Home » Yerramsetti sai » Love Stories


    "బాగానే వచ్చాయండీ!"

    "మైగాడ్! నువ్వు బి.ఎస్.సి. ఫస్ట్ క్లాసా?" నివ్వెరపోతూ అడిగారాయన. సర్టిఫికెట్లు చూసిన తరువాత.

    "అవునండీ."

    "అయినా, జాబ్ దొరకలేదా?"

    ఏమీ మాట్లాడలేదు చలపతి. ఓ నిమిషం చలపతి ముఖం వంకే చూసి అన్నింటిమీద సంతకాలు పెట్టారాయన.

    "చూడవోయ్, ప్రస్తుతం నువ్వు ఖాళీయే కదా? ఓ చిన్ని పని చేస్తావూ?"

    "ఏమిటండీ అది?" ఉత్సాహంగా అడిగాడు చలపతి.

    "మా అమ్మాయి పి.యు.సి. పరీక్షల కింకా రెండు నెల్లటైముంది. అదేమో లెఖ్ఖల్లో, ఇంగ్లీష్ లో బాగా వీక్. నీదీ లెఖ్ఖల గ్రూపే. కాబట్టి ఈ రెండు నెలలూ దానికి కోచింగ్ ఇవ్వగలవా? ఆఫ్ కోర్స్- ఊరికే కాదనుకో! ఐ విల్ పే యూ!"

    చలపతికిది బాగానే ఉందనిపించింది. రెండు నెలలూ ట్యూషన్ చెబితే తన ఖర్చులకయినా కొంత డబ్బు దొరుకుతుందని 'ఊ' కొట్టాడు.

    "వెరీగుడ్! సాయంత్రం అయిదింటికి ఇక్కడకు రా! నాతో వద్దువుగాని ఇంటికి."

    "అలాగే, సార్."

    "థాంక్యూ" అన్నారాయన.

    సాయంత్రం అయిదు గంటలకల్లా ఆఫీస్ చేరుకున్నాడు చలపతి.

    "రావోయ్, కూర్చో- పది నిమిషాల్లో బయలుదేరదాం" అని ఏవో కాగితాలు చూసుకోసాగారాయన. ఆఫీసు నుంచి బయలుదేరేసరికి అయిదున్నర అయింది. జీప్ లో పది నిమిషాలకే వాళ్ళ ఇల్లు చేరుకున్నారు.

    హల్లో సోఫా వంక చూపుతూ, "కూర్చో, అమ్మాయి వస్తుంది" అన్నారాయన.

    సోఫాలో కూలబడ్డాడు చలపతి. మరో అరగంట తరువాత ఆయన వెంటే వచ్చి నుంచుంది రెహానా.

    "పేరు రెహానా" అన్నారాయన.

    "నమస్తే!" అంది రెహానా చలపతి కళ్ళలోకి చూస్తూ. చలపతి ఆమె అందం చూసి నిశ్చేష్టుడయాడు. తెల్లగా, అజంతా విగ్రహంలాంటి శరీరపు ఒంపులతో, పెద్ద కళ్ళూ, చక్కని ముక్కూ, ఎర్రని పెదాలతో మెరిసిపోతూందామె.

    తడబడుతూ ప్రతి నమస్కారం చేశాడు. ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుని చేతిలోని పుస్తకాలు మధ్యలో ఉన్న స్టూల్ మీద ఉంచింది.

    లెఖ్ఖల పుస్తకం తీసి ఓసారి చూసి, "మీకు కష్టంగా ఉన్న ఛాప్టర్ లేవో చెప్పండి. వరుసగా చేసేద్దాం" అన్నాడు తలవంచుకొనే. ఆమె కళ్ళలోకి చూడాలంటేనే భయంగా ఉంది, ఎక్కడ తడబడిపోతాడోనని.

    ఆమె చెప్పిన ఛాప్టర్ లన్నీ గుర్తుపెట్టుకొని వరుసగా బుక్ వర్క్స్, ప్రాబ్లెమ్స్ ఒకటొకటిగా వివరిస్తూ ఆమెతోనే చేయించసాగాడు.

    గంటసేపలా గడిచేసరికి, "ఇక లెఖ్ఖలు చాలండీ, మాస్టారూ, ఈవేళకి! ఇంగ్లీష్ చెప్పండి" అంది నెమ్మదిగా.

    "సరే... సరే!" అన్నాడు చలపతి కంగారుగా. అతని కంగారు చూస్తే ఆమెకు నవ్వు వస్తూంది .

    ఇంగ్లీష్ పాఠం తీసి తనకు తోచినట్లుగా ఎక్స్ ప్లెయిన్ చేస్తూ చదివాడు.

    అదో అరగంటసేపు పట్టింది.

    "ఇక నే వెళ్తాను. రేపూ ఇదే టైముకొస్తాను" అన్నాడు లేచి నించుంటూ.

    "ఉండండి! ఛాయ్ తీసుకొస్తాను" అంది రెహానా తనూ లేస్తూ.

    "అబ్బే! ఎందుకండీ? వద్దు.." మొగమాటంతో అన్నాడు చలపతి.

    "భలేవారే! ఛాయ్ తాగకుండా వెళ్లడానికి వీల్లేదు" అంటూ నవ్వి లోపలకు పరుగెత్తింది. నవ్వుతూన్నప్పుడు మరింత అందంగా మారిన ఆమె రూపం చూసి ఉత్తేజితుడయిపోయాడతను.

    అయిదు నిమిషాల్లో చిన్న ట్రేలో కప్పునిండా టీ తీసుకొచ్చి అతని ముందుంచింది.

    "మరి  మీరో?" కప్పు అందుకుంటూ అడిగాడు చలపతి.

    "నేను మీరొచ్చే ముందే తాగేశాను."

    తాగిన తరువాత కప్పు, ట్రే తీసుకుని ఆమె లోపలికెళ్ళిపోయింది.

    చలపతి బయటి కొచ్చేస్తుంటే గార్డెన్ లో కుర్చీలో కూర్చుని ఇంగ్లీష్ మాగ్ జైన్ చదువుతూ తాసిల్దార్ గారు కనిపించారు.

    "ఏమోయ్? ఎలా ఉంది మీ స్టూడెంట్? పాసవుతుందంటావా?"

    "ఈజీగా పాసవుతుందండీ! మీరన్నంత 'వీక్'గా లేదు లెఖ్ఖల్లో."

    "ఆఫ్ కోర్స్... ఆఫ్ కోర్స్. తెలివిగలదే కాని... ప్రాపర్ గైడెన్స్ కావాలి. అంతే." నవ్వుతూ అన్నారాయన.

    చలపతి ఇంటి కొచ్చేశాడు.

    ఆ రాత్రంతా అతనికి నిద్రపట్టలేదు. రెహానా రూపమే క్షణక్షణానికీ కవ్విస్తూ కనబడుతూంది. ఎంత ప్రయత్నించినా మనసులోంచి ఆమె తొలగడం లేదు. తనమీద తనకే కోపం వచ్చింది చలపతికి. ఇంత దిగజారి పోయాడేమిటి తను? అందమయిన అమ్మాయితో పరిచయమైనంత మాత్రాన మనసిలా అల్లకల్లోలమయి పోవడమేంటి? అయినా, రెహానా అంతస్తేమిటి? తన అంతస్తేమిటి? ఆమె ఓ ఆఫీసరుగారమ్మాయి. తనేమో ఉద్యోగం కోసం వెదుకుతూన్న మిడిల్ క్లాస్ మనిషి. ఆమెదో ఘటం, తనదో మతం. తెల్లగా దేవతలా ఉన్న రూపం ఆమెది. ఎండలో, వానలో తిరిగి నల్లగా, మోటుగా తయారయిన మనిషి తను.

    మరునాడు సాయంత్రం ట్యూషన్ కి వెళ్ళినప్పుడు ధైర్యంగా ఆమెతో మాట్లాడడం, పాఠాలు చెప్పడం చేయగలిగాడు చలపతి.

    రెహానా కొద్దిగా ఆశ్చర్యపోయింది అతనిలోని మార్పుని చూసి. తనని చూసి తడబడడం, కంగారుగా పాఠాలు చెప్పడం చేసిన పెద్దమనిషి ఒక్కరోజులో ధైర్యంగా, ఎంతో అనుభవం ఉన్నవాడిలా మాట్లాడడం ఎలా నేర్చుకొన్నాడు? ఆమెకు అర్థం కాలేదు.

    వారం రోజులు అలాగే సీరియస్ గా గడిచిపోయాయ్. రెహానా కది ఏమీ నచ్చలేదు. మరో మాట మాట్లాడకుండా కేవలం పాఠాలు చెప్పుకుంటూ పోవడమేనా ఈ మనిషి తత్త్వం? ఈ రోజు ఎలాగయినా సరే, అతన్ని కబుర్లలోకి దించేయాలని నిర్ణయించుకుంది.

    రాగానే ఇంగ్లీష్ పుస్తకం అందుకొన్నాడు చలపతి.

    "ది ఆర్ట్ ఆఫ్ పొలిటికల్ లయింగ్."

    "ఒక చిన్న విషయం..." అంటూ అడ్డు తగిలింది రెహానా.

    "ఏమిటది?"

    "పుస్తకాల పురుగులాగా ఎప్పుడూ చదవటం కూడా మంచిది కాదన్నారండి మా లెక్చరర్ ఒకామె!" చిన్నగా నవ్వుతూ అందామె.

    "అది చదివేవాళ్ళ గురించి అని ఉంటుంది. మీ గురించి కాదేమో!" హాస్యంగా అన్నాడు చలపతి.

    "అంటే, నేను బాగా చదవటం లేదంటారా?" చిరుకోపం అభినయిస్తూ అంది.

    "నే ననలేదుగా అలా అని?"

    "పోనీండి- వాదనెందుకుగ్గానీ- ఈ చీర ఎలా ఉంది?" పైటచెంగు బిగుతుగా లాగి అతనికి చూపుతూ అడిగింది.

    చలపతి ఉక్కిరిబిక్కిరయ్యాడు.

    "చాలాబాగుంది గానీ - ముందు పాఠం-"

    "ఎప్పుడూ పాఠం, పాఠం ' అంటారేమండీ! ఈవేళ ఒక్కరోజు చెప్పకపోయినంత మాత్రాన మునిగిపోయిందేమీ లేదు... ఈ చీర నిన్నే కొన్నాను. ఎంతో తెలుసా?"

google-add

Writers

A RadharaniA V Gurava ReddyActhuthavalliAdavi Bapi RajuadivishnuAkkala Saraswathi BaburaoAngara Venkata KrishnaraoArunaAttuluri Vijaya LakshmiAvasarala Ramakrishna RaoBalabhadrapatruni RamaniBalivada KantharaoBhupathiBollimuntha Nageswara RaoBommarillu KadhaluC AswarthaChaayaChalamChandu Harshavardhanchandu sombabuCherukuri RamadeviChitta Reddy Surya KumariD KameshwariDevarakonda Balagangadhara TilakDivedhula Somanadha SastryDR C Bhavani DeviDr C. ANANDA RAMAMDr Jandhyala Papayya SastryDr KarunasreeDr Muktevi BharathiDr N. Ananta LakshmiDr Ravuri BharadwajaDr S V S Kishore KumarDr. Dasaradhi RangacharyaDr. SamaramDwivedula VisalakshiG V Amareswara RaoGanti Venkata RamanaGovindaraju SeetadeviGullapalli SundarammaHarikishanHemaadri chidambaradeekshithuluHistoryIchapurapu JagannatharaoJonnalagadda Rama LakshmiK R K MohanK RamalakshmiK.V. NarendarKadambhariKamalamaniKandarpa Vijaya LakshmiKandhukuri LingarajuKandlakunta Sarath ChandraKantamaneni SwapnaKasinudhuni Suvarchala DeviKavilipati Vijaya LakshmiKiranmayeekodavatiganti kutumbaraoKoduri Kousalya DeviKolipaka RamamaniKomala Devikommanapalli ganapathi raoKommuri Venugopala RaoKrishna - (Mulam Venugopl)Kumari P Leela VenktramanKurumaddali VijayalakshmiLalladeviLathaM D SowjanyaM PardhasaradhiM.S.Rama RaoMadireddy Sulochanamainanpati bhaskarMallikMandarapu LalithaManjariMerlapaka muraliMucherla Rajani SakuntalaMunimanikyam Narasimha RaoMuppala RanganayakammaNanduri VithalP RamalakshmiP S NarayanaP SatyavathiPalakodeti Satyanarayana RaoPalanki Venkata Ramachandra MurthyPallampati Venkata SubbaiahParimala SomeswarPasupuleti Mallikharjuna RaoPolapragada Satyanarayanamurtypolkampalli santhadeviPolopragada RajyalakshmiPoranki Dakshinamurtypotthuri vijayalakshmiPrasanna KumarPuranam Suraya Prakasa RaoR Sandhya DeviRabindranath TagoreRamavarapu Venugopala RaoRavulapalli SunithaRavulapati Seetha Ramraosaradha ashok vardhan sarathsaroja sree sreeSharvaniShikha Venkataramanaa RajaShyamala Jayarami ReddySingaraju Rama Chandra MurthySree SreesreelathaSri N T Rama Raosri veturi prabhakara sastrySuguri SanthadeviSumathi SarangapurkarSurepalli Vijayasuryadevara rammohan raoTamirisha JanakiThapi DharmaraoTulasi KrishnaUnnava Vijayalakshmiushasri V S Ranga SwamiV.S. SukthankarVachaspathivaddera chandidasvasireddy seeta devi novelsVASUNDHARAVeerajiVempalli Niranjan ReddyVeturi Prabhakara SastryYamini Saraswathi NovelsYandamuri veerendranathYarlagadda Sarojani DeviYarram ChandrasekharamYelamanchili Jhansi Lakshmiyerramsetti sai

Publications

Andamaina Ala - Sathyajit Rey SreekurmamAprasyulu - Bhimeswara ChallaEeroju Panduga - Sree RekhaEmandi Kathalu - Mala KumarJail Note Book of Bhagat Singh - Kalpana PandeyKantamaneni SwapnaKavuri KodandaramayyaNee Jathaga Nenundaali - Mala KumarSannihithSkantavyulu - Bhimeswara ChallaSree Sai SharadaUdaya Bhaskara - Dochevarevarura Udaya Bhaskara - Sanghamitra