Home » Dr c. ananda ramam » Tapasvi

 

    శంశాంక, మిసెస్ కామేశ్వరీ దేవి ఇద్దరూ ఒక్కసారిగా అన్నారు. ధ్వనిలో భేదం లేకపోలేదు.
    సౌందర్య అర్ధమవుతున్నట్లు చూసింది.
    మిసెస్ కామేశ్వరీ దేవి వెటకారంగా నవ్వుతూ "ఒకే. నీ మనసు కుసుమ మీదకు పోయిందన్నమాట!' అంది.
    "నా మనసు ఆవిడా మీదకు పొతే మా ఇంటికి తీసుకెళ్ళేవాడిని. హాస్పిటల్ కు దేనికి?"
    "ఏదయితేనేం?"
    "మన హాస్పిటల్ అలాంటిదని.... అలా నడుస్తుందని మీకు రూడీగా తెలుసా? ఎందుకు ఊరుకున్నారు మరి?"
    మరోసారి ముడుచుకుపోయిన మిసెస్ కామేశ్వరీ దేవి అతి త్వరలోనే కోలుకొని "వీల్లేదు. కుసుమ లాంటి వ్యక్తుల్ని హాస్పిటల్ లోకి తీసుకురావటానికి ఒప్పుకోలేను!" అంది.
    "కుసుమ నర్స్ గా చాలా సమర్ధురాలు. అలాంటి వాళ్ళను తీసుకోకపోవటంలో అర్ధం లేదు."
    "కానీ, కుసుమ చెడిపోయిన వ్యక్తీ."
    సౌందర్య కల్పించుకుంది.
    "మీరు పతిత స్త్రీ జనోద్దరణ సంఘం నడిపిస్తున్నారు కదా!"
    'అయితే?"
    "ఏం లేదు, ఊరికే గుర్తుకొచ్చి అడిగాను."
    "పతితల పట్ల నాకు జాలి ఉంది. వాటిని ఉద్దరించాలనే ఆశయమూ ఉంది. కానీ అంత మాత్రం చేత హాస్పిటల్ వాతావరణం పాడు చెయ్యనివ్వను." గట్టిగా అంది కామేశ్వరీదేవి.
    ఈ సమయంలో శశాంక కూడా కల్పించుకున్నాడు.
    "విక్రమ్! కుసుమ మీద జాలి ఉంటే మరొక రకంగా సహాయం చెయ్యవచ్చు. అంతే కాని మన హాస్పిటల్ లో నర్స్ గా ఉంచుకోవటం మంచిది కాదేమో!"
    విక్రమ్ చికాకుపడ్డాడు.
    "మీరంతా ఏ భాష మాట్లాడుతున్నారో నాకేమీ అర్ధం కావటం లేదు. జాలి ఏమిటి? సహాయం ఏమిటి? ఉద్దరించటం ఏమిటి? ఒకరు మరొకరిని ఎలా ఉద్దరించగలరు? మన హాస్పిటల్ లో ప్రస్తుతం ఉన్న నర్స్ లెవరూ నాకు నచ్చలేదు. అందుకని కుసుమను వేసుకోవాలనుకుంటున్నాను."
    "కుసుమ నచ్చిందన్నమాట!"
    ఆ వ్యంగ్య వాగ్బాణం విక్రమ్ వజ్ర హృదయానికి డీ కొని మొక్కపోయింది.
    "అవును, నర్స్ గా కుసుమకు సాటిరాగల వాళ్ళెవరూ ఉండరు!"
    కామేశ్వరీ దేవి క్షణక్షణానికి రగులుకుపోతోంది.
    "నాన్సెన్స్! కుసుమను తీసుకోవటం అసంభవం!" అంది దృడంగా.
    విక్రమ్ శశాంక వైపు తిరిగాడు.
    "శంశాక గారూ! మనం నిజంగానే రోగుల క్షేమం కోరితే..... ఒకనాడు నాతొ మీరన్న మాటలు నిజమయితే .... మీరు దేనిని సాధించాలనుకున్నారో అది ఉన్నదనే నమ్మకం రూడిగా మీకు కలిగితే ... కుసుమను తీసుకోండి!"
    శశాంక ఒక్క క్షణం కూడా సందేహించలేదు.
    "అల్ రైట్! త్వరలోనే కుసుమకు అపాయింట్ మెంట్ ఆర్డర్ అందేలా చూస్తాను."
    "శశాంకగారూ!' గర్జించింది మిసెస్ కామేశ్వరీ దేవి.
    "నెమ్మదిగా మాట్లాడండి! నాకు చెవుడు లేదు!" స్థిమితంగా అన్నాడు శశాంక.
    "నా మీదకే కత్తి కడుతున్నారా?"
    "లేదే! నాకు మీ మీద కక్ష దేనికి?"
    "ఇదంతా ఏమిటి మరి?"
    "ఎవరు ఉండవలసిన స్థానంలో వాళ్ళను ఉంచటం మీ మీద కక్ష కట్టడం అవుతుందా?"
    'అలాగా! గుడ్! త్వరలోనే మీరు ఉండవలసిన స్థానంలో మీరు చేరుకుందురు గాని."
    "బెదిరిస్తున్నారా?" చిరునవ్వుతో అడిగాడు శశాంక.
    "కాదు హెచ్చరిస్తున్నాను. ఇన్నాళ్ళుగా స్నేహితులం గనుక."
    "థాంక్స్! ఇప్పటికీ నేను మీకు స్నేహితుడ్నే! విష్ యు బెస్ట్ ఆఫ్ లక్!"
    మిసెస్ కామేశ్వరీదేవి నిగ్రహించుకోలేకపోయింది. చటాలున లేచి వెళ్ళిపోయింది.
    శశాంక విక్రం ను చూసి అర్ధవంతంగా నవ్వాడు.
    విక్రమ్ ఒక్క క్షణం తటపటాయించి "మీకు కుసుమను తీసుకోవాలని లేకపోతే మిమ్మల్ని బ్రతిమాలను -- బలవంతపెట్టను ఆలోచించుకోండి ." అన్నాడు.
    "నా ఆలోచనలన్నీ నిన్ను తిరిగి తీసుకోవటానికి ముందే అయిపోయాయి.ఇప్పుడు ఆలోచించవలసిన అవసరమేమీ లేదు!"
    శశాంక అక్కడి నుండి వెళ్ళేవరకూ ఎలాగో ఓపిక పట్టిన సౌందర్య అతడు వెళ్ళగానే విక్రమ్ ముందు మోకరిల్లింది.
    విక్రమ్ తొట్రుపడి "ఛ! ఛ! ఇదేమిటి? సర్వస్వతంత్రురాలివి. మరొకరి ముందు మోకరిల్లటమేమిటి?" అన్నాడు.
    సౌందర్య లేవలేదు. ఒక విధమయిన తన్మయత్వంతో విక్రం ను చూస్తూ అంది.
    "నా ఉనికిని అర్ధవంతం చెయ్యగలిగే మూర్తి ముందు మోకరిల్లుతున్నాను! మరొకరి ముందు కాదు."
    

                                                              28


    కుసుమను తిరిగి హాస్పిటల్ లోకి తీసుకోవటం పెద్ద దుమారం లేవదీసింది . హాస్పిటల్ లో నర్సులు, డాక్టర్లు, బయటి జనం.... అందరూ ఎదురు తిరిగారు.
    అంతవరకు అటు శశాంక, ఇటు కామేశ్వరీ దేవి , ఇంకా మరి కొన్ని ప్రభుత్వ సంస్థలలోనూ జోక్యం కలిగించుకుని అర్హతల విషయం కాని, ఉచితానుచితాలుకాని ఆలోచించకుండా తమకు ఇష్టం వచ్చిన వాళ్ళను ఉద్యోగాలలో ప్రవేశపెట్టడం అందరికీ తెలుసు. అది న్యాయమని అందరూ అనుకున్నారు. అశక్తత వల్ల కొంతా, అలసట వల్ల కొంతా ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడందరూ ఒక్కసారిగా ఎదురు తిరిగారు. శశాంక దుర్మార్గాలను వివరిస్తూ వ్యాఖ్యానిస్తూ వెక్కిరిస్తూ పత్రికలలో వ్యాసాలు రాసాగాయి. కొందరు శశాంకను ముఖం ఎదురుగానే చీదరించుకున్నారు. విక్రంను గురించిన ప్రచారాలకు లెక్కలేదు.
    "ఇదివరలో ఇతని నిర్లక్ష్యం కారణంగానే ఒక రోగి ప్రాణాలు పోయాయి. ఇప్పుడు ఒక చెడి పోయినదాన్ని ఏరికోరి తెచ్చి హాస్పిటల్లో ఉంచుకున్నాడు."
    "హాస్పిటల్ ను బ్రోతల్ హౌస్ గా మార్చాలనుకుంటున్నారు" లాంటి నిందా వాక్యాలు విక్రం ఎటు తిరిగినా వినిపిస్తున్నాయి.
    అటు కామేశ్వరీదేవికి, ఇటు శశాంకకూ కావలసిన "పెద్ద మనుష్యులు" కొందరు ఈ పరిస్థితికి కలవరపడ్డారు.
    ఈ ప్రచారం మరింత వ్యాపించడానికి శాయశక్తుల సహాయపడుతూ లోలోపల ఎంతో ఆనందిస్తున్న కామేశ్వరీ దేవి ఆ పెద్ద మనుష్యులతో విషాదస్వరాన అంది.
    "నన్నేం చెయ్యమంటారు చెప్పండి? శశాంకగారితో శతవిధాల చెప్పాను. అయన వింటేనా? అంతగా కుసుమ మీద జాలి ఉంటే నా పతిత జనోద్దరణ సంఘంలో చేర్చుకుంటానని చెప్పాను. మనకు ఏదో పరపతి ఉంది. దానిని ఉపయోగించి మనను ఆశ్రయించినవాళ్ళకు ఏదో ఒక విధంగా సహాయం చెయ్యగలుగుతున్నాం. కానీ, ఉచ్చం, నీచం ఉండద్దా?" అంతలా బరితెగించిన దాన్ని హాస్పిటల్ లో చేర్చటమా? సిగ్గు చేటు! ఛా! మనలో ఒకరివల్ల ఇలాంటిది జరిగిందంటే తల ఎత్తుకోలేకపోతున్నాను."
    బాధగా తల వంచుకుంది మిసెస్ కామేశ్వరీదేవి..... మిగిలినవాళ్ళు కూడా తలలు దించుకున్నారు.
     శశాంకకూ, ఆ పెద్ద మనుష్యులకూ తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి.
    "మీరిలా పట్టుబట్టటం బాగుండలేదు. ఆ కుసుమను తోలగించేయ్యండి. కావాలంటే వేరే ఏదైనా ఏర్పాటు చూడండి!"
    ఇంచ్జుమించు అందరూ అదే మాట!
    శశాంక ఒక్కటే మాట మీద నిలబడ్డాడు.
    "కుసుమను నేను తొలగించను. మీరెవరైనా తొలగించాలనుకున్నా నా శక్తి నంతా వినియోగించి అడ్డు పడతాను!"
    పెద్ద మనుష్యులు కోపంతో వెళ్ళిపోయారు.
    సౌందర్య తండ్రి తల ఆప్యాయంగా నిమురుతూ "నాన్నగారూ! ఇంత పోరాటం .... తట్టుకోగలరా?" అంది ప్రేమతో.
    "చూద్దువుగాని ...." గర్వంతో అన్నాడు పైకి.
    లోలోపల అనుకున్నాడు. "రగిలే నీ కళ్ళలో ఆప్యాయత కురుస్తోంది. తీక్షణమైన నీ ముఖంలో చల్లని చిరునవ్వు మెరుస్తోంది. ఈ రెంటినీ నిలబెట్టుకోవటానికి ఏం చెయ్యలేను నేను?"
    డాక్టర్ కిరణ్ కుమార్ విక్రమ్ ను కలుసుకున్నాడు.
    "విక్రం! ఇప్పుడు నీ జీవితం స్థిరపడుతోంది. నలుగురూ నీ ప్రతిభను గుర్తిస్తున్నారు. ఇలాంటప్పుడు ఆ కుసుమ కోసం అంతా ఎందుకు నాశనం చేసుకుంటున్నావు?"
    "నాశనం చేసుకుంటున్నానా? ఏమిటి?"
    తన కోసం బాధపడుతున్న డాక్టర్ కిరణ్ కుమార్ ను గౌరవంతో మన్నిస్తూనే నిర్లక్ష్యంగా అడిగాడు విక్రం.
    "నీ భవిష్యత్తు...."
    "మీ దయ వల్ల నా లాబ్ ఉన్నంతవరకూ ....... ప్రయోగాలు చెయ్యగలిగే శక్తి నాలో సడలనంత వరకూ నా భవిష్యత్తుకు నాశనమనేది లేదు!"
    ఏమి దృడ విశ్వాసం! ఈ మనోబలానికెదురు నిలవగలిగినదేది? డాక్టర్ కిరణ్ కుమార్ మనసులో విక్రం పట్ల గౌరవం మరింత పెరుగుతోంది....
    "ఇంతమందికి ఎదురు తిరగటం మంచిదికాదేమో!"
    "నర్స్ గా సమర్దురాలయిన ఒక వ్యక్తినీ.... అర్ధం లేని మరేవేవో కారణాలతో నర్స్ గా ఉంచటానికి వీల్లెదంటున్నారు. నన్ను గుడ్డిగా వాళ్ళను అనుసరించమంటారా? క్షమించండి.... ఏ పరిస్థితుల్లోను , ఎవరినీ గుడ్డిగా అనుసరించాలేను!"
    "కానీ వాళ్ళు ఊరుకోరు!"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra