Home » D kameshwari » Kalani Venaki Tippaku

 

                                                    తల్లికి విలువ?

    "ఏమండోయ్ మీ అమ్మగారేమిటి పెట్టె బేడా సర్దేస్తుంది. ఎక్కడికన్నా వేడ్తున్నట్లు మీకేమన్నా చెప్పిందావిడ?' తాపీగా పేపరు చూస్తున్న శేషగిరి దగ్గరికి గాభరాగా వచ్చి అంది పద్మ.
    పేపరులోంచి తలెత్తి "నాకేం చెప్పలేదే! ఎక్కడికి వెళ్తుంది. అడగకపోయావా?' అన్నాడు.
    "ఏమో నాకేం తెలుసు. ఆవిడ నాకేం చెప్పలేదు. మీరెళ్ళి అడగండి. "మొహం మాడ్చుకుంటూ అంది.
    "ఏం మళ్ళీ ఇద్దరూ ఏమన్నా గొడవపడ్డారా?" భార్యవంక అసహనంగా చూశాడు.
    "ఏం వుంది చెప్పడానికి . నిన్న ఏదో మాటామాటా అనుకున్నాం. ఇదేమన్నా మాకు కొత్తా" తనని తాను సమర్ధించుకుంటూ అంది.
    "వెళ్ళి అడగండి ఆవిడ చాలా సీరియస్ గా అన్నీ సర్దేస్తుంది. మన బుజ్జి అడిగితే 'ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానురా నాన్నా' అందిట.
    ఈలోగా బుజ్జి, శ్రావణి అక్కడికి పరిగెత్తి వచ్చారు. "అమ్మా, నాన్న మామ్మ వెళ్ళిపోతుంది.' వగరుస్తూ అన్నారు.
    శేషగిరి లేవబోయే లోపలే "శేషూ నేను వేడ్తున్నానురా . ఇవాళ ఆదివారం మీరింట్లో వున్నారని, ఈరోజు పెట్టుకున్నాను ప్రయాణం."
    "ఏమిటమ్మా ఎక్కడికి ప్రయాణం. కుసుమ దగ్గరికా, అదేమన్నా నిన్ను రమ్మనమని రాసిందా. నాకు చెప్పనే లేదు నువ్వు" అన్నాడు.
    "కుసుమ దగ్గరికి కాదు , ఇకమీదట నేను ఎవరికి భారం కాకుండా నా పొట్ట కోసం తిప్పలు నేనే పడాలని నిర్ణయించుకున్నాను."
    శేషగిరి మొహం నల్లబడింది. పద్మ గిల్టీగా చూసింది. "ఏమిటమ్మా అది. ఏం జరిగిందని ఇలా అంటున్నావు. ' కాస్త కోపంగా అన్నాడు.
    "ఏం జరుగుతుంది నాయనా. ఒకరోజు భాగోతం అయితే చెప్పుకోవచ్చు. నాకూ చీము, నెత్తురూ వుంది. మానాభిమానాలున్నాయి. ఎంత మీమీద ఆధారపడి బతుకుతున్నా నాకు ఊరికే తిండి పెట్టడం లేదు. రోజంతా నడుం వంచకుండా చాకిరి చేసి వండి వార్చి, మీ అందరికి క్యారియర్లు కట్టిచ్చి, మీ పిల్లలకి అయాలా, ఈ ఇంటి కాపలా కుక్కలా పడుండి మీరోచ్చేవరకు మీ పిల్లల అల్లరి ఆగడం భరిస్తూ బతిమాలి బామాలి తినిపించి, తాగించి , చదివించి ఇదంతా నా ఇల్లనుకుని నా కొడుకుని నా మనవలనుకుని చేశాను ఏడాదిగా.
    నాయనా నీ ఇంట్లో చేసే ఈ చాకిరికి ఎవరన్నా కళ్ళ కద్దుకుని ఇంట్లో వుంచుకుని తిండి పెట్టి కనీసం ఐదొందలు ఇస్తారు. మీకు నేనేదో గుదిబండనై , ఊరికే తినిపోతున్నట్టు. భారమై ఎందుకు వుండడం బాబూ, కన్నతల్లి అన్న గౌరవం, అభిమానం లేకపోయినా మనకింత చేస్తుంది అన్న భావన మీకు లేకపోయినపుడు నేనెందుకు పడుండాలి.
    ఈ చాకిరి ఎక్కడ చేసినా నా రోజులు దివ్యంగా వెళ్ళిపోతాయి. కన్నతల్లి స్థానం నాకీ ఇంట్లో లభించనపుడు కసుర్లు, విసుర్లు తింటూ మీకు భారమై వుండరాదని నిర్ణయించుకున్నాను. నా చాకిరీకి విలువ కట్టి డబ్బిచ్చేచోట వెతుక్కుని వెడుతున్నాను" సరస్వతమ్మ స్థిరంగా అంది.
    పద్మ మొహం వివర్ణమయింది. గాభరాగా శేషగిరి వంక చూసింది. భార్య వంక అంతా నీవల్లే అనుభవించు అన్నట్లు చూసి తల్లిని అనునయిస్తున్నట్లు "ఏమిటమ్మా అత్తాకోడలు మాటామాట అనుకోడం లోకంలో కొత్తా. అంత మాత్రానికి ఇల్లు వదలి వెడతానంటావేమిటి, నీవరస బాగులేదు" కాస్త కోపంగా అన్నాడు.
    'అవున్నాయనా నా వరస బాగుండదు. కాస్త మాటలకి ఎవరూ ఇల్లోదలరు బాబూ. నాకు మనసనేది వుంది. ఏదన్నా హద్దు దాటినపుడే తెగింపు వస్తుంది. ఆఫీసుకి వెళ్ళేముందు అరటిపళ్ళు లెక్క చూసుకుంటుంది. పాలగిన్నే చూసుకుంటుంది నీ భార్య. నేనేదో ఇంట్లో పడి అందినంత దోచుకుతింటున్నానని పిల్లి మీద, ఎలక మీద పెట్టి అంటుంది.
    నాదీ నోరే , నాది కడుపే ఓ పండు, ఓ లడ్డు తినే స్వాతంత్యం కూడా లేని ఈ ఇంట్లో నాకేం వుందని వుండాలి. శేషూ ఊరికే చేసే చాకిరికి విలువ వుండదు. నేను వెళ్ళాక జీతం ఇచ్చి పెట్టుకొంటే గాని నేను మీకేం చేశానో అర్ధం కాదు.
    పరాయిచోట నాకు నచ్చితే చేస్తాను లేదంటే ఇంకో ఇల్లు చూసుకొంటాను. ఓ గుడికెళ్ళాలన్నా నిన్నే డెబిరించుకుని కసిరించుకొనే బతుకు నాకు వద్దు. కష్టపడి సంపదిన్చుకుంటాను తింటాను.
    నా పిల్లలని చూసుకోవాలన్న రోజున మీ ఇళ్ళకి వచ్చి ఓ పూట వుండి వెడతాను. ఈ ఆస్వాతంత్యం బతుకుకంటే పరాయి ఇంట్లో వంటామెగా బతకడంలో నా ఆత్మగౌరవం నిలుపుకోవాలని నిర్ణయించుకున్నాను.' సరస్వతమ్మ ఖచ్చితంగా అంది.
    భార్యాభర్తలు మొహాలు చూసుకున్నారు. "కన్నకొడుకుండగా ఇక్కడ అక్కడ వంటలు చేసుకుంటావా , అందరూ మా మొహాన ఉమ్మేయాలనా, లోకం అనేది నన్నేగా' 'ఉక్రోషంగా అన్నాడు.
    "శేషూ లోకం ఏమంటుంది . ఇరుగు పొరుగు అనుకుంటే నాలుగు రోజులనుకుంటారు. ఈ రోజుల్లో ఎవరికి వారే ఎవరి గురించి పట్టించుకునే కోరిక తీరిక ఎవరికున్నాయి. లోకం కోసం నా ఆత్మాభిమానం ఇంకా బలిపెట్టి బతకను"
    'అయితే పని కూడా చూసుకున్నావన్నమాట అపుడే ఎక్కడ? ఎవరింటికెడుతున్నావు వంటమనిషిగా?" వ్యంగ్యంగా అడిగాడు.
    "ఎవరో పిల్లల తల్లి మీలాగే ఉద్యోగస్తులు, ఇద్దరు పిల్లలతో అవస్థ పడుతుంది. మీలాంటి పెద్దదిక్కు కావాలి మామ్మగారు ఎవరన్నా ఇంట్లోకి అంది. కన్నతల్లి విలువ తెలియని మీ ఇంట్లో పడుండేకంటే కన్నతల్లిలా ఆదరిస్తానన్న ఆచోట నాకు నచ్చిందని...."
    శేషగిరి భార్య వంక కోపంగా చూశాడు. ఇదంతా నీ వల్లే అనుభవించు అన్నట్టు చూశాడు. పద్మ తల దించుకుంది. శేషగిరి విసవిస గదిలోకి వెళ్ళాడు.
    "పద్మ ఇలారా" గట్టిగా పిల్చాడు.
    "వెళ్ళు....ముందెళ్ళి అమ్మకి క్షమాపణ చెప్పు. ఆవిడ ఇంట్లోంచి వెడితే ఆవిడన్నట్టు నష్టం ఆవిడకి కాదు మనకు. ఆవిడ వెడితే మన పాట్లు కుక్కలు కూడా పడవు. బుద్ది వచ్చింది గౌరవంగా చూస్తానని చెప్పు. ఇంకా కాదంటే కాళ్ళు పట్టుకో. అలా చెయ్యనంటే నీ కర్మ. ఎన్ని వందలిచ్చినా నీకిలా చాకిరి చేసే మనిషి దొరకదు." అన్నాడు.
    పద్మ అప్పటికే భయపడింది. అత్తగారు లేకుండా ఇల్లు ఎలా మానేజ్ చేయాలన్న ఆలోచనే భయం పుట్టించగా అత్తగారిని క్షమించమనడం మినహా దారి లేదన్నది ఆమెకీ తట్టింది. నల్లబడిన మొహంతో హాలులోకి వెళ్ళింది. 'అత్తయ్యా పోరపాటయింది. క్షమించండి . మీరింత కోపం తెచ్చుకుంటారని మమ్మల్ని వదిలి వెడతారని అనుకోలేదు. ఇకముందు.....' ఏదో చెప్పబోయింది.
    "వద్దమ్మా నీ క్షమాపణలు కాదు నాకు కావాల్సింది. నాకు నా సంపాదన కావాలి. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, ఎవరికి బరువు కాకుండా అన్న తృప్తి కావాలి. అయన పోయిన ఈ ఏడాదిలో నాకంటూ ఏమీ లేకుండా కొడుకు మీద ఆధారపడడం అంటే ఏమిటో అర్ధం అయింది.
    "ఉద్యోగం చేసే చదువు నాకు లేదు. నాకు వచ్చిన విద్య వంట. అది చేసుకుంటూ ఇంకా వీలయితే నలుగురి చిన్నపిల్లలకి చదువు చెప్పుకుంటూ, ఇంకా కావలిస్తే ఊరగాయలు, అప్పడాలు, అమ్ముకుంటూ నయినా నా బతుకు నేను గౌరవంగా బతకచ్చు అన్న ఆలోచనే ఈ ఇంట్లోంచే వెళ్ళగలిగే ధైర్యనిచ్చించి. నాకు కావాల్సింది జీతం ఇచ్చి పెట్టుకునే వారు కావాలి. నువ్వు ఆ జీతం ఇస్తానంటే వుంటా ... లేదంటే ఇల్లు చూసుకున్నాను.'
'    'అంటే , నీవింట్లో ఉండాలంటే మేమూ జీతం ఇవ్వాలా" అన్నాడు శేషగిరి.
    'అవును నాయనా ఊరికే చాకిరికి విలువ ఎలా ఉండదో , ఊరికే తినే తిండికీ గౌరవం ఉండదు. "తల్లివిలువ' మీలాంటి వారికి ఎలాగూ తెలియదు. కనీసం 'తల్లికి విలువ' కట్టయినా డబ్బిచ్చి రుణం తీర్చుకోండి' సరస్వతమ్మ నవ్వి అంది.
    'అంతా ఏమనుకుంటారన్న బాధ నీకులేదా?"
    "నాలాంటి తల్లులు ఇకముందు నన్ను చూసి నేర్చుకుని బాగుపడుతారు. కొడుకుల మీద ఆధారపడే తల్లులు నా సంగతి విని పాఠం నేర్చుకుంటారులే నాయనా" అదోలా నవ్వింది సరస్వతి వెళ్ళడానికి పెట్టెపట్టుకుని.
    శేషగిరి గాభరాగా ముందుకి వచ్చి పెట్టేలాగి 'అలాగే డబ్బిస్తా రా లోపలికి.'
    "ఒక నెల అడ్వాన్సు ముందుగా ఇయాలి సుమా" అన్నదామె.
    శేషగిరి, పద్మ నిస్సహాయంగా ఒకరి మొఖాలొకరు చూసుకున్నారు.

                                                            *స్వాతి మంత్లి 

google-ad-img

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuAdivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu HarshavardhanChandu SombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDr C Bhavani DeviDr C. Ananda RamamDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri ChidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeeKodavatiganti KutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala DeviKommanapalli Ganapathi RaoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy SulochanaMainanpati BhaskarMallikMandarapu LalithaManjariMerlapaka MuraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada SatyanarayanamurtyPolkampalli SanthadeviPolopragada RajyalakshmiPoranki DakshinamurtyPotthuri VijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha RamraoSaradha Ashok Vardhan SarathSaroja Sree SreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreeSreelathaSri N T Rama RaoSri Veturi Prabhakara SastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli VijayaSuryadevara Rammohan RaoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava VijayalakshmiUshasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathiVaddera ChandidasVasireddy Seeta Devi NovelsVasundharaVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri VeerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi LakshmiYerramsetti Sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book Of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaSurekha Puli - PaapaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra