భార్య పిల్లలమీద నీకు శత్రుత్వం ఏమీ ఉండదనుకున్నాంగా."

    "సో....."గట్టిగా నవ్వేడు. "........అంకిత్ నీ కొడుకు అని వప్పుకుంటున్నావన్న మాట. అదే నాక్కావల్సింది. ఇప్పుడు అసలు విషయం చెపుతాను విను. నీ భార్య నా దగ్గిరలేదు."

    పక్కన బాంబు పడ్డట్టు ఉలిక్కిపడ్డాను. "....మరి?" అన్నాను.

    "నిన్ను పోలీసులు అరెస్టు చేసారని చెప్పాను. ఆవిడ ప్రస్తుతం ఆ పోలీస్ స్టేషన్ ల చుట్టూ తిరుగుతూ వుండి వుంటుంది. ఫోన్ లో నువ్వు విన్న స్త్రీ కంఠం నాదే!!.... ఎలా వుంది నా ప్లాన్? నిన్ను భలే ఫూల్ చేసాను కదూ. ఆత్మహత్య ఉత్తరంకూడా వ్రాయించి చంపేస్తున్నాను."

    ......నిజంగానే నన్ను ఫూల్ ని చేసాడు. అయితే ఇది నాకు చాలా సంతోషంగాకూడా అనిపించింది. నేను ఛస్తే చావనీ. అరుంధతి వీడి చేతిలో అవమానంపాలు కాలేదు. అది చాలు! మరణంకూడా ఇప్పుడు నన్ను బాధ పెట్టటంలేదు. నా భార్య కొడుకు క్షేమంగా వున్నారు.

    ఆ ఆలోచన కలిగాక నాకు ఎక్కడలేని ఆనందమూ వేసింది. అతడినీ ఏడిపించాలనుకున్నాను.

    "థాంక్స్ కృపానంద్. ఇప్పుడు అసలు విషయం నేనూ చెపుతాను విను. నేను తీసుకున్నది విషంకాదు. ఎలా వుంది నా ప్లాన్?" అంటూ నవ్వేను.

    అప్పుడు జరిగింది ఆ సంఘటన.

    నేను కలలో కూడా వూహించనిది.

    మెరుపువేగంతో కృపానంద్ పిస్టల్ తీసి, క్షణంకూడా ఆలస్యం చేయకుండా వరుసగా మూడుసార్లు పేల్చాడు. నేను అతడిని ఏడిపించటానికి చెప్పిన చిన్న అబద్ధం అతడిని దాదాపు పిచ్చివాడిని చేసి వుంటుంది. ఆ వెర్రి కోపంతో అతడు మదమెక్కిన గజంలా తోచాడు. మొహమంతా వికృతంగా తయారయింది. అందమైన పొరలు తొలగించిన వికృతమైన మొహం! అసలు సిసలైన సాడిజం!! నాకు మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. ఇంతకాలం అతడు నన్ను పెట్టిన చిత్రవధకి పాటు అతడిని ఫూల్ ని చేయగలిగాను. అది చాలు. విషం వలన ఛస్తే ఏం? పిస్టల్ గుళ్ళ వల్ల ఛస్తేనేం.....? బహుశ ఆ సంతోషమే నాకు  ఎక్కడలేని చురుకుదనాన్ని సంపాదించి పెట్టి వుంటుంది. చురుగ్గా పక్కకి తప్పుకున్నాను. ఒక బుల్లెట్ నా చెవి పక్కనుంచీ, మరొకటి మెడ పక్కనుంచీ ఇలా వరసగా పిస్తోలుగుళ్ళు సాగటం తెలుస్తోంది. ఇదంతా రెప్పపాటుకాలంలో జరిగింది. పిస్తోలు చప్పుళ్ళతో గది ప్రతిధ్వనించింది. ఆ ధ్వనులతోపాటు ఒక ఆర్తనాదం కూడా కలిసిపోయింది. ఆ ఆర్తనాదం నా వెనకనుంచి వచ్చింది.

    విభ్రాంతుడనై వెనుదిరిగాను. నేను ఖాళీచేసిన ప్రదేశంలోకి గుమ్మంలోంచి ప్రవేశిస్తూన్న జాన్ డేవిడ్ స్వరం అది.

    నేను చూసేసరికి అతడు ఛాతీ పట్టుకుని కూలిపోయాడు.

    నెమ్మదిగా అతడిచుట్టూ రక్తపు మడుగు ఏర్పడసాగింది. అతడి దగ్గరకు వెళ్ళాలనుకున్నాను. అశక్తుడనై కూలిపోయాను. నాలోనూ విషప్రభావం ఉధృతమైంది.

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra